RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, November 14, 2013

'మసాలా' చిత్ర సమీక్ష

                             'మసాలా' చిత్ర సమీక్ష            2.5/5


'సురేష్ ప్రొడక్షన్', 'స్రవంతి బ్యానర్ ' సంయుక్తంగా కె . విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాయి   


భీమరాజపురం అనే ఊళ్ళో బలరాం(వెంకటేష్) అనే జమీందారుంటాడు. అతనికి బ్రిటిష్ వాళ్ళని మించిపోయే ఇంగ్లీషు మాట్లాడాలని కోరిక .. అబద్ధమంటే కోపం. బలరాం చెల్లెలు(షాజన్ పదమ్సీ ). బలరాం విరోధి  బామ్మర్ది   (పోసాని).  మేనేజర్ నారాయణ(ఎమ్మెఎస్ నారాయణ) . ఇతని స్నేహితుడి కొడుకు రెహమాన్(రామ్).అతనికో అక్క(అంజలి).   ఇబ్బందుల్లో వున్నరెహమాన్ ను నారాయణ జమీందార్ వద్ద పని ఇప్పిస్తానని  భీమరాజపురానికి తీసుకొస్తాడు  . అక్కడ రామ్ గా తన పేరు అబద్దం చెప్పి రెహమాన్ బలరాం దగ్గర  కోటలో ఉద్యోగం సంపాయిస్తాడు . రెహమాన్ తన పేరులో ఆడిన ఆబద్ధం కోసం మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది .ఒకసారి నమాజ్ చేస్తుండగా దొరికిపోయిన రామ్- 'తనకు రెహమాన్ అనే తమ్ముడున్నాడని, అతను నమాజ్ చేస్తుండగానే మీరు  చూసారంటూ' మాయ చేస్తాడు . ఇక ఓ రోజు హైదరాబాద్ లో చదువుకుంటున్న బలరాం చెల్లెలు  ఇంటికి వస్తుంది. ఆమెతో రామ్ లవ్ లో పడతాడు. ఆ విషయం  బలరాంకు తెలుస్తుంది. ఆతర్వాత రామ్ చెప్పిన అబద్ధాలుకూడా  బలరాంకు తెలుస్తాయి .ఆ తర్వాత ఏం జరిగిందనేది తెర ఫై చూడాలి .... 
    
ఈ మధ్య మల్టీ స్టారర్ చిత్రాలకు మొగ్గు చూపిన వెంకటేష్ , యువ హీరో రామ్ లు కలిసి స్వంత సంస్థల ఫై రూపొందించిన  ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే వున్నాయి . ఇది హిందీ హిట్ 'బోల్ బచ్చన్' కి రీమేక్ .  ఆ చిత్రానికి కాపీ ఫేస్ట్ గానే ఈ చిత్రం  కనిపిస్తుంది.  ఏదైనా.. సినిమాను రీమేక్ చేసే  ముందు  మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటారు .  కానీ అవేమీ లేకుండా మక్కికి మక్కి దించేశాడు దర్శకుడు విజయ్ భాస్కర్. ఈ 'మసాలా' చిత్రంలో ప్రధానంగా అదే లోపంగా కనిపిస్తుంది. కథకు, పాత్రలకు, మాట్లాడే బాషకు సంబంధం ఉండదు. ఒక అబద్ధం అనేక అబద్ధాలు ....వాటికోసం  అనేక పాత్రలు ....ఇలాంటి కామెడీ తెలుగు ప్రేక్షకులు రోటీన్ గా చూస్తున్నదే. లాజిక్ మచ్చుకైనా లేని ఈ చిత్రం లో కనీసం ప్రేక్షకులను అక్కట్టుకునే మ్యాజిక్ అయినా లేదు .   దర్శకుడు అన్నివిధాలా విఫలమయ్యాడు. పాత్రల, సన్నివేశాల లక్ష్యం ఏమిటో  క్లారిటీ లేదు. -వెంకటేష్ - షాజన్ మధ్య అన్నచెల్లెలి అనుబంధాలు ఎక్కడా కనిపించవు.అలాగే అంజలి తో అతని ప్రేమ కూడా ఆర్టిఫిషియల్ గా వుంది . జమీందార్  'మసాలా డ్రామా కంపెనీ' చుట్టూ తిరగడం ఆయన పాత్ర హుందాతనానికి తగినట్లు  లేదు. కామెడీ విలన్ (పోసాని)వల్ల   సినిమా లో గ్రిప్ పోయింది.కేవలం- 'జమీందార్ కు  అబద్ధమంటే పడదు...హీరో అతనికి అబద్ధం చెప్పాడు' అనే అంశం  ఫైనే సినిమా నడుస్తుంది . క్లైమాక్స్ లో 'ఎంత మోసం' అంటూ పెట్టిన డ్రామా   బలహీనంగా  చిత్రీకరించడం తో సిన్మాకు మైనస్ అయ్యింది . 
 
జమీందార్ బలరాం గా వెంకటేష్  మొదటి సారి  డిఫరెంట్ పాత్ర లో  నటించాడు.  
 'క్యాట్ అండర్ ది హ్యాండ్ సెర్చింగ్ మదర్ ల్యాండ్'. 'ఐ టాక్ ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్'. 'నా లాంగ్వేజ్ ఇంగ్లీష్, నా మథర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, నా టోటల్ బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్'. అంటూ వెంకటేష్ చేసిన బట్లర్ ఇంగ్లీష్ కామెడీ ప్రేక్షకులను నవ్వించింది .అయితే ఈ బట్లర్ ఇంగ్లీష్ ప్రయోగం ప్రేక్షకుల్లో ఎంతమందికి అర్ధమవుతుందో ఏమో ?  'రామ్', 'రెహమాన్' పాత్రల్లో రామ్ బాగా నటించాడు. రెహమాన్ గా కష్ట పడ్డాడు . రెండు పాటల్లో బాగా డాన్స్ చేసాడు . షాజన్  అందంలో గానీ..నటనలోగానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఆమెది రాంగ్ సెలక్షన్ -అనే చెప్పాలి .  రామ్ కి అక్కగా, వెంకటేష్ కి ప్రియురాలిగా చేసిన అంజలి, అక్కగానే బాగుందనిపించింది. ఇక వయసు మీరిన  కొవై సరళ  చేసిన  డ్యాన్స్ లు  కొద్దిగా  నవ్వించినా.. ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది .ఎద్దు గా  జయప్రకాష్ రెడ్డి , అలీ, ఎమ్మెస్ నారాయణ బాగానే చేసారు .  తమన్ పాటల్లో 'నిను చూడని' ,'దుమ్ములే' ,'మీనాక్షి'...ఓకే .  మంచి లోకేషన్స్ లో బాగా చిత్రీకరించారు . అండ్రూ  ఫోటోగ్రఫీ ,వర్మ ఎడిటింగ్ బాగుంది. అనిల్ రావిపూడి సంభాషణలు బాగా రాసాడు               -రాజేష్  

Wednesday, November 13, 2013

పిల్లల్ని కనడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను -కరీనా


కొన్ని సంవత్సరాల పాటు అతడితో కలిసి జీవించాను. పెళ్లి అనేది సమాజానికి అవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నాను. కానీ నా వరకూ నేను ఏ రోజైతే అతడికి నా మనసులో స్థానం ఇచ్చానో, అప్పుడే తనకి భార్యనైపోయానని అనుకున్నాను. కలిసివున్న అన్నేళ్లలో మా బంధం బలంగా లేదని అనిపించివుంటే అసలు మేం పెళ్లి వరకూ వెళ్లేవాళ్లమే కాదు. కాబట్టి... ఆల్రెడీ రిలేషన్ దృఢంగా ఉన్నప్పుడు ఇక చేయడానికేముంటుంది!... 

రజనీ స్టైల్ యానిమేటెడ్ బొమ్మలో చూడలేరా?


ఇటీవలే‘కొచ్చాడ యాన్‌’ ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ రిలీజైనప్పుడు జనాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి . రజనీ స్టైల్ కేవలం యానిమేటెడ్ బొమ్మలో చూడడం కష్టం. ఒరిజినాలిటీ లేదు.. అని విమర్శలొచ్చాయి . సూపర్‌స్టార్‌ని ఓ 3డి బొమ్మగా చూడలేమని వ్యాఖ్యానించారు కొందరు. అయితే , ఈ సినిమా థియేటర్స్ లోకి రిలీజై విమర్శల్ని తిప్పి కొడుతుందేమో వేచి చూడాలి....

'క్రిష్‌' హృతిక్‌ చెప్పిన 'టింకిల్'...


బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌కు ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. నటుడిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో, ఫలితం మాత్రం ఆయన్ని ఉత్సాహపరచలేదు. కానీ కేవలం వాణిజ్య విలువలతో తెరకెక్కించిన 'క్రిష్‌-3' ఊహించని విజయానందాన్ని అందించింది. ఇండిస్టీ తనను పెద్ద స్టార్‌గా గుర్తించే అవకాశాన్ని 'క్రిష్‌-3' చిత్రం హృతిక్‌ రోషన్‌కు కల్పించింది. ఈ సక్సెస్‌ను ఆయన పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. ...

అందంతో పాటు సేవా గుణం! -సుస్మిత



అందం అంటే రూపం ఒక్కటే కాదు . విశ్వ సుందరి కిరీటాన్ని గెలిచి సేవా కార్యక్రమాలే ధ్యేయంగా సుస్మితాసేన్‌ 'నేనున్నాను' అంటూ ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. ఇంకా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పెళ్లి కాకపోయినా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఇది హర్షించదగిన విషయం. ఆడపిల్లలు అంటేనే బయపడుతున్న తల్లిదండ్రులు ఉన్న నేటి కాలంలో ఈమె దత్తత తీసుకున్నది ఇద్దరూ ఆడపిల్లలే కావడం గమనార్హం. అందులో ఒకరి కోసం న్యాయపోరాటం కూడా చేసింది. పిల్లల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఆమె మాటలు....

షారుఖ్‌... 'అన్‌ఫెయిర్' ప్రకటనలొద్దు!


సినిమా హీరోలు, హీరోయిన్లు, క్రికెట్ క్రీడాకారులు - ఇటువంటి సెలబ్రిటీలు చెప్పే మాటలు ప్రజల మీద బలంగా ముద్ర వేస్తాయి. అందుకే ప్రకటనల్లో సెలబ్రిటీలని వాడి తమ ఉత్పత్తులని మార్కెట్ చేసుకుంటుంటాయి కంపెనీలు. ఇలాంటప్పుడే సెలబ్రిటీలు జాగరూకతతో ఉండాలి. తాము ప్రచారకర్తగా ఉన్న ఉత్పత్తులు ఎంతవరకు సరైనవో ఆలోచించాలి. అంతేకాని వాస్తవదూరంగా వ్యవహరిస్తే షారుక్ ఖాన్‌కి ఎదురైన పరిస్థితే మిగతా సెలబ్రిటీలకు వస్తుంది....

Thursday, November 7, 2013

ప్రజా నాయకులు కాదు, ప్రజాప్రతినిధులు మాత్రమే!

వందకోట్ల మైలు రాయి దాటిన చిత్రాలు

బాలీవుడ్ ట్రెండ్ ఇప్పుడు పూర్తీగా మారిపోయింది. ఏ సినిమా అయినా ఇప్పుడు ఎన్ని రోజులు అడిందని చూడటంలేదు. వందరోజులు, సిల్వర్ జూబ్లీ, సూపర్ హిట్, బంపర్ హిట్లు ఇప్పుడు లెక్కలేదు. ఎన్ని కో్ట్ల రూపాయలు వసూలు చేసిందనేదే ముఖ్యం. తక్కువ రోజులు ఆడినా కలెక్షన్లు రాబడితేనే హిట్గా భావిస్తారు. వంద కోట్లు దాటితేనే బంపర్ హిట్ కింద లెక్క. వంద కోట్లు, అంతకు మించి వసూలు చేస్తే గొప్ప. ఇప్పటి వరకూ బాలీవుడ్, కోలీవుడ్ కలుపుకొని 25 చిత్రాలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి. వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించాయి. సినిమా నిర్మాణం కూడా ఇప్పుడు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న లక్ష్యంతో జరుగుతోంది. పెద్ద హీరోల లక్ష్యం వంద కోట్లు....

Saturday, November 2, 2013

మల్లిక బుల్లితెర స్వయంవరం

'మర్డర్‌' సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తార మల్లికా శరావత్‌. ఆ సినిమాలో మల్లికా అందాల ప్రదర్శన, ఘాటైన ముద్దు సీన్లు ఆమెకు ఎనలేని క్రేజ్‌ తేవడమే కాదు, అనతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ భాగానే సాగుతోంది. మర్డర్‌ చిత్రం ద్వారా శృంగార తారగా ముద్ర వేసుకున్నారు. యువత గుండెలను కొల్లగొట్టారు. హాట్‌ హాట్‌గా కనిపించి కుర్రకారు మతిపోయేలా చేశారు మల్లిక... హర్యాన రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో పుట్టింది మల్లిక. రీమా లంబ అని పేరును మల్లికగా సినిమాల్లోకి వచ్చే ముందు మార్చుకుంది.... 

'3 డీ' తేలిపోయింది !

ఈతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. నేటి ప్రేక్షకుడు కూడా ఓ డైరెక్టర్‌లా ఆలోచిస్తున్నాడు. పోస్టర్‌ను చూసి సినిమా కథేంటో చెప్పేస్తున్నాడు. ఈ తరుణంలో సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలని దర్శకనిర్మాతలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వారికి లభించిన ఆయుధం 3డీ. ఈ టెక్నాలజీతో తెలుగు సినిమాకు సరికొత్త ఆకర్షణ తేవాలని దర్శకనిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో 3డీ ఫార్మాట్‌లో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలు .....

మళ్ళీ త్రిష- రానా మధ్య ప్రేమాయణం మొదలు


త్రిషకు పెళ్లికళ వచ్చేసిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అందుకే ఆమె కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ చెన్నై సుందరి 2002లో సినీరంగ ప్రవేశం చేసింది. అప్పట్లో కెరియర్ ప్రారంభించిన హీరోయిన్లు నేడు పెళ్లిళ్లు చేసుకుని సంసార జీవితంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో త్రిషకూ పెళ్లి చేయాలని ఆమె తల్లి నిర్ణయించినట్లు సమాచారం. ఇంకేం వరుడిని వెతికే పనిలో పడ్డారట. అదే విధంగా త్రిషకు తెలుగు యువ నటుడు రానా మధ్య ప్రేమాయణం సాగుతోందనే....

హాలీవుడ్లో నిర్మాతగా విజయవంతమై..అశోక్ అమృతరాజ్

సన్నగా, నల్లగా ఉన్న తమిళ కుర్రాడు టెన్నీస్ బాగా ఆడేవాడు. అతనే కాదు. అతని సోదరులు కూడా ఛాంపియన్లే. వారు నెమ్మదిగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి టెన్నీస్ క్రీడాకారుల్లో ఒకరిగా ఎదిగారు. ఆ సమయంలో ఈ కుర్రాడికి హాలీవుడ్ మీద కన్నుపడింది. టెన్నీస్‌ను వదిలి హాలీవుడ్‌కు జంప్ చేశాడు. ప్రపంచంలోనే విజయవంతమైన హాలీవుడ్ నిర్మాతల్లో ఒకరిగా ఎదిగాడు. ఘోస్ట్ రైడర్, స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్, బ్రింగింగ్ డౌన్ ది హౌస్, ప్రిమానిషన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. ఇప్పటి దాకా అతను తీసిన సినిమాలకు 6000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వచ్చింది. ఒకప్పుడు చెన్నైలో సైకిళ్ల మీద తిరిగిన ఈ కుర్రాడికి ఇప్పుడు సొంత విమానం కూడా ఉంది. ఆ కుర్రాడి పేరు అశోక్ అమృతరాజ్. ఆయన తాజాగా రాసిన ఆత్మకథే అడ్వాంటేజ్ హాలీవుడ్. దానిలో నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు.....