RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, March 21, 2012

ఇప్పుడు నయన తార పారితోషికం కోటి రూపాయలు


http://cinevinodam.com/news/flash_news2.htm‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో అద్భుతాభినయంతో ప్రేక్షకుల్ని మైమరిపించింది నయనతార. గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో రాణించిన తీరు అందరినీ వేనోళ్ల పొగిడేలా చేసింది. ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తర్వాత నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పబోతోందని అందరూ భావించారు కూడా. అయితే ప్రభుదేవాతో విఫల ప్రేమాయణం దృష్ట్యా ఈ సుందరి తిరిగి సినిమాల్లో నటించడానికి పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత తెలుగులో ఈ సుందరి రానా సరసన రాధాకృష్ణ నకిష్) దర్శకత్వం వహిస్తున్న ‘కృష్ణం వందేజగద్గురుం’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోలతో జతకట్టిన ఈ భామ తొలిసారిగా యువహీరో రానాతో కలసి నటించడం....

జెనీలియా లో పెళ్లి కళ

హాసిని అనే పదానికి సరైన నిర్వచనంగా పేరు తెచ్చుకున్న నటి జెనీలియా. తమిళం, తెలుగు, హిందీ మొదలగు పలు భాషా అభిమానుల్ని తన అందంతో గులామ్ చేసుకుంటూ హీరోయిన్‌గా ఉన్నత స్థాయికి చేరుకున్న ఈ ముద్దు గుమ్మ తొమ్మిదేళ్లుగా ప్రేమించిన రితేష్ దేశ్‌ముఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకల్లో ఆహుతులందరి కళ్లు అపురూపంగా ప్రత్యక్షమయిన నటి నవ వధువు జెనీలియా పైనే. తన వివాహ వేడుకలో...

Sunday, March 11, 2012

ఎందరో పెళ్లి చేసుకుంటానన్నారు

ప్రస్తుతానికి కధానాయిక పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని నటి సోనియా అగర్వాల్‌ తెలిపారు. దర్శకుడు సెల్వరాఘవన్‌తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె నటిస్తున్న తమిళచిత్రం 'ఓ నడిగయిన్‌ వాంగ్మూలం' (ఓ నటి సాక్ష్యం). ఈ చిత్రం శుక్రవారం నాడు తమిళనాట విడుదల కానున్న నేపధ్యంలో ఆమె విలేకరులతో ముచ్చటించారు. తనకు వయసు ఎక్కువకాదనీ, అందువలన కధానాయికల పాత్రలకే ప్రాధాన్యం ఇసాననీ, 40 దాటితే అప్పుడు పిన్ని, అక్క తదితర పాత్రలకు.....

ఆస్కార్‌ విజేతల ఎంపిక ఎలా?

అకాడమీ అవార్డు అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ ఆస్కార్‌ అంటే మాత్రం అంతా గుర్తిస్తారు. ఆస్కార్‌ అవార్డులకు అధికారిక పేరే అకాడమీ అవార్డులు. హాలీవుడ్గ మెుదలుకొని టాలీవుడ్గ దాకా వివిధ దేశాలకు చెందిన నటీనటులంతా కూడా కోరుకునేది జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్‌ అవార్డు సాధించాలనే. అది దక్కితే చాలు జీవితం ధన్యమైపోతుంది... ఇక నటజీవితంలో నుంచి హారుుగా, ప్రశాంతంగా రిటైర్‌ కావచ్చు అనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. సినీ ప్రపంచంలో యావత్‌ ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన అవార్డులుగా ఆస్కార్‌ అవార్డులు గుర్తింపు పొందారు. వాటికి ఆ గుర్తింపు....

Friday, March 9, 2012

అవకాశాల కోసం గ్లామరస్‌గా నటిస్తున్నానంటే ఎట్లా ?


తాను శృంగార నటిని కానని అంటోంది ముద్దుగుమ్మ త్రిష. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ అమ్మడు తెలుగులో కాస్త గ్లామర్ పరంగా హద్దులు మీరే ప్రయత్నం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీని గురించి త్రిష స్పందిస్తూ- తాను తమిళంలో చివరిగా నటించిన చిత్రం 'మన్మథన్ అంబు' అని తెలిపింది. ఆ తర్వాత సుమారు ఏడు నెలలుగా తమిళంలో నటించలేదని చెప్పింది. అందుకు కారణం మంచి పాత్ర కోసం ఎదురు చూడడమేనని పేర్కొంది. అందుకు ఫలంగా విశాల్ సరసన...

నటి శ్రీయపై నష్టపరిహార కేసు వేస్తా

తన చిత్ర విడుదలను నిషేధించాలని ప్రయత్నిస్తే నటి శ్రీయపై నష్టపరిహారం కేసు వేస్తానని రాజా పోకిరి రాజా చిత్ర నిర్మాత మలేషియా పాండియన్ వెల్లడించారు. మలయాళంలో మమ్ముట్టి, పృథ్వీరాజ్, శ్రీయ నటించిన చిత్రం పోకిరి రాజా. 2010లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు మలేషియా పాండియన్ రాజా పోకిరి రాజా పేరుతో తమిళంలోకి అనువదించారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో నటి శ్రీయ మలయాళ చిత్ర నిర్మాత థామస్ ఆంటోని మీద....

Tuesday, March 6, 2012

కనువిప్పు కలిగిస్తాయంటున్న మనీషా కొయిరాలా

ఒకనాటి బాలీవుడ్ అందాలభామ మనీషాకొయిరాలా ప్రస్తుతం జీవిత చరిత్ర రాసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు హడల్ పుట్టిస్తున్న వార్త ఇది. ఈ ‘చరిత్ర’ ఎవరెవరి బ్రతుకుల్ని బజారుకు లాగనునుందో అని పలువురు బాలీవుడ్ పెద్దలు భయపడి చస్తున్నారట. ఇంతకీ తన చరిత్ర తానే రాసుకోవాలని మనీషాకు ఎందుకు అనిపించింది? అనే విషయంలోకెళితే .. అపార్థాల కారణంగా వైవాహిక జీవితం విఛ్చీన్నమవ్వడం, తప్పతాగి ముంబయ్ పురవీధుల్లో చిందులు వేస్తూ మీడియాకు చిక్కడం... ఇత్యాది కారణాల వల్ల మనీషా మానసికంగా చాలా కృంగిపోయారు. మళ్లీ తాను మనిషిని కావాలంటే అది ఒక్క దేవుడి వల్లే అవుతుందని గ్రహించిన మనీషా...

రజనీకాంత్ ' కొచ్చాడయాన్' సంచలనం

అనగనగా ఒక రాజు... అని కథ ప్రారంభించగానే రాజుల కథలు మాకు వద్దు ... లేటెస్ట్‌ కథలు కావాలి అని చిన్నపిల్లలు కూడా అంటున్న కాలంలో శతాబ్దాల కిందటి రాజు కథ (?)ను వెండితెరకు ఎక్కించడం సాహసమే అవుతుంది. వయస్సు మీద పడిన తరుణంలో, ఆరోగ్యం దెబ్బ తిన్న సమ యంలో ఇలాంటి సాహసం చేయడం ెకరీర్‌ను పణంగా పెట్టడమే. అలాంటి సాహసాలు చేయడం ఆయనకు అలవాటు కాబట్టే ఆయన మహా నటుడయ్యాడు. అభిమానులకు ఆరాధ్యదైవమ య్యాడు. ఆయనే రజనీకాంత్‌.....

Saturday, March 3, 2012

                    'మై హార్ట్ ఈస్ బీటింగ్' నిర్మాత కే.రాజశేఖర్,హీరో రేవంత్ లకు ఆత్మీయ అభినందన
                            పూర్తిగా అమెరికాలో,అక్కడున్న తెలుగువాళ్ళతో నిర్మించిన 'మై హార్ట్ ఈస్ బీటింగ్' ఇటీవల విడుదల అయ్యి అభినందనలు అందుకుంటోంది. ఈ సందర్భంగా 'మై హార్ట్ ఈస్ బీటింగ్' నిర్మాత కే.రాజశేఖర్,హీరో రేవంత్ లకు రవీంద్రభారతిలో 'యువకళావాహిని' మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా ఆత్మీయ సత్కారంచేసింది. విదేశాల్లో వున్నా మన యువత దైనందిన జీవితాన్ని ఇందులో హృదయం గా చిత్రీకరించారని- 'యువకళావాహిని'వై.కే.నాగేశ్వరరావు అన్నారు.

ఈ చిత్రం ద్వారా నిర్మాత రాజశేఖర్ కొత్తవారికి వేదిక కల్పించి,వారికి ఆశాజ్యోతిగా నిలిచారని -డి.యస్.దీక్షిత్ అన్నారు.యువతకు ఈ చిత్రం లో పెద్ద పీటవేసారని-చాట్ల శ్రీరాములు అన్నారు. రాజశేఖర్ అబిరుచిగల నిర్మాత-అని పాలకుర్తి మదుసూదనరావు అన్నారు.నిర్మాతగా డబ్బు మూటలతో కాకుండా,కొత్త ఆలోచనలతో రాజశేఖర్ చిత్రరంగానికి వచ్చారని-రచయిత సి.యస్.రావు అన్నారు.

 బ్రహ్మజిత్, శ్రీధర్ దీక్షిత్ వంటి సినిమా విద్యార్ధులు కూడా తమ అభిప్రాయాలను చెప్పిన ఈ సభలోసంగీత దర్శకుడు మైఖేల్ మక్కల్ మాట్లాడుతూ-ఒక మంచి చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయినందుకు ఆనందం గా వుంది-అన్నారు.హీరో రేవంత్ మాట్లాడుతూ-అభిరుచి గల నిర్మాతలు చిత్ర రంగంలో వున్నారనడానికి రాజశేఖర్ గారే మంచి ఉదాహరణ,.వారి చిత్రంలో అవకాశం రావడం నా అదృష్టం -అన్నారు. నిర్మాత కే.రాజశేఖర్ మాట్లాడుతూ-నా మొదటి చిత్రం 'గౌతం బుద్ధ' కు నంది అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి ఆర్ధికంగా తక్కువ...అభినందన పూర్వకంగా ఎక్కువ వచ్చింది. ఇంతమంది ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందం గా వుంది. ఇకపైన కూడా మంచిచిత్రాల నిర్మాణానికే కట్టుబడి వున్నాను. త్వరలో ఓ కామెడి థ్రిల్లర్ నిర్మించబోతున్నాను-అన్నారు.. సారిపల్లి కొండలరావు, జే .బాపు రెడ్డి, డి.మోహనరావు , జి.వి. నారాయణ రావు, జీ . హనుమంత రావు, పీ.జయప్రకాష్ రెడ్డి , సంజయ్ కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






Thursday, March 1, 2012

ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట కు ఆత్మీయ సత్కారం

ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట కు ఆత్మీయ సత్కారం

ఇటీవల హైదరాబాద్ విచ్చేసిన ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట దంపతులకు  కు 'యువకళా వాహిని' ఆధ్వర్యం లో ఫిబ్రవరి 29న హోటల్  అమృతాక్యాజిల్  లో  ఆత్మీయ సత్కారంజరిగింది. ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ,     జే.బాపురెడ్డి , సారిపల్లి కొండలరావు,  గజల్ శ్రీనివాస్,  దీక్షిత్,  సాయిచంద్,  వడ్డేపల్లి కృష్ణ,  వంశీ రామరాజు, యన్. రవీంద్ర రెడ్డి, జి.హనుమంతరావు,  పీ .జయప్రకాశ్రెడ్డి, యాదవరెడ్డి, 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వర్ రావు తదితరులు ఈ సత్కార కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు.