RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, June 27, 2014

'ఆటోనగర్‌ సూర్య' చిత్ర సమీక్ష

                                    'ఆటోనగర్‌ సూర్య' చిత్ర సమీక్ష    2. 5 / 5

        మ్యాక్స్‌ ఇండియా లిమిటెడ్‌ పతాకంఫై  దేవకట్టా రచన ,దర్శకత్వంలో  కె .అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు 
                                          
                                      
                 చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మారిన సూర్య (నాగచైతన్య) అతని  మేనమామ సాయికుమార్‌ కూడా ఆదరించడు. అక్కడే ఆటోనగర్‌లో ఉండే మెకానిక్‌ (సమ్మెటగాంధీ) ఇచ్చిన ప్రోత్సాహంతో మంచి మెకానిక్‌గా మారతాడు. డీజిల్‌తో పనిలేకుండా బేటరీతోనే జీపుల్ని నడిపే టెక్నిక్‌ను కనిపెడతాడు. కానీ ఆటోనగర్‌పై కన్నేసిన ఇంద్ర (జయప్రకాష్‌రెడ్డి) మాఫియా ముఠా- సూర్య కనిపెట్టిన ఆ టెక్నాలజీ ఇవ్వనందుకు గొడవ చేయడంతో- సూర్య జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడే తను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి.. బయటకు వస్తాడు. కానీ మళ్ళీ తన తెలివితేటలతో సొంతంగా షెడ్‌ పెట్టాలనుకున్నా - మళ్ళీ అదే   మాఫియా అడ్డుకుంటుంది.  వారిని ఏమీచేయలేని స్థితి. ఇదంతా మేయర్‌ కోటిలింగం(మధు)  కనుసన్నల్లోనే జరుగుతుంది . చివరికి సూర్య వారిని ఎదిరించి-  ఆటోనగర్‌ ని ఎలా కాపాడాడు? అన్నది కథ.

                  నాగచైతన్య చిత్రాలంటే ప్రేమకథలకు పెట్టింది పేరు . '100%లవ్‌', ' ఏమాయచేసావె', 'మనం' వంటి సాఫ్ట్‌ పాత్రలను చేసిన చైతన్యకు  మాస్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేయాలనే ప్రయత్నం లో భాగం గానే    'జోష్‌', 'దడ', 'బెజవాడ' చిత్రాల్లో ఒక్కోవిధమైన  మాఫియాను ఎదిరించే పాత్రలను  పోషించాడు.అదేవిధంగా 'వెన్నెల' వంటి హాయిగొలిపే చిత్రానికి దర్శకత్వం వహించిన దేవకట్టా ఆ తరువాత .... 'ప్రస్థానం'  అనే రాజకీయ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. ఆ రెండింటికీ మంచి  పేరే వచ్చింది. ఇప్పుడు అదే దర్శకుడు నాగచైతన్యకు మాస్‌ ఇమేజ్‌ తెచ్చే ప్రయత్నం చేశాడు. విజయవాడలో 'ఆటోనగర్‌' అనేప్రాంతం ఉంది. అక్కడ వాహనాల షెడ్లేకాదు.. ఆ పేరుతో రకరకాలుగా స్మగ్మింగ్‌లు, దందాలు, ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. దాన్ని వెలికి తెచ్చేప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ, వాటిని బయటపెట్టే ప్రయత్నంలో ఎంచుకున్న కథానాయకుడు ఇంకా' బలమైన వాడు' అయి  ఉంటే బాగుండేది . సమాజంలో దోపిడీదారులు, పెత్తందారులు, సామాన్యులు, వారందరిపై పెత్తనం చెలాయించే ఇంకో రకం కూడా ఉంది.  అదే మాఫియా.. అంటూ  చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో ప్రధానంగా హీరోకు ఒక ఎయిమ్‌ ఉంటుంది.. దేశంలో మంచి మెకానిక్‌గా గుర్తింపు పొంది- తాను కనిపెట్టిన మోటర్‌ టెక్నాలజీతో పేరు, డబ్బు సంపాదించుకోవాలని. కానీ  ఆ విషయం కథనం లో మరుగునపడిపోయింది. దానికంటే ఆటోనగర్‌ అనే ప్రాంతాన్ని పీడిస్తున్న మాఫియాపై యుద్ధం చేయడమే ప్రధానం అయ్యింది.  క్లైమాక్స్‌తో పాటు సినిమాలో అవసరానికి మించి  భారీ పోరాటాలు పెట్టారు . అప్పట్లో నాగార్జునకు 'శివ' ట్రెండ్‌ సెట్టర్‌.. ఆ తరహాలో పలు చిత్రాలు వచ్చాయి. మళ్ళీ ఆయన వారసుడిగా చైతన్యకు వచ్చిన కథ ఇది. దర్శకుడు ఈ చిత్రం ద్వారా చెప్పదలచుకుంది పెద్దగా ఏమీకన్పించదు. ' వేటాడే పులికి జింక ఎదురుతిరిగితే' - ఎలా ఉంటుందో ఈసినిమా కథ కూడా అలాగే ఉంది. పాతకాలపు సినిమా చూస్తున్నట్లుంటుంది . రైల్వేలో అమ్మాయిని రేప్‌ చేస్తుంటే ప్రయాణీకులు పట్టనట్లు వ్యవహరించడం.. .. ఆటోనగర్‌లో ఉంటూనే హీరో.. సిటీ మేయర్‌ను చూడకపోవడం.. వంటి కొన్ని అంశాలు అతకలేదు.కథ, కథనంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. సీన్‌, సీన్‌కీ మధ్య లింక్‌ లేకుండా కథనం ముందుకు సాగుతుంటుంది. 

                 ఈ సినిమాలో నాగచైతన్య పాత్రే కీలకం. కథంతా అతని  చుట్టూనే తిరుగుతుంది. లెంగ్తీ    డైలాగ్స్ పలకడం  లో ఇబ్బంది పడ్డా - మాస్‌ పాత్రలో మరోసారి మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రతినాయకులు భారీ ఆకారాలతో ఉండడంతో కొన్ని సన్నివేశాల్లోఅతని హీరోయిజం   తేలి పోయింది . మరదలిగా సమంత నటించింది. కేవలం ఆటవిడుపుకోసం ఆమె పాత్ర ఉంది. నటించే అవకాశం కూడా పెద్దగాలేదు.'సురా..సురా' అనే పాటలో  గ్లామర్ తో ఆకట్టుకుంది.  సాయికుమార్‌ తన పాత్రను బాగాచేశాడు. విజయవాడ అనే సిటీలో ఆటోనగర్ ను తన చేతుల్లో  ఉంచుకున్న రౌడీగా జయప్రకాష్‌రెడ్డి నటించాడు. ఆయన అనుచరుడి గా అజయ్‌ నటించాడు. వీరందరిని లీడ్‌ చేసే పాత్ర మేయర్‌ది.ఈ పాత్రను  టీవీ నటుడు మధు పోషించాడు. ఇక రఘుబాబు పోలీసు అధికారిగా సరిపోయాడు. కలెక్టర్‌గా ఆహుతిప్రసాద్‌చేసారు .  బ్రహ్మానందం, వేణుమాధవ్‌,మాస్టర్‌ భరత్‌ల  పాత్రలు ఆశించిన  వినోదాన్నివ్వలేదు  . ఇతర పాత్రల్లో కోట, తనికెళ్ళ భరణి , బ్రహ్మాజీ , ఎమ్మెస్ ,  నందు ,నవీన్ , పృధ్వి , జీవా , రఘు బాబు , దువ్వాసి నటించారు . 

              ఇందులో అనూప్‌ రూబెన్స్‌ పాటలు అంతంత మాత్రమే. సెకండాఫ్‌లో ఓ పాటనుకూడా ఆలపించాడు.నేపధ్య సంగీతం ఒక మాదిరిగా వుంది . శ్రీకాంత్ నారోజ్  కెమెరా పనితనం  పర్వాలేదు. చిత్రంలో ఆర్ట్‌కు ప్రాధాన్యత ఉంది. ఆటోనగర్‌ సెట్ నిర్మాణంలో  రవీందర్  తన పనితనాన్ని చూపించాడు. దేవకట్టా సంభాషణలు   చాలా చోట్ల   పర్వాలేదు. 
 'మన పనిలోనే దేవుడు ఉన్నాడు '... 'నిజమైన జైలు జైలు బయటే ఉంది '.. వంటి కొన్ని డైలాగ్‌లు బాగున్నాయి .   'సమాజంలో మనిషి.. వ్యవస్థ' వంటివి కామన్‌మేన్‌కు అర్థంకావు.                -రవళి 

Friday, June 6, 2014

'తారా' స్థాయిలో మన వాళ్ళు!

'తారా' స్థాయిలో మన వాళ్ళు!
'అత్తారింటికి దారేది' తో తెలుగు సినిమా వంద కోట్ల మార్కుని చేరుకోగలదని ఆశ కలిగింది . తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరుగుతున్న కొద్ది- తెలుగు సినిమా బడ్జెట్ కూడా అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమా బడ్జెట్‌లో సింహాభాగం హీరో, దర్శకుల పారితోషికాలే -అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు తెలుగు సినీ పరిశ్రమలో హీరోలతో పాటు దర్శకుల పారితోషికాలు కూడా చుక్కలనంటుతున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆధారంగా వారి పారితోషికాలు మారుతున్నాయి. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు అందుకుంటున్న పారితోషికాలు ఏ స్థాయిలో వున్నాయో తెలుసుకుందాం....

నా ఆలోచన కూడా మారింది!

నా ఆలోచన కూడా మారింది!
హీరోహీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేస్తుంటే కెమిస్ట్రీ పెరుగుతుంది. నేను, సమంత ఒకేసారి కెరీర్‌ ప్రారంభించాం. ఇందులో రెండో పాత్ర కంఫర్ట్‌గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి యూత్‌కు కనెక్ట్‌ అయ్యేపాత్ర. తండ్రి పాత్రలో ఫీలింగ్స్‌, ఎమోషన్స్‌ అనేవి నాకు పెద్దగా అనుభవంలేనివి. అందుకే ఛాలెంజ్‌గా స్వీకరించాను. అసలు నేను తండ్రి అంటే నమ్ముతారా? అనిపించింది. అప్పుడు దర్శకుడు చాలా సర్దిచెప్పి ఒప్పించారు....


పెట్టుబడుల్లోనూ తారలే !

పెట్టుబడుల్లోనూ తారలే !
కోట్లు కోట్లు సంపాదిస్తున్నా కొందరు బాలీవుడ్ స్టార్లు ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. డబ్బుని జల్సాల కోసం ఖర్చు చేసేయకుండా..అలాగని పూర్తిగా బ్యాంకుల్లోనే దాచేయకుండా .. మంచి రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటివారు ఈ కోవకి చెందినవారే. కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం వీరి హాబీ....

లక్ష్యాన్ని అధిగమించిన రామానాయుడు

లక్ష్యాన్ని అధిగమించిన రామానాయుడు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక దర్శకులను పరిచయం చేసిన ఘనత రామానాయుడిదే. ఆయన హస్తవాసి మంచిది కావడంతో ఆయన పరిచయం చేసిన దర్శకులందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. తన కోసం, తన కుటుంబం కోసం నిర్మాతగా మారి సినిమాలు తీసినప్పటికీ, పరోక్షంగా కొన్ని వందల కుటుంబాల జీవనోపాధికి కారకులయ్యారు. 'నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలి' అనుకొనే మంచి మనసు రామానాయుడిది. 'చేతనైతే ఒకరికి సాయం చెయ్యి.. కానీ పొరపాటున కూడా ఎవరికీ హాని చెయ్యకు'... ఇదీ ఆయన నమ్మి ఆచరించే సిద్ధాంతం....
http://cinevinodam.com/visesham/ramanaidu210514.htm

ప్రేక్షకులకు నచ్చేలా చేస్తే, ఆ తృప్తి వేరు!

ప్రేక్షకులకు నచ్చేలా చేస్తే, ఆ తృప్తి వేరు!
దర్శకుడిగాకన్నా నటుడిగా కన్నా నిర్మాతగా కన్నా నాకు ఏం కావాలో నాకు తెలుసు. నాకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అదే చేస్తుంటాను. అది నటనకానీ, దర్శకత్వం కానీ. ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తహతహ పడుతుంటాను. పెద్ద పెద్ద పారితోషికాలు తీసుకుని నటించిన దానిలో ఆనందం ఉంటుందనుకోవచ్చు. కానీ ఓ మంచి చిత్రాన్ని తీసి ప్రేక్షకులకు నచ్చేలా చేస్తే, ఆ తృప్తి వేరు...

http://cinevinodam.com/film%20news/prakashraj280514.htm

ఆనందంతో దొర్లి దొర్లి పని చేస్తున్నా!

ఆనందంతో దొర్లి దొర్లి పని చేస్తున్నా!

''నేను ఈ రోజున ఇలా ఉండటానికి కారణం అచ్చిరెడ్డి. అనుక్షణం నాకు తోడుగా నిలబడి, నేనీ స్థానానికి చేరుకోవడానికి కారణమయ్యారు అచ్చిరెడ్డి. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. ఇది చాలా చిన్న మాట. నాలుగేళ్ల తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'యమలీల - 2'. 'యమలీల' చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రం కంటే పది రెట్లు ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. నా తొలి సినిమాగా భావించి....