RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, August 15, 2012




'దేవుడు చేసిన మనుషులు' చిత్ర సమీక్ష          1.5/5


శ్రీ వెంకటేశ్వరా సినీచిత్ర పతాకంఫై పూరి జగన్నాద్ దర్శకత్వంలో బీ.వి.యస్.యన్.ప్రసాద్  ఈ చిత్రాన్ని నిర్మించారు.

               అక్షయ తృతీయ రోజు అలిగిన లక్ష్మీదేవిని సముదాయించడానికి విష్ణుమూర్తి -భూలోకంలో ఇద్దరు అనాధలు ఒక్కటయ్యే కధను చెబుతాడు. హైదరాబాద్ లో  సెటిల్మెంట్స్ చేసే రవి తేజ అందులో ఒకరు. బ్యాంకాక్ లో కారు డ్రైవర్ ఇలియానా మరొకరు.పోలీసు అధికారి సుబ్బరాజుకి బ్యాంకాక్ లోని మాఫియా డాన్  ప్రకాష్ రాజ్ తో వచ్చిన సమస్యను సెటిల్ చెయ్యడానికి రవి తేజ బ్యాంకాక్ వెళ్తాడు. ప్రకాష్ రాజ్ ను కలిసేక్రమంలో కారు డ్రైవర్ ఇలియానా,మరో కారు డ్రైవర్ గోలి పరిచయమవుతారు.ఇలియానాతో ప్రేమలో పడతాడు.అనుకోని గొడవలో ప్రకాష్ రాజ్ ని కలిసిన రవితేజ మరో ఇబ్బందిని ఎదుర్కొంటాడు.రవితేజ  చెప్పిన సుబ్బరాజుపని చెయ్యడానికి వప్పుకున్న  ప్రకాష్ రాజ్, ఇలియానాను తనకు అప్పగించమంటాడు.ఆతర్వాత జరిగిన కధ వెండి తెరఫై చూడాలి...
             
                 'నేనింతే' జంట పూరిజగన్నాద్ -రవితేజ కలిసి చేసిన  'తొక్కలో సినిమా' ఇది. ఇది తిట్టు అనుకునేరు...ఈ సినిమా కధ  ప్రారంభానికి  అరటి పండు తొక్కే కీలకం.'రిలయెన్స్' వారు కొన్న సినిమా కనుక, 'ప్యాకేజి' పద్ధతిలో నాలుగు డబ్బులు మిగలేసుకోవడమే ధ్యేయంగా చుట్టేసిన చిత్రం ఇది. పేరున్న  దర్శకుడు పూరి జగన్నాద్ బాధ్యత లేకుండా ...పని మీద సీరియస్ నెస్ లేకుండా తీసిన చెత్త చిత్రం ఇది.తలా తోకా లేని కధ...హాలీవుడ్ చిత్రాల్లో నుండి కొట్టేసిన స్క్రీన్ ప్లేతో ,తన విహార విడిది బ్యాంకాక్ లో హరీ బరీగా చేసేసి చేతులు దులిపేసుకున్నాడు.సినిమా ప్రారంభంలో అక్కడక్కడా సరదాగా ఉందనిపించినా ...రాను రానూ చిరాకు పెరిగి దియేటర్ లోంచి పారి పోదామనిపించే స్థాయికి చేరుతుంది. విష్ణు-లక్ష్మిల అర్ధం లేని సంవాదంతో  ప్రారంభమయ్యే ఈ చిత్రం అంతా అసంబద్ధమే. తమిళంతో సహా, కొన్ని ఎత్తేసిన ట్యూన్లు ఉన్నప్పటికీ  రఘు కుంచే పాటలు,చిన్నా నేపధ్య సంగీతం వున్నంతలో బాగున్నాయి.గీత రచయిత భాస్కర భట్ల కష్టపడ్డాడు.ఎప్పుడూ హైలైటే గా నిలిచే పూరి పంచ్ డైలాగ్స్ ఇందులో ఏమాత్రం పండలేదు. విదేశీ డాన్సర్  గాబ్రియేలాఫై చిత్రీకరించిన 'డిస్ట్రబ్ చేస్తున్నాడే' పాట కూడా అంతంత మాత్రం గానే వుంది.మొత్తం మీద శ్యాం ఫోటో గ్రఫీ, పాటల చిత్రీకరణ బాగుంది.
                
                   చాలా కాలం  తర్వాత రవితేజ అతి కామెడీ చెయ్యకుండా కొంతవరకూ ప్రేక్షకులను కాపాడేడు.గతంలో కన్నా బాగా చేసాడు.బక్క పల్చని భామ ఇలియానా  హావ భావాలు బాగానే పలికించినా...తనఆకారంతోనూ,విగ్
తోనూ ఇబ్బంది పెట్టింది.రెండు పాటల్లో మాత్రం అందంగా కనిపించింది.మతి మరుపు డాన్ గా ప్రకాష్ రాజ్ పాత్ర వినోదాన్ని పంచినా, చివరికొచ్చేసరికి ఇలియానాని 'చెల్లీ' అంటూ చిర్రెత్తించాడు.   ధనలక్ష్మిని ఆవాహన చేసుకోవాలని చూసే కార్ డ్రైవర్ గోలి గా అలీ బాగా చేసినా అంతగా ఆకట్టుకోలేక పోయాడు .విష్ణు-లక్ష్మిలు గా బ్రహ్మానందం, కోవై సరళ రొటీన్ గా చేసారు.అలీకి లక్ష్మిదేవి  కనిపించే సన్నివేశం బాగుంది.ఈ చిత్రంలో ఇతర పాత్రలు సుబ్బరాజు,యం.యస్.నారాయణ, జ్యోతి రాణా, 'ఫిష్' వెంకట్ పోషించారు.                             -రాజేష్                                                                                                                                                                                                                 

0 comments:

Post a Comment