RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, March 30, 2011

నూతన ప్రసాద్ మృతి

ప్రముఖ సినీనటుడు నూతన్ ప్రసాద్(61) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుక్రితం డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. 1973లో 'అందాల రాముడు'చిత్రంతో తెరంగేట్రం చేసిన నూతన్ ప్రసాద్......

యువతకు చేరువచెయ్యడమే లక్ష్యం! - దూరదర్శన్ డైరెక్టర్ శైలజా సుమన్

సుమారు 28 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఆకాశవాణి, దూరదర్శన్ లకు సేవలందించి ప్రతిభ ఆధారంగా డైరెక్టర్ స్థాయికి ఎదిగినట్లు గర్వంగా చెబుతున్న శైలజ మహిళలు స్వశక్తితో ముందుకు సాగేందుకు ప్రభుత్వ తోడ్పాటు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండే మార్కెటింగ్ రంగంలో సైతం ఎనిమిదేళ్లు పనిచేసి సంస్థకు లాభాల నార్జించి పెట్టడమే కాకుండా నాలుగు సార్లు మార్కెటింగ్ లో జాతీయస్థాయి ఉత్తమ అవార్డులను......

Sunday, March 27, 2011

రెహ్మాన్‌ బయోగ్రఫీ... 'స్పిరిట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌'

ఎ.ఆర్‌.రెహ్మాన్‌ జీవితంలోని ఆయా దశలు, వివిధ సంఘటనలు తెలుసుకుసుకునేందుకు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ ద స్పిరిట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ పుస్తకాన్ని రాశారు నస్రీన్‌ మున్నీ. మొజార్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌గా పేరు గాంచిన రెహ్మాన్‌ బయోగ్రఫీ పుస్తకాన్ని వచ్చేనెల 6వ తేదీన ప్రముఖ సినీ దర్శకులు మణిరత్నం విడుదల చేయనుండడం విశేషం. ‘రెహ్మాన్‌ బయోగ్రఫీ పుస్తకాన్ని పబ్లిష్‌ చేసేందుకు అవకాశం రావడం మాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాము. మ్యూజిక్‌ మాస్ట్రోగా రెహ్మాన్‌ ఎదిగిన తీరు......

అమెరికాలో ఏంజిలీనా జోలి విగ్రహం

హాలీవుడ్‌ నటీమణుల స్టైలే వేరు. వారంతా కొత్త, కొత్త హాబీలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సినిమాల్లో వారు చక్కటి గ్లామర్‌, నటనతో అందరినీ మురిపిస్తారు. బయట ప్రపంచంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పాపులారిటీ సంపాదిస్తారు. ఇటువంటి హాలీవుడ్‌ నటీమణి ఏంజిలీనా ఆమె పాపులారిటీ ఎంతటిది అంటే ఏకంగా ఏంజెలీనా విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించారు అభిమానులు. అయితే నటీమణుల విగ్రహాలను ప్రతిష్టించడం మాత్రం అమెరికాలో కొత్త ప్రయోగంగా.......

Thursday, March 24, 2011

శ్రీకాంత్ 'విరోధి'

శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా లోగో లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నిన్నటికి సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమాను ఎక్కువగా ఔట్ డోర్ లో చేశాము. ఆర్టిస్టులందరూ బాగా సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమాకు మంచి సంగీతం.......

ఎలిజబెత్ టేలర్ ఇక లేరు

అందచందాలతో, నటనా వైదుష్యంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన హాలీవుడ్ కలలరాణి ఎలిజబెత్ టేలర్ (79) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండెకు సంబంధించిన అస్వస్థతతో బాధపడుతూ, రెండు నెలల కిందట లాస్ ఏంజెలిస్‌లోని సెడార్స్-సినాయ్ ఆస్పత్రిలో చేరిన ఆమె, ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు గల ఎలిజబెత్ టేలర్ బాలనటిగా రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘకాలం నటనా రంగంలో కొనసాగిన ఆమెకు మూడుసార్లు ఆస్కార్........

Tuesday, March 22, 2011

లక్స్ డ్రీం గర్ల్ కాంటెస్ట్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, స్ప్రింట్ టెలీఫిలిం లిమిటెడ్ వారు మెగా రియాలిటీ షో ‘లక్స్ డ్రీమ్ గర్ల్ కాంటెస్ట్’ను మూడు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నాము. ఏప్రిల్ 16 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది. 16 ఎపిసోడ్ల ఈ ఈవెంట్ కు ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో అథితి సినిమా పరిశ్రమ నుండి వస్తారు. ఏప్రిల్ ఒకటి నుండి ఈ సెలక్షన్స్......

గుర్తుండి పోయే సినిమాలు రెండు చేసినా చాలు : రానా

నిరాశపర్చను’....యువకథానాయకుడు సుశాంత్‌.

‘సంవత్సరం గ్యాప్‌ అభిమానులను నిరాశపర్చింది. అందుకు సారీ. ఈసారి ఓ మంచి అవకాశంతో చాలా సంతోషంగా ఉన్నా. అష్టాచెమ్మా, గోల్కొడ హైస్కూల్‌ -లాంటి హిట్లిచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేస్తున్నా. కొత్త ప్రాజెక్టుతో నాలోని ప్రతిభను పూర్తిస్థాయిలో దర్శకుడు వెలికితీస్తారని ఆశిస్తున్నా. విభిన్నమైన సినిమా ఇది. నిరాశపర్చను......

పోటీ పడుతున్న అందాల నాయికలు


సంవత్సరన్నరకాలంగా సినిమా లేకపోయినప్పటికీ ఇలియానా రెమ్యూనరేషన్‌ ఒకటి నుంచి రెండు కోట్లు పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మిగతా హీరోయిన్లు ఎంత తీసుకుంటున్నారు? అనేది చర్చనీయాంశమవుతోంది.
తెలుగుతోపాటు, తమిళంలోనూ మార్కెట్‌ కలిగి, హిందీ ప్రేక్షకులకు కూడా ఓ మోస్తరు పరిచయం కలిగిన త్రిష కోటి రూపాయల లోపు తీసుకుంటుండగా, తెలుగు తప్ప మరో భాషలో ఏమాత్రం మార్కెట్‌ లేని ఇలియానాకు ఎందుకంత ఇస్తారు?......

Saturday, March 19, 2011

నిరాశ పరచిన' దొంగల ముఠా' ..'.రాజ్ '......ప్రపంచ కప్ క్రికెట్ ప్రభావం

రాంగోపాల్ వర్మ 5 రోజుల్లో తీసిన ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది . అయితే- ఒక్క ఆట ఆడినా విజయమే నంటూ వర్మ చేసిన ప్రకటన ....చెప్పిన లెక్కలు పక్కన పెడితే - ఒక సినిమా గా ' దొంగల ముఠా' పరాజయాన్నే పొందింది . సుమంత్ హీరోగా దర్శకులను మార్చి తీసిన' రాజ్' కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది . విడుదల సమయంలో ఆసక్తి కలిగించేందుకు చేసిన 'ముద్దు' ప్రచారం కూడా......

శోభన వజ్రం వంటిది : కమల్

క్లాసికల్‌ నాట్యం నేర్చుకున్న శోభనని డ్యాన్సింగ్‌ క్వీన్‌ అని కూడా అంటారు. నటిగా చిత్రాల్లో నటిస్తూనే నాట్య ప్రదర్శనలకూ ఎక్కువ సమయం ేకటారుుస్తున్నారు. 1994 కళార్పణ అనే డ్యాన్స్‌ స్కూల్‌ని చెన్నైలో ప్రారంభించి, ప్రతి ఏడాదీ డ్యాన్స్‌ ఫెస్టివల్స్‌ని భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తుంటారామె.. ’చంబరి’్త చిత్రంలో 1972లో నటిగా ెకరీర్‌ ప్రారంభించి.......

Friday, March 18, 2011

యువ కళావాహిని మీడియా డైరెక్టరీ ఆవిష్కరణ

యువ కళావాహిని వ్యవస్థాపకుడు వై.కె.నాగేశ్వరరావు తనయుడు గురుప్రసాద్ స్మృత్యర్థం ప్రతి ఏటా రూపొందించే మీడియా డైరెక్టరీ ఆవిష్కరణ సభ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేచిన మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ 201011 ను ఆవిష్కరించి ప్రసంగించారు. కళా, సాంస్కృతిక రంగాలతో పాటు వివిధ రగాలనెంచుకుని సమాజసేవ చేస్తున్న పలువురు ప్రముఖుల వివరాలను పొందుపరుస్తూ.......

‘ప్లీజ్ వినద్దు’ అంటున్న అశ్విన్

యాప్ ల్యాబ్స్ లో వైస్ ప్రసిడెంట్ ని. వీకెండ్స్ లో మ్యూజిక్ చేస్తుంటాను. ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ.
ఇంతకు ముందు ‘నువ్వో కల’ అనే ఆల్బమ్ చేశాను. దాని ద్వారా వచ్చిన అనుభవంతో ఈ ఆల్బమ్ చేశాము. ఇందులో 9 పాటలున్నాయి. ప్రతి పాటలో ప్రేమ ఉంటుంది. అయితే ప్రేమ అనేది వివిధ అంశాల మీద ఉంటుంది. ఈ ఆల్బమ్ కు ఈ పేరు పెట్టడానికి కారణం ఆకర్షించడం కోసమే. నేను సంగీతం ఎక్కడా నేర్చుకోలేదు.
ఈ ఆల్బమ్ చేయడానికి ఒక ఏడాది పట్టింది. ఇప్పటికే రెండు వేల ఐదు వందల.......

Wednesday, March 16, 2011

రాష్ట్రవ్యాప్తంగా క్యాంపస్ ఫిలిం క్లబ్ లు

ఆధునిక యువత ముఖ్యంగా విద్యార్థులు సమాజంపై దుష్ప్రభావం చూపే కార్యక్రమాలు చూస్తూ వ్యసనాల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి ధోరణి నుంచి నవ సమాజాన్ని రక్షించడమే కాకుండా వారిలో సృజనాత్మకత శక్తిని పెంచుతూ ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సృజన, కళలు, సందేశాత్మక, పర్యావరణం, విద్యాపరంగా గుణాత్మక విజ్ఞానం అందించే మంచి సినిమాలు చూపించి విద్యార్థులను తీర్చిదిద్దాలని.....

రెంటాల జయదేవ కు డాక్టరేట్

పత్రికా రచనా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టు, రచయిత రెంటాల జయదేవ తాజాగా డాక్టరేట్ పట్టా పొందారు. జర్నలిజంలోనూ, తెలుగులోనూ రెండు ఎం.ఏ.లు చేసిన ఆయన దాదాపు తొమ్మిదేళ్ళు శ్రమించి, తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి పూర్తి చేశారు. మార్చి 5వ తేదీ శనివారం చైన్నలో జరిగిన ‘మద్రాసు విశ్వద్యాలయం’ స్నాతకోత్సవంలో ఆయనకు పట్ట ప్రదానం జరిగింది. విశ్వవిద్యాలయం 153వ వార్షిక స్నాతకోత్సవం.....

Saturday, March 12, 2011

సెక్సీ అంటేనే ఇష్టం!

నన్ను సెక్సీ అని పిలవడం ఇష్టమే. అయితే అదే సమయంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి సమాంతరంగా కష్టించానన్న సంగతి గుర్తు తెచ్చుకోవాల్సిందే. నా విషయంలో జనం తొలుత నా పనినే గుర్తించారు. తర్వాత నెమ్మదిగా దేహాకృతి, అందం గురించి ప్రస్తావించడం మొదలెట్టారు. నా వరకూ.. ఓ మంచి నటి అని గుర్తింపు తెచ్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తాను. అయినా ఇప్పుడంతా ప్రెట్టీ, సెక్సీ, హాట్, పవర్ ఫుల్......

కరీం నగర్ , విజయవాడల్లో ...' లఘు చిత్ర ఉత్సవాలు '

కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్వర్యంలో ' పాల పిట్ట డాకుమెంటరీ -షార్ట్ ఫిలిం ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు . ఆసక్తి గలవారు నాగ భూషణం : 9885462052 ని సంప్రదించవచ్చు. విజయవాడలో 'షార్ట్ ఫిలిం ఫెస్టివల్' ఉగాది పురస్కారాలు పేరుతో జాతీయ స్థాయిలో ' లఘు చిత్ర ఉత్సవాలు ' ఏప్రిల్ 2 నుండి నిర్వహిస్తున్నారు . వివరాలకు ....www. sffvja.blogspot.com చూడవచ్చు .......

Tuesday, March 8, 2011

జెనీలియా కూడా ' బికినీకి రెడీ' అంటోంది

అల్లువారి పెళ్లి సందడి

Wednesday, March 2, 2011

అవసరం కొద్దీ భరిస్తున్నారు :prakashraj

ఆత్మ విశ్వాసాన్ని అహంకారంగా భావించవచ్చు. వాళ్లు ఏదనుకుంటే దానికి ఓకే. కానీ నాది అహంకారమని భావించను. వాళ్ల అవసరాన్ని బట్టి నన్ను భరించే స్థితి వాళ్లకి ఉంది. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ల తప్పులూ ఉంటాయి. నా తప్పులూ ఉంటాయి. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. అలాగని ఉరిశిక్ష కాదు కదండి. వివాదం నా ఇంటిపేరు. అయినా వాటిని నేను సీరియస్‌గా......

విశాఖ కృష్ణాకాలేజీలో 'సృజన ఫిలిం క్లబ్' ప్రారంభం

విశాఖపట్నం వి.యస్.కృష్ణా కాలేజీలో 19 న 'సృజన ఫిలిం క్లబ్' ప్రారంభం అయ్యింది. ‘ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ కార్యదర్శి వారాల ఆనంద్ ఈ ఫిలిం క్లబ్ ను ప్రారంభించి మాట్లాడుతూ -విజువల్ మీడియాను కెరీర్ గా మలచుకునే వారికి ఈ క్లబ్ చాలా ఉపయోగపడుతుందని, సమాజంలో మార్పులకు సినిమా ఎలా దోహదపడుతోందో అంతర్జాతీయ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు. కాలేజీ ప్రిన్సిపాల్ డా.మూర్తి, విశాఖ ఫిలిం సొసైటీ గౌరవ కార్యదర్శి నరవ ప్రకాశరావు.......

Tuesday, March 1, 2011

‘బ్రదీనాథ్’లో నేను సమురాయ్ :అల్లు అర్జున్

‘బద్రీనాథ్’లో మరోసారి మాస్ పాత్రలో నటిస్తున్నా. తమన్నా కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకుడు. ఓ చారిత్రక కథాంశం వున్న సినిమా అని అనుకుంటున్నారంతా. అది నిజంకాదు. ఒకానొకప్పటి దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నా రోల్ ఇండియన్ సమురాయ్. కత్తి, డాలు గిరగిరా తిప్పుతాను, ఫైట్లు అలరిస్తాయి. బాగా వర్క్ అవుట్ అయ్యే సినిమా ిది. సమురాయ్ గా నన్ను ప్రేక్షకులు ఖచ్చితంగా.....

ఆస్కార్‌ ఉత్తమ చిత్రం 'ది కింగ్స్‌ స్పీచ్‌'

'ది కింగ్స్‌ స్పీచ్‌' చిత్రానికి నాలుగు ఆస్కార్‌ పురస్కారాలు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఈ చిత్రం అవార్డుల్ని కైవసం చేసుకొంది. నత్తి ఉన్న జార్జ్‌-6 తన సమస్యను అధిగమించడానికి చేసిన ప్రయత్నమే ఈ చిత్రకథ. ఆస్ట్రేలియన్‌ స్పీచ్‌ థెరపిస్టు సాయంతో ఆయన ఎలా తన మాటను పునరుద్ధరించుకున్నాడో తెలిపే కథాంశాన్ని హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు టామ్‌ హూపర్‌. ఈ సినిమాలో కథానాయకుడిగా నటించిన కోలిన్‌ ఫర్త్‌ ఉత్తమ నటుడిగా......