RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, September 27, 2013

'అత్తారింటికి దారేది' చిత్ర సమీక్ష

'అత్తారింటికి దారేది' చిత్ర సమీక్ష     3.75/5

           శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై రిలయన్స్ వారి సమర్పణలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన,దర్శకత్వంలో బి .వి .ఎస్ .యన్ .ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు .


           ఇటలీలోని మిలాన్ లో రఘు నందా పెద్ద  బిజినెస్ మెన్. ఆయన మనవడే గౌతమ్ నందా. 'ఆరడుగుల బుల్లెట్' లా తాతకు అన్నివేళలా గౌతమ్ అండగా ఉంటాడు. రఘు నందాకు  ఒక చివరికోరిక వుంటుంది. తనకు ఇష్టంలేకుండా వేరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో తన కూతురు సునంద ను ఇల్లు వదిలి  పొమ్మన్నానని అనుక్షణం బాధపడుతూ వుంటాడు. తను చనిపోయేలోపు కన్న కూతురుని కళ్ళారా చూడాలనివుందని అడగితే- తాత  కోరిక నెరవేర్చడానికి హైదరాబాద్ కు చేరుకుంటాడుగౌతమ్సునంద ఇంట్లో సిద్దార్థ్ పేరుతో కారు డ్రైవర్ గా పనికి కుదురుతాడు.అలా వచ్చిన గౌతంకు తన మరదళ్ళు అయిన శశి, ప్రమీల లతో ఎలాంటి ప్రేమ బంధం ఏర్పడింది? తండ్రి అంటే మండి పడుతున్న  సునందలో మార్పు తీసుకురావడానికి ,  తాత కోరికను తీర్చడానికి  గౌతమ్ ఏం చేసాడనేది సినిమాలో చూడాలి ...   

కనుల పండువగా వుండే భారీసినిమాలు కరువై  
అవురావురుమంటున్న   తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే సినిమా ‘అత్తారింటికి దారేది’. పవన్ కళ్యాణ్ హీరో ఇమేజ్ కి  , త్రివిక్రమ్ జనరంజక రచనా - దర్శకత్వ ప్రతిభ కలిసి...కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ అంశాలు మేళవించిన   ఈ చిత్రం ప్రేక్షకులకు,  పవన్ కళ్యాణ్ అభిమానులకు  మంచి  వినోదాన్ని అందిస్తుంది . 
       పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిగా  సరిపోయే విధంగా గౌతమ్ నందా పాత్ర ను  దర్శకుడు త్రివిక్రమ్ చక్కగా తీర్చిదిద్దాడు. గౌతమ్ పాత్ర లో ఉండే ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్, బుల్లెట్ లా పేలే డైలాగ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విశేషంగా ఆనందింపజేస్తాయి. పవన్ కళ్యాణ్ తో 'చూడు 'సిద్దప్ప నేను సింహం లాంటి వాడిని...', సింహం నిద్ర పోతుంటే జూలుతో జడవేయ్యోద్దు..పులి పలకరించిందని పక్కనే నిలుచుని ఫోటోకు ఫోజివ్వద్దు' వంటి  త్రివిక్రమ్ కలం నుంచి అలాంటి మార్కు ఉన్న డైలాగ్స్ ఈ చిత్రంలో చాలా వున్నాయి . త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు పవన్ కళ్యాణ్ మరింత పవర్ యాడ్ చేసి అభిమానులకు వంద శాతం సంతృస్తిని కలిగించాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం...స్క్రీన్ ప్లే వేగంగా,పట్టుగా లేకపోవడం కొంత నిరాశను కలిగించినా.. త్రివిక్రమ్ మార్క్ కథనం, పవన్ పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ఆ ఇబ్బందిని మర్చి పోయేలా చేసాయి . అలాగే రచయితగా త్రివిక్రమ్  ప్రాసకోసం,పంచ్ ల కోసం ఒక్కోసారి సందర్భ ఔచిత్యాన్నిమర్చిపోవడం కనిపిస్తుంది . సినిమా ద్వితీయార్ధంలో బ్రహ్మనందం చేసిన 'అహల్య'  ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ బాబా ఎపిసోడ్ ప్రేక్షకులను అభిమానులకుతప్ప...మిగతా ప్రేక్షకులకు బాగా ఇబ్బంది పెట్టాయి .   ఇక రైల్వే స్టేషన్ లో క్లైమాక్స్ సీన్ చిత్రానికి హైలెట్.   క్లైమాక్స్ లో దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్, పవన్ కళ్యాణ్ నటన చిత్రం స్థాయిని పెంచాయి . 
              రఘునందా గా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తనదైన శైలిలోచక్కగా  నటించాడు.'మిర్చి' చిత్రం ద్వారా టాలీవుడ్ లో రీఎంట్రి ఇచ్చిన నదియా సునందగా    ప్రధాన పాత్రలో  ఆకట్టుకున్నారు. శశిగా సమంత, ప్రణీతలు గ్లామర్ తో ఆలరించారు.  పోసాని సన్నివేశాలు కూడా బాగున్నాయి . ఇతర పాత్రల్లో మోహన్ రుషి , రావు రమేష్ ,అలీ , ఎమ్మెస్ నారాయణ , రఘుబాబు , కోట , డా" భరత్, కాదంబరి కిరణ్ , పృథ్వి , ప్రదీప్ నటించారు . 
      
         దేవి శ్రీ ప్రసాద్ఈ చిత్రానికి  అందించిన ఆడియో ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది . రామజోగయ్య శాస్త్రి రాసిన 'కిర్రాక్', 'దేవ దేవం', 'బాపు గారి బొమ్మ', 'టైమ్ టూ పార్టీ' పాటలతోపాటు,  దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన 'నిన్ను చూడగానే', శ్రీమణి రాసిన 'ఆరడుగుల బుల్లెట్'తోపాటు 'కాటమ రాయుడా' అంటూ పవన్ పాడిన పాటకు అనూహ్య స్పందన లభించింది. ఆడియోకు  ధీటుగా పాటల  చిత్రీకరణ కూడా వుండటం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ . పీటర్ హైన్స్ వెరైటీ ఫైట్స్ అందించారు .  ప్రసాద్ మూరెళ్ల తన ఫోటోగ్రఫీ తో  యూరప్ అందాలను చక్కగా చూపడమే కాకుండా,కీలక సన్నివేశాల చిత్రీకరణకు జీవం పోశారు.ఒక పాటలో దేవిశ్రీ ప్రసాద్ , మరోపాటలో ముంతాజ్, హంసనందిని కనిపించడం విశేషం                    -రాజేష్ 

Saturday, September 21, 2013

శృంగార దృశ్యాలకూ సిద్ధం !

తప్పనిసరైతే శృంగార దృశ్యాల్లో నటించేందుకైనా సిద్ధంగానే ఉన్నానని, సినిమాల్లో పాత్రలకు సంబంధించి తన ఉద్దేశాలపై వివాహం ఎటువంటి ప్రభావమూ చూపలేదంటూ కుండబద్దలు కొట్టింది నటి కరీనాకపూర్. ‘పెళ్లికి అటువంటి పాత్రలకూ ఎటువంటి సంబంధమూ లేదు. కెరీర్‌ను పెళ్లికి, ప్రేమకు కొంతమంది ఎందుకు ముడిపెడతారో నేను అర్ధం చేసుకోలేకపోతున్నా’ అని పేర్కొంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘ఓంకార’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌తో శృంగార దృశ్యాల్లో....

పెళ్లి చేసుకుంటామని ఎందరో...

రెండుసార్లు చేదు అనుభావాల్ని చవిచూసిన ప్రముఖ నటి నయనతార ప్రస్తుతం తన జీవితంలో ప్రేమకు తావు లేదని స్పష్టం చేసింది. ప్రేమ అనే రెండు అక్షరాలు ఆమె జీవితంలో ఒకసారి కాదు.... రెండుసార్లు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. భగ్న హృదయంతో నయనతార తన కెరీర్ మీదే దృష్టి పెట్టింది. నటిగా ఆమె సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతోంది. అయితే యువ హీరోల రూపంలో ప్రేమ మళ్లీ నయనను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. నయనతార తనకు ప్రత్యేక స్నేహితురాలు అంటూ హీరో ఆర్య బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు ఆమెను ఇంటికి తీసుకెళ్లి...

బుల్లితెర ఫై 100కోట్ల 'మహాభారతం'

బాలీవుడ్ సినిమాలకు రూ. 100 కోట్లు ఖర్చు చేయడం సాధారణ విషయం. అలాగే హిందీ సినిమాలు రూ. 100 కోట్లు వసూలు సాధిస్తుండడం కూడా మామూలు విషయంగా మారిపోయింది. బుల్లితెర కూడా భారీతనాన్ని ఆపాదించుకుంటోంది. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో భారీ వ్యయంతో వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన మెగా సీరియల్ సెప్టెంబర్ 16నుంచి ప్రేక్షకుల ముందుకు....

'త్వరలో దక్షిణాది సినిమాకూ రూ.100కోట్ల వైభవం'

త్వరలో దక్షిణాదిసినిమా వందకోట్ల మార్క్ ను దాటుతుందని ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మైలురాయిని చేరుకోవడం గగనంగా మారిందన్నాడు. బుధవారం ఐఎన్ ఎస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో నాగార్జున పలువిషయాల్ని పంచుకున్నారు. బాలీవుడ్ ఇప్పటికే ఆస్థానాన్ని అందిపుచ్చుకోగా, దక్షిణాది సినిమా మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉందని తెలిపారు. ఆ భర్తీ త్వరలో పూర్తి చేస్తామనే ధీమాను....

'రాజకీయాల్లోకి రా.. కథానాయకుడా'


సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ భారత సినీ వినీలాకాశంలో తిరుగులేని కథానాయకుడు రజనీకాంత్. ఆయన రాజకీయ ప్రవేశంపై చాలా కాలంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో రజనీకాంత్ ఇచ్చిన ఓ సంకేతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయూంశమైంది. రాజకీయ సంకేతంగా ఆయన గళం విప్పడం అభిమానుల్లో ఉత్తేజం నింపింది. తర్వాత విడుదలైన చిత్రాల్లో రాజకీయ డైలాగులు పేలడంతో రజనీ రాజకీయ ప్రవేశంపై చర్చ తీవ్రమైంది. రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, రావాల్సిన సమయంలో వస్తా ....

నాటకరంగానికి 'అక్కినేని నాటక కళా పరిషత్‌' ప్రోత్సాహం !


అభినయ రంగంలో అన్ని మెట్లూ అధిరోహించిన 90 ఏళ్ల అక్కినేని నుంచి అభినందనలు, బహుమతులు అందుకునే అవకాశం కల్పించే 'డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు నాటక పరిషత్‌ కళా 'కు 20 ఏళ్లు వచ్చాయి. నటనా రంగంలో వెలుగులు విరజిమ్మిన ప్రతిభావంతులలో ముందు పేరుగా చెప్పుకునే అక్కినేని నాగేశ్వరరావు పేరిట అభిమానులు రాష్ట్ర రాజధానిలో నాటకాల పోటీలను ఆ పరిషత్తును నిర్వహిస్తున్నారు. 1929లో మొదలై పోటీ నాటకాలకు ఒరవడి దిద్దిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు స్ఫూర్తితో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ తెలుగు నాట ప్రతిష్టాత్మక పరిషత్తుగా...

వందేళ్ళ సినిమాకు డాక్యుమెంటరీ నీరాజనం!

భారతీయ సినిమా పరిశ్రమ వందేళ్ల పండగ చేసుకుంటున్న సమయమిది. ఒక సినిమావ్యక్తిగా సినిమాప్రియులకు ఏం కానుక చెయ్యాలని ఆలోచిస్తుంటే - ఇదివరలో తెలుగు సినిమా ప్రముఖుల గురించి తాను రూపొందించిన విలువైన డాక్యుమెంటరీలు గుర్తొచ్చాయి సీనియర్ నటుడు సాయిచంద్‌కు. వాటిని పదిమందికీ ప్రదర్శించి, సమాజానికి అంకితమివ్వడం కన్నా మంచి పనేముంటుంది? 'చలో, అదే చేద్దాం' అని బయల్దేరారు సాయిచంద్....

సవాలు విసిరే పాత్రల కోసం...

ముద్దంటే మాకేమైనా సరదానా ?

మామూలుగా ఒక ముద్దు సీన్‌ ఉంటేనే సినిమాకి అది పెద్ద హైలైట్‌ అయిపోతుంది. ఆ సీన్‌ గురించి గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 27 ముద్దు సీన్లతో ఇప్పుడు కొత్త రికార్డు కొడుతోంది..బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా కజిన్ పరిణితి చోప్రా. తను తాజాగా నటించిన 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఇన్ని ముద్దులకి సై అంది. 'సినిమా కథ అటువంటిది. అన్ని ముద్దు సీన్లు డిమాండ్‌ చేసింది. లేకపోతే చేయడానికి మాకేమైనా సరదానా ? అంటోంది తెలివిగా ఈ చిన్నది. మరి, ఈ సన్నివేశాలలో పరిణితి చోప్రా ఎంతటి పరిణితి చూపిందో తెలియాలంటే ఇటీవల రిలీజయిన ఈ సినిమా చూడాల్సిందే !

Saturday, September 14, 2013

' పోటుగాడు' చిత్ర సమీక్ష

                                     ' పోటుగాడు' చిత్ర సమీక్ష      2. 75 / 5

నటీనటులు: మంచు మనోజ్‌, సాక్షి చౌదరి, సిమ్రాన్‌కౌర్‌ముండి, రేచల్‌ వెయిన్‌, అనుప్రియ గొయాంక, పోసాని కృష్ణమురళి, అలీ, షిండే, సత్యంరాజేష్‌, గీతాసింగ్‌
నిర్మాతలు: లగడపాటి శిరీష, శ్రీధర్‌,  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్‌ వడయార్‌.

           అల్లరి కుర్రాడు గోవిందం (మంచుమనోజ్‌). ప్రేమించడం అతని అలవాటు. అలా అని అందరినీ పెళ్లి చేసుకోడు. ఇప్పటి యూత్‌కు తగినట్లు యూజ్‌అండ్‌ త్రో అన్నమాట. అలా ఆయన జీవితంలో వచ్చిన వైదేహి, ముంతాజ్‌, ప్రియ, రేవల్‌ అనే నలుగురు అమ్మాయిల్ని ప్రేమించేస్తాడు. అయితే ఎవ్వరినీ సరిగ్గా ప్రేమించడు. ఈ విషయం తెలిసి అందరూ అసహ్యించుకుంటారు. దాంతో ఆత్మహత్య చేసుకోవడానికి కెండెక్కుతాడు. సరిగ్గాఅక్కడే జీవితంలో రాకరాక వచ్చిన ఓ ప్రేమికురాలి చేతిలో మోసపోయిన వెంకట్‌ (పోసాని కృష్ణమురళి) కూడా వచ్చి ఆత్మహత్యచేసుకోవాలనుకుంటాడు. ఒకరినొకరు   తామెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో చెప్పుకుంటారు.  ఆ కథలు వెండితెరఫై  చూడాల్సిందే.

           సినిమాను తీయాలంటే యూత్‌ను ఎట్రాక్ట్‌ చేయడమే  లాజిక్కు. ఫ్యామిలీ చిత్రాలు తీసి పాసైనా కలెక్షన్లురాక ఇబ్బంది పడ్డానన్న లగడపాటి శ్రీధర్‌ ఇప్పుడు యూత్‌ను దృష్టిలో పెట్టుకుని 'పోటుగాడు' తీశాడు. మాతృక కన్నడ 'గోవిందాయ నమ:' చిత్రాన్ని చూసి అందులో 'ప్యార్‌మే పడిపోయా..' పాట నచ్చి చిత్రాన్ని తీయడానికి ముందుకు వచ్చాడంటే- అందులో ఏదో ఆకర్షణ ఉందనేగా.   కెరీర్ ప్రారంభం నుండీ చాలా ప్రయోగాలు చేసినా  మంచు మనోజ్‌కు సరైన సక్సెస్‌లేదు. అయితే 'పోటుగాడు' మాత్రం ఒక ఫార్ములా ప్రకారం మాస్‌ ప్రేక్షకుల కోసమే చేసారు కనుక, మంచి వసూళ్ళే  సాధించ వచ్చు . సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల  పెద్ద సినిమాల పోటీ  లేకపోవడం కూడా కలిసొచ్చింది.   ఎంటర్‌టైన్‌ మెంట్‌పేరుతో పాత్రకు తగ్గట్టు  ఎనర్జిటిక్‌గా మనోజ్‌ నటించాడు. మిగిలిన పాత్రల నిడివి పెద్దగా లేకపోవడంతో సినిమా అంతా  మనోజే కన్పిస్తాడు. దానితో ఒక్కోసారి విసుగు పుడుతుంది కూడా. అల్లరిగా తిరిగే వ్యక్తి- జీవితంలో ఎదురైన అనుభవంతో మళ్ళీ మంచివాడుగా మారడం అన్న పాయింట్‌ పాతదే అయినా... ప్రజెంట్‌ చేసే విషయంలో దర్శకుడు పవన్‌ కొత్తగా చేశాడు. రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా స్క్రీన్‌ప్లే మలిచాడు.                                           

       ఇది మనోజ్‌ ఒన్‌మేన్‌ షో. సినిమా మొత్తం మనోజ్‌ లేని సీన్‌ అంటూ ఉండదు. తన అతి నటనతో డాన్స్‌, ఫైట్స్‌ ఇరగదీశాడు.ఇందులో  మనోజ్‌, పోసాని పాత్రలే కీలకం. ఇద్దరూ చిత్రాన్నితమ  భుజాలపై మోసేశారు. హీరోయిన్లుగా చేసిన నలుగురు అమ్మాయిలు కొత్తవారే. వారిలో ఉన్నంతలో ముంతాజ్‌గా  నటించిన సాక్షి చౌదరి బాగుంది.   మిగిలిన పాత్రల్లో షిండే, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి పాత్రలు మోస్తరుగానే ఉన్నాయి. రాజేష్‌, గీతాసింగ్‌ పాత్రలు ఉన్న కొన్నిసెకన్లయినా కొద్దిగా నవ్వించే ప్రయత్నం చేశారు.అయితే , హీరో -హీరోయిన్ల మధ్య ప్రేమ ఏర్పడే సన్నివేశాలు రొటీన్ గా వున్నాయి . హీరోయిన్లతో  హీరో ప్రేమ ను ఎందుకు వాదులు కోవాల్సి వచ్చిందీ? చూపే కారణాలు కన్విన్సింగ్ గా లేవు . అనుభవం గల డైలాగ్  రైటర్‌ శ్రీధర్‌ సిపాన బాగానే రాశాడు. అక్కడక్కడా  కొన్నిడబుల్ మీనింగ్  మాస్  మసాలాలు వాడుకున్నాడు . దాంతో వాటిలో కొన్నింటికి  బీప్‌ సౌండ్‌లు వచ్చేశాయి. సంగీతపరంగా అచ్చు ఓల్డ్‌ఈజ్‌ గోల్డ్‌ తరహాలో పాత మెలోడీని రుచిచూపించాడు. 'ప్యార్‌లో పడిపోయానే..' అనే పాట వినడానికి చాలా బాగుంది.శ్రీకాంత్  ఫొటోగ్రఫీ బాగుంది. రోప్‌షాట్స్‌, రిస్కీషాట్స్‌లో మనోజ్  పనితనం బాగుంది .    -రవళి 

Friday, September 6, 2013

'తుఫాన్' చిత్ర సమీక్ష

                                          'తుఫాన్' చిత్ర సమీక్ష         2/5

                                      నిర్మాణసంస్థ: రిలయన్స్‌, లాఖియా సంస్థ... దర్శకత్వం: అపూర్వ లఖియా.

                           నటీనటులు: రామ్‌చరణ్‌, శ్రీహరి, ప్రియాంకచోప్రా, మహీగిల్‌, ప్రకాష్‌రాజ్‌,అతుల్ కులకర్ణి తదితరులు


       విదేశాలనుంచి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ వివాహంకోసం ముంబై వస్తుంది మాల (ప్రియాంకచోప్రా). వేడుక రాత్రి తిరిగి వెళుతుంటే ఓ చోట హత్యను కళ్ళారా చూస్తుంది. ప్రత్యక్షసాక్షిగనుక కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌చేస్తుంది.  చనిపోయింది డిప్యూటీకలెక్టర్‌ గనుక ఆ విషయాన్ని పోలీసు వ్యవస్థ సీరియస్‌గా తీసుకుంటుంది. అప్పటికే ఏదేళ్ళలో 22సార్లు ట్రాన్స్‌ఫర్లు కాబడ్డ విజయ్‌ఖన్నా (రామ్‌చరణ్‌) ముంబైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతారు. తన పరిధిలో కాబట్టి అతనికి కమీషనర్‌ కేసు బాధ్యతలు అప్పగిస్తాడు. ప్రత్యక్షసాక్షి గనుక మాలను కోర్టుకు రమ్మని విజయ్‌ఖన్నా ఆహ్వానించడంతో , చనిపోయిన పిల్లల సెంటిమెంట్‌తో ఆమె సహకరించడానికి అక్కడే ఉంటుంది. కేసులో భాగంగా కార్లను  మార్ట్‌గేజ్‌ చేసే షేర్‌ఖాన్‌ (శ్రీహరి)తో స్నేహం పెంచుకుంటాడు విజయ్‌ఖన్నా. అతని ద్వారా ఆయిల్‌ మాఫియా మూలవిరాట్‌ రుద్రప్రతాప్‌ తేజ (ప్రకాష్‌రాజ్‌)ను టార్గెట్‌ పెడతాడు ఎసీపీ. అయితే  తేజ వేసిన ప్లాన్‌తో ఏసీపీ సస్పెండ్‌ అవుతాడు. ఆ తర్వాత పోలీసు దుస్తులులేకుండానే   తేజను ఎలా మట్టుపెట్టాడు?  అనేది కథ.

       పోలీసు నేపథ్యంలో కథలు తెలుగు తెరకు కొత్త  కాదు. ఇదివరకు చాలానే వచ్చాయి. సమసమాజమే లక్ష్యంగా పోలీసు విధినిర్వహణలో పోరాటం చేయాలని  పోలీసు అధికారి  వాదిస్తుంటాడు. సంఘవిద్రోహశక్తులపై పోలీసు తన తూటాను ఎక్కుపెడుతుంటాడు. వారి మధ్య పోరాటం, సంఘర్షణ వంటి అంశాలతోనే ఆ సినిమాలు తెరకెక్కుతాయి. మధ్యలో సెంటిమెంట్‌ కోసం కొన్ని సన్నివేశాలు, ప్రేమ కోసం కథానాయికను ఉపయోగించుకుంటారు. నమ్మకద్రోహంకోసం పోలీసుల్లోనే ఓ వ్యక్తి సంఘవిద్రోహులకు తోడ్పాడు ఇవ్వడం అన్నీ మామూలే. అయితే ఒకప్పుడు ఇటువంటి కథను హిందీలో అమితాబ్‌ చేసి 'జంజీర్‌'తో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే కథను రీమేక్‌గా తీయడం సాహసమే. అందులోనూ పోలీసు అంటే పవర్‌ఫుల్‌గానూ, చక్కని శరీరధారుఢ్యం, ఎమోషనల్‌గా చూసిన కొన్ని పాత్రలను  రామ్‌చరణ్‌చేస్తే  ఎలా ఉంటుంది? అనేదే  ఇందులో కొత్తవిషయం.

      అపూర్వలాఖియా అనగానే బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలు గుర్తుకువస్తాయి. 'జంజీర్‌'కు రీమేక్‌ అనగానే ఏదో కొత్తదనం ఉంటుందని వెళ్ళంకానీ.. రామ్‌చరణ్‌ ఎలా చేశాడనే ఆసక్తి సహజం . 78లో అప్పటి ట్రెండ్‌కు తగినట్లు వున్న ఈ చిత్రాన్ని  చూసి, ఇప్పటి రామ్‌చరణ్‌ను అమితాబ్ తో  పోల్చలేరు. నేటి జనరేషన్‌కోసమే ఈ చిత్రాన్నిచాలా మార్పులతో  దర్శకుడు రీమేక్‌ చేసినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. కథలో నవ్యత కోసం ఆయిల్‌ మాఫియాను తీసుకున్నాడు.
     రొటీన్ కధతో , వెరైటీ  ట్విస్ట్‌లు లేకుండా... ఇప్పటి ట్రెండ్‌లో  ప్రేక్షకులను మెప్పించడం కష్టమే . ఏ ప్రత్యేకతలు లేని  ఈ చిత్రం ఎంతో అంచనాలను పెంచి...  చివరికి ప్రేక్షకులకు హింస నే మిగిల్చింది .  హిందీలో రామ్‌చరణ్‌ ప్రవేశ మంటూ .. ప్రచారాన్ని  ఉపయోగించుకున్నా...పరాజయాన్నే పొందారు .  రామ్‌చరణ్‌ ఏసీపీగా సరిపోయినా... కథానాయిక అతన్నిమించిన ఎత్తు ఉండడం ప్రధాన లోపంగా కన్పిస్తుంది. రామ్‌చరణ్‌  ఎమోషన్స్  అన్నీ పలికించినా ...ఎక్కడా ఫీల్‌ కలిగించలేదు . ఏదో డ్యూటీలో భాగంగా సీరియస్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడనే అనిపిస్తుంది. ప్రియాంక చోప్రా రొటీన్‌ అమ్మాయిలానే నటించింది. వాగుడుకాయలా ఆమె  కొత్తగా అన్పిస్తుంది. ప్రకాష్‌రాజ్‌, శ్రీహరి పాత్రలు ఇందులో కీలకం. షేర్‌ఖాన్‌ చిత్రానికి హెల్ప్‌ అయ్యేపాత్ర. అప్పట్లోప్రాణ్‌ పోషించిన పాత్రను శ్రీహరి చేశాడు.  హిందీలో సంజయ్‌దత్‌ చేశాడు. అయితే హిందీలో సంజయ్‌కు పాట ఉంది. ఇందులో లేదు.  చక్కటి  ట్విస్ట్‌ ఉన్న పాత్ర గనుక శ్రీహరికి మంచి మార్కులు పడ్డాయి. విలనిజంలో పలు షేడ్స్‌ చూపించే ప్రకాష్‌రాజ్‌ తన పాత్రని  అలవోకగా పండించాడు.  ఈ రెండు పాత్రలు మినహా చిత్రంలో చెప్పుకోవడానికి ఏమీలేదు.

      సీరియస్‌గా సాగే ఈ చిత్రంలో తెలుగువారికి కావాల్సిన హాస్యం లేకపోవడం   ప్రధాన లోపం. పంచ్‌ డైలాగ్‌ల పేరుతో కేవలం సన్నివేశపరంగా  రాసినవే. "భయంతో బతకవచ్చుకానీ, తప్పుచేశామని బతకడం కష్టం. అత్యాశలేనిదో ఎదిగే హక్కులేదు.. తుఫాన్‌ వస్తే తట్టుకోలేం.." వంటి డైలాగ్‌లు ప్రాసకోసం రాసినట్లు అనిపిస్తాయి. 'పోలీస్' అంటూ రామ్‌చరణ్‌ ఓ సన్నివేశంలో పలకడం... పేలవంగా అనిపించింది. వెంటనే 'పోకిరి'లో మహేష్‌బాబుఅన్న డైలాగ్‌ను థియేటర్లలో జనాలు గుర్తుచేసుకోవడం విశేషం. మరో సన్నివేశంలో .... ప్రియాంకచోప్రా రూమ్‌లోకి తన పోలీసుతో వచ్చిన రామ్‌చరణ్‌ను చూసి..."హోటల్‌ మేనేజర్‌వి.. పర్మిషన్‌ తీసుకుని రావాలని తెలీదా?" అని పలికిన డైలాగ్‌...కరెక్ట్‌గా సరిపోయిందనే కామెంట్లు విన్పించాయి. చంద్రబోస్‌ రాసిన  రెండు  పాటలు  సోసో సంగీతంతో   అంతగా ఆకట్టుకోలేదు. గురు రాజ్ ఫోటోగ్రఫీ పర్వాలేదు .                     -రవళి 

    

Tuesday, September 3, 2013

నువ్వు నువ్వుగా ఉండు! -శ్రీదేవి

నేనింకా పెళ్లి చేసుకోలేదు! -అంజలి

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు' సినిమాతో క్రేజ్ ను అమాంత పెంచుకున్న నటి అంజలి తనపై వచ్చిన పెళ్లి వార్తలను ఖండించింది. ఈ మధ్య అంజలి అదృశ్యం ఉదంతం వెనుక పెళ్లి జరిగిందనే వార్తలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొంది. 'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి సమయం వస్తే దాయాల్సిన అవసరం దేనికని'....

నిర్మాతగా ఏక్తాకపూర్‌ సంచలనాలు


బాలీవుడ్ లో నిర్మాతగా రాణించడం అంటే ఈజీ కాదు. వందల కోట్ల పెట్టుబడి పెడుతుంటారు. ఏదైనా తారుమారు అయితే కోట్లలో నష్టం చవిచూడాల్సి వస్తుంది. జితేంద్ర కూతురిగా నిర్మాణ రంగంలో అడుగుపెట్టినా త్వరలోనే తన ముద్రను వేసుకుంది. సీరియల్స్‌ను నిర్మించడంలో రాణించి తరువాత సినీ రంగంవైపు అడుగులు వేసింది. ఈమె నిర్మించిన పలు సీరియళ్లు తెలుగులోనూ డబ్బింగ్‌ అయ్యాయి . ఇక తెలుగు నటీమణి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా నిర్మించిన 'ది డర్టీ పిక్చర్' ను ప్రేక్షకులు ఎప్పుడూ....

సిద్ధార్థ్, సమంత రహస్య వివాహం?

గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారిన సమంత, సిద్ధార్థల ప్రేమ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ఈసారి వారిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిపోయినట్లు కొన్ని తమిళ పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. సమంత, సిద్ధార్థల కుటుంబ సభ్యులతో పాటు, పరిమిత బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగిట్లు ఆ పత్రికలు పేర్కొన్నాయి. సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని....

దీపిక కెరీర్‌ను మార్చేస్తుందట!

ఈ ఏడాది దీపికా పడుకోనే కెరీర్ యమ జోరు మీదుంది. వరుసగా 'యే జవానీ హై దీవానీ', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలతో ఇటు ప్రేక్షకుల్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించింది. అయితే ఆమె బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా బయటకు రాలేదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. రాబోతున్న 'రామ్ లీల' సినిమా రషెస్ చూసినవాళ్లు ఇప్పటివరకూ ఆమె అత్యుత్తమ అభినయం ....

నన్ను బలిపశువును చేయకండి:పూనమ్ పాండే