RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 30, 2011

సాధారణ జీవితంలోకి రాగేశ్వరి

నటన, మోడలింగ్, యాంకరింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ రాగేశ్వరి లూంబా తన సత్తా చాటుకుంది. అయినా ఆమె ఇంతటితో ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు తన దృష్టంతా క్రాసోవర్ (దేశాంతరాల సినిమా) సినిమాలపై ఉంది. రాగేశ్వరి ఇప్పటి వరకు ఆఖే, మై ఖిలాడీ తూ అనాడీ వంటి సినిమాల్లో నటించింది. 2003లో విడుదలైన ముంబై సే ఆయా మెరా దోస్త్ ఈ 39 ఏళ్ల బ్యూటీ ....

బాలీవుడ్ లో హిట్లు - ఫట్లు

ఈ సంవత్సరం హిందీ చిత్ర సీమలో 107 వచ్చాయి. తొలి త్రైమాసికంలో 21 సినిమాలు, రెండో త్రైమాసికంలో 27, మూడో త్రైమాసికంలో 38, నాలుగో త్రైమాసికంలో 21 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో మూడో త్రైమాసికంలో విడుదలైన చిత్రాల్ని అత్యధిక మంది ప్రేక్షకులు చూశారు. బాలీవుడ్‌ సక్సెస్‌ రేటు ఫరవాలేదని పించే స్థాయిలో నిలిచింది. విడుదలైన 107 సినిమాల్లో 30 సినిమాలు టాప్‌ రేంజ్‌లో ఆడాయి. ఇందులో సల్మాన్‌ఖాన్‌ నటించిన బాడీగార్డ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రాలు... బాడీగార్డ్‌, రెడీ, రా.వన్‌, సింగం, జిందగీ నా మిలేగీ దోబారా, మర్డర్‌ 2, మేరీ బ్రదర్‌ కి దుల్హన్‌, ఢిల్లీ బెల్లీ, యామ్లా పాగ్లా దీవానా, తను వెడ్స్‌ మను. ఓ మోస్తరు కలెక్షన్లు....

Tuesday, December 27, 2011

ముగ్గురు ఖాన్‌లను అధిగమించి ఒంటి చేత్తో వందకోట్లు


డర్టీపిక్చర్’ విజయంతో విద్యాబాలన్ పేరు దేశమంతటా మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం వంద కోట్ల మైలురాయిని దాటొచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హీరోయిన్ ఓరియెంటడ్ సినిమా వందకోట్లు దాటడం ఓ రికార్డ్‌గా హిందీ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా విద్యాబాలన్‌దేనని, ఒంటి చేత్తో సినిమాని విజయ తీరాలకు చేర్చిందని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక చిత్ర నిర్మాత ఏక్తాకపూర్ ఓ అడుగు ముందుకేసి- విద్యాబాలన్‌కు ‘విద్యాబాలన్‌ఖాన్’ అని నామకరణం చేసేసింది. విద్యాబాలన్‌ఖాన్ అని సంభోదించడం వెనక వున్న సంగతేంటని- ఏక్తాకపూర్‌ను ప్రశ్నిస్తే.. ‘బాలీవుడ్‌లో ఏ సినిమా అయినా వందకోట్ల కలెక్షన్లు సాధించాలంటే  ....

డిస్నీలో షబానా,సుహాసిని

సెలవుల్లో చిన్నారుల కోసం డిస్నీ జూనియర్‌ కొత్తగా రెండు యానిమేటెడ్‌ సిరీస్‌లను ప్రసారం చేయనుంది. ఎ పోయెం ఈజ్‌..., టేస్టీ టైమ్‌ విత్‌ చెఫ్‌ జెఫ్రోంక్‌ వీటిలో ఉన్నాయి. డిసెంబర్‌ 19న వీటి ప్రసారం ఆరంభం కానుంది. డిస్నీ ఛానల్‌లో ఇవి రోజులో పలు మార్లు ప్రసారం కానున్నాయి.‘ఎ పోయెం ఈజ్‌...’ అనేది షార్ట్‌ యానిమేటెడ్‌ సిరీస్‌. డిస్నీ క్లాసిక్‌ సినిమాలు ‘డంబో’, ‘బాంబీ’, ‘లేడీ అండ్‌ ది ట్రాంప్‌’ తదితర చిత్రాల్లోని దృశ్యాలు కూడా ప్రసారం కానున్నాయి. గేయాలు అంటే ఇష్టపడే ప్రముఖ సినీతార షబానా అజ్మీ హిందీలో వీటిని వర్ణించి వివరించనున్నారు. ప్రముఖ సినీతార, దర్శకురాలు సుహాసినీ రత్నం తెలుగులో  ....

Sunday, December 25, 2011

'శృంగార తార' ముద్ర నుంచి బయట పడ్డాను :నేహా ధూపియా

జూలీ, శీషా వంటి శృంగార చిత్రాలలో నటించిన మాజీ మిస్ ఇండియా నేహా ధూపియాను బాలీవుడ్ ఇటీవల వరకు ఆమె సెక్సీబ్యూటీగానే గుర్తించింది. తదనంతరం మిథ్య వంటి సినిమాల్లోనూ సత్తా నిరూపించుకోవడం వల్ల శృంగారతార ముద్ర నుంచి బయటికి రాగలిగానని నేహా చెప్పింది. ‘సెక్సీ సింబల్ నుంచి సాధారణ నటిగా మారడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. నేహా శృంగారతార అనే భావన  .....

ఫాల్కే అవార్డ్ గ్రహీత పైడి జయరాజ్

Thursday, December 22, 2011

' రాజన్న' చిత్ర సమీక్ష

                                                            ' రాజన్న' చిత్ర సమీక్ష   3.25/5
      
అన్న పూర్ణ  స్టూడియోస్  పతాకం ఫై  విజయేంద్ర ప్రసాద్  దర్శకత్వం లో  అక్కినేని నాగార్జున  ఈ చిత్రాన్ని నిర్మించారు.
      దేశ స్వాతంత్రం కోసం నాలుగు మిత్రులతో కలిసి తెల్లవాళ్ళని ఎదుర్కొన్న రాజన్న దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాటానికి స్వస్తి చెప్పి  స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా నేల కొండ పల్లి కి బయల్దేరుతాడు.  అక్కడికి చేరే సరికి ....భారత దేశం లో  ఇంకా కలవని  నిజాం పాలకులు  రజాకార్లతో , దొరల తోడుతో  సాగిస్తున్న  అమానుష  పాలన చూసి చలించి పోతాడు. అణగారిన ప్రజల్లో  తన పాట తో  పోరాట పటిమను  పెంచుతాడు. రజాకార్లను, దొరలను తరిమి కొట్టేలా చేస్తాడు.  లక్ష్మమ్మ ను పెళ్లి చేసుకుంటాడు. అయితే వీరి తిరుగు బాటును సహించని నిజాం సర్కార్ వారి ఫై భారీ దాడికి సన్నాహాలు చేస్తుంది. వారిని నిలువరించడానికి సిద్ధమైన రాజన్న కు స్వాతంత్ర పోరాటం లో అతని తో కలిసి పాల్గొన్న నలుగురు మిత్రులు వచ్చి బాసట గా నిలు స్తారు.  పెద్ద పెట్టున వచ్చిన నిజాం సైనికులతో పోరాడుతూ రాజన్న బృందం  నేలకొరుగు తారు. రాజన్న భార్య పారిపోతూ ప్రాణాలు విడుస్తుంది. వారి కూతురు మల్లమ్మను  ఊరిలో ఒకరు పెంచుకుంటారు.  మల్లమ్మకు పాటంటే ప్రాణం . ఆ ఊరి దొరసాని ఓ సారి మల్లమ్మ ని పాడోద్దంటూ  నిషేధం విధిస్తుంది.  అలా పాడినందుకు శిక్షించడానికి వస్తే  తప్పించుకు  పారిపోతుంది.  దొరల కష్టాలు పోవాలంటే - డిల్లీ  వెళ్ళి ప్రధాని నెహ్రూ ని కలిసి పరిస్థితిని వివరించాలని సంగీతం  మాస్టర్ చెప్పిన  దాని ప్రకారం డిల్లీ  ప్రయానమవుతుంది . అలా వెళ్ళిన మల్లమ్మ డిల్లీ చేరి, తను అనుకున్నది ఎలా సాదించింది అనేది చిత్రం లో చూడాలి .

     ఈ తరహా  కధాంశం తో ,భారీ ఖర్చు తో  సినిమా చెయ్యడం  నిజం గా సాహసమే. అయితే నటుడిగా  ఈ తరహా పాత్ర  చెయ్యాలనే కోరిక వల్లనో .... తెలంగాణా వాదులను సంతృప్తి పరచాలనే ఆలోచన తోనో నాగార్జున  సొంత బేనర్ ఫై ఈ చిత్రాన్ని చేసారు.  పోరాట సన్నివేశాలకు రాజ మౌళి  రూపకల్పన చేస్తానని  చెప్పడం కూడా  నాగార్జున సాహసానికి  బలాన్నిచ్చి వుంటుంది.  అయితే పోరాట సన్నివేశాలకే కాకుండా  సినిమా అంతా  రాజ మౌళి  పర్య వేక్షణలోనే జరిగినట్లు   సినిమా పరిజ్ఞానం  ఉన్నవారికి  తేలిగ్గా అర్ధమవుతుంది. మల్లమ్మ గా అనీ నటన , కీరవాణి సంగీతం, నాగార్జున పోరాట సన్నివేశాలు    ఈ చిత్రం లో ప్రత్యేకతలు . చారిత్రక  నేపధ్యం అంటూనే  పూర్తి కల్పిత గాధను  సినిమా టిక్ గా  తెరకెక్కించారు.  సినిమా ప్రారంభంలో  మల్లమ్మ తో చేసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి.  ప్రధానం గా- మల్లమ్మను  వూరివారంతా సాగనంపే సన్నివేశం .దొంగ బారినుండి డబ్బును వదిలేసి,మట్టిని దక్కించుకునే సన్నివేశం .   ఇంటర్వెల్ ముందు నాగార్జున ఎంట్రీలో  ...బ్రిటిష్ వారితో పోరాటంలో  హీరో ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తూ , సహజత్వానికి దూరమై పోయారు.     సినిమా రెండవ భాగం ప్రారంభం నుండి వరుసగా రజాకార్ల దురాగతాలను చూపే సన్నివేశాలుప్రేక్షకులను  స్పందింప జేస్తాయి.వీటిలో ముఖ్యం గా-  దొరల బండి ముందు అవ్వ కొడుకు పరుగెడుతూ చని పోవడం, అందానికి పన్ను కట్టమనే సన్నివేశం. ' వెయ్ 'అంటూ రాజన్న  తన పాట ...డప్పు దరువు తో గ్రామస్తులను చైతన్య వంతులను చేసే సన్నివేశాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా - పోచవ్వ పోరాటం, చిన్న పిల్లాడు ముందుకు రావడం , దొర దగ్గర కుర్రాడి తిరుగుబాటు.   క్లైమక్స్ లో మిత్రులతో కలిసి నాగార్జున చేసే  భారీ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.   హీరో శత్రువులను వరుసపెట్టి చీల్చి చెండాడే ఇటువంటి సన్నివేసమే' మగధీర' లో రాజమౌళి చేసారు.  దాన్ని దృష్టిలో పెట్టుకునే' సింహా 'లో బోయపాటి శ్రీను  చేసారు. ఇప్పుడు మరో సారి ఈ చిత్రం లో చూస్తాము. తేడా అంతా- ఇందులో హీరో తో పాటు మరో నలుగురు మిత్రులు వుండటం. పోరాటం చివరిలో  మిత్ర బృందం అంత ఒకే చోటా చేరి తనువులు చాలించడం  మనసులను కదిలిస్తుంది.   అయితే ఆదిలాబాద్ నుంచి  పదేళ్ళ మల్లమ్మ సుదూరం లో ఉన్న డిల్లీ కి వెళ్ళడం ...నెహ్రు ని కలవడం  వంటివి ప్రేక్షకులకు  కొరుకుడు పడవు. తెలుగు తనం తో, పల్లె పలుకులతో , వీనుల విందుగా సాగిన కీరవాణి పాటలు ,నేపధ్య సంగీతం ఈ చిత్రం లోని చాలా లోపాలను కప్పేసింది.  చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది. “వేయరా వేయ్”, "అమ్మా అవనీ" వంటిపాటలు  సినిమాకి వన్నె తెచ్చాయి.
                         పోరాటకారుడు రాజన్న గా నాగార్జున  తన  పూర్వ విధానానికి  పూర్తి భిన్నమైన  గెట్అప్ తో  పాత్రకు పూర్తి  న్యాయం చేసారు. అతని కుమార్తె మల్లమ్మ గా సినిమాకు  ప్రధానమైన పెద్ద పాత్రలో  అనీ అద్భుతం గా నటించింది.  రాజన్న భార్యగా స్నేహ, అతని మిత్రులుగా అజయ్, సుప్రీత్, శ్రావణ్, ప్రదీప్ రావత్ , సంగీతం మాస్టార్ గా నాజర్ , దొరసానిగా శ్వేతా మీనన్, ఇతర పాత్రల్లో ముకేష్ రుషి శకుంతల, హేమ,విజయ కుమార్, శ్రీధర్, సత్య నాగ్ నటించారు. మల్లమ్మ తాత పాత్రలో చేసిన సమ్మెట గాంధీ  కూడా చాలా బాగా చేసాడు. శ్యాం,అనిల్ భండారిల మంచి ఫోటోగ్రఫీ ...కోటగిరి ఎడిటింగ్....రవీందర్ కళా ప్రతిభ చూపిన ఈ చిత్రం లో గ్రాఫిక్స్ ను రాజ మౌళి తరహాలో సందర్భోచితం గా ఉపయోగించుకున్నారు.                                                                                    -రాజేష్
                        
                                                                                                                                             

Wednesday, December 21, 2011

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శంకర్‌ల హాట్‌ ప్రాజెక్టు


ముగ్గురూ...ముగ్గురే...కోలీవుడ్‌లో కెరీర్‌ ఆరంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగినవారే...రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శంకర్‌. ఈ ముగ్గురు పేర్లు వింటేనే ఒక వైబ్రేషన్‌. అలాం టిది ముగ్గురూ ఓ ప్రాజెక్టులో కలిస్తే ఇక ఆ ప్రాజెక్టు హాట్‌ ప్రాజెక్టు కాక మరేముంటుంది. ఎప్పటినుండో అనుకుంటున్న ప్రాజెక్టే అయినా ఇప్పటికి కార్యరూపం దాల్చనుందని కోలీవుడ్‌లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌ తో కలిసి ‘రోబో’తో...కమల్‌హాసన్‌తో కలిసి ‘భారతీయుడు’తో సంచలనం సృష్టించిన శంకర్‌ తాజాగా ఈ ఇద్దరు హీరోలతో ఓ సినిమా .....

ఆఖరు వరకూ నిలబడాలి:సుమన్‌

Monday, December 19, 2011

రచయిత, నటుడు భూపాల్ రెడ్డి కి సన్మానం

                           రచయిత, నటుడు భూపాల్ రెడ్డి కి సన్మానం
  ప్రముఖ రచయిత్రి    వాసి రెడ్డి  సీతా దేవి  జయంతి  సందర్భం  గా -          ఇటీవల కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న రచయిత, నటుడు [కొమరం భీమ్] భూపాల్ రెడ్డి కి 'యువ కళా వాహిని' నేతృత్వం లో సన్మానం జరిగింది. డిశంబర్ 16  న 'తెలుగు  యూనివర్సిటీ' లో జరిగిన ఈ కార్య క్రమం లో -   డా:సి .నారాయణ రెడ్డి , దూర దర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధు సూదన రావు , రచయిత్రి  శ్రీ లత  , ఆవుల మంజులత, సుద్దాల అశోక్ తేజ,  యం .ఆర్.నాయక్, త్రిపురనేని సాయి చంద్ , అల్లాణి శ్రీధర్ ,  'యువకళా వాహిని'  వై.కే. నాగేశ్వర రావు, జి . మల్లికార్జునరావు   తది తరులు పాల్గొన్నారు. టి. నాగి రెడ్డి , వెంగ మాంబ  , గంగాధర్   బృందం  ప్రదర్శించిన   'సత్య  హరిశ్చంద్రీయం '   సభికులను  ఆకట్టుకుంది .

Saturday, December 17, 2011

ఉత్తమ సినిమా కల్చర్‌ ని పెంచాలి

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు దక్షిణ భారతంలోని మూడు మహానగరాల్లో అంతర్జాతీయ సినిమా పవనాలు ఆహ్లాదంగా వీస్తాయి. దేశదేశాల వైవిధ్యభరితమైన సినిమాలు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతుల్ని పంచుతాయి. బెంగళూరు, చ్నై, తిరువనంతపురం నగరాలు పోటీ పడుతూ ఉత్తమ సినిమాలకు పోటీ పెడుతూ చిత్రోత్సవాలు జరుపుకొంటున్నాయి. అయితే టాలీవుడ్ మాత్రం ఈ సంబరాలకు అతీతం......

మళ్లీ మొదట్నించీ జీవితాన్ని ప్రారంభించాలంటున్న భాను ప్రియ

తెలుగు చిత్రసీమలో విశాలమైన, అందమైన కళ్లు ఎవరివంటే వెంటనే స్ఫురణకు వచ్చేది భానుప్రియ. హావభావాల్ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించడంలో ఆమెకి ఎస్సెట్ ఆ కళ్లే. ఆమె ఎనిమిదేళ్ల కూతురు అభినయ స్కూలుకు వెళ్తుండటంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆమె ఆశిస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణించిన ఆమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి టాప్ హీరోలతో చేసింది.తన తల్లి, సోదరుని వల్ల ఎంతో నష్టపోయిన ఆమె-.....

Wednesday, December 14, 2011

ప్రపంచ సినిమా చరిత్రలోనే వినూత్న ‘ప్రయోగం’

ప్రపంచ సినిమా చరిత్రలోనే వినూత్న ‘ప్రయోగం’
prayogam1ఇప్పటిదాకా ప్రపంచ సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో మూకీ నుండి టాకీ కొచ్చి ఈస్ట్‌మన్‌ కలర్‌, 70 ఎం.ఎం. టెక్నాలజీనుండి ప్రస్తుత 3డి, డిజిటల్‌ టెక్నాలజీ వరకూ ఎన్నెన్నో సరికొత్త ప్రయోగాలను ప్రేక్షకులు వీక్షిస్తూ వచ్చారు. ఇంతవరకూ ప్రపంచ సినీ చరిత్రలో ఒకే తెరపై నాలుగు ఫ్రేములు...అవి కూడా కథతో సంబంధం కలిగి ప్రేక్షకులకు ఎటువంటి గందరగోళం లేకుండా హ్యాపీగా చూడగలిగేలా ఒక వినూత్న ప్రయోగానికి నాంది పలికారు భానుప్రకాష్‌. ఆయనకు వచ్చిన సరికొత్త ఆలోచనలకు ప్రతిరూపమే ‘ప్రయోగం’ సినిమా. ఈ సినిమా విశేషాలను దర్శకుడు భానుప్రకాష్‌ ‘కలర్స్‌’తో పంచుకున్నారు.

మీ గురించి చెబుతారా?
బి.టెక్‌ పూర్తిచేసుకుని కొంతకాలం ఢిల్లీలోని సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం చేసి సినిమా మీద మక్కువతో ఇంగ్లాండ్‌ వెళ్లి అక్కడ ఎం.ఏ. ఫిలిం మేకింగ్‌ కోర్స్‌ పూర్తిచేశాను. సినిమా రంగంలోకి అందరూ నాలుగు డబ్బులు సంపాదించుకుందామనే కాంక్షతో వస్తుంటారు. కానీ నేను తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ప్రయోగంతో రొటీన్‌కు భిన్నంగా తన సినిమా ఉండాలని అటువంటి తన ఆలోచనలకు ఒక కార్యరూపంగా రూపొందించిన చిత్రమే ఈ ‘ప్రయోగం’.

ప్రయోగం మేకింగ్‌: ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇందులో ‘ప్రయోగం’ అనేది ఒక వెబ్‌సైట్‌ పేరు. ఒక సైంటిఫిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ డిటెక్టివ్‌ ఈ వెబ్‌సైట్‌ను నడిపిస్తూ ఉంటాడు. సిటీలో మత్తుమందులు విచ్చలవిడిగా విస్తరిస్తున్న తరుణం లో అసలు ఈ మత్తుమందులు సిటీకి సప్లయ్‌ చేసే వ్యక్తిని పట్టుకోవడానికి సైంటిఫిక్‌ డిటెక్టివ్‌ చేసిన ఎక్స్‌పరిమెంట్‌ ఏమిటనేది ప్రయోగం కథ. అతడు నిర్వహించిన ఈ ప్రయోగం ద్వారా అసలు నేరస్తులు పట్టుబడటమే కాకుండా సొసైటీలో నాలుగు గ్రూపుల మధ్య నడిచే మానసిక సంఘర్షణలు, వైరుధ్యమైన పరిస్థితులు, మానవ సంబంధాలు, వారి వ్యక్తిత్వాలు.

ప్రయోగం ఆలోచన ఎలా వచ్చిందంటే...
prayogam3‘ఇంగ్లాండ్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ చేసేటప్పుడు డిజిటల్‌ రివల్యూషన్‌ ఇన్‌ సినిమా అనే అంశంపై రీసెర్చ్‌ చేస్తూ డిజిటల్‌ కెమెరా ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రయోగాలు జరిగాయో తెలుసుకున్నాను. ఆ క్రమంలో ఒక పేజ్‌లో నాలుగు ఫొటోలుండటం చూశాను. అప్పుడు అనిపించింది. సినిమాలో ఒకే ఫ్రేమ్‌లో నాలుగు సన్నివేశాలు జరిగితే ఏది చూస్తారు? నాలుగింటిలో నాలుగు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కనిపిస్తుంటే ప్రేక్షకులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ఒకవేళ నాలుగు చూడాలనిపిస్తే నాలుగు చూడగలరా? ఇటువంటి ప్రశ్నలు నన్ను వెంటాడాయి. వీటన్నింటికీ సమాధానమే మీ ముందుకు వస్తున్న ఈ నా ప్రయోగం సినిమా.

నిర్మాణ విశేషాలు: ఈ చిత్ర నిర్మాణ విశేషాల గురించి చెబుతూ భానుప్రకాష్‌ ఇలా అన్నారు. ‘ప్రయోగాత్మకమైన ఆలోచన రావడం కష్టం కాదు. ఆ ఆలోచనని కథగా మలిచి దానికి సంబంధించిన వారందరినీ ఒప్పించి, ఒక తాటిపైన ఉంచి, కెమెరాలో బంధించి జనరంజకంగా తీర్చిదిద్దటం అత్యంత కష్టతరమైన పని. నేను చేసిన ఈ ప్రయోగం కోసం నలభై మంది ఆర్టిస్టులను ఎంపికచేసి వారికి 66 రోజులపాటు లొకేషన్‌లో సెట్‌ వేసి ట్రైనింగ్‌ ఇచ్చి షూట్‌ చేశాము. ఎందుకంటే నటీనటులు కెమెరా ముందు రెండు గంటలపాటు కట్‌ లేకుండా ఏకధాటిగా నటిస్తూనే ఉండాలి.

ఒకవేళ వారిలో ఎవరైనా ఒక గంట తర్వాత తప్పు చేస్తే, అక్కడ కట్‌ చేసి మళ్లీ మొదటినుండి రెండు గంటలు షూట్‌ చేయాలి. ఇంత రిస్క్‌ తీసుకోవడానికి కారణం ప్రేక్షకులు ఈ నాలుగు గ్రూపుల నిజ జీవితాలు చూస్తున్న అనుభవం కలగాలి. ఈ మేకింగ్‌లో రెండో కష్టం ఏమిటంటే...ఈ నాలుగు ఫ్రేముల్లో ఉన్న నటులు ఒకరితో ఒకరు ఫోన్‌లో సంభాషిస్తూ ఉండాలి. నాలుగు ఫ్రేముల్లో రెండు గంటల షూట్‌లో ఒక ఫ్రేమ్‌లో వ్యక్తి ఏ సెకండ్‌లో కాల్‌ చేస్తాడో...ఇంకో ఫ్రేమ్‌లో ఉన్న వ్యక్తి దాని తర్వాత సెకండ్‌లో కాల్‌ లిఫ్ట్‌ చెయ్యాలి.

ఇది ప్రాక్టికల్‌గా చాలా కష్టమైన పని. ఇక మూడోది...జీపులో ఫిక్స్‌ చేసిన కెమెరాతో జీపు రెండు గంటలపాటు వివిధ ప్లేసులకి, రోడ్లమీద తిరుగుతూ రెండు గంటల్లో ఫలానా టైమ్‌కి ఫలానా ప్లేస్‌కి జీపు వచ్చి తీరాలి. దీనితో జీపు ట్రాఫిక్‌ వల్ల అప్పుడప్పుడు త్వరగా, లేటుగా వచ్చేది. టైమ్‌కి ఆ ప్లేస్‌కి వచ్చేవరకూ మొదటినుంచి రెండు గంటల షాట్‌ మళ్లీ తీయాల్సివచ్చేది.

ఎవరికోసం ఈ ప్రయోగం?
prayogam2నేను ఎంచుకున్న కథ సమాజంలో వివిధ వర్గాలవారి జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. నేను చేసిన ప్రయోగం కథని ఆవిష్కరించిన విధానం సరికొత్తగా ఇంతవరకూ ఎవరూ చూడని విధంగా ఉండటం. ఇలా చేయడం వలన వినోదం పాళ్లు రెగ్యులర్‌గా తీసినదానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందన్న ప్రగాఢ నమ్మకం ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ‘అవతార్‌’ సినిమా 3డిలో చూసినప్పుడు ఏ సినిమా కలిగించని అనుభూతిని నాకు ఆ సినిమా కలిగించింది.

ఈ ప్రయోగంతో ఏం చెప్పదల్చుకున్నారు?
వినోదం ప్రధానంగా సాగే ఈ ప్రయోగంలో అంతర్లీనంగా డ్రగ్స్‌ జోలికి వెళ్లవద్దు అనే మెసేజ్‌ కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్‌ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ చిత్రం విజయవంతం చేసి తెలుగు వాళ్లు కూడా ప్రయోగాత్మక చిత్రాలు మిగిలిన భాషల కన్నా ధీటుగా తీయగలరు అనే విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేయాలని...నూతన ప్రయత్నంగా చేస్తున్న నా ఈ ‘ప్రయోగం’ సక్సెస్‌ చేస్తారని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను.

విద్యాబాలన్ పారితోషికాన్ని ఐదు కోట్లకు పెంచేసింది


విద్యాబాలన్ నటించిన క్రేజీ చిత్రం ‘డర్టీ పిక్చర్’. సిల్క్‌స్మిత జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో విద్యాబాలన్ సిల్క్‌గా నటించింది. ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందు బోల్డన్ని వివాదాలు ఎదుర్కొంది. ఈ వివాదాలే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. సినిమా విడుదలకు ముందు విద్యాబాలన్ని విమర్శించిన వారే ఇప్పుడు ‘డర్టీపిక్చర్’ సాధిస్తున్న వసూళ్లని చూసి ఆశ్చర్యపోతున్నారట. తొలి వారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్లు వసూలయ్యాయని బాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నారు. తను నటించిన చిత్రానికి అనూహ్య స్పందన ....

Tuesday, December 13, 2011

నా భర్త తోడ్పాటు ఉంది:శ్వేతామీనన్‌

మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ

                                                           మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ

‘మల్లీశ్వరి’ తెలుగు చిత్ర సీమకు చుక్కానిలాంటిదని , ఎన్నటికి వన్నె తగ్గని అద్భుత కళాఖండమని ...  జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.' యువ కళావాహిని' ఆధ్వర్యంలో  త్యాగరాయ గానసభలో జరిగిన ‘వాహిని వారి మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ’ సభకు సినారె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభ, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వర్‌రావు సంగీతం' మల్లీశ్వరి' ని  చిరస్థాయిగా నిలబెట్టాయని సినారె పేర్కొన్నారు. ఎన్టీఆర్, భానుమతి పాత్ర లు, ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు’, ‘మనసున మల్లెల’ పాటలు నేటికీ మరుపురానివన్నారు. దేవులపల్లి సాహిత్య ప్రతిభకు మల్లీశ్వరి పాటలు తార్కాణమన్నారు.
సభలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ- 1951లో వచ్చిన' మల్లీశ్వరి' తెలుగు చలన చిత్ర పరిశ్రమకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభకు చిత్రంలోని సన్నివేశాలే నిదర్శనమన్నారు.బి .యన్ .రెడ్డి వంటి ఉన్నత స్థాయి దర్శకుల స్ఫూర్తి తోనే తను చిత్ర నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.  సభకు అధ్యక్షత వహించిన సారిపల్లి కొండల రావు ప్రసంగిస్తూ- బీఎన్‌రెడ్డి లాంటి దర్శకులు అరుదుగా లభిస్తారన్నారు. ఫిల్మీడియా సౌజన్యం తో ఈ కార్యక్రమం జరిగింది.
సభలో ప్రముఖ రచయిత, నటులు రావి కొండల రావు, నిర్మాత, దర్శకులు అల్లాణి  శ్రీధర్, ప్రముఖ రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, సాహితీ వేత్త ఓలేటి పార్వతీశం, లంకా లక్ష్మీనారాయణ, వై.కె. నాగేశ్వర్‌రావు, మళ్లీ ఖార్జునరావు, నరసింహారావు,  త్యాగరాజు  తదితరులు పాల్గొన్నారు .  సినిమాలోని సన్ని వేశాలను, కథను, పాటలతో పాటు రసవత్తరం గా  ఎస్.వి. రామారావువివరించారు . సభకు ముందు  వీకే దుర్గ , శరత్ చంద్ర' మల్లీశ్వరి' చిత్రంలోని పాటలను మధురంగా  ఆలపించారు.
                



Friday, December 9, 2011

'పంజా' చిత్ర సమీక్ష

                                                            'పంజా' చిత్ర సమీక్ష  2.5/5

సంఘ మిత్ర ఆర్ట్స్ -అర్క మీడియా వర్క్స్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ దర్శకత్వం లో నిర్మించారు. నీలిమ తిరుమల శెట్టి , నగేష్ ముంతా , శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని ఈచిత్రానికి నిర్మాతలు.
                             
                           చిన్న తనం లో తనకు ఆశ్రయం ఇచ్చి ఆదుకొన్న కొల్కొత్తా మాఫియా లీడర్  భగవాన్ కు నీడలా  ఉంటూ... ప్రత్యర్ధి కులకర్ణి గ్యాంగ్ నుండి  కాపాడు తుంటాడు జై .
జీవితంలో  తాను కోల్పోయిన ప్రేమను సంధ్య లో చూసుకుంటాడు. భగవాన్ కొడుకు మున్నా రావడం తో పరిస్థితులు మారుతాయి. అతని శాడిస్ట్ చేష్టలు అందరిని బాధిస్తాయి. జై సన్నిహితురాలు , క్లబ్ డాన్సర్  జాన్వి మున్నా దృష్టిలో పడుతుంది. అతన్ని ఇష్టపడని జాన్విని మున్నా అతి క్రూరం గా కొట్టి చంపుతాడు. ఆ సందర్భం లో జై తో జరిగిన సంఘర్షణ లో మున్నా చనిపోతాడు. దాన్ని అవకాశం గా తీసుకుని గురవయ్య అనే ముటా  సభ్యుడు భగవాన్ -జై ల మధ్య చిచ్చు పెడతాడు. తనని చంపడానికి చూస్తున్న భగవాన్ ని ఎదుర్కోవడం ఇష్టం లేని జై అక్కడికి దూరం గా వెళ్ళి పోవాలను కుంటాడు. అక్కడి నుండి సంధ్య వాళ్ళ వూరికి వెళ్ళిన జై అక్కడ కొన్ని సమస్యలను పరిష్కరిస్తాడు. పగతో రగిలిపోతున్న భగవాన్ జై మిత్రుడు చోటూ ను పట్టుకుని  సంధ్య వివరాలు సేకరిస్తారు. సంధ్యను ఎత్తుకు తీసుకొస్తారు. ఆమెను కాపాడేందుకు జై తిరిగి కోల్కతా వస్తాడు. ఆ తర్వాత జరిగింది తెర ఫై చూడాలి ....
                                                      ' పులి', 'తీన్ మార్' ల పరాజయం తర్వాత వచ్చినప్పటికీ ...   డిఫరెంట్   గెట్అప్ తో పవన్ కళ్యాణ్  కనిపించిన  ఈ చిత్రం పట్ల ప్రేక్షకులు, అభిమానులు విపరీతమైన ఆసక్తి కనపర్చారు. పవన్ మాఫియా  గ్యాంగ్ స్టర్ గా  చాలా స్టైలిష్ నటన కనపరిచాడు  .  డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ లో కొత్త దనాన్ని చూపిస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో అతను చాలా  బాగా చేసాడు.  అయితే, సినిమా అంతా  కేవలం యాక్షన్ కే పరిమితం కావడం వల్ల,  పవన్ నుండి  ఆశించే  అంశాలు కొరవడటం వల్ల  ఈ చిత్రం  అసంతృప్తిని మిగిల్చింది.  ఈ చిత్ర కధాంశం గతం లో వచ్చిన పవన్ కళ్యాణ్     ' బాలు' , నాగార్జున 'అంతం'  చిత్రాలను గుర్తుకు తెస్తుంది. వినోదం పాలు బాగా తక్కువగా ఉన్న ఈ చిత్రం లో ...దర్శకుడి చిత్రీకరణ స్థాయి  సామాన్య ప్రేక్షకుడిని మించిపోయింది. అలీ ,బ్రహ్మానందం ఉన్నప్పటికీ వారి కామెడీ అంతంత మాత్రమే. పోలీసు పాపారాయుడుగా  బ్రహ్మానందం తో చేసిన సన్నివేశాల్లో పవన్ పాత్ర ని మరీ సిల్లీ గా చూపించారు. హీరో లో ప్రేమ పుట్టడం ...పెరగడం ...మరింత బాగా చూపితే సినిమా కి జీవం వచ్చేది. హీరో లో ఉండే కటినత్వాన్ని చూపినంత బలం గా అతనిలోని సున్నితత్వాని   చూప లేదు. సినిమా మొదటి భాగం చూసిన ప్రేక్షకులు హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి పొందితే ...రెండవ భాగం లో ఆ గ్రాఫ్  దారుణం గా పడి పోయింది. ప్రేక్షకులు ఆసక్తి చూపిన 'పంజా' టైటిల్ సాంగ్ సినిమా ఐపోయాక ,చివర్లో  పెట్టడం కూడా మైనెస్  అయ్యింది.
                                                    భగవాన్ గా  జాకీ ష్రాఫ్ ,అతని ప్రత్యర్ధి గా అతుల్ కులకర్ణి  పరిమితమైన పాత్రలే ఐనప్పటికీ బాగా చేసారు. గురవయ్య గా తనికెళ్ళ భరణి, మున్నాగా  అడివి శేషు రాణించారు. హీరోయిన్ సంధ్య గా  సారా జెనె డయాజ్ ఎంపిక సరిపోలేదు. జాన్వి గా అంజలీ లావణ్య  పాత్రకి తగ్గట్టే సెక్సీ గా ఉంది. ఇతర పాత్రల్లో పరుచూరి వేంకటేశ్వర్ రావు ,సుబ్బరాజు , ఝాన్సీ నటించారు.
వినోద్ ఫోటో గ్రఫీ ఈ చిత్రం లో ప్రత్యేకత. యువన్ శంకర్ రాజా సంగీతం లో ' ఎలా ఎలా ' వంటి ఒకటి,  రెండు మినహా చెప్పుకోదగ్గ పాటలు లేనప్పటికీ ,రీ రికార్డింగ్ సినిమా మూడ్ కి చాలా సహకరించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శ్యాం కౌషెర్ యాక్షన్ సన్నివేశాలు ,విజువల్  అఫెక్ట్స్ బాగున్నాయి.                                                                                                                                                                                                                                                                                                                                                        - రాజేష్

Wednesday, December 7, 2011

దివ్యభారతి జీవిత కధా చిత్రం ... కృష్ణవంశీ ‘అంత:పురం’కు సీక్వెల్‌

సిల్క్‌స్మిత జీవిత కథ స్ఫూర్తితో ‘డర్టీపిక్చర్’ రూపొందిన విషయం తెలిసిందే. సిల్క్‌గా విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. దీంతో ఈ తరహా చిత్రాల నిర్మాణం ప్రస్తుతం బాలీవుడ్‌లో ఊపందుకుంది. ఈ కోవలోనే నటి దివ్యభారతి జీవితం వెండితెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. ఒక దశలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హాట్ ఫేవరేట్‌గా నిలిచిన దివ్యభారతి మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అందమైన సౌందర్య రాశిగా తక్కువ టైమ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఆభిమానుల హృదయాలను దివ్యభారతి కొల్లగొట్టిన...

అనుష్క నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్...ఆంతరంగికురాలు కూడా

‘లేడీస్ వర్సెస్ రిక్కీబహల్’లో నటించిన హీరో రణ్‌వీర్‌సింగ్, హీరోయిన్ అనుష్కశర్మల మధ్య ఏం జరుగుతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరూ ఆ చిత్రం షూటింగుల్లోనేకాక బయట కూడా సన్నిహితంగా, ఏకాంతంగా మెలుగుతుండటంపై బాలీవుడ్ జనాలతోపాటు అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై రణవీర్ స్పందించాడు.... అనుష్క తనకు అత్యంత సన్నిహితురాలని....

Tuesday, December 6, 2011

సృష్టికి ప్రతిసృష్టి టుస్సాడ్స్‌ మ్యూజియం

బాలీవుడ్ అందాల రాణులు కరీనా కపూర్‌, ఐశ్వర్యారాయ్‌లతో కలిసి ఫొటోలు దిగాలని ఉందా..? మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ని కలవాలనుందా..? బాలీవుడ్ టాప్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ల పక్కన నిలబడాలనుందా..? వీరందరినీ ఒేకసారి దర్శించాలనుందా..? అయితే వెంటనే లండన్‌లోని మేడ్మ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. మన దేశానికి చెందిన ఈ ప్రఖ్యాత సెలబ్రిటీలే కాదు ప్రముఖ సెలబ్రిటీలు మైకెల్‌ జాక్సన్‌, బ్రిట్నీ స్పియర్స్‌ వంటి ఎందరినో ఒేక చోట సందర్శించే అద్భుతమైన వేదిక ఈ మ్యూజియం. ఇటువంటి ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలతో ఏర్పాటైన ....

కేవలం నగ్నత్వంపైనే ఆధారపడలేము:మహేశ్ భట్

జిస్మ్‌లో బిపాసా బసు అంగాంగ ప్రదర్శన కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఇందులో అబ్రహాం, బిపాసా మధ్య కాస్త ఎక్కువ మోతాదులోనే శృంగార సన్నివేశాలు ఉంటాయి. దీనికి కొనసాగింపుగా జిస్మ్2 తీస్తున్నట్టు దర్శకుడు మహేశ్ భట్ ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా శృంగారతార సన్నీ లియోన్‌ను ఎంపిక చేయడం సంచలనం సృష్టించింది. ఈమె ప్రస్తుతం బిగ్‌బాస్ 5 రియాలిటీ షోలో హల్‌చల్ చేస్తోంది. టైటిల్ జిస్మ్ (దేహం) సూచిస్తున్నట్టుగా ఇది శారీరక ప్రదర్శనకు సంబంధించిన .....

Saturday, December 3, 2011

ఇలియానా కిస్సింగ్ సీన్ అద్భుతంగా వచ్చింది


వెండితెరపై అధర చుంబనాలు బాలీవుడ్‌లో మామూలు విషయమే కానీ ఇంకా దక్షిణాది చిత్రాల్లో ఆ ట్రెండ్ ఊపందుకోలేదు. బికినీలు ధరించడానికి సైతం రెడీ అనే సుందరాంగులు సైతం లిప్ టూ లిప్ కిస్సులంటే ఆమడ దూరంలో వుంటారు. అయితే గోవా భామ ఇలియానా ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేయడానికి సిద్ధమైంది. నాజూకు ఒంపుసొంపులతో కుర్రకారు మతులుపోగొట్టిన ఈ వయ్యారి ఇటీవల కాలంలో సరైన సక్సెస్‌లు లేక నిరుత్సాహంతో వుంది. అయితే శంకర్ దర్శకత్వంలో విజయ్ సరసన ‘నన్‌బన్’ (హిందీ ‘త్రీఇడియట్స్’ తమిళ రీమేక్)లో ఈ సుందరి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ చిత్రం ‘త్రీరాస్కెల్స్’ పేరుతో రానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇలియానా భారీ ఆశల్ని పెట్టుకుంది. ఈ చిత్రంతో దక్షిణాదిన పూర్వవైభవాన్ని పొందాలనే ఆలోచనలో వుంది. ఎప్పటికీ బెట్టు మీదుండే ఈ సుందరి.....

'బెజవాడ' చిత్ర సమీక్ష ...

'గాడ్‌ఫాదర్‌' చిత్రాన్నే అటుమార్చి, ఇటుమార్చి ప్రేక్షకుడ్ని ఏమార్చే వర్మ ప్రయత్నం ఈసారీ ఫలించలేదు. అతను నిర్మాతే అయినా, తీసిన దర్శకుడు వివేక్‌కృష్ణ వర్మ శిష్యుడే. వర్మ సారథ్యంలో వస్తున్న చిత్రాలు చూస్తే...ప్రపంచంలో జరుగుతున్న రకరకాల హత్యలన్నింటినీ తెలుగు వాళ్లకు పరిచయం చేసే ప్రయత్నం 'బెజవాడ'లో చేశాడనిపిస్తోంది. నాగచైతన్యకు లేనిపోని ఇమేజ్‌ను తీసుకొచ్చే హడావిడే తప్ప అసలు సారం లేదు. 'దడ' రూపంలో వచ్చిన వైఫల్యం నుంచి నాగచైతన్య ఇంకా నేర్చుకోలేదనే చెప్పాలి. అతనికి ఏమాత్రం సూటవని కథ ఇది. దాంతో ....

Sunday, November 27, 2011

నయనతార, సమంతాలకు నకిలీ ట్విట్టర్ బెడద


గ్లామర్ పాత్రల్లో కనిపించిన నయనతార ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహా సాధ్వీ సీతగా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో నయనతార సీత పాత్రలో పరకాయవూపవేశం చేసిందంటూ అంతా ఆమెని ప్రశంసిస్తున్నారు. ఈ ప్రశంసల జల్లుని ట్ట్విట్టర్‌లో కురిపిస్తున్నారట. అయితే ఇది నిజంగా నయనతారకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ కాదని తెలుస్తోంది. తన పేరుతో చెలామణి అవుతున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల గురించి....

100 చిత్రాల 'ఫిరంగి గుండు' జాకీ చాన్‌

జాకీచాన్‌ ఎన్నో కష్టనష్టాలతో సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్‌ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి కి ఎదిగాడు. ఆక్రోబాటిక్‌ ఫైటింగ్‌ స్టయిల్‌, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు జాకీచాన్‌. ఆయన పేరు చెబితే చాలు మార్షల్‌ ఆర్ట్స్ అభిమానులు పులకరించిపోతారు. 1960 నుంచి నటనారంగంలో ఉన్న జాకీచాన్‌ ఇటీవలే తన 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. గాయకుడు కూడా అయిన జాకీచాన్‌ ఎన్నో ఆల్బమ్స్‌ కూడా.....

Thursday, November 24, 2011

బాలీవుడ్‌లో గుర్తొచ్చినప్పుడల్లా షూటింగ్ అంటారు:ఇలియానా


ఇలియానా ‘బర్ఫీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ‘‘బాలీవుడ్‌లో ... గుర్తొచ్చినప్పుడల్లా షూటింగ్ అంటారు. ఆ సినిమా కారణంగా రెండుమూడు భారీ తెలుగు సినిమాలను వదులుకోవాల్సివచ్చింది. ఇప్పుడు బాధపడితే ఏం లాభం’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు ఇలియానా. -‘‘వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా విజయం సాధించినా నేను మాత్రం బాలీవుడ్‌లో ఉండను. ఇకనుంచి నా దృష్టి అంతా .....

అంకిత భావంతో చేసాను:నయనతార

పవిత్రమైన ఇల్లాలికి ప్రతిరూపం సీత. ఆ పరమ పవిత్రమూర్తి పాత్రలో నయనతార నటించడమేంటి? ఆ పాత్రకు నయనతార తగదు? ఇది కొన్ని నెలల క్రితం కొన్ని మహిళా సంఘాల వాదన. గ్లామర్ డాల్‌గా కమర్షియల్ చిత్రాల్లో చిందులేసిన నయనతార ఏంటీ? సీతగా నటించడమేంటి? ఇది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన కొంత మంది వాదన. అప్పుడు నయనతారను విమర్శించిన వారే ాశ్రీరామరాజ్యం్ణ చిత్రంలో మహాసాద్వి సీతగా ఆమె కనబరిచిన నటన చూసి ....

Monday, November 21, 2011

పరభాషా నటులపై ఆంక్షలు విధిస్తాం


ప్రతిభ ఉన్న తెలుగు నటులు అవకాశాల్లేక మరుగున పడుతున్నారు’’ అని ప్రముఖ నటుడు, నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ విజయనగరంలో పత్రికలవారితో ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల లావాదేవీలతో నడిచే సినీ పరిశ్రమలో తెలుగు నటులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉందని, అందువల్ల పరభాషా నటులపై ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.పరిశ్రమ వర్గాలు ఇటీవల పరభాషా నటులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ప్రతిభ ఉన్న తెలుగు నటులు అవకాశాల్లేక....

నేనూ తపన పడుతున్నా:ఫ్రిదా పింటో

స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌తో హాలీవుడ్‌ ప్రవేశం చేసిన ఫ్రిదా పింటో కెరీర్‌ మంచి ఊపుమీద నడుస్తోంది. ముంబారులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి ప్రయత్నం ప్రపంచవాప్త గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్కార్‌ పంట పండించింది. దీంతో హాలీవుడ్‌లోని చిత్ర ప్రముఖుల దృష్టిలో పడింది. యూ విల్‌ మీట్‌ ఏ టాల్‌ డార్క్‌ స్ట్రేంజర్‌, మిరాలి, రైజ్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌, ఇమ్మోర్టల్స్‌...మొదలైన అంతర్జాతీయ చిత్రాల్లో నటించింది. మరో రెండు ఆంగ్ల చిత్రాలు....

Saturday, November 19, 2011

రాజకీయాల్లో చేరడం జీవితంలోనే అత్యంత చెత్త నిర్ణయం:గోవిందా


రాజకీయాల కోసం ఐదేళ్లపాటు సినీరంగానికి దూరమైన ప్రముఖ నటుడు గోవిందా ఇప్పుడు చింతిస్తున్నాడు. రాజకీయాల్లో చేరాలనుకోవడం తన జీవితంలోనే అత్యంత చెత్త నిర్ణయమని అంగీకరించాడు. రాజకీయాలు తనకు ఏమాత్రమూ సరిపడవని 2004లో ఉత్తర ముంబై ఎంపీగా ఎన్నికైన గోవిందా అన్నాడు. ‘ఆ ఐదేళ్లలో నేను చాలా కష్టాలు అనుభవించా. శరీరం బరువు ఏకంగా 108 కిలోలకు చేరింది.చివరికి రాజకీయాలను వదిలించుకున్నాను. బరువు తగ్గడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది’ అంటూ ఈ 47 ఏళ్ల నటుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘రాజకీయం దుర్మార్గపు ఆట అని అనను కానీ .....

తెలుగు చిత్ర నిర్మాతలకు కొత్త ఊపిరి

భారీ ఎత్తున సినిమాలను తీయడమేకాదు అందులో విషయం కూడా ఉందా లేదా అనేది చూస్తున్నాడు తెలివైన సగటు ప్రేక్షకుడు. సినిమా నిర్మాణం అనేది ఈ రోజుల్లో కత్తిమీద సాము మాదిరిగా తయారయింది. హంగామా చేసి సినిమా విడుదల చేయడంతో పాటు , దానికి ప్రచారం కల్పించడం సినిమా నిర్మాణం కన్నా కష్టసాధ్యమైపోయింది. తీరా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసుకుని విడుదల చేశాక పైరసీ సీడీలు మర్నాడే ప్రత్యక్షం అవుతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీతో దానిని కొంతవరకూ అరికట్టగలిగారు . ఇప్పుడు తాజాగా విడుదలయిన ‘దూకుడు’, ‘శ్రీరామరాజ్యం’ మళ్లీ భారీ తెలుగు చిత్ర నిర్మాతలకు .....

Friday, November 18, 2011

అవి చాలా ప్రమాదకరం :జెనీలియా

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయంలో వందం శాతం ఆలోచించుకోవాల్సి ఉంటుందని నటి జెనీలియా అంటున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపును, క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ నవ్వుల రాణి విజయ్ సరసన నటించిన వేలాయుధం ఇటీవలే విడుదలై విజయ వంతంగా ప్రదర్శింపబడుతోంది. అలాగే మలయాళంలో నటించిన.....

అపురూప దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’:చిత్ర సమీక్ష

నందమూరి తారక రామారావు నటించిన ‘లవకుశ’ తెలుగు సినీ ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది. శ్రీరాముడంటే ఎన్టీఆర్, సీతమ్మ అంటే అంజలీదేవి అనే నమ్మకం వారిది. ఇక లవకుశులు ఆ తరం వారందరి మదినీ దోచిన కవలలు. ఆ సుందర సుమధుర దృశ్య కావ్యాన్ని సృష్టించడం అంటే ఎంత సాహసం కావాలి? శ్రీరాముని పాత్రను, సీత అభినయాన్ని, లవకుశుల గానామృతాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ఎంత ధైర్యం ఉండాలి? అయితే అవన్నీ నిండుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల కలయికకు ప్రతిరూపంగా ‘శ్రీరామరాజ్యం’ నిలిచింది. ‘లవకుశ’ చిత్రాన్ని ఈ తరానికీ అందించాలనే సత్ సంకల్పం నిర్మాత యలమంచిలి సాయిబాబుది అయితే, ఎనభై ఏళ్ళ వయసులో సైతం....

Tuesday, November 15, 2011

అందుకే వివాదాస్పద టీవీ షోల్లో పాల్గొంటున్నాను

కేవలం సినీతారలు, ప్రముఖులే ఎక్కువగా కనిపించే కలర్స్ చానెల్ బిగ్‌బాస్ 5 షోలో ఒక లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తి ప్రవేశించడం సాధారణ విషయం ఏమీ కాదు. సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణ్ త్రిపాఠీ మాత్రం నిస్సంకోచంగా ఇందులోని ప్రవేశించారు. అదృష్టం బాగా లేకపోవడంతో 42 రోజుల తరువాత ఆ షో నుంచి ఆదివారం బయటికి రావాల్సి వచ్చింది. స్వయంగా లింగమార్పిడి చేయించుకొని తనలాంటి వాళ్ల సంక్షేమం కోసం 12 ఏళ్లుగా పోరాడుతున్న...

మంచి సినిమా తీయాలన్న ఆలోచన వస్తే నాశనమే :పూరి జగన్నాథ్

Saturday, November 12, 2011

మెదడుకు పని చెప్పాను :శంకర్

‘రీమేక్ చిత్రమే కథా కొంచెం రిలాక్స్‌గా చేద్దామని మొదట అనుకున్నా.. ఆ తర్వాత అర్థమైంది... మైండ్‌కు పని చెప్పాల్సింది చాలా ఉందని’ అని నన్బన్ గురించి ఆ చిత్ర దర్శకుడు శంకర్ అన్న మాటలివి. ఇప్పటి వరకు సొంత కథలతో 9 చిత్రాలను తెరకెక్కించిన శంకర్ ప్రస్తుతం తన పదవ చిత్రాన్ని రీమేక్ కథతో రూపొంది స్తున్నారు. శంకర్ చిత్రం వస్తుందంటే దానిపై అంచనా లు అధికంగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తమిళంలో తొలి సారిగా....

టాప్‌ డిజైనర్‌ ఔట్‌ఫిట్‌కోసం దీపికా, చిత్రాంగదల గొడవ

అందాల తారలకు ఒకరంటే మరొకరికి అస్సలు గిట్టదు. తరచు గా ఒకరిపై మరొకరు కామెంట్‌ చేసు కుంటూ వార్తల్లోకెక్కుతుంటారు. బాలీవుడ్‌ సుందరాంగులు చిత్రాంగద సింగ్‌, దీపికా పదుకునేలమధ్య వైరం కొనసాగుతోంది. దీపికా పదుకునే, చిత్రాంగద సింగ్‌లు రోహిత్‌ ధావన్‌ చిత్రం ‘దేశి బాయ్స్‌’లో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి నటిస్తున్న' దేశి బాయ్స్‌' సినిమా సెట్స్‌లో కూడా ఈ తారలు గొడవకు దిగుతున్నారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. దీంతో చివరికి ఈ అందాలతారలు కలిసి ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చి...