RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, July 27, 2012

'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్ర సమీక్ష



                   'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'  చిత్ర సమీక్ష       2.5/5

 మంచు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం ఫై  శేఖర్ రాజా దర్శకత్వం లో మంచు లక్ష్మి ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించారు.

అద్భుతభవనం  గంధర్వ మహల్ ని అద్దెకిచ్చి జీవిస్తున్న రాయుడు కి ఇద్దరు కూతుళ్ళు. అక్కడకి కొత్తగా వచ్చి చేరిన ఓ యువకుడు రాయుడు చిన్న కూతురు ని ప్రేమిస్తున్నానంటూ వెంట తిరుగుతూ ... ఆ కుటుంబానికి  మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. రాయుడు పెద్ద కూతురుకి పెళ్లి కట్నంగా గంధర్వ మహల్ ని ఇమ్మని కోరుతారు. రాయుడు  కుటుంబం అందుకు సిద్ధ పడినా...మరణించిన  రాయుడు తండ్రి నరసింహనాయుడుకు అది ఇష్ట పడక, అతని ఆత్మ  గంధర్వ మహల్లో తిరుగుతూ వారిని ఇబ్బంది పెడుతుంది. ఇంతకీ ఈ గంధర్వ మహల్ అసలు కధ ఏంటి? నరసింహనాయుడు ఎలా మరణించాడు? ఆ ఇంటికి వచ్చిన ఆ యువకుడు ఎవరు? ఈ విషయాలన్నీ సినిమాలోనే చూడాలి ....
                  చాలా సార్లు 'అరుంధతి' ని గుర్తు చేస్తూ అంతకు మించిన భారీనిర్మాణ,సాంకేతిక విలువలతో వచ్చిన ఈ చిత్రంలో అన్ని హంగులూ వున్నాయి...మంచి స్క్రీన్ ప్లే తప్ప. శేఖర్ రాజా గొప్ప  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనిపించింది." చెల్లెలికోసం దేనికైనా వెనుదీయని త్యాగమూర్తి అన్నయ్య ,చెల్లెల్ని బాధ పెట్టే భర్త ,చివరికి అతన్ని దండించే అన్నయ్య" ...మనం ఎన్నోసార్లు చూసిన  ఈ కధతోనే  మళ్ళీ  ఈ చిత్రం తీసారు. అయితే అధునాతన సాంకేతికతతో ఈ చిత్రానికి కొత్త కలర్ తేవాలని ప్రయత్నించారు.కానీ ,రెండు, మూడుతరాల కధ కావడంతో ఏర్పడ్డ గందరగోళం ,స్క్రీన్ ప్లేలో పట్టులేక పోవడం, వినోదం కొరవడటం ...ఉన్న కాస్త కామెడీ పండకపోవడం -వంటి కారణాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఈ చిత్రాన్ని తమిళంలో కూడా చేసినందున సినిమా మొదటి భాగం లో  కొంత అరవ వాసన కొట్టింది.  బాల క్రిష్ణ,మంచు మనోజ్,మంచు లక్ష్మి ప్రసన్నల నటన...గంధర్వ మహల్ వంటి భూపేష్  కళాప్రతిభ, నిప్పుల గుర్రంఫై బాలయ్య రావడం, క్లైమాక్స్ లో ఒక శరీరంలో మరొకరి ఆత్మ... వంటి' పిక్సన్' వారి విజువల్ ఎఫెక్ట్స్  ఈ చిత్రంలో ప్రత్యేకతలు.
                 హీరోగా  కాకుండా , తొలి సారి బాలక్రిష్ణ  ఈ చిత్రం లో ప్రధాన  పాత్రపోషించేందుకు  తీసుకున్న  నిర్ణయం నూటికి నూరు పాళ్ళూ కరెక్టే అనిపిస్తుంది.దర్శకుడు ఇంకా బాగా  ఉపయోగించుకోలేదనే అసంత్రుప్తి కలిగినా...నరసింహనాయుడు పాత్రను బాలయ్య హుందాగా , అద్భుతం గా పోషించాడు. "ఎవరైనా గంధర్వ మహల్ నాదీ అని అన్నారో" వారి అంతు చూస్తాననే అతడు, చెల్లి కాబోయే భర్త కోరితే గంధర్వ మహల్ ని  అప్పగించి ఎలా వెళ్ళి పోతాడో అర్ధం కాదు. వైవిధ్యాన్ని  ఇష్టపడే మంచు మనోజ్ వివిధ గెటప్స్ తో  ఇందులో ప్రతిభావంతంగా  రెచ్చి పోయి నటించాడు.సినిమా ప్రారంభం లో అతని ఫై చిత్రీకరించిన ఫ్లాష్ బ్యాక్ పాట లో హింస, దీక్షా సెథ్ బృందం తో చేసిన మరో పాటలో ఆటవికత కాస్త ఎక్కువయ్యాయి. డైలాగ్ డెలివరీ లో తండ్రి మోహన్ బాబు ను అక్కడక్కడా అనుకరించాడు.అమృతవల్లిగా లక్ష్మీ ప్రసన్న మూడు రకాల గెటప్స్ తో,చక్కటి నటనతో  ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఫణీంద్ర భూపతిగా సోనూ సూద్ 'అరుంధతి' లోని పశుపతిని  గుర్తు చేసాడు.దీక్షా సెథ్ అందంగా కనిపించింది.అజయ్ భూత వైద్యుడిగా వెరైటీ  పాత్ర పోషించాడు. సాయి కుమార్ విలన్ గా  చేసినా కమెడియన్ గెటప్ లో కనిపించడం ఎబ్బెట్టుగా వుంది.ఇతర పాత్రల్లో ప్రభు, భాను చందర్, సుహాసిని, రుషి, పృథ్వి, ప్రవీణ్, మధుమిత, ప్రభ,ధర్మవరపు, రఘుబాబు,అభినయశ్రీ, ఐశ్వర్య నటించారు. బెబో శశి పాటల్లో 'ఇది అని-అది అని'బాగుంది. పాటల చిత్రీకరణ బాగుంది. చిన్నా నేపధ్య సంగీతం సినిమా మూడ్ కి ఉపకరించింది.మంచు మనోజ్ యాక్షన్ ,రాజశేఖర్ ఫోటో గ్రఫీ బాగున్నాయి.                  
                                                                - రాజేష్       

Monday, July 23, 2012

పడక గది సీన్ నా భర్తకి నచ్చలేదు :రీమా సేన్

పడక గది సన్నివేశాల్లో నటించడం భర్తకు నచ్చలేదని నటి రీమాసేన్ వెల్లడించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఈ ఉత్తరాదిభామ ఇటీవల విడుదలైన 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' చిత్రంలో పడకగది సన్నివేశాల్లో నటించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ- ఈ చిత్రం తన ఖాతాలో పెద్ద హిట్‌గా నిలిచిందన్నారు. అయితే హిట్స్ తనకు....

రాజేష్ ఖన్నా ఇంటిలోనే ఉంటా:అనితా అద్వానీ

రాజేష్ ఖన్నా మృతితో.. ఇక్కడి కార్టర్ రోడ్‌లోని ఆయన నివాస గృహమైన 'ఆశీర్వాద్' అభిమానులకు పర్యాటక స్థలంగా మారింది. ఈ ఇంటిని 'కాకా' జ్ఞాపకాల మ్యూజియంగా మార్చాలన్న ఆలోచనలూ చేశారు! ఆయన కుమార్తెలు ట్వింకిల్, రింకీల ఆలోచనా అదే. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. రాజేష్ ఖన్నా జీవితపు మలిసంజెలో ఆయనకు 'తోడు'గా ఉన్న అనితా అద్వానీయే .....

Friday, July 20, 2012

ఆకాశమే హద్దన్నారు:యస్.యస్.రాజమౌళి

‘ఈగ’ విజయం నన్ను నిజంగా గాల్లో విహరించేలా చేస్తోంది. సినిమా అనేది కళాత్మక వ్యాపారం. ప్రణాళికబద్దంగా నిర్వహిస్తే చక్కటి విజయాల్ని సొంతం చేసుకోవచ్చన్నది నా అభివూపాయం. ఈగ అనే చిరువూపాణి చుట్టూ మనస్సుకు హత్తుకునే భావోద్వేగాల్ని అల్లి వాటికి సృజనాత్మకతను మేళవించి ‘ఈగ’ చిత్రాన్ని తెరకెక్కించాను. కథపై వున్న నమ్మకమే ఈ చిత్రాన్ని విజయవంతంగా వెండితెరపై ఆవిష్కరింపజేసింది. ‘మగధీర’ రికార్డుల్ని ‘ఈగ’ అధిగమిస్తుందా? అన్న ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ...ఈగ విడుదలైన మూడు భాషల్లో మంచి కలెక్షన్లను సాధిస్తోంది. అయితే కలెక్షన్స్ హీరోల మధ్యవార్‌లా మారాయి. ఆ వార్‌లో.....

రంగనాద్' నడత 'పుస్తకావిష్కరణ

రంగనాద్' నడత 'పుస్తకావిష్కరణ
మనిషి జీవితం లో 'నడత' కు  చాలా ప్రాముఖ్యత వుందని అక్కినేని నాగేశ్వర్ రావు అన్నారు. రవీంద్రభారతిలో ప్రముఖ నటుడు రంగనాద్ రచన' నడత' పుస్తకావిష్కరణ చేసిన అక్కినేని మాట్లాడుతూ -ప్రస్తుతం వక్ర మార్గంలో, విష పూరితమైన దిశలో పోతున్న సమాజానికి రంగనాద్ కవితలు కనువిప్పు కలిగించేలా వున్నాయని అన్నారు. 'యువకళావాహిని' ఆధ్వర్యం లో జరిగిన ఈ  కార్యక్రమంలో డా"కే .ఐ .వరప్రసాద్ రెడ్డి దంపతులకు రంగనాద్ తన కవితా సంపుటిని అంకితమిచ్చారు. రంగనాద్ ను అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో రాళ్ళ బండి కవితా ప్రసాద్,డా"సి.నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ,సారిపల్లి కొండల రావు,వేమూరి రామ కోటేశ్వర్ రావు, బైసా రామదాస్, క్రిష్ణ, వై.కే.నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. సభ ప్రారంభం లో రంగనాద్ చిత్రాల్లోని పాటలతో అందించిన ' గీతాలహరి' ప్రేక్షకులను అలరించింది.

Friday, July 13, 2012

నేను సెల్ఫ్‌మేడ్ హీరోయిన్:ప్రియాంకచోప్రా

‘వృత్తిపరంగా నన్నెవరూ వేలెత్తి చూపలేరు. ఎందుకంటే ఒక పాత్ర ఒప్పుకున్న తర్వాత, దానికి ప్రాణం పెట్టి ఎంత కష్టపడడానికైనా రెడీ అవుతా. ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ప్రొఫెషనల్‌గా నన్ను వంకపెట్టలేరు. కానీ అసూయతో రగిలిపోతుంటారు కాబట్టి, నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తారు. నా గురించి ఎన్నయినా మాట్లానివ్వండి. ఐ డోంట్ కేర్’’ అంటున్నారు’’ ప్రియాంకచోప్రా. ఈ హాట్‌గాళ్ సరసన నటిస్తే తమ భర్తలు ఎక్కడ ఆమెకు పడిపోతారేమోనని కొంతమంది హీరోల భార్యలు ....

స్టార్ హీరోలతో నో సినిమా:రాజమౌళి

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆశపడిన అభిమానులకు నిరాశ! తాను (చిరంజీవి లాంటి) స్టార్ హీరోలతో సినిమా చేయలేన ని.. చిరు కోరితే కథ మాత్రం అందిస్తానని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి కుండబద్దలు కొట్టేశారు! నాని లాంటి హీరోలతో సినిమాలు చేసుకుంటానని....

Tuesday, July 10, 2012

బాలీవుడ్‌ రక్తచరిత్ర

ఇంకెంత కాలం హీరోగా నటించాలి? :అజిత్

ఆయనంతే అదో టైప్. ఆయన నటనే కాదు, ఆలోచనా ధోరణి కూడా ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. వృత్తి నటనే అయినా దానికి సంబంధించిన చాలా మంది వ్యక్తులకు దూరంగా ఉంటారు. చిత్రపరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన అనాసక్తి చూపిస్తారు. ఒక వేళ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ఆయన వ్యాఖ్యలు ఎంతో కొంత సంచలనానికి దారి తీస్తాయి. చాలా నిక్కచ్చిగా ఉంటారనే పేరుంది. అయినా విమర్శలకు అతీతుడేమికాదు......

Sunday, July 1, 2012

బాలీవుడ్‌లో ద్విపాత్రలకు మళ్లీ ఆదరణ

అక్షయ్ కుమార్‌ను అటు అల్లరి పాత్రలోనూ, ఇటు యాక్షన్ పాత్రలోనూ చూడాలంటే రెండేసి టికెట్లు కొనాల్సివచ్చేది. అయితే ఒకే టికెట్‌లో రెండు పాత్రల్లో అక్షయ్‌ను చూపించిన చిత్రం ‘రౌడీ రాథోడ్’. బహుశ రెండురకాల ప్రేక్షకులు రావడంతోనేమో అవలీలగా ఆ చిత్రం వంద కోట్ల వసూలు సినిమాల జాబితాలో చేరిపోయింది. దీంతో బాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ అదే బాటలో పయనించాలనుకుంటున్నారు. మళ్లీ డ్యుయల్ రోల్స్ సినిమాలు తెరకెక్కించాలని....

ప్రతి పైసా నిర్మాణ విలువలు పెంచాలి:జాన్ అబ్రహాం

నటుడిగాకంటే కూడా నిర్మాతగా తాను చాలా సంతృప్తిగా ఉన్నానని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు. ‘వికీ డోనర్’ సినిమాతో నిర్మాతగా మారిన తాను ఇక నుంచి ప్రత్యేకమైన చిత్రాలను నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పాడు. కేవలం ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ‘వికీ డోనర్’ నలభైకోట్ల రూపాయలకుపైగా వసూలు చేసిందని, అయితే వసూళ్లపరంగా కాకుండా ప్రత్యేకమైన కథతో సినిమాను నిర్మించినందుకు.....