RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, August 28, 2011

ఓ ఫైన్ డే నేనే చెప్పేశా

ఈ వారం ఏ సినిమాకి ప్రేక్షకులు లేరు

Friday, August 26, 2011

నిజాయితీ లేనిరోజు ... అన్నీ ఓటములే... జాక్వెలిన్

చురకత్తుల్లాంటి చూపులతో గుండెలకు గాలాలు వేయడం, మెరుపులీనే మేనుతో మెస్మరైజ్ చేయడం ఆమెకు చాలా బాగా తెలుసు. ఇటీవలే ‘మర్డర్ 2’తో ప్రేక్షకుల మతులు పోగొట్టిన ఆ సౌందర్యరాశి... జాక్వెలిన్ ఫెర్నాండెజ్. మోడల్‌గా, నటిగా, కాలమిస్ట్‌గా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఈ సొగసరి... ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా...

ఐటమ్‌సాంగ్‌లో నటించే అందాల భామకు కోటి రూపాయలు

శింబు చిత్రంలో ఐటమ్‌సాంగ్‌లో నటించే అందాల భామకు కోటి రూపాయల పారితోషికం ఇవ్వడానికి నిర్మాత సిద్ధపడినట్లు సమాచారం. విన్నైతాండి వరువాయ్, వానం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తరువాత శింబు నటిస్తున్న చిత్రం 'ఒస్తీ' . ఇది హిందీలో ఘన విజయం సాధించిన దబాంగ్ చిత్రానికి రీమేక్. ధరణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక ఐటమ్‌సాంగ్ ఉంది. హిందీలో మున్ని.. సాంగ్‌లో సెక్స్‌బాంబ్ మలైకా అరోరా ఖాన్ నటించింది. ఆ చిత్ర విజయానికి ఈ సాంగ్ పెద్ద ప్లస్....

Thursday, August 25, 2011

చిరునవ్వు చెరిగిపోదంటున్నసమంత

భవిష్యత్తు గురించి ఆలోచించే అలవాటు మనకు లేదు. ఈరోజు ఏమిటని మాత్రమే ఆలోచిస్తా. ముందున్న క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నా. అదే నాకున్న ఏకైక బలం...అంటోంది సమంత. మహేష్‌బాబుతో చేసిన 'దూకుడు' పూర్తికావచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని విశ్వాసంతో సమంతా ఉంది. మరిన్ని అవకాశాలకు దారి చూపుతుందని ఆశగా ఉంది. తెలుగులో ప్రేక్షకుల్లో ప్రస్తుతం మంచి క్రేజ్‌ సంపాదించిన తారల్లో.....

రెండేళ్ళ తర్వాతనే అందాల అనుష్క పెళ్లి

జేజమ్మగా తెలుగు లోగిళ్లలో సందడి చేసిన అనుష్క.... వన్నె తరగని నాయిక అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షక దేవుళ్ల గుండెల్లో ఆమెకు మంచి స్థానం ఉంది. ప్రస్తుతం ఈ అనుష్క తెలుగు సహా తమిళనాట కూడా తన హవా నడిపిస్తోంది. ఇక్కడో సినిమా, అక్కడో సినిమా అన్న చందాన ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జున సరసన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఢమరుకం’లో నటిస్తూనే..తమిళనాట కార్తీకి జతగా ఓ చిత్రంలో నటిస్తోంది. అదేగాక కమల్‌హాసన్‌.....

Tuesday, August 23, 2011

శృతిహాసన్‌కు సిఫార్సులంటే గిట్టదు

శృతిహాసన్‌కు సిఫార్సులంటే అస్సలు ఇష్టముండదట. కమల్‌ కూతురు అనే ముద్ర నుంచి బయట పడేందుకు శృతి చేయని ప్రయత్నం లేదు. ప్రతి విషయంలోనూ తనదైన ప్రత్యేకతను చూపించాలని ఆరాటపడుతోంది. తాజా కబురేంటంటే...ఎవరైనా కథ చెప్పాలనుకుంటే తన దగ్గరకు రావాల్సిందేనని పట్టుబడుతోంది. కమల్‌ ఉన్నాడుగా...అతనికి చెబితే సరిపోతుందని భావించే నిర్మాతలకు తాను దూరమని చెప్పకనే చెబుతోంది. తమిళ నిర్మాతొకరు ......

హాలీవుడ్‌లో నెంబర్ వన్ లీయోనార్డో

Sunday, August 21, 2011

సల్మాన్‌ జీవితంలో ఇంకెవారికీ చోటు లేదంటోంది కత్రినా

నేనున్నానని... నీకేం కాదని అంటూ తెగ ఓదార్చేస్తోంది కత్రినాకైఫ్‌ తన కండల బాయ్‌ఫ్రెండ్‌ సల్మాన్‌ఖాన్‌ని. కొంత విరామం తర్వాత ఇటీవల సల్మాన్ తో ఏక త టైగర్ చిత్రం లో నటిస్తున్నకత్రినాకైఫ్‌- కొంతమంది పనిగట్టుకుని మా మధ్య లేని అగాధాన్ని సృష్టించారని... ఒకప్పుడు సల్మాన్‌ బ్యాడ్‌ పీరియడ్‌లో ఉన్నప్పుడు తాను దగ్గరున్నానంటూ...

ఆటో డ్రైవర్‌ కూతురిగా ఫ్రీదా పింటో

ఆస్కార్‌ అవార్డు చిత్రం స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చిత్రంలో మెరిసిన సినీతార ఫ్రీదా పింటో. ఈ చిత్రంతో అంతర్జాతీయంగా పాపులారిటీ సంపాదించారు ఫ్రీదా. ఆ తర్వాత రెండు, మూడు హాలీవుడ్‌ చిత్రాల్లో చేసిన ఈ తార అందులో పూర్తిగా వెస్ట్రన్‌ స్టైల్‌లో కనిపించారు. త్వరలో చేయనున్న ఓ ఇంగ్లీష్‌ చిత్రంలో ఫ్రీదా పూర్తిగా దేశీయ అవతారంలో కనిపించనుండడం విశేషం. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం ఇండియాలో జరుపుకోనున్నారు. త్వరలో ఈ సిని మా .....

Thursday, August 18, 2011

అది నిజం కాదు :జీవా

శవం పక్కనే శృంగారం వార్తలతో వర్మ షాక్

ఇటీవల రక్తచరిత్ర తీసి సంచలనం సృష్టించిన రామ్‌గోపాల్ వర్మ.. ఇలాంటిదే మరో సినిమాను ప్రేక్షకుల ముంగిటికి తీసుకువస్తున్నాడు. నీరజ్ గ్రోవర్ అనే టీవీ చానెల్ ఉద్యోగిని మరియా సుసైరాజ్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేయడాన్ని ఆధారంగా తీసుకొని వర్మ ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ని రూపొందించాడు. మూడేళ్ల శిక్ష అనంతరం మరియా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సునీల్ బోహ్రా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. కన్నడ నటి మరియా, నేవీ మాజీ అధికారి ఎమైల్ జెరోమ్ మాథ్యూ కలిసి....

రణభీర్‌ నాబెస్ట్‌ ఫ్రెండ్‌... అనంటున్న దీపిక

ఎ.ఆర్‌.రెహ్మాన్‌ 'సత్యమేవ జయతే'... దక్షిణాదిన ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా మొదటి సారి మేకప్ వేసుకున్నది దక్షిణాది చిత్రం కోసమే. విజయ్ కథానాయకుడిగా నటించిన ఆ తమిళ సినిమా పేరు 'తమిళన్'. అక్కడి నుంచి బాలీవుడ్‌కెళ్ళి ఓ వెలుగు వెలిగిన ప్రియాంక ఇప్పుడు మరలా దక్షిణాది వైపు చూడనుంది. అదీ మురుగదాస్ దర్శకత్వంలో. దర్శకుడు మురుగదాస్ విజయ్‌తో ఓ సినిమా తీస్తున్నట్లు ఇటీవల వార్త వెలువడింది. ఇందులో హీరోయిన్‌గా అనీల్‌కపూర్ కూతురు సోనమ్‌కపూర్ నటిస్తోందని అనుకున్నారు. అయితే ఆమె....

Wednesday, August 17, 2011

తండ్రి రచనలతో అమితాబ్ మ్యూజియం

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నేటికీ యాంగ్రీయంగ్‌మన్‌గా హిట్‌ చిత్రాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుడ్డా...తేరా బాప్‌ హిట్‌ చిత్రంతో ఆయన బాలీవుడ్‌లో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక బిగ్‌-బి తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ కూడా పాపులర్‌ వ్యక్తే. ఆయన తనయుడి మాదిరిగా సినిమాల్లో కాకుండా సాహిత్యంలో ఎన్నో గొప్ప రచనలు చేసి ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ నేపథ్యంలో తండ్రి రచనలన్నీ....

షమ్మీకపూర్‌ చివరి మాటలు

తెరపైనే కాదు, తెరవెనకా ఆత్మీయ అనుబంధాల్ని పెనవేసుకున్న బాలీవుడ్‌ నటుడు షమ్మీకపూర్‌. కెమెరా ముందు విషాదం, వినోదం పండించటం ఒక ఎత్తు. నిజ జీవితంలో వాటితో పయనించటం మరొక ఎత్తు. రొమాంటిక్‌ హీరోగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న షమ్మీ కపూర్‌ జీవితంలోకి విషాదం ప్రవేశించింది. కిడ్నీ సమస్యలతో వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యారు. ఆ సమయంలో కూడా జీవితాన్ని సానుకూలంగానే తీసుకొని, తనదైన లోకాన్ని సృష్టించుకున్నారు. కంప్యూటర్‌ టెక్నాలజీని ఆలంబనగా చేసుకొని, ఎంతోమంది నూతన నటీనటులతో అనుబంధాన్ని....

Friday, August 12, 2011

దేశంలోని అందరికీ అందుబాటులో...

'కేడి' స్థాయిలో 'దడ'... 'రెడీ' రేంజిలో 'కందిరీగ'

Tuesday, August 9, 2011

ఘనంగా 'సంతోషం' అవార్డుల వేడుక

అశేష ప్రజానీకం మధ్య 'సంతోషం' సినిమా వారపత్రిక 9వ 'సంతోషం' ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నోవాటెల్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు అందుకున్నారు. ఉత్తమనటుడు అవార్డు: బాలకృష్ణ,(సింహా), ఉత్తమ కథానాయిక: అనుష్క (వేదం), ఉత్తమ ఫేస్‌ ఆఫ్‌ ద ఇయర్‌: దీక్షాసేథ్‌ (వేదం), ఉత్తమదర్శకుడు: బోయపాటి శ్రీను (సింహా), ఉత్తమ తొలి చిత్రం నిర్మాత: పరుచూరి కిరీటి (సింహా), ఉత్తమ మాటల రచయిత: బోయపాటి శ్రీను (సింహా), ఉత్తమ సంగీత దర్శకుడు : చక్రి (సింహా), ఉత్తమ సహాయనటుడు : సాయికుమార్‌ (ప్రస్థానం), ......

సైంటిస్ట్‌, బౌద్ధ సన్యాసి, సర్కస్ కళాకారుడిగా మూడు పాత్రల్లో సూర్య

మురుగదాస్, సూర్యల కాంబినేషన్లో మరో భారీ చిత్రం రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తమిళ్‌లో ‘7ఆమ్ ఆరివు’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య సైంటిస్ట్‌గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో...

Sunday, August 7, 2011

అభిమానుల కోసం ఆసుపత్రి నిర్మిస్తున్న రజనీకాంత్


అభిమానుల కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో ఓ ఆసుపత్రిని నిర్మించనున్నట్టు ఆ యన సోదరుడు సత్యనారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు. సింగపూర్‌లో చికిత్స పొంది చెన్నైకి తిరిగి వచ్చిన రజనీ ప్రస్తుతం ఆళ్వార్‌పేటలోని తన కుమార్తె ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. సింగపూర్ ఆసుపత్రిలో చేరిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు చేసిన పూజలు రజనీని కదిలించాయన్నారు. అభిమానుల ప్రార్థనల వల్లే తాను తిరిగి కోలుకున్నానని....

కాస్త ఓపిక పట్టండి... అనంటున్న త్రిష

‘‘నా పెళ్లి గురించి నా కంటే మీకే కంగారెక్కువైపోయింది’’ అంటూ త్రిష మీడియాపై వ్యంగ్యాస్ర్తాలను సంధించారు. సినిమాలు తగ్గడంతో ఇక త్రిష పెళ్లాడేయాలని నిశ్చయించుకున్నారని, ప్రస్తుతం ఇంట్లో వాళ్లు వరుడి అన్వేషణలో ఉన్నారని త్రిషపై ఇప్పటికే పలు కథనాలు కోలీవుడ్‌లో వెలువడ్డాయి. అలాగే ఓ తమిళ యువహీరోతో త్రిష ప్రేమాయణం...

Friday, August 5, 2011

2010 నంది అవార్డులు ప్రకటన

నటిస్తూనే... అంతర్జాతీయ సంగీత శృతి

రపంచ ప్రఖ్యాతిగాంచిన విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తనయురాలు శృతి హాసన్‌. ఈ అందాల తార నేడు సినీ యాక్టర్‌గానే కాకుండా సింగర్‌గా సైతం పాపులారిటీ సంపాదిస్తోంది. ఈ సినీతార ఇటీవల కొత్త అవతారం ఎత్తి వెల్వెట్‌ రివాల్వర్‌ అనే ఇంటర్నేషనల్‌ బ్యాండ్‌కు లిరిక్స్‌ రాయడమే గా కుండా పాటలు పాడి అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. రాక్‌ స్టార్‌ డేవిడ్‌ కుష్నర్‌కు చెందిన వెల్వెట్‌ రివాల్వర్‌ బ్యాండ్‌తో కలిసి....

Tuesday, August 2, 2011

నా క్రేజ్ తగ్గలేదు ...త్రిష

తన క్రేజ్ ఏమీ తగ్గలేదని త్రిష అంటున్నారు. ఈ చెన్నై బ్యూటీ ఇటీవల ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు. త్రిష ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని, ఆమె తల్లి వరుడ్ని కూడా సెలెక్ట్ చేసున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లి వార్తలను త్రిష ఖండిస్తున్నారు. ప్రేమ వివాహమే చేసుకుంటానని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. వీటన్నిటికీ కారణం....

మళ్లీ కెరీర్ ప్రారంభిస్తున్నా...మమత

Monday, August 1, 2011

'బద్రీనాథ్‌' 187 సెంటర్లలో యాభై రోజులంటే నమ్మరే...‌

'బన్నీ బాగా చేశాడని అందరూ అంటుంటే తండ్రిగా చాలా గర్వపడుతున్నా. ఈ సినిమాకోసం దర్శకుడు వినాయక్‌ అందర్నీ బాగా కష్టపెట్టాడు. ఇంత మంచి విజయం సాధించిందంటే కారణమూ ఆయనే. అందుకు అభినందలు' అని బద్రినాద్ 50 రోజుల సభలో నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. భారీగా తీసినా బాడ్ టాక్ వచ్చిన ఈ చిత్రం 187 సెంటర్లలో అడిందంటే.....

అమీర్ ఖాన్ భార్యా 'కిరణం'

ఢిల్లీ బెల్లీ....తాజాగా వివాదాల్లో చిక్కుకున్న చిత్రమిది. ఒక దశలో నేపాల్‌లో ఈ చిత్రాన్ని నిషేధించారు. ఆ తరువాత పెద్దలకు మాత్రమే అనుమతించారు. తాజాగా భారతదేశంలోనూ ఇదెన్నో వివాదాల్లో చిక్కుకుంది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఈ చిత్రం పై కేసు నడుస్తోంది. ఈ చిత్రానికి అభినయ్‌ దేవ్‌ దర్శకత్వం వహించారు. అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావ్‌ తదితరులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తీసేందుకు ముందు అభినయ్‌ అమీర్‌ఖాన్‌ను కలుసుకొని కథ వినాల్సిందిగా.....