RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, January 29, 2012

'ఏజెంట్ వినోద్' కోసం యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది


 

తారల ఇళ్లల్లో మంగళవాయిద్యాలు

బ్యాండ్.. బాజా.. బారాత్... ప్రస్తుతం బాలీవుడ్ తారలు కొం దరు ఈ ఆలోచనలోనే ఉన్నారు. ఈ సంవత్సరం బాలీవుడ్‌లో కనీసం ఐదారు పెళ్లిళ్లయినా జరుగుతాయని అంటున్నారు. వీటిలో మొదటిది రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియాల పెళ్లి. ఎనిమిది సంవత్సరాలుగా సాగుతోన్న ఈ జంట  .....బాలీవుడ్ తారల ఇళ్లల్లో మంగళవాయిద్యాలు మారుమోగే సమయం వచ్చింది. ఈ ఏడాదిలో చాలా మంది తారలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. అయితే రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా పెళ్లి మాత్రం ఖరాయింది. వీరిద్దరూ వచ్చే నెల మూడున దంపతులు కాబోతున్నారు.....

Friday, January 27, 2012

అమెరికాలో అందమైన ప్రేమ కధ

ధర్మపథ క్రియేషన్స్ అధినేత కె.రాజశేఖర్ అనగానే ‘గౌతమబుద్ధ’ చిత్రం మనకళ్లముందు సాక్షాత్కరిస్తుంది. గౌతమబుద్ధ అనగానే మనమందరం గర్వించే దృశ్యకావ్యం నిలుస్తుంది. ‘గౌతమబుద్ధ’ మనం గర్వించే దృశ్యకావ్యం కనుకనే ప్రభుత్వం కూడా మెచ్చి నంది అవార్డులను అందజేసింది. మహా పండితుడు సద్గురు శివానంద కుమారుడైన రాజశేఖర్ తండ్రి యొక్క ఉత్తమాభిరుచిని వంట పట్టించుకున్న వాడు గనుక రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ‘గౌతమబుద్ధ’ను నిర్మించారు. డబ్బు సంపాదించిన వారు, కోట్లాది రూపాయల టర్నోవర్తో వ్యాపారాలను చేస్తున్నవారు చిత్రరంగాన, చిత్రరంగానికి అవతల ...

జెనీలియా నటనకీ, పెళ్లికీ సంబంధం లేదనీ తేల్చి చెప్పింది


బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్ ని ఫిబ్రవరి 3న పెళ్లాడబోతున్న చిరునవ్వుల సుందరి జెనీలియా పెళ్లి తర్వాత కూడా నటిస్తాననీ, నటనకీ, పెళ్లికీ సంబంధం లేదనీ తేల్చి చెప్పింది. వారితో సినిమాలు తీస్తున్న నిర్మాతలు వారి పెళ్లి కారణంగా తమ సినిమాల షెడ్యూళ్లలో మార్పులు చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఓ నెల వరకు వాళ్లు షూటింగులకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్లున్న సన్నివేశాల్ని నెల తర్వాత ప్లాన్ చేస్తున్నారు.జెనీలియా మాత్రం పెళ్లి వల్ల తన సినిమాలకు ఎలాంటి ఆటంకం కలగడం లేదని చెబుతోంది. నిజానికి ఆమె హీరోయిన్ గా ఎంపికైన ...

Saturday, January 21, 2012

తాప్సీ బైక్ రైడింగ్‌... బిపాసాబసు రిక్షా సవారీ


ఆ మధ్య 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లో పవర్‌బైక్ రైడింగ్ చేసి ఎంతో ఆకట్టుకుంది తాప్సీ. ఇప్పుడు మరో ఉత్తరాది భామ సమీరా కూడా ఇలాంటి బైక్ రైడింగ్‌తో అలరించనుందట. ఇందుకోసం వేగంగా బైక్‌ని నడపటం నేర్చుకొంటోందట ఈ ముద్దుగుమ్మ. తను నూతనంగా నటించబోయే 'సాల్ట్' అనే చిత్రంలో ఈ ఫీట్ చేయడానికి రెడీ అవుతోందట ఈ బొద్దుగుమ్మ. ఇందులో హీరోయిన్ వేగంగా బైక్ రైడింగ్ చేసుకుంటూ ప్రమాదానికి గురవుతుంది. అది కూడా తనకు తానుగా ఈ ప్రమాదానికి గురికావాల్సిన ...

ఇప్పటి వరకు నేను ఏదీ అనుకోని ప్లాన్ చేయలేదు

‘నెంబర్‌గేమ్స్‌ను నేను పట్టించుకోను. నా పని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాకు లేదు’ అంటున్నాడు యువ కథానాయకుడు మహేష్‌బాబు. సీనియర్ నటుడు కృష్ణ నట వారసుడిగా రంగప్రవేశం చేసిన మహేష్ అనతి కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ కథానాయకుడిగా ఎదిగాడు. ‘పోకిరి’తో 75 ఏళ్ళ సినీ చరివూతను తిరగరాసిన ఈ ప్రిన్స్.. ‘దూకుడు’తో ఆ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు తాజాగా ‘బిజినెస్ మేన్’ చిత్రంతో మరో సంచలనాత్మక విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకొని హీరోగా తిరుగులేని స్థానాన్ని ....

Friday, January 20, 2012

'హోసన్నా'... పాటతో వివాదంలో చిక్కుకున్న రెహ్మాన్


ఏఆర్ రెహ్మాన్ ఓ పాట విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. 'ఏక్ దివానా థా' చిత్రంలో ఆయన సమకూర్చిన హోసన్నా... అనే పాట ఈ వివాదానికి దారి తీసింది. ఇందులో ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తూ 'హోసన్నా' అనే పదాన్ని ఉపయోగించడం క్రైస్తవులు తప్పు పడుతున్నారు. 'హోసన్నా' పాట రాసిన జావేద్ అక్తర్, సంగీత దర్శకుడు రెహమాన్ క్షమాపణ చెప్పాలని మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు. "హోసన్నా అనే మాట యూదులకు, క్రైస్తవులకు ఎంతో పవిత్రమైనది...దేవుణ్ణి 'హోసన్నా' అని సంబోధిస్తూ ఉంటాం. అలాంటి పదాన్ని ఎలా పడితే అలా ఉపయోగించడం క్షంతవ్యం కాదని ....

అట్టడుగు నుండి అత్యున్నతికి ఓప్రా‘విన్‌’ఫ్రే

భారతీయ మీడియా మార్కెట్‌ హాలీవుడ్ తారలతో పాటు అమెరికా టీవీ మాధ్యమ దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా టాక్‌ షో క్వీన్‌గా పేరొందిన ఒప్రా విన్‌ఫ్రే భారత్‌లో వారం రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఆమె పర్యటన బాలీవుడ్ తారలతో పాటు జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకట్టు కుంటోంది. న్యూస్‌వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియా సైట్లలో ఎక్కడ చూసినా విన్‌ఫ్రే కబుర్లే ....

Tuesday, January 17, 2012

ఒబామాను హాలీవుడ్ వద్దంటోంది

యావత్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అంటే అతిశయోక్తి కాదు. నాలుగేళ్ళకోసారి జరిగే అధ్యక్ష ఎన్నికలపై యావత్‌ ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొంటుంది. ఎన్నిక ప్రక్రియ ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనో ముగిసేది కాదు. ఓ ఏడాది ముందుగానే ఈ ప్రక్రియ మెుదలవుతుంది. ముందుగా పార్టీ తరఫు అభ్యర్థిగా నెగ్గాలి. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలి. అలాంటి ప్రక్రియ ఇప్పుడు అమెరికాలో మెుదలైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నారుు. క్రితం ఎన్నికల్లో డెమెుక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఒబామా పోటీ చేసినప్పుడు ....

'దాదా సాహెబ్ ఫాల్కే' రామానాయుడుకు పద్మ అవార్డు ?


 

Sunday, January 15, 2012

కొత్తగా గమ్మత్తుగా అసిన్... బొద్దుగా కనిపించాలని సమంత


అందాల భామ అసిన్ కొత్తగా గమ్మత్తుగా కనిపిస్తూ జనాన్ని ఆకట్టుకుంటోంది. ఈ మళయాళ భామ బాలీవుడ్లో పాగా వేసి నంబర్ వన్ గా రాణించాలని ఇంకా కలలు కంటూనే ఉంది. అందులో భాగంగానే మునుపటి కంటే మరింత నాజూగ్గా అసిన్ తయారైంది. ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన దుస్తులు ధరించి ఆమె కనిపిస్తున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ న్యూ లుక్ తోనే రాబోయే "బోల్ బచ్చన్, హౌస్ఫుల్-2" చిత్రాల్లోనూ అసిన్ అలరించనుంది. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ....

'బిగ్ బాస్ 5' విజేత జుహీ పర్మార్

మనదేశంలో రియాల్టీ కార్యక్రమాలు ఒక ఊపులో ఉన్నారుు. ప్రతి ఛానల్లో ఒక రియాల్టీ కార్యక్రమం హైలైట్గా నిలిచి టిఆర్పీ తో గేవ్గ్సు ఆడుకుంటున్నారు. ఒక రియాల్టీ కార్యక్రమం హిట్ అరుుతే ఛానల్ కూడా హిట్ అవుతుంది. అలాంటి రియాల్టీ కార్యక్రమంలో టాప్ వరుసలో ఉన్న కార్యక్రమం ‘బిగ్ బాస్’. కలర్స్ చానల్లో ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే జిగేల్ మంటూ జరిగిన సీజన్-5 ఫైనల్ లో వరుసగా రెండవసారి మహిళ కంటెస్టెంట్ విజయం సాధించింది. గత పోటీలో ‘శ్వేత’ అనే టీవీ నటీమణి విజయం సాధించింది. సీజన్-5లో టీవి నటి ‘జూహీ పర్మార్’  ....

Friday, January 13, 2012

'బిజినెస్ మేన్' చిత్ర సమీక్ష


                                          'బిజినెస్ మేన్' చిత్ర సమీక్ష     3/5

                             ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం ఫై పూరి జగన్నాద్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
                            'ముంబాయిని మాఫియ రహిత నగరం గా మార్చామని'- ముంబాయి పోలీసు కమీషనర్ ప్రకటించిన రోజునే అక్కడ సూర్య అడుగు పెడతాడు.  ముంబాయిని ఉచ్చపోయిన్చడానికే వచ్చానని చెప్పుకునే సూర్య ఆ క్రమం లోనే ముందుకు సాగుతూ సూర్య భాయ్ గా ఎదుగుతాడు.  మరో పక్క పోలీసు కమీషనర్ కూతురినే ప్రేమలోకి దించుతాడు.  సమాజంలో పలుకు బడి పెరుగుతున్నా-  పోలీసులు తో పాటు సూర్య కు  ప్రత్యర్ధులు కూడా  పెరుగుతారు. వారిని ఎదుర్కొంటూ , మాఫియాని కార్పోరేటీకరిన్చాలనే  సూర్య తన కోరిక తీర్చుకోవడానికి ఏమి చేసాడనేదే  ఈసినిమా ...

                           ' పోకిరి' వంటి  పెద్ద  హిట్  కాంబి నేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో, పేరుకు తగ్గట్టే  బ్రహ్మాండమైన బిజినెస్ తో  విడుదలయ్యింది . అసలే ' దూకుడు' మీదున్న మహేష్ బాబు తో అభిమానుల ఆశల మేరకు సినిమా అందించడం అంత తేలిక కాదు.  పూర్తిగా  ఆసహజం, ఆచరణ సాధ్యం కాని కధనే తీసుకున్నా ... ప్రత్యేకం గా పెట్టే  కామెడీ వంటి  అనవసరమైన ఫార్ములా జోలికి పోకుండా ...సూటిగా చెప్పడం ద్వారా అయితే  పూరీ జగన్నాద్ ఈ చిత్రం లో విజయవంతం అయ్యాడు.  మహేష్ బాబు నటన,  పూరి మాటలు- టేకింగ్  , తమన్ సంగీతం ఈ చిత్రం లో హై లైట్స్ .  మాఫియా నేపధ్యం పాతదే అయినా  వేగం గా నడపడం వల్ల , సినిమాలో  వినోదం తగ్గిందనే  అసంతృప్తి  కలగా కుండా ...బోర్  లేకుండా చెయ్య గలిగారు. మహేష్ తో  నెగిటివ్  ఛాయలున్న రఫ్ఫ్  పాత్రను చాలా బాగా  చేయించారు. ఒక విధం గా  ఈ చిత్రం అంతా  మహేష్  వన్ మేన్ షో  అనే చెప్పాలి. బ్యాంకు నుండి పత్రాలు  దోపిడీ చేయడం, ఐ .టి దాడుల పేరుతో  ఎన్నికల ఫండ్ దొంగిలించడం, ఎన్నికలకోసం వేలకోట్లు ఇవ్వడం ...మొదలైన ఎన్నో అర్ధం లేని అంశాలు ఈ చిత్రం లో ఉన్నాయి. హీరో పనిగట్టుకుని  కమీషనర్ కూతుర్ని ట్రాప్ చెయ్యాలనుకోవడం , వారి మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత  వారి మధ్య వచ్చే సన్నివేశాలు అంత రక్తి కట్టలేదు. గట్టి విలన్ పాత్ర లేకపోవడం వల్ల , సినిమా క్లైమాక్స్ కూడా  అంత ఆసక్తికరంగా లేదు. 'యువత గొప్ప లక్ష్యం పెట్టుకోవాలి...దాన్ని సూటిగా సాధించేయాలి' -అంటూ దర్శకుడు  సినిమా చివరిలో  హీరో తో  ఇప్పించిన సందేశం వినడానికి బాగుంది. ఈ చిత్రం లో హీరో  సాధించిన విధం గా జరగాలంటే  సినిమాల్లోనే సాధ్యం. ఇంటర్వెల్ ముందు  గ్యాంగ్ ఫైటే చేస్తూ  హీరో హీరోయిన్ కంట బడటం' పోకిరి' ఇంటర్వెల్ సీన్ ని గుర్తు చేస్తుంది.

మహేష్ బాబు నటుడిగా ఈ చిత్రం లో మరింత పక్వమైన  నటన ప్రదర్శించాడు. మాన్లీగా కనిపిస్తూ , మంచి హావభావ ప్రకటనతో సంభాషణలు పలికి ఆకట్టుకున్నాడు.   కాజల్ పాత్ర,నటన గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆమె తండ్రి పోలీసు కమీషనర్ గా నాజర్ , రాజకీయ నాయకులుగా ప్రకాష్ రాజ్, సయ్యాజి షిండే , రాజా మురద్ , ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, గణేష్, ధర్మవరపు,భరత్ రెడ్డి ,మాస్టర్ ఆకాష్  నటించారు. పూరి జగన్నాద్ అందించిన సంభాషణలు చాలా సినిమాల తర్వాత ఇందులో రొటీన్ కి భిన్నం గా, అర్ధవంతంగా, పవర్ ఫుల్ గా  వున్నాయి. తమన్ పాటల్లో ఒకటి పాత హిందీ ట్యూన్ , ఐటెం సాంగ్ కి వాడుతారనుకున్న ' సార్ వస్తారోస్తారా 'పాటను హీరో - హీరోయిన్ లతో చేసారు. ఈ పాట తో పాటు' చందమామ' పాట కూడా బాగా చిత్రీకరించారు. ఈ పాటలోహీరో - హీరోయిన్ ల సున్నితమైన  ముద్దు ముచ్చట ప్రేక్షకులకు బోనస్ . 'బ్యాడ్  బోయ్స్' పాటలో ముంబై నటి  శ్వేతా భరద్వాజ్ అందంగా  చేసింది.  అయితే సెన్సార్ 'బ్లర్' ల వల్ల  పూర్తిగా ఆస్వాదించ లేక పోయారు. నేపధ్య సంగీతం చాలా బాగుంది. విజయ్ ఫైట్స్,శ్యాం ఫోటో గ్రఫీ ,శేఖర్ ఎడిటింగ్ బాగున్నాయి.                 
                                                                                                                                             -  రాజేష్              

Sunday, January 8, 2012

గ్లామర్ పెంచిన కాజల్ ...కూర్చోనంటున్న తమన్నా


విమర్శలను తట్టుకుని నిలబడటం కాజల్‌కి అలవాటైపోయింది. ఆ మధ్య రెండు వివాదాల్లో చిక్కుకుని వెంటనే తేరుకుంది ఈ పంజాబీ బొమ్మ. ప్రస్తుతం ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి సినిమాలే చేస్తోంది కాజల్. మహేశ్ సరసన నటించిన 'బిజినెస్‌మేన్' చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య బికినీల్లోనూ, లిప్‌లాక్ సీన్లలోనూ చేయనని తెగేసి చెప్పింది ఈ అమ్మడు. అయితే 'బిజినెస్‌మేన్' చిత్రంలో మహేశ్‌తో లిప్‌లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో మునుపటి చిత్రాల్లోకంటే కాస్తంత కురుచ దుస్తులను ధరించినట్లు   .....

సినిమా చరిత్రలో మైలు రాయి:కమల్‌హాసన్

నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నటుడు కమల్‌హాసన్. ఐదేళ్ల ప్రాయం నుంచి నటనలో ఓనమాలు దిద్దుకున్న ఈ నట చక్రవర్తి నేటికీ ప్రముఖ హీరోగానే ప్రకాశిస్తున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంతో విశ్వరూపం చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సుమారు రూ.120 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంటుందన్న ....

Saturday, January 7, 2012

దర్శకుడు ఇలియానా నటనకు ఫిదా అయిపోయాడట


‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తోంది గోవా భామ ఇలియానా. దక్షిణాదిన ఒకప్పుడు స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేసిన ఈ సుందరి ఇటీవల కాలంలో రేసులో కొంచెం వెనకబడింది. సౌత్ సినిమాలో ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్‌కే పరిమితమైన ఈ వయ్యారి హిందీ చిత్రం ‘బర్ఫీ’లో ఓ ఛాలెంజింగ్ పాత్రను చేస్తోంది. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా పక్కా ప్రయోగాత్మక చిత్రంగా దర్శకుడు అనురాగ్‌బసు ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు రణభీర్ కపూర్ చెవుడు, మూగవానిగా నటిస్తున్నాడు. ఇక కథానాయికగా మెయిన్‌లీడ్‌లో నటిస్తున్న ప్రియాంకచోప్రా ....

మన సినిమాల అంచనాలు తప్పాయి

వేళ్లమీద లెక్కపెట్టుకునే విజయవంతమైన చిత్రాలు విడుదలైన ఈ సంవత్సరం భారీ అంచనాలు పెట్టుకున్న కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఎటువంటి ప్రభావం ప్రేక్షకులపై చూపించలేక చతికిలపడ్డాయి. ఈ సంవత్సరం మొదట్లో జనవరి నెలలో బాలకృష్ణ, దాసరి నారాయణరావుల కాంబినేషన్‌లో వచ్చే సినిమా కదా అని నందమూరి అభిమానులు ముందుగానే పండుగ చేసుకున్నారు. పైగా సంక్రాంతి హీరో బాలయ్యకు ఆ సినిమా తప్పనిసరిగా మరో హిట్‌ అవుతుందని భావించారు. టైటిల్‌ కూడా  ....

Wednesday, January 4, 2012

ఎంపికలో రామ్‌చరణ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు


'ఆరెంజ్‌' ఇచ్చిన షాక్‌తో రామ్‌చరణ్‌ కథా ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేవలం లవర్‌బారుగా కనిపించటం సరిపోదనే భావనకు వచ్చాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటేనే సినిమా నిలబడుతుందని నమ్ముతున్నాడు. దీంతో తాజా చిత్రం 'రచ్చ'లో కావల్సినన్ని కమర్షియల్‌ అంశాలు చేర్చాడంట. దర్శకుడు సంపత్‌ నంది తగిన జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ సినిమా తర్వాత చరన్‌ 'ఎవడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ....

అమెరికాలో 'మై హార్ట్ ఈజ్ బీటింగ్' ...అదోలా


ధర్మ పధ క్రియేషన్స్ పతాకం ఫై ' గౌతమ బుద్ధ' చిత్రాన్ని నిర్మించి , నంది అవార్డ్ అందుకొన్న అభిరుచిగల నిర్మాత కే. రాజ శేఖర్ మలి ప్రయత్నం గా అమెరికా నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ' మై హార్ట్ ఈజ్ బీటింగ్' [...అదోలా] అనే పేరు తో నిర్మిస్తున్న ఈ చిత్రం అమెరికాలోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుందని , ఈచిత్రాన్ని పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరించడం విశేషం అని నిర్మాత కే. రాజ శేఖర్ చెప్పారు. కేవలం ప్రేమకే పరిమితం కాకుండా ...బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ పిల్లలు ,తల్లి దండ్రుల మధ్య మనసుని హత్తుకునేలా....

Sunday, January 1, 2012

అపజయాలే విజయ సోపానాలని ఇలియానా అంటోంది


అపజయాలే విజయ సోపానాలనే సూత్రాన్ని తన జీవితంలో ప్రతి సందర్భానికి అన్వయించుకుంటానని ఇలియానా చెబుతోంది. అంతేకాదు అపజయాలు పలకరించినప్పుడే ఆత్మవిమర్శకు అవకాశం దొరుకుతుందని కొత్త ఫిలాసఫీని వల్లిస్తోంది. ఈ ఏడాది ఈ సుందరి నటించిన ‘నేను నా రాక్షసి’ ‘శక్తి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. దీంతో ఇలియానా క్రేజ్ ఇండవూస్టీలో అమాంతం పాతాళానికి వెళ్లిపోయింది. ఒకప్పుడు అగ్రకథానాయికగా ఈ వయ్యారి విపరీతమైన స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేసింది. అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కట్టారు. తెలుగులో ఫెయిల్యూర్స్ వల్ల తను పెద్దగా బాధపడటం లేదని, పైగా అవి తన కెరీర్‌కు  ...

కొత్తదనం కోసం పరితపించారన్నది వాస్తవం:2011 చిత్ర సమీక్ష

'కొత్త ఒక వింత... పాత ఒక రోత' అని అందరూ అంగీకరిస్తారు. అయితే ఆ కొత్తబాటను పట్టడానికి, నూతన అనుభూతుల్ని ఆస్వాదించడానికి సాహసించే వారు అరుదు. కానీ జయాపజయాలను పక్కన పెడితే తెలుగు చిత్రసీమలోని చిన్న, పెద్ద నటీనటులు ఈ యేడాది ఆ కొత్తదనం కోసం పరితపించారన్నది వాస్తవం. ఎప్పటిలానే కాంబినేషన్‌లతో కొందరు కుస్తీపడితే, మరికొందరు కొత్త వారితో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడ్డారు. భారీ స్థాయిలో సినిమాలు తీసి చతికిల పడినవారు కొందరైతే, వినూత్న కథాంశంతో విజయకేతనం ఎగరేసిన వారు మరికొందరు. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోయినా, అనుకున్న మంచి సినిమా తీశాం అని సంతృప్తి పడుతున్న వారు మరికొందరు. ఏదేమైనా ఎప్పటిలానే .....