RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Tuesday, May 31, 2011

కత్రినా కైఫ్ కు తప్పిన ముప్పు

నడి సముద్రంలో షార్క్‌ల లాంటి ప్రమాదకరమైన చేపలు తిరిగే చోట అందమైన హీరోయిన్ ఈతలు కొడుతుంటే తెరమీద చూడటానికి మనకి బాగానే ఉంటుంది. అందులోనూ కత్రినా కైఫ్ లాంటి మల్లెతీగలు అలా చేస్తుంటే అంతా కళ్లప్పగించి చూస్తుంటారు. కానీ.. షూటింగ్‌లో ఈత కొడుతున్నప్పుడు తలమీద నుంచి షార్క్ చేప వెళ్తే.. అందులోనూ ఆ విషయం బయటకు వచ్చిన ఓ అరగంట తర్వాత తెలిస్తే ఎలా ఉంటుంది? జోయా అక్తర్......

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా అందాల తార మాధురీ దీక్షిత్‌

ఒకప్పటి బాలీవుడ్‌ అందాల తార మాధురీ దీక్షిత్‌ నేడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా మారారు. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా నిలి చిన ఈ తార ప్రస్తుతం అమెరికాలో ఓ పెద్ద షాపింగ్‌ మాల్‌ను కొనుగోలు చేయడం విశేషం. ఆమె యుఎస్‌లోని ఫ్లోరిడాలో మిలియన్ల డాలర్ల విలువ చేసే షాపింగ్‌ మాల్‌ను కొనుగోలుచేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సినీ తార మాధురీ దీక్షిత్‌ వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడిన విష యం అందరికీ తెలిసిందే. అక్కడ కొంతకాలం కుటుంబంతో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె......

Monday, May 30, 2011

అవన్నీ పూర్తయితేనే...త్రిష పెళ్లి

ఈ మధ్య త్రిష పెళ్లి వార్తలు దక్షిణాదిన షికార్లు చేశాయి. వాటిని ఆమె చిరునవ్వుతో తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కాగా... ఇటీవల తన పెళ్లి గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పేశారు ఈ చెన్నయ్ చందమామ. తమిళంలో అజిత్‌తో చేస్తున్న ‘మంకత’ త్రిష నలభైయ్యవ సినిమా. యాభై సినిమాలను పూర్తి చేసిన తర్వాత అంటే... ఇంకా పది సినిమాల్లో నటించిన తర్వాత, పెళ్లి గురించి......

ముచ్చటగా మూడో ఖాన్‌ తో క్వీన్ అసిన్

లండన్‌ డ్రీమ్స్‌ చిత్రంతో అసిన్‌ పని అయిపోయిందని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేశాయి. ఇక అసిన్‌ మళ్లీ పుట్టింటికే అనుకున్నవాళ్లందరికీ అసిన్‌ సల్మాన్‌ఖాన్‌తో ‘రెడీ’ అయ్యేసరికి అంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ‘వాంటెడ్‌’, ‘దబంగ్‌’ చిత్రాల తర్వాత బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా చెలామణి అవుతున్న సల్మాన్‌ఖాన్‌తో ఉత్తరాది హీరోయిన్ల పోటీకి ఎదురొడ్డి ఛాంపియన్‌గా అసిన్‌ నిలబడింది. సల్మాన్‌ మనసు చూరగొంది. ఇదిలావుండగా ఇంతవరకూ బాలీవుడ్‌లో మహామహులైన హీరోయిన్లకే సాధ్యం కాలేనిది అసిన్‌కు సాధ్యమయింది. త్వరలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో కలిసి ‘టూ స్టేట్స్‌’ చిత్రంలో నటించే......

Saturday, May 28, 2011

పీపుల్స్‌ మేగజైన్‌లో కత్రినా రహస్యాలు

త సంవత్సరం మోస్ట్‌ బ్యూటిఫుల్‌ వుమెన్‌గా, సెక్సీయెస్ట్‌ వుమెన్‌గా వార్తలలోకి ఎక్కిన కత్రినాకైఫ్‌కు సినిమా జయాపజయాలతో సంబం ధం లేకుండా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ఫ్యాన్స్‌ హవా ఎక్కువనే చెప్పాలి. ఎక్కువగా నెటిజన్లు కత్రినా ఫొటోల కోసం ఇంటర్నెట్‌ సెర్చ్‌ చేస్తుంటారు. రీసెంట్‌గా మార్కెట్లో విడుదలైన జూన్‌ సంచిక ‘పీపుల్స్‌ మేగజైన్‌’ కవర్‌ పేజీపై కత్రినా అందమైన ఫొటో తెగ సందడి చేస్తోంది. కత్రినా పీపుల్స్‌ మేగజైన్‌లో తన అందం వెనక ఉన్న సీక్రెట్స్‌ ఎన్నో....

హింసించిన పోసాని దుశ్శాసన ...

శ్రీకాంత్ హీరోగా పోసాని క్రిష్ణ మురళి దర్శకత్వం లో నిర్మించిన' దుశ్శాసన' విడుదలయి ఈ మధ్య కాలం లో ఏ చిత్రానికి రానంత ఘోరమైన విమర్సల పాలయ్యింది. ఓ వెబ్ సైట్ ఈ చిత్రానికి 0 రేటింగ్ ఇచ్చిన్దంటేనే దీని దయనీయ పరిస్థితి అర్ధమౌతుంది. అర్ధం పర్ధం లేని కధ తో , ఆచరణ సాధ్యం కాని సందేశం తో .....అసహనానికి గురి చేసే సన్నివేశాలతో....

Thursday, May 26, 2011

నా స్థానం పదిలం ;త్రిష

అందం అభినయం ఉన్న అతికొద్దిమంది తారామణుల్లో త్రిష ఒకరు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన పాత్రలను ఎంపిక చేసుకోవటంలో, కథా ఎంపికలో జాగ్రత్తగా ఉంటారు. అదే ఆవిడ్ని తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో మంచి నటిగా నిలిపింది. బాలీవుడ్‌లో చేసిన 'కట్టామీఠా' ప్రయత్నం నిరాశ కలిగించటంతో, మళ్లీ దక్షిణాది వైపు దృష్టి సారించింది. ఇటీవల వచ్చిన 'తీన్‌మార్‌'లో త్రిషకు మంచి.....

రజనీకాంత్ గురించి మరోసారి ....

రజనీకాంత్‌ మొదట పాపులర్‌ కన్నడ నాటకాల రచయిత, దర్శకులు టోపి మునియప్ప వద్ద నటనలో శిక్షణపొందారు. ఆయన నాటకాల్లో పలు పాత్రల్లో నటించారు. 1973లో ఆయనతో కలిసి నాటకాలు చేసిన రాజ్‌ బహదూర్‌ అనే స్నేహితుడు రజనీకాంత్‌ను మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణపొందాలని సూచించారు. దీంతో ఈ ఇనిస్టిట్యూట్‌లో చేరిన రజనీకాంత్‌కు రెండు సంవత్సరాల పాటు అవసరమైన ఆర్థిక సహాయం కూడా రాజ్‌బహదూర్‌ చేశాడు. ఒకసారి రజనీకాంత్‌ నాటక ప్రదర్శనను.....

Tuesday, May 24, 2011

ఏంజిలినా జోలీ సేవలు స్ఫూర్తిదా యకం .....

ఏంజిలీనా జోలి ...అమెరికన్‌ మోడల్‌, ప్రఖ్యాత హాలీవుడ్‌ హీరోయిన్‌. హాలీవుడ్‌లో ఒకానొక దశలో అత్యధిక పారితోషికం అందుకున్న నటి ఆమె. ప్రఖ్యాత హాలీవుడ్‌ నటిగా విశ్వవ్యాప్త అభిమానులను సొంతం చేసుకున్న జోలీ మూడుసార్లు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుంది. రెండుసార్లు స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులను, అనితర సాధ్యమైన అకాడమీ అవార్డులను అందుకున్న జోలీ......

బంగారానికి బ్రాండ్ అంబాసిడర్లు మన హీరో లు ....

ఇటీవల కాలంలో మన తెలుగు హీరోలను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంటూ తమ బంగారు ఆభరణాల విక్రయాలను పెంచుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. నాగార్జున అక్కినేని 'కళ్యాణ్‌ జ్యుయలర్స్‌'కు బ్రాండ్‌ అంబాసడర్‌గా వ్యవహరిస్తుంటే.. బంగారంపై అప్పులిచ్చే ‘మణప్పురం’ అనే సంస్థకు వెంకటేష్‌ ప్రచారం చేస్తున్నారు. ఇక మహేష్‌బాబు ‘......http://cinevinodam.com/news/flash_news1.htm

Monday, May 23, 2011

రజనీకాంత్ గురించి మరోసారి ....

రజనీకాంత్‌ మొదట పాపులర్‌ కన్నడ నాటకాల రచయిత, దర్శకులు టోపి మునియప్ప వద్ద నటనలో శిక్షణపొందారు. ఆయన నాటకాల్లో పలు పాత్రల్లో నటించారు. 1973లో ఆయనతో కలిసి నాటకాలు చేసిన రాజ్‌ బహదూర్‌ అనే స్నేహితుడు రజనీకాంత్‌ను మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణపొందాలని సూచించారు. దీంతో ఈ ఇనిస్టిట్యూట్‌లో చేరిన రజనీకాంత్‌కు రెండు సంవత్సరాల పాటు అవసరమైన ఆర్థిక సహాయం కూడా రాజ్‌బహదూర్‌ చేశాడు. ఒకసారి రజనీకాంత్‌.....

జెన్నిఫర్‌ లోపెజ్‌... ప్రేమ

ప్రముఖ పాప్‌ సింగర్‌, హాలీవుడ్‌ తార, మోడల్‌ అయిన జెన్నిఫర్‌ లోపెజ్‌ గురించి తెలియని మ్యూజిక్‌ లవర్స్‌ వారుండరు. ఈ గాయని 13 సంవత్సరాల టీనేజీ వయసులోనే ప్రేమలో పడిందట. ఈ నేపథ్యంలో 41 సంవత్సరాల ఈ అమ్మడు ప్రస్తుతం ‘లవ్‌..?’పేరిట ఓ కొత్త మ్యూజిక్‌ ఆల్బమ్‌ను విడుదల చేశారు. టీనేజీలోనే మొదటిసారిగా ప్రేమానుభూతిని పొందిన ఈ సెలబ్రిటీ తన కొత్త.....

Saturday, May 21, 2011

బోర్ కొట్టించిన రవితేజ 'వీర '

'విక్రమార్కుడు' తర్వాత రవితేజ ద్విపాత్రాభినయంతో రమేష్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన 'వీర' ప్రేక్షకులను బోర్ కొట్టించింది. ఈ చిత్రం భవిష్యత్తు ముందే తెలిసిపోవడం వల్లనేమో మొదటినుండి మీడియాకు దూరంగా ఉన్నారు. మంచి నటనతో రవితేజ తన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ .... గతంలో అంతంత మాత్రం సినిమాలను చేసిన దర్శకుడు రమేష్ వర్మ కాలదోషం పట్టిన కధ,......

వైభవంగా పి.పుల్లయ్య శత జయంతి

పద్మశ్రీ పిక్చర్స్ అధినేత, ప్రముఖ నటి శాంతకుమారి భర్త, దర్శక నిర్మాత పి.పుల్లయ్య శత జయంతి ని 'యువకళా వాహిని' హైదరాబాద్ తెలుగు యునివర్సిటీ లో 18న వైభవంగా నిర్వహించింది. కొద్దిమంది అగ్రశ్రేణి సిని దర్శకుల్లో పుల్లయ్య ఒకరు. నిరాడంబరుడు ... అద్భుత ప్రతిభాశాలి. నా జీవితంలో అతనికి గొప్ప స్థానం ఉంది. వేంకటేశ్వరునిఫై రెండు సినిమాలు తీసిన ఘనత.....

Tuesday, May 17, 2011

నిజమైన టాలెంట్ ఉన్న యువ హీరో కౌశిక్ .......

‘సునిశితమైన భావాలు వెండితెరపై పలికించడానికి కళ్ళు, పెదవులు ప్రధానం. కౌశిక్ లో అవి రెండూ వున్నాయి. దానికి తోడు తీరైన పర్సనాలిటీని ఇటీవలి కాలంలో పెంపొందించుకుని సిసలైన హీరోగా తయారయ్యాడు’ అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ‘టాలెంట్ వుండే సినీ నేపథ్యం లేని వాళ్ళకు హీరోగా ఇప్పటి పోటీ వాతావరణంలో ఛాన్స్ వుందా అనే ప్రశ్నకు జవాబు కౌశిక్. ఇలాంటి కుర్రాళ్ళు చాలామంది ఇండస్ట్రీలోకి రావాలి’ అని కౌశిక్ ని ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన వైబ్ సైట్ ని మే 12న ప్రారంభిస్తూ ఆయన అన్నారు. ‘రియల్ టాలెంట్ వున్నవారు గతంలో http://cinevinodam.com/cinenews/kaushik140511.htm

ఎన్టీఆర్ పెళ్లి గురించి మీడియాలో ఆహ ఓహో అంటూ .....

ఎన్టీఆర్ పెళ్లి గురించి మీడియాలో ఆహ ఓహో అంటూ వచ్చింది. నిజంగానే పెళ్లి చాలా బాగా జరిగింది. కానీ ఆహుతులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. స్టార్స్ పెళ్ళిలో ఇలాంటివి సహజమే అనే వాళ్ళు లేకపోలేదు. అయితే భోజనాల దగ్గర జరిగిన అరాచకం అంత ఇంత కాదు. టేబుల్ మీల్స్ పెట్టడంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. మీడియా పీపుల్ భోజనానికి వెళుతుంటే సెక్యురిటి సిబ్బంది పాసులు లాగేసుకుని దురుసుగా ప్రవర్తించారు. మీడియా నిరసన వ్యక్తం చేయడంతో కళ్యాణ్ రామ్ సారీ చెప్పారు. గొడవ సద్దుమణిగి భోజనాలకు వెళితే అక్కడ ఎవరికీ భోజనాలే లేవు. కనీసం మంచి నీళ్ళు లేవు. ఎన్టీఆర్ పెళ్ళిలో విందు కోసం 'అక్కడ నుండి పూత రేకులు, ఇక్కడ నుండి హల్వా, వేరెక్కడ నుండో బొబ్బట్లు, ఇంకెక్కడ నుండో సున్నుండలు వస్తున్నాయని' చెవిలో ఇల్లు కట్టుకుని చావగొట్టిన మీడియా వాళ్ళకు ఆ పెళ్లిలో చివరకు పస్తే దిక్కైంది. ఆ కాళరాత్రి ... ఎన్టీఆర్ కళ్యాణ మండపం వెనక జాగారం చేస్తున్న మీడియా మిత్రుల ఫోటో ఇది...

Thursday, May 12, 2011

టీవీ చానెళ్లను పర్య వేక్షించడానికి సెన్సార్ బోర్డు

ఇటీవల వివిధ చానెళ్లలో వచ్చిన రియాలిటీ ప్రదర్శనలు వివాదాస్పదం కావడం, ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో టీవీ చానెళ్లను మరింతగా పర్యవేక్షించాలని సెన్సార్ బోర్డు నిర్ణయించింది. టీవీలకు ప్రత్యేకంగా సెన్సార్ బోర్డు ఏర్పాటుకు కమిటీని నిర్ణయించే ప్రక్రియలో సెన్సార్ బోర్డు ఉంది. అసభ్యతను ప్రోత్సహిస్తున్న రియాలిటీ షోలపై సెన్సారింగ్ ఉండాలనే డిమాండ్......

పూరిని కూడా ఇబ్బంది పెడుతున్న రాక్షసి

సినిమా రంగంలో ఎవరికైనా విజయం ఉంటేనే గుర్తింపు. అసలే విజయం చూసి చాలా కాలం అయిన పూరి జగన్నాథ్ కు అతని తాజా చిత్రం 'నేను నా రాక్షసి' మూలుగుతున్న నక్క ఫై తాటిపండు పడినట్లు మరో పెద్ద పరాజయాన్నిచ్చింది. అయ్యిందేమో అయ్యింది అని... అమితాబ్ తో హిందీ చిత్రం చేసుకుంటున్న పూరికి 'నేను నా రాక్షసి' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిరావడం నిజంగా ఇబ్బందికరమే. టివి చానెల్స్ లోను, పత్రికల వారితోనూ ఈ చిత్రం గొప్పదనాన్ని, ఏమాత్రం ఉత్సాహం లేకుండా పూరి చెబుతుంటే........

Tuesday, May 10, 2011

ఇలియానాను నిషేధించాలి... నయనతార మాట మార్చింది

అసలే వరుస పరాజయాలతో సతమతమౌతున్న ఇలియానాను సినిమా రంగం నుండి నిషేధించాలి... అంటూ ఓ తమిళ్ చిత్ర నిర్మాత డిమాండ్ చేస్తున్నారు. విక్రం హీరోగా మోహన్ నటరాజ్ నిర్మిస్తున్న'దైవమగన్' చిత్రంలో చేసేందుకు ఇలియానా 35లక్షలు అడ్వాన్స్ తీసుకుంది. అయితే శంకర్ '3 ఇడియట్స్ 'లో అవకాశం రావడంతో ఈ చిత్రంలో చెయ్యలేనని చెప్పేసింది. అయితే 35లక్షలు అడ్వాన్సు ఇవ్వలేదు. దాంతో మోహన్ నటరాజ్ చెన్నై ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేసి, అన్ని భాషలలోను ఆమెఫై నిషేధం విధించాలని......

గాడమైన ప్రేమలో సిద్ధార్ధ - శ్రుతి హసన్

'అనగనగా ఓ ధీరుడు'లో తొలిసారి కలిసి నటించిన సిద్ధార్ధ -శ్రుతి హసన్ ఆ చూపులు కలిసిన శుభవేళ ప్రభావంతో మంచి ప్రేమికులుగా మారినట్లు పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అయితే వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ - ఈ జంట ప్రేమ మరింత ముదిరి పాకాన పడుతోందని వార్తలు చెబుతున్నాయి. ఈ జంట వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్' అనే చిత్రంలో చేస్తున్నారు. దీనితో పాటు వీరిద్దరితో ఓ హిందీ చిత్రం కూడా రాబోతోందని.....

షాపుల ఓపెనింగ్స్ కి వస్తారు తప్ప అవార్దుల విలువ తెలియదు

ఇన్‌కంటాక్స్‌ రైడ్స్‌ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయిన కథానాయిక అనుష్క, ఒక్కసారిగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. 'ఎంబిఎస్‌ జువేలేర్స్‌' షాప్‌ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా విచ్చేసింది. ఇందుకుగాను పన్నెండు లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు వినికిడి. అంతకు ముందే జరిగిన వంశీ అవార్డుల కార్యక్రమానికి అనుష్క డుమ్మా కొట్టడం తో... ఇకఫై అవార్డుల కార్యక్రమాలకి హీరోయిన్లని పిలవొద్దని........

చిరంజీవి సరదా పడుతున్న సినిమాకు రంగం సిద్ధం

సినిమాల్లో మెగా స్టార్... రాజకీయాల్లో కమెడియన్ అయిన చిరంజీవికి మళ్ళీ సినిమాలు చేసి, పోయిన ఇమేజ్ తిరిగి సంపాయించేసుకోవాలని తెగ ఉబలాటంగా ఉంది. దానికోసం సమాజానికి సందేసాన్నిచ్చే 'అధినాయకుడు'గా చిరంజీవిని చూపేలా ఓ సినిమాను ప్లాన్ చేసారు. పరుచూరి సోదరులు రచన చేసిన ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ప్రముఖ నాయిక నటించే......

Saturday, May 7, 2011

తెలుగు సినిమాల పేర్లు .... తెలుగు తప్ప ఏదైనా

తమిళ సినిమాలకు మరికొన్ని భాషా చిత్రాల్లో వారి భాషను ప్రోత్సహించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ్ పేరు పెడితేనే అక్కడ ప్రభుత్వ రాయితీలు ఇస్తారు. మరి ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. తీసేది తెలుగు సినిమా పేర్లేమో ... తెలుగు తప్ప ఏదైనా. ఈ మధ్య వచ్చిన 'తీన్ మార్', 'mr.పెర్ఫెక్ట్', '100% లవ్' కొన్ని ఉదాహరణలు. 'లైఫ్ ఈజ్...........

ఎన్టీఆర్ పెళ్లిలో మీడియాకు అవమానం

ఈ మధ్య కాలంలో ఎవరూ చేసుకోనంత ఘనంగా పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ మీడియా పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. సినిమా నటుడిగా అనుదినం ఫిలిం మీడియాతో సంబంధం, అనుబంధం ఉండే అతని వివాహ ఆహ్వానం మాత్రం ఫిలిం మీడియాలో చాలా మందికి అందలేదు. వాళ్ళ దృష్టిలో ముఖ్యులు కొందరికే ఇచ్చారు. ఇకపోతే పెళ్లి కవరేజికి వెళ్ళిన మీడియా వారికి మరింత అవమానం జరిగింది. పెళ్లిలో పెట్టుకున్న సెక్యూరిటీ వారు మీడియా వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నోటికొచ్చింది......

Thursday, May 5, 2011

సక్సెస్స్ తో కాజల్ రేటు పెంచేసింది

అందాల నటి కాజల్ ప్రభాస్ తో చేసిన 'డార్లింగ్', 'mr.పెర్ఫెక్ట్ ' విజయవంతం కావడంతో పారితోషికాన్ని పెంచేసిందని తెలుస్తోంది. ఆమె చేసిన 'బృందావనం' కూడా పర్వాలేదనిపించింది. 70, 80లక్షలు అడుగుతున్న కాజల్ ఇప్పుడు కోటికి మారిందట. తమిళంలోనూ పాపులర్ అయిన కాజల్ ఇప్పుడు హిందీలోను నటించబోతోంది. మనలో ప్రతిభ ఉండి, వచ్చిన అవకాశాలను......

ప్రచార చిత్రాల్లో ప్రధమ స్థానం ప్రియాంక దే

సాధారణంగా తను నటించే సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్‌ బట్టే ఎవరైనా టాప్‌స్టార్‌గా పరిగణించబడటం రివాజు. బాలీవుడ్‌లో ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌ ఎవరు అనగానే అంతా కత్రినాకైఫ్‌, కరీనాకపూర్‌ పేర్లే చెబుతారు. ఎందుకంటే వాళ్లు తీసుకునే రెమ్యునరేషన్‌ దక్షిణాది హీరోల రెమ్యునరేషన్‌ కన్నా అధికంగా ఉండటమే. అయితే జయాపజయాలు, నంబర్‌వన్‌ ర్యాంకులతో సంబంధం లేకుండా బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రాకు కమర్షియల్‌ యాడ్స్‌ రూపంలో సంవత్సరానికి ఎంతలేదన్నా రూ.80 కోట్ల మేరకు ఆదాయం వస్తోందని.......

Monday, May 2, 2011

ఇకఫై ఇబ్బంది పడనంటున్న అనుష్క

‘‘సినిమా అనేది నా జీవితంలో ఓ భాగం మాత్రమే. అంతేకానీ జీవితమే సినిమా కాదు’’ అంటున్నారు అనుష్క. రీల్ లైఫ్ కారణంగా రియల్ లైఫ్‌లోని మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నానని ఈ ముద్దుగుమ్మ ఆవేదన వ్యక్తపరిచారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘కథానాయికగా ఈ స్టేజ్‌కి రాగలగడం సాధారణమైన విషయం కాదు. కృషితో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే ఈ రేంజ్‌కి రాగలం. ఇలాంటి గొప్ప స్థానంలో ఉన్నందుకు ఆనందపడాలో... లేక....

పడిపోయిన ఫీలింగ్ లేదు... సూర్య

రక్త చరిత్ర ఏ భాషలో చేయడానికైనా ఇష్టపడేవాణ్ని. ఆ చిత్రంతో హిందీలో పరిచయటం కావటం చాలా ఆనందంగా ఉంది. ఫలితం ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తిని కాదు. అదొక్కటే పరిగణలోకి తీసుకోను. తమిళంలో నా సినిమాలు బాగానే ఆడుతున్నాయి. భిన్నమైన పాత్రలు వేసినప్పుడల్లా నన్ను బాగానే రిసీవ్‌ చేసుకున్నారు. ఏదో కిందపడిపోయానన్న....

Sunday, May 1, 2011

రాష్ట్రవ్యాప్తంగా క్యాంపస్ ఫిలిం క్లబ్ లు

ఆధునిక యువత ముఖ్యంగా విద్యార్థులు సమాజంపై దుష్ప్రభావం చూపే కార్యక్రమాలు చూస్తూ వ్యసనాల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి ధోరణి నుంచి నవ సమాజాన్ని రక్షించడమే కాకుండా వారిలో సృజనాత్మకత శక్తిని పెంచుతూ ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సృజన, కళలు, సందేశాత్మక, పర్యావరణం, విద్యాపరంగా గుణాత్మక విజ్ఞానం అందించే మంచి సినిమాలు చూపించి విద్యార్థులను తీర్చిదిద్దాలని.......

అనుకున్న పరాజయన్నే మిగిల్చిన 'నేను నా రాక్షసి'

రాణా -ఇలియానా జంటగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో నిర్మించిన 'నేను నా రాక్షసి' అంతా ముందుగా అనుకున్న విధంగానే పరాజయం పాలయింది. మంచి మాస్ ఎంటర్ టైనేర్ ని ఆశించిన వారికి ఈ చిత్రం నిరాశను మిగిల్చింది. ఓ ఇంగ్లిష్ సినిమా ని ఆధారంగా చేసుకుని అర్ధం లేని కధనం తో తీసిన ఈ చిత్రం పరాజయానికి హీరోగా రానా కూడా ఒక కారణం......