RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 20, 2013

'బిరియాని' చిత్ర సమీక్ష

                                  'బిరియాని'  చిత్ర సమీక్ష  3/5

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా  వెంకట్ ప్రభు దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు . 

సుదీర్  అమ్మాయిలను అమితంగా ఆకట్టుకునే  టాలెంట్ తో   ప్లే బాయ్ లా, చిన్న నాటి మిత్రుడు పరశు రామ్ తో
కలిసి  తిరుగుతుంటాడు  .ఇండస్ట్రియలిస్ట్ అయిన వరదరాజన్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు . ఒక రోజు వరదరాజన్ ఇచ్చిన ఓ పార్టీకి వచ్చి,వెళ్తూ -బిర్యానీ కోసం వెదుకుతున్న  సుదీర్ -పరశు లకు  హాట్ బ్యూటీ మాయ తగులు తుంది. ఆమె మాయకి పడిపోయి మాయతో కలిసి ఆమె హోటల్ కి వెళతారు . ఆ రాత్రి బాగా తాగి ఎంజాయ్ చేసిన వారికి , ఉదయం లేచి చూస్తే మాయ కనిపించదు. సుదీర్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు.  ఆ మర్డర్ కేసు నుండి తనని రక్షించు కోవడానికి ప్రేమికురాలు ప్రియాంక తో పాటు , స్నేహితుల సాయం తీసుకుంటాడు. ఆ మర్డర్ మిస్టరీని  సుదీర్ ఎలా చేదించాడు?అనేదే మిగిలిన కథాంశం..

ఇటీవల కొన్నిచిత్రాల  చేదు అనుభవం అందుకున్న  కార్తీ హిట్ కొట్టక తప్పని చిత్రం ఇది . ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం కార్తీని , ప్రేక్షకులను నిరాశ  పరచలేదు . హీరో ను ను ప్లే బాయ్ గా చూపుతూ, మంచి మసాలా బ్యాక్ గ్రౌండ్ లో వెంకట్ ప్రభు  తరహా స్క్రీన్ ప్లే ... సస్పెన్స్ తో ఈ చిత్రం నడుస్తుంది . మొదటి భాగం అంతా సరదా సన్నివేశాలతో , కాస్త చిరాకు తెప్పించినా -ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకి ఊపు నిచ్చాయి . రెండవ భాగం ఆసక్తికరం గా, వేగం గా సాగుతుంది .అందువల్ల చాలా లాజిక్స్ మిస్ అయినా ప్రేక్షకుడు గుర్తించడు  . హోటల్ లో వరద రాజన్ హత్య  జరిగినప్పుడు సి. సి. కెమెరాతో పాటు, చాలా మంది దాన్ని గమనించడానికున్న అవకాశాన్నీ  దర్శకుడు దాటవేశాడు .అలాగే ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు , సస్పెన్స్ రివీల్  చేసేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతాము . ఎంత జాగ్రత్తగా చేసినా, డబ్బింగ్ సినిమా వాసనలు పోలేదు  .  అయితే హీరో ను పోలీసులు చేజ్ చేస్తుంటే -దానికి పాటను జత చెయ్యడం , రైల్వే స్టేషన్ లో ఉత్కంట కలిగించే  సన్నివేశం లో -'ఫ్లాష్ మాబ్ డాన్స్' పెట్టడం కొత్తగా అనిపిస్తాయి .  క్లైమాక్స్  ఈ చిత్రానికి హై లైట్ .సీరియస్ సన్నివేశాల్లో కూడా కామెడీ జొప్పించడం ఈ దర్శకుడి ప్రత్యేకత .  

సుదీర్ గా ప్లే బాయ్ తరహా పాత్రలో కార్తీ మొదటి భాగం లో మంచి వినోదాన్ని అందిస్తూ , రెండవ భాగం లో హీరోయిజాన్ని చక్కగా  పండించాడు  .ఒక పాటలో స్వంత గొంతు కలిపాడు . హన్సిక అందం గా , పాత్రోచితం గా చేసింది .  సుదీర్ మిత్రుడు పరశురామ్ గా ప్రేమ జీ   హీరో కు మంచి సపోర్ట్  అందించాడు .మాయ గా మాండీ  వేడి వేడిగా కనిపించింది  , వరదరాజన్ గా నాజర్ , హీరో అక్క గా మధుమిత , సి .బి .ఐ అధికారి రియాజ్ గా సంపత్ , కాంట్రాక్ట్ కిల్లర్ - హిట్ వుమన్ గా ఉమా ,  పరశురామ్ అల్లుడు విజయ కృష్ణ గా రాంకీ తమ తమ పాత్రలను బాగా పోషించారు . యువ హీరో జై కూడా ఒకసారి కనిపించాడు  . 

వందవ చిత్రం అయినప్పటికీ  యువన్ శంకర్ రాజా ఈ చిత్రం లో ఒక్క పాటా బాగుందనిపించలేదు . రీ రికార్డింగ్ మాత్రం కొత్తగా , బ్రహ్మాండం గా చేసాడు .శశాంక్ వెన్నెలకంటి మాటలు  ప్రత్యేకం గా చెప్పు కోవాల్సినంత బాగున్నాయి . శక్తి శరవణన్ ఫోటోగ్రఫీ , ప్రవీణ్ - ప్రశాంత్ ల ఎడిటింగ్ , శెల్వ స్టంట్స్ బాగున్నాయి                                             -రాజేష్

Thursday, December 19, 2013

ఈ ఏడాది నిర్మాతలకు నష్టాలు ...కష్టాలే !


170 రిలీజ్‌లు... 140 అట్టర్‌ప్లాప్‌లు..14 విజయాలు.. 70-80మంది కొత్త నిర్మాతల ఘోర వైఫల్యం . ఇదీ ఈ ఏడాది తెలుగు సినిమా సాధించిన ఘనత. సక్సెస్‌ శాతం 10 కూడా లేదు. బడా సినిమాలు విజయాలు సాధించినా వాటిలో లాభాలొచ్చింది తక్కువే. పరిమిత బడ్జెట్‌ సినిమాలు ఓ మోస్తరు విజయం సాధించినా నిర్మాతలకు లాభాల్ని తెచ్చాయి. రూ.40కోట్ల ఖర్చుతో తెరకెక్కిన సినిమా రూ.50కోట్లు తెస్తే ప్రయోజనమేంటి? రూ.10కోట్లతో తెరకెక్కి 20కోట్లు వసూలు చేస్తేనే గొప్ప.... 

ప్రేమ..పెళ్లి..విడాకులు - అదే ఆనవాయితీ


భార్య వెళ్లిపోయినా.. నన్ను వదిలి నీవు పోలేవులే అంటూ బాలీవుడ్ 'క్రిష్'హృతిక్‌ రోషన్ విరహగీతం పాడుతున్నాడు. 'ఎప్పటికీ తన హృదయంలో నిదురించే చెలి సుసానే'- అంటూ ఫేస్‌బుక్‌లో ప్రేమ సందేశాన్ని పోస్ట్ చేశాడు. తాను లేకపోతేనే సుఖమనుకుంటే ఆ దుఃఖాన్ని భరిస్తానంటున్నాడు. సుసానే కోసం తన మనసు తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని 'ఓపెన్‌ హార్ట్' తో చెబుతున్నాడు. సుసానే దూరమవటాన్ని తట్టుకోలేని హృతిక్‌.. హృతిక్‌ రోషన్‌. బాలీవుడ్‌లో ఎగసిపడ్డ యువకెరటం. మొదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన హీరో. హాలీవుడ్‌ ఫాంటసీ హీరోలకు ధీటుగా 'క్రిష్‌'గా బాలీవుడ్‌లో ఎదిగిన కథానాయకుడు. 'అగ్నిపథ్‌' సినిమాతో తనలోని ఎమోషన్‌ని బయటకు తీసిన నటుడు. సూపర్‌ సినిమాలున్నా....

విజయం పట్ల పూర్తి నమ్మకం తో ...కార్తీ


విభిన్న కథాంశాలతో కమర్షియల్ సినిమాలు చేస్తూ విలక్షణ హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ ‘ఆవారా’ ‘నా పేరు శివ’లాంటి విజయవంతమై చిత్రాలతో ఆయన తెలుగుప్రేక్షకులకు చేరువయ్యారు. కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బిరియాని’. వెంకట్‌ప్రభు దర్శకుడు. స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. హన్సిక కథానాయిక. ఈ నెల 20న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కార్తీ చెప్పిన విశేషాలివి....

Thursday, December 12, 2013

జెన్నిఫర్‌ లోపెజ్‌ అందాల రహస్యం

వెండితెరపైనా వెలగాలని .... యామీ గౌతమ్



అందమైన ముఖం, ఆకట్టుకునే నవ్వు, చూడగానే 'వావ్' అనిపించే శరీర సౌష్టవం ఇవ్వన్నీ కలబోసిన బొమ్మలా ఉంటుంది యామీ గౌతమ్ . ఎప్పటికైనా ఐఎఎస్‌ అవ్వాలన్నది తన జీవిత ధ్యేయం. కానీ అనుకోకుండా మోడల్‌గా అవకాశాలు వచ్చిపడడం....మిత్రుల ప్రోత్సాహంతో నటన వైపు మళ్లింది. మోడల్‌గా నిరూపించుకుని వెండితెరపై అడుగుపెట్టింది. అయితే మోడల్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న యామీ వెండితెరపై అంతగా సక్సెస్‌ కాలేకపోతోంది. నితిన్‌తో తీసే'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' చిత్రమైనా....

వినూత్న ప్రయోగాలు నటులకు చాలా ముఖ్యం!

అతన్ని ప్రేమించి పెద్ద తప్పు చేసా! -హన్సిక



శింబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశ్రమలోని పలువురు హెచ్చరించినా పట్టించుకోకుండా ప్రేమించానని, ఇప్పుడాయన నిజ స్వరూపం తెలిందని నటి హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. శింబు, హన్సిక ప్రేమించుకుంటున్నారని వెల్లడించగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నటి కుష్బూ, సిమ్రాన్ వంటి సీనియర్ తారామణులు శింబు ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త అంటూ హన్సికను హెచ్చరించారు. అయినా తాము ప్రేమలో పడ్డామని....

అసిన్ పెళ్లి చేసుకుందా ?



నటి అసిన్ పెళ్లి చేసుకుందా ? ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతున్న వేడివేడి చర్చ ఇదే. కేరళ రాష్ట్రానికి చెందిన ముద్దుగుమ్మ అసిన్. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక రౌండ్ కొట్టి 'గజని' చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. అక్కడ కూడా కొంత కాలం హవా కొనసాగించింది. ప్రస్తుతం అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో అసిన్ పెళ్లి చేసుకుని ....