RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Tuesday, February 28, 2012

విద్యా బాలన్ ఎర్ర చీర కావాలని పట్టుబట్టిందట


'ది డర్టీ పిక్చర్' సినిమా విద్యాబాలన్‌లోని మరో కోణాన్ని చూపింది. అయితే ఆ సినిమా ఆమెలో మూఢనమ్మకాలనూ పెంచింది. ఆ చిత్రంలో ఎర్ర రంగు దుస్తులు ధరించి ప్రేక్షకులను మైమరిపించిన విద్యా ఎక్స్‌పోజింగ్ విషయంలో అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కొంది. తన తాజా చిత్రం ‘ఫెర్రారీ కీ సవారీ’లో ఐటమ్ సాంగ్ చేస్తున్న విద్యా బాలన్ ఆ పాట కోసం ఎర్ర రంగు చీర కావాలని పట్టుబట్టిందట. ది డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో అదరగొట్టిన 33 ఏళ్ల విద్యా బాలన్ విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ వారి ‘ఫెర్రారీ కీ సవారీ’లో ‘మాలా జావు ద్యా నా ఘారీ’ అంటూ ఐటమ్ సాంగ్‌లో...

ఫీల్‌గుడ్ మూవీ ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’...చిత్ర సమీక్ష...

పరాయి దేశాలలో నివశించే భారతీయుల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి సగటు సినిమా ప్రేక్షకుడిలో ఉండటం సహజం. అది ఇవాళ్టిది కాదు, అందుకనే విదేశాలలో స్థిరపడిన తొలితరం తెలుగువాళ్ళు తమ జీవనవిధానాన్ని, తాము కోరుకుంటున్న తెలుగుదనాన్ని, ఆశిస్తున్న భారతీయతలను సినిమాల రూపంలో తెలియ చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా అనేది కళాత్మక వ్యాపారం కాబట్టి ఈ చిత్రాలలో ప్రేమనూ మిళితం చేశారు. ఇలా వచ్చిన చిత్రాలు ఘన విజయాలను సొంతం చేసుకోకపోయినా, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమా మాధ్యమం ద్వారా తమ భావాలను, తమ వారి భావాలను వ్యక్తం చేయాలని తహతహలాడే ఎన్నారైలు కొందరైతే, తమలోని ప్రతిభను పదిమందికీ....

Monday, February 20, 2012

ఆరు గ్రామీలు గెల్చిన అడెలే

ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌.. బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌.. రికార్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌.. సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌.. బెస్ట్‌ షార్ట్‌ ఫామ్‌ మ్యూజిక్‌ వీడియో.. బెస్ట్‌ పాప్‌ సోలో పెర్‌ఫార్మెన్స్‌.. పోటీ పడ్డ ఆరు విభాగాల్లో గ్రామీలు దక్కించుకుంది అడెలె. పాప్‌ సంగీత చరిత్రలో ఇలా జరగడం రెండోసారి మాత్రమే. తొలి గీత గుచ్ఛం '19'కి పధ్నాలుగు ప్లాటినమ్‌ డిస్క్‌లు బద్ధలయ్యాయి. రెండో ఆల్బమ్‌ '21'. అంతకు మించి విజయం. మొదటి వారంలో 208,000, ఏడాదిలో 35.5 మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి. 18 దేశాల్లో నెంబర్‌వన్‌ ఆల్బమ్‌గా నిలిచింది. ఇవన్నీ ప్రపంచ రికార్డులే.....

శింబు, నయనతార మళ్లీ కలసి నటింప చేసే ప్రయత్నాలు


మాజీ ప్రేమికులు శింబు, నయనతార మళ్లీ కలసి నటిస్తారా? ప్రస్తుతం కోడంబాక్కమ్‌లో వేడి వాడి చర్చ ఇదే. ఒకప్పుడు వీరిద్దరూ డీప్ లవర్స్. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. శింబు, నయనతార కలిసి వల్లవన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలోని రొమాన్సింగ్ సన్నివేశాలకు సినీ విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు. అంత గాఢమైన ప్రేమ ఆ తరువాత బెడిసి కొట్టింది. దీంతో నయనతార కొంతకాలం కోలీవుడ్ పక్కకే రాలేదు. ఆ తరువాత విజయ్ సరసన విల్లు చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా  ...

Saturday, February 18, 2012

ఇప్పనపల్లి హరికిషన్ కు సన్మానం


                                                 
 
                                                      ఇప్పనపల్లి హరికిషన్ కు సన్మానం

ఇటీవల హైదరాబాద్ వచ్చిన   ప్రవాసాంధ్ర  ప్రముఖులు ఇప్పనపల్లి హరికిషన్ ను ఇంటర్ నేషనల్  ఇన్సిట్యూట్  ఆఫ్ తెలుగు కల్చర్ -యువకళావాహిని సంస్థలు   నిజం క్లబ్ లో సన్మానించాయి. సారిపల్లి కొండల రావు, బాపురెడ్డి , గజల్ శ్రీనివాస్, దీక్షిత్, సాయి చంద్, యం.వెంకటేశ్వర్లు, వై.కే.నాగేశ్వరరావు ,వి.కే.దుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Friday, February 17, 2012


                                                            ' నిప్పు' చిత్ర సమీక్ష         2.25/5     
                      బొమ్మరిల్లు పతాకం ఫై గుణశేఖర్ దర్సకత్వం లో వై .వి.యస్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సూర్య - శ్రీ  ప్రాణ మిత్రులు.   శ్రీ పుట్టిన రోజు  వేడుకల కోసం  సూర్య  మిత్ర బృందం  సౌదీ  అరేబియా వెళ్తుంది. అక్కడ  శ్రీ  ప్రేయసి  వైష్ణవి  ప్రమాదవశాత్తు చనిపోతుంది. అయితే ఆమెను  శ్రీ హత్యచేసినట్లు భావించి   అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. శ్రీ కి వురి శిక్ష విధిస్తారు. ఆ శిక్ష నుండి అతను  తప్పించుకోవాలంటే  చని పోయిన వైష్ణవి  తల్లి దండ్రులు శ్రీ ని  క్షమించినట్లు  రాసివ్వాల్సి వుంటుంది. గూండా సామ్రాజ్యానికి  నాయకుడైన  వైష్ణవి తండ్రి  రాజా గౌడ్ అరాచకాలను ఎదిరించి , అప్పటికే సూర్య అతనితో  శత్రుత్వం కొనితెచ్చుకుని ఉంటాడు. అయినప్పటికీ మిత్రుడు శ్రీ ప్రాణాలు కాపాడటం కోసం ...రాజా గౌడ్ నుండి క్షమాపణ సంతకం తీసుకోవడానికి సూర్య ప్రయత్నం ప్రారంభిస్తాడు. శ్రీ కుటుంబ సభ్యులకు విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ,తను ప్రేమించిన శ్రీ చెల్లెలు మేఘన కు మాత్రమే సూర్య  జరిగింది చెబుతాడు.  రాజా గౌడ్ ను ప్రసన్నం చేసుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా పట్టు వదలని సూర్య తను అనుకున్నది ఎలా సాధించాడనేదే ఈ చిత్ర కధాంశం .
          మాస్ చిత్రాల హీరో రవితేజ తో   ఫ్లాప్ చిత్రాల దర్శకులు నిర్మించిన ఈ చిత్రం పట్ల  మొదటి నుండీ అందరికి సందేహాలున్నాయి. చిత్రం చూసాక వారి సందేహాలే నిజమయ్యాయని అనిపిస్తుంది. రవి తేజ సినిమా అంటే పూర్తి వినోదాత్మకం గా వుండాలని  ప్రేక్షకులు ఆశిస్తారు. ఈ చిత్రం లో వారు ఆశించినంత వినోదం లేకపోవడం తో పాటు, కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పరిచింది.  రౌడీ గ్యాంగులు ...వాళ్ళతో హీరో ఫైట్లు మనం చాలా సినిమాల్లో చూసినవే .వాటితోపాటు ఇందులో హీరో కంటైనర్ ఫై బైక్ నడపడం...గేటు ఫై నుండి  బైక్ తో జంప్  చేయడం వంటి  కనల్ కన్నన్  స్పెషల్  విన్యాసాలు కూడా చేసి చిరాకు  కలిగించాడు.  శ్రీ  ప్రేయసి  వైష్ణవి   సౌదీ  అరేబియాలో అన్ని అంతస్తుల భవంతి ఎక్కి మరీ ...పరుగెడుతూ  పడి, ప్రాణాలు పోగొట్టుకోవడం నమ్మేవిధంగా లేదు.  శ్రీ ప్రాణాలు కాపాడటం కోసం ...రాజా గౌడ్ నుండి క్షమాపణ సంతకం తీసుకోవడానికి సూర్య చేసిన  ప్రయత్నాలు కూడా సహజత్వానికి దూరంగా వున్నాయి.  చాలా సినిమాలకి  ప్రధాన ఆకర్షణ అయిన  బ్రహ్మానందం  కామెడీ  ఈ చిత్రం లో మాత్రం పెద్ద ఇబ్బంది గా మారింది. ఒక్కో పాట ఒక్కొక్కరితో రాయించినా,  మంచి లోకేషన్స్ లో బాగా చిత్రీకరించినా... తమన్ సంగీతం లో పాటలు ఇంకాస్త బాగుంటే  సినిమాకి ఉపకరించేవి.  టి.వి 9 లో రాజా గౌడ్ ను పరిచయం చెయ్యడం, రెస్టారెంట్ లో ఫైట్ వంటివి బాగున్నాయి.
               ఈ చిత్రం లో రవి తేజ ఒక్కడే  ప్రధాన ఆకర్షణ . ఎప్పటిలానే  శక్తివంతం గా సూర్య  పాత్రకి  న్యాయం చెయ్యడానికి కృషి చేసాడు. ఇటీవల చిత్రాల కన్నా అందం గా కూడా కనిపించాడు. దీక్షా సేథ్ విగ్రహం బాగున్నా
విషయం లో ఇంకా వెనుకబడే వుంది.  శ్రీ పాత్రలో శ్రీరాం చిన్న పాత్ర బాగా చేసాడు.అతని ప్రేయసి వైష్ణవి  గా భావన , మరో సన్నివేశం లో దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారి కనిపించి వెళ్ళారు. శ్రీ తండ్రిగా  రాజేంద్ర ప్రసాద్ బాగానే చేసినా ,అతన్నీ...కృష్ణుడిని  బాగా వాడుకోలేదని అనిపిస్తుంది. లావు తగ్గిన భరత్ ని  చూడ లేకపోయాము. ప్రదీప్ రావత్, ముకుల్ దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్, ధర్మవరపు, సి.వి.యల్, ప్రగతి, సురేఖ వాణి,  వినయ్ వర్మ, గీతా సింగ్ , శకుంతలఈ చిత్రం లోని ఇతర పాత్రలు పోషించారు. శ్రీధర్ సీపాన సంభాషణలు, సర్వేష్ మురారి ఫోటో గ్రాఫి,
గౌతం రాజు ఎడిటింగ్  బాగున్నాయి                                                                                                                                -రాజేష్               


షారుఖ్ ఖాన్ బ్రాండ్‌ అంబాసిడర్‌ వివాదం

పశ్చిమబెంగాల్కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆమోదం తెలిపారు. ఈ నియామకంపై కొద్దిపాటి నిరసన ధ్వనులూ వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ను తాను అభిమానిస్తున్నందువల్లే, ఢిల్లీ, జైపూర్ లాంటి జట్లను కాదని కోల్కతా నైట్ రైడర్స్ను కొనుగోలు చేసినట్లు షారుఖ్ తెలిపారు. ఆయన నియామకం వివిధ రాష్ట్రాల మధ్య సరికొత్త ‘బ్రాండ్ల’ పోరాటానికి తెర తీయనుంది. ఇప్పటికే అమితాబ్ గుజరాత్కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. మరెన్నో రాష్ట్రాలు ఈ పోరాటంలో తల దూర్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.దేశంలో రాష్ట్రాల మధ్య సరికొత్త యుద్ధం మొదలైంది. నిజానికి ఈ తరహా ట్రెండ్ కొన్నేళ్ళ క్రితమే మొదలైన ప్పటికీ ఇప్పటికి....

రాజకీయాల్లోకి జెనీలియా

‘జెనీలియా పాలిటిక్స్‌లోకి రాబోతున్నారు. వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మామ విలాస్‌రావు దేశ్‌ముఖ్ తరఫున జెన్నీ ప్రచారంలో పాల్గొనబోతున్నారు’’. బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఇది. ఈ పాలిటిక్స్ సెగ జెన్నీని అంటుకోవడానికి కారణం ఆమె మాజీ ముఖ్యమంత్రి కోడలు కావడమే అని పలువురు బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జెనీలియాని అడిగితే- ‘‘రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? అదేం నేరం కాదే. అయినా ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించే స్థితిలో లేను. నేను పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. నా ఇంటికోసం, నావారి కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే తప్పకుండా...

Tuesday, February 14, 2012

అఖిల్ కు నటించాలని వుంది.... నాగార్జున చైనీస్ రెస్టారెంట్


అక్కినేని కుటుంబం నుండి మరో హీరో రాబోతున్నాడు అనే వార్త త్వరలోనే వినబోతున్నాం. అక్కినేని నాగార్జున గారి చిన్న కొడుకు అఖిల్ ఒక ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ- తనకు సినిమాల్లో నటించాలని ఉందని మనసులో మాటని తెలిపాడు. తన ఇంటి పేరు వల్ల, ఇటీవల సిసిఎల్ లో తన ప్రదర్శన వల్ల తనని అందరు గుర్తిస్తున్నారని తనని తను నిరూపించుకుంటానని అన్నాడు. ప్రస్తుతం తాను అమెరికాలో బిబిఎ చేస్తున్నట్లు అది పూర్తయిన తరువాత...

టాప్‌ 50 హీరోయిన్లు, సెలెబ్రెటీలు, మోడల్స్‌

లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, మీసాలు ఉన్నా, లేకపోరుునా...సినిమా రంగంలో హీరోలకు సంబంధించి ఇలా ఎన్నో అంశాలను ప్రేక్షకులు తేలిగ్గా తీసుకున్నారు. హీరోరుున్ల విషయానికి వస్తే మాత్రం అందానికి, ఆకట్టుకునే రూపానికీ పట్టం కట్టారు. తెల్లగా లేకపోరుునా, ఛామన ఛాయలో ఉన్నా ముఖంలో కళ ఉంటే అమితంగా ఆదరించారు. మరి ఇలాంటి హీరోరుున్లు, మోడల్స్‌, సెలబ్రెటీలు పదుల సంఖ్యలో ఉన్నారు. వారిలో వీక్షకులు పట్టం కట్టిందెవరికి? ఆ విశేషాలపై ....

Sunday, February 12, 2012

'ఋషి'... 'ధోని '... ‘ఎస్‌ఎంఎస్‌’... ఇలా వున్నాయి


వైద్య వృత్తినే దైవంగా భావించే ఓ యువకుని కథతో రాజ్‌మదినేని దర్సకత్వం లో ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌నిర్మించిన 'ఋషి' కి మంచి చిత్రం అని, క్లాస్ చిత్రమని టాక్ వచ్చింది. ...పిల్లలు, తల్లిదండ్రుల ఆలోచనల మధ్య ఉన్న వ్యత్యాసాలతో ప్రకాష్ రాజ్ దర్సకత్వం లో నిర్మించిన' దోని' మధ్యతరగతి కుటుంబాల మనస్థత్వాలను అడ్డం పట్టిందని అంతా ప్రశంసిస్తున్నారు. సుదీర్ హీరో గా పరిచయ మవుతూ...

సమాజంలో విలన్లే సినిమాల్లో హీరోలు

అప్పటితరం హీరోకి ఇప్పటితరం హీరోకి ఎంత తేడా...పౌరాణికమైనా, జానపదమైనా...సాంఘీకమైనా కథానాయకుడికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, హీరోయిజం చూపించడానికి శత్రువులను, దుర్మార్గులను తన కండబలంతో, బుద్దిబలంతో దారిలోకి తేవడం, హీరోయిన్‌ అభిమానాన్ని పొందడం, అన్నింటికీ మించి చెదరని క్రాఫ్‌, నలగని డ్రెస్‌, నున్నగా గీసిన గడ్డం...చూడగానే బుద్దిమంతుడు అనిపించేలా ఉండాలి. అవన్నీ 1990 సంవత్సరానికి ముందు మాట. అయినా అడపాదడపా కొందరు హీరోలు ఇటువంటి ప్రయోగాలు చేసి ...

Sunday, February 5, 2012

‘భట్టి విక్రమార్క’గా బాలకృష్ణ ?... జర్నలిస్టుగా పవన్‌ కళ్యాణ్‌?


బేతాళుడు-విక్రమార్కుడు కథల గురించి మన చిన్నప్పుడు చందమామపుస్త్తకాల్లో చదువుకు న్నాం. ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగే ఈ కథలను పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ త్వరలో ఓ సోషియా ఫాంటసీ చిత్రంలో నటించబోతున్నారని, ఈ చిత్రం బేతాళ-విక్రమార్క కథల ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం 1960లో వచ్చిన సీనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా ‘భట్టి విక్రమార్క’ సినిమాను ....

మంచి కథ దొరికితే ఏ హీరో తో అయినా...

Saturday, February 4, 2012

కే .వి.రెడ్డి అవార్డ్ అందుకున్న కోదండరామిరెడ్డి

కే .వి.రెడ్డి  అవార్డ్  అందుకున్న కోదండరామిరెడ్డి
'జగదేక దర్శకుడు'  కే.వి.రెడ్డి అవార్డ్ తో  పాతికేళ్ళుగా ప్రముఖ దర్శకులను గౌరవిస్తున్న ' యువకళావాహిని'   కే. వి. రెడ్డి  శత జయంతి సందర్భం గా  కోదండరామిరెడ్డి ని ఈ అవార్డ్ తో సత్కరించింది. రవీంద్రభారతిలో ఫిబ్రవరి 3 న జరిగిన ఈ కార్యక్రమం లో అక్కినేని నాగేశ్వర్ రావు చేతుల మీదుగా కోదండరామిరెడ్డి ఈ అవార్డ్ స్వీకరించారు.   కే.వి.రెడ్డి  ప్రాణం పోసిన  ప్రతి చిత్రం నవతరం దర్శకులు,నటులకు   'వేదం' వంటిది. కే.వి.రెడ్డి వంటి గొప్ప  దర్సకులవల్లనే నటులు గొప్పవారయ్యారు.  సమాజానికి  మంచి-చెడులు  చెప్పాలనే తపన తో  కే.వి.రెడ్డి కధలు రాసుకునేవారు.ఆయన చిత్రాల్లో ' పోతన',' వేమన', 'మాయా బజార్' లాంటి చిత్రాలు ఒక పార్శమైతే ...'దొంగ రాముడు', 'పెద్దమనుషులు', 'పెళ్లినాటి ప్రమాణాలు' మరో కోణం. పురాణాల ఫై మోజు,  దర్శకత్వ శాఖ ఫై పూర్తి  పట్టు, సామాజిక స్పృహ ఉన్న గొప్ప దర్శకుడు కే.వి.రెడ్డి -అని  అక్కినేని అన్నారు.  సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ- సినిమా చరిత్ర వున్నంతకాలం కే.వి.రెడ్డి రూపొందించిన 'మాయా బజార్','పాతాళ భైరవి' చిత్రాలు వుంటాయి-అని అన్నారు.  తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ-చిత్ర పరిశ్రమ నిర్వహించాల్సి ఇటువంటి కార్యక్రమాలను  ' యువకళావాహిని' వంటి సాంస్కృతిక సంస్థలు నిర్వహించడం అభినందనీయం- అనిఅన్నారు. నిర్మాత కే.అచ్చిరెడ్డి మాట్లాడుతూ- స్వర్ణయుగపు దర్శకుల   క్రమశిక్షణ   పుణికిపుచ్చుకున్న దర్శకుడు కోదండరామిరెడ్డి -అని అన్నారు. మహా దర్శకుడు కే.వి.రెడ్డి అవార్డును అక్కినేని చేతులమీదుగా అందుకోవడం చాలా ఆనందం గా వుందని-  కోదండరామిరెడ్డి  తనకుజరిగిన  సత్కారానికి  కృతజ్ఞతలు చెప్పారు.  జర్నలిస్టులు వాసిరాజు ప్రకాశం, ఏ .రాంబాబు,  'లయన్స్'  పీ .జయప్రకాష్ రెడ్డి, జి.హనుమంతరావు, 'యువకళావాహిని'  వై.కే.నాగేశ్వరరావు  కే.వి.రెడ్డి అవార్డ్ ను ఎంపికచేశారు.   ఏ. వి.యస్ ,జయలలిత, ' కార్నేషన్' రాం , రాచమల్లు ఇస్మాయిల్ రెడ్డి తదితరులు  పాల్గొన్న  ఈ కార్యక్రమంలో  కే.వి.రెడ్డి-కోదండరామిరెడ్డిల  ' సిని సంగీత విభావరి'  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Thursday, February 2, 2012

జూన్ 13న రామ్‌చరణ్ పెళ్లి ...‘అగ్నిపథ్‌’లో రామ్‌చరణ్?

చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్, 'అపోలో' ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసన వివాహానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 13న హైదరాబాద్‌లో కల్యాణం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయాన్ని అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మీడియాకు వెల్లడించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో పెళ్లి ముచ్చట్లు ....

సల్మాన్ ఖాన్ హిట్ ఫార్ములా పట్టేసాడు

ప్రతీ నటుడికి ఓ డ్రీమ్‌ ఉంటుంది. ఆ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఎన్నో ఆశలతో, ఊహలతో సంవత్సరాల తరబడి కష్టపడి, కోట్లు ఖర్చు పెట్టి పూర్తిచేస్తాడు. అలాంటిదే బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ చేసిన సినిమా 'వీర్‌'. కానీ సినిమాకు రీల్‌ డబ్బులు కూడా రాలేదు. వీర లెవల్లో 'వీర' ఫ్లాప్‌ అయింది. దీంతో సల్మాన్‌ఖాన్‌కు పూర్తిస్థాయిలో జ్ఞానోదమైంది. దేనిపైన మనం అతిగా ఆశలు పెట్టుకుంటామో, అదే కొంప ముంచుతుందని అర్థం చేసుకున్నాడు. స్టోరీ డిస్కషన్స్‌, ప్రాజెక్ట్‌ ఎస్టిమేషన్స్‌...అంటూ ...

Wednesday, February 1, 2012

100కోట్ల బడ్జెట్‌తో కమల్‌హాసన్‌ మరో ప్రయోగం ‘విశ్వరూపం’

కమల్‌హాసన్‌ చేస్తున్న మరో ప్రయోగం ‘విశ్వరూపం’. ఈ సారి ప్రయోగం మరింత ఆసక్తికరం, వైవిధ్యం. పూర్తి వాణిజ్య పంథాలో భారీ ప్రణాళికతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కమల్‌కి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, పివిపి సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పతాక సన్నివేశాలు మినహా సినిమా సాంతం పూర్తయింది. త్వరలో ఢిల్లీలో బ్యాలెన్స్‌ షూటింగ్‌ పూర్తి చేయనున్నారు.కమల్‌ శైలి విన్యాసాలతో....

హిందీ రీమేక్‌ హక్కుల కోసం పోటా పోటీ

ఒకప్పుడు దక్షిణాదివారిని ఉత్తరాదివారు ఇడ్లీసాంబార్‌, పొంగల్‌, ఉప్మాలంటూ దెప్పిపొడిచేవారు. దక్షిణాది పొడ అస్సలు గిట్టేదికాదు సినిమా ఇండస్ట్రీలో ఈ ధోరణి విపరీతమైన స్థాయిలో ఉండేది. హిందీలో హిట్టయిన చిత్రాల కోసం దక్షిణాది భాషా నిర్మాత, దర్శకులు రీమేక్‌ చేసేందుకు క్యూ కట్టేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. గత రెండు మూడు సంవత్సరాల బాలీవుడ్‌ ట్రాక్‌ రికార్డులు పరిశీలిస్తే ఎక్కువగా దక్షిణాదినుంచి కోలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల రీమేకులపైనే బాలీవుడ్‌ ట్రెండ్‌ నడుస్తోందంటే  ...