RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, January 31, 2014

'హార్ట్ ఎటాక్' చిత్ర సమీక్ష

                                    'హార్ట్ ఎటాక్' చిత్ర సమీక్ష  3/5
 

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకం ఫై పూరి జగన్నాధ్ స్వీయ రచన , దర్శకత్వం లో నిర్మించిన చిత్రం ఇది . 


వరుణ్‌ (నితిన్‌) ఒక హిప్పీతరహా కుర్రాడు . ఆ దేశం ఈ దేశం  అంటూ తిరుగుతూ, రేపటి మీద ఆశ లేకుండా, ఏ రోజుని ఆ రోజు ఎంజాయ్‌ చేసే వ్యక్తి . స్పెయిన్ లో  హయాతిని (అదా శర్మ)చూసి  ఇష్టపడతాడు. ఆమెని ఓ ముద్దిమ్మంటూ వెంటపడతాడు. తనని ప్రేమించడం లేదని, ముద్దిస్తే చాలని వేధిస్తుంటాడు. ఈ క్రమం లో వరుణ్‌ని హయాతి లవ్‌ చేస్తుంది. అయితే ఏ సెంటిమెంట్స్ లేనివరుణ్‌ ధోరణి నచ్చక -తనని జీవితం లో ఎప్పుడూ కలవొద్దని అంటుంది .  ఆ తర్వాత గోవా వెళ్ళిపోతుంది . సెంటిమెంట్స్ లేవంటూనే - తాను హయాతి ని ప్రేమించిన విషయాన్ని తెలుసుకున్న వరుణ్‌  ఆమె కోసం వెతుకుతూ గోవా వస్తాడు . అప్పటికే తండ్రి కోసం హయాతి గోవా డాన్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతుంది . ఆ పరిస్థితుల్లో వరుణ్‌ ఏం చేసాడనేది సినిమాలో చూడాలి ... 

యూత్ -మాస్  చిత్రాలు చెయ్యడం లో పూరి జగన్నాధ్ స్టైలే  వేరు . అతను గతం లో చేసిన పలు చిత్రాలు యువ ప్రేక్షకులను కిర్రెక్కించి, బాక్సాఫీసుల్ని బద్దలు గొట్టాయి . అతని లోని సత్తా ఇంకా తగ్గలేదని ఈ చిత్రం కూడా నిరూపిస్తుంది . కాలం తో పాటు మారుతూ జగన్ తెలుగు సినిమా ని ప్రపంచ స్థాయి తీసుకెళ్ళా లను కుంటున్నాడో ఏమో -ఇటీవల అతని సినిమాలన్నీ ఎక్కువ భాగం విదేశాల్లోనే తీస్తున్నాడు  . ఆదునిక సమాజం లో ఇప్పుడు  ప్రేమ- అను బంధాల పరిస్థితి ఎలా వుందో ఈ చిత్రం లో తన స్టైల్ లో చూపించాడు . సాంకేతికం గానూ , నిర్మాణ విలువల్లోనూ అద్భుత స్థాయిలో ఈ చిత్రం వుంది . ఆధునికత ఎంత పెచ్చు పెరిగినా- అనుబంధాల విలువ ఎలా తగ్గలేదని ఇందులో చూపించారో  ..అలానే  సినిమా లో ఎన్ని హంగులున్నా, కధ కున్న ప్రాధాన్యత కూడా అలానే తగ్గ లేదని దర్శకులు గ్రహించాలి . ఈ చిత్రం లో కధాంశం కొత్త గా ఉంటే ఇంకా బాగుండేది .  ఇందులో కధే ప్రధాన లోపం  . అసలు ఇందులో కధ  వుందని ప్రత్యేకం గా చెప్పుకోవడానికి ఏమీ లేదు . గతం లో మనం చూసిన ఎన్నో సినిమాలు , జగన్ చేసిన సినిమాలే ఇందులోనూ కనిపిస్తాయి తప్ప ,కొత్తగా ఏమీ లేదు . అయితే జగన్ ఎంతో ప్రతిభావంతంగా , ప్రభావవంతంగా ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేసాడు . అందులో తను చాలా వరకూ విజయవంతం అయ్యాడు . 

ఇందులో- ఏ బంధాలు వద్దని చెప్పేహీరో  హీరోయిన్‌ని ముద్దు పెట్టమంటూ  వెంటపడడం ఏమిటో ? అతడిని హీరోయిన్‌ ఎందుకు ప్రేమిస్తుందనే దానికి కారణం అంటూ కనిపించదు.'చూపించండే ' అనే పాట పూరి జగన్ ఆధునిక అభిరుచికి నిదర్శనం .  సినిమాలో చాలా సన్నివేశాలు రొటీన్ గానే సాగినా , రెండవ భాగం లో హీరో హీరోయిన్ కోసం గోవా వచ్చినప్పటినుండి సినిమా ఆసక్తికరంగానే నడిచింది  . 

 వరుణ్ గా నితిన్ పూరి జగన్ స్కూల్ లో పిల్ల చేష్టల్ని దాటేసి, గతం లో కన్నా పరిణితి చెందిన  నటన ప్రదర్శించాడు  . ప్రతి సినిమాకి తెలుగుదనం తక్కువైన హీరోయిన్ ని మనకు పరిచయం చేసే పూరి జగన్ ఇందులో '1920 'అనే హిందీ హార్రర్  చిత్రంలో చేసిన అదా శర్మను పెట్టారు .ఫలితం అంతంత మాత్రమే . ఇస్కాన్ రమణ గా బ్రహ్మానందం పాత్ర , నటన బాగున్నాయి .గోవా లో తమిళ్ వ్యాపారి గా అలీ పాత్ర ఓకే. ఇతర పాత్రల్లో దేవన్ ,అజయ్ , నికోల్ , అజాజ్ ఖాన్ , కేశా కంబటి పోషించారు .   చివరిలో కాసేపు ప్రకాష్ రాజ్ కనిపించడం విశేషం .    


అనుప్ రుబెన్స్ పాటలు ఈ చిత్రం లో ప్రధాన ఆకర్షణ . అన్ని పాటలూ ... శేఖర్ నృత్య దర్శకత్వం లో ఆ పాటల చిత్రీకరణా  ప్రేక్షకులను ఉర్రూత లూగించేలా వున్నాయి .అతని బాణీలను  అందుకోవడంలోపాటల రచయిత భాస్కర భట్ల కొన్ని చోట్ల తడబడ్డాడు ... మరి కొన్నిచోట్ల వెనుకబడ్డాడు . అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో మరో హైలైట్ . విదేశీ లోకేషన్స్ సహా సినిమా మొత్తం కనులకింపుగా చిత్రీకరించారు . నేపధ్య సంగీతం బాగుంది  ,  రామ్ - లక్ష్మణ్  ఫైట్స్ కొత్తదనాన్ని సంతరించుకున్నాయి . శేఖర్ ఎడిటింగ్ సినిమా వేగాన్ని పెంచింది  . బ్రహ్మ కడలి కళా దర్శకత్వం సినిమాకి నిండుదనాన్ని ఇచ్చింది . యువ ప్రేక్షకులను కట్టిపడేసే పూరి జగన్ సంభాషణలు ఈ సారి  కొంతమేరకే పని చేసాయి                                                                                       -రాజేష్ 

Monday, January 13, 2014

విడుదలకు ముందే పరాజయాలు !


తెలుగు సినిమా నిర్మాణం ప్రమాదకరంగా మారిపోయింది . భారీ చిత్రాలంటూ పరుగెత్తి బొక్క బోర్లా పడుతున్నారు పాపం నిర్మాతలు . ఎంతో ఆశించి, పెద్ద మొత్తంలో ఖర్చు చేసే నిర్మాతలకు - 'టేబుల్ ప్రాఫిట్' బదులు, ఇప్పుడు 'టేబుల్ డెఫిసిట్' సాధారణమైపోయింది. సంక్రాంతి పండగతో పాటు ఈ నెలలో విడుదలవుతున్న కొన్ని చిత్రాల పరిస్థితి కూడా అదే!...

రాంబాబు అడ్ల ను సత్కరించిన స్వామి జ్ఞానదానంద



'యువకళావాహిని'-గురుప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభ లో 8న జరిగిన 'స్వామి వివేకానంద' నాటక శత ప్రదర్శనోత్సవమ్ కార్యక్రమం లో సినీ వినోదం .కామ్ సంపాదకుడు రాంబాబు అడ్ల ను సత్కరించిన రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద

వాటిని మించిన ప్రతిభ నాకుంది !


'నిత్యామీనన్‌కు పొగరెక్కువ. ఆమె దర్శక నిర్మాతలకు నిబంధనలు విధిస్తారు. నిర్మాతలను గౌరవించరు. అయితే మంచినటి''- ఇది దక్షిణాదిలో నటి నిత్యామీనన్‌కు ఉన్న పేరు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే ఈ బ్యూటీ సొంతగడ్డపై అవకాశాలను కోల్పోయింది. అయితే టాలీవుడ్‌లో ఈమెకు సక్సెస్‌ఫుల్ నాయకి అనే పేరుంది. కోలీవుడ్‌లో ఇంతకుముందు' వెప్పం', '180' చిత్రాల్లో నటించినా సక్సెస్ ఖాతాను ఓపెన్ చేయలేదు. తాజాగా నటిస్తున్న రెండు చిత్రాలపై ఈ బ్యూటీ కెరీర్ ఆధారపడి ఉంది. వాటిలో....

ఎవరి పని వారికుంటుంది!


‘సినిమాకు ప్రేక్షకుడిని రప్పించే శక్తి ఉన్న ప్రత్యేక పాటలను ఐటమ్ సాంగ్స్ అంటూ చులకనగా మాట్లాడటం అన్యాయం. మేం చేసే పాటలు ఆయా సినిమాలకు అదనపు ఆదరణను పెంచుతున్నాయని ఎందుకు అనుకోకూడదు.. ప్రత్యేక పాట(ఐటమ్ సాంగ్)లపై పాజిటివ్‌గా ఆలోచిస్తే బాగుంటుంది..’ అని బాలీవుడ్ ఐటమ్ బాంబ్‌గా గుర్తింపు పొందిన నటి మల్లికా అరోరా ఖాన్ వ్యాఖ్యానించారు.....

వచ్చిన వాళ్లు ఏమీ ఆశించకూడదు!


బాలీవుడ్ బ్యాచులర్ సల్మాన్ ఖాన్ వివాహం పట్ల విముఖత వ్యక్తం చేశాడు. తనకు పెళ్లంటే ఆసక్తి లేదని, బ్యాచ్ లర్ గా ఉండటానికే ఇష్టపడతానని కండల వీరుడు తెలిపాడు. వయసు యాభై ఏళ్లకు చేరువవుతున్నా ఈ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమ విషయంలోనూ విసిగిపోయిన సల్లూభాయ్... ప్రియురాలు కలిగి ఉండటం అన్నా ఇష్టం లేదంటున్నాడు. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనీ, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతానని....

నమిత రాజకీయ సంచలనం!

తన రాజకీయ తెరంగేట్రం ఖాయమని, ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని అంటోంది నటి నమిత. వెండితెరపై అందాలు ఆరబోసిన ఈ సూరత్ సుందరి ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసింది. టాలీవుడ్‌లోను హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారిస్తున్న ఈ ముద్దుగుమ్మకు సినిమా ఛాన్స్‌లు తగ్గాయి. నటిగా అవకాశాలు కొరవడినా నమిత పేరుకు క్రేజ్ తగ్గలేదన్నది నిజం....












నేను సినిమా ఫ్యాక్టరీని కాదు!



‘మల్టీస్టారర్ చిత్రాలు తీయడం అంత కష్టం కాదు.. అందులో పనిచేసే హీరోలు ఎంత స్టార్‌లైనా కథను అనుసరించి తమ పని తాము చేసుకుపోతే ఇబ్బందులు అనేవి ఉండవు. నా వరకు నేను తీసిన ఏ సినిమాలోనూ నటులతో ఇబ్బంది పడలేదు.’ అని దర్శకురాలుగా మారిన నృత్య దర్శకురాలు ఫరాఖాన్ వ్యాఖ్యానించారు. 2007లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో ఆమె ఒక పాటలో 31 మంది టాప్ హీరో, హీరోయిన్లను చూపించారు. స్టార్ నటులు షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పడుకొనేతో పాటు బొమ్మన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా వంటి వారితో ప్రస్తుతం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....

'బల్లాద్‌ రుస్తుం' దర్శకురాలు అజిత్‌ సుచిత్రా వీరా

                                          

'ఆస్కార్‌ బరిలో నిలబడటం, 4000 చిత్రాలను చూసి, అందులోని నుంచి ఎంపిక చేపట్టడం, అందులో నేను దర్శకత్వం వహించిన చిత్రం ఉండటం..చాలా గొప్పగా వుంది. ఇండిరు సినిమాకు, అందునా కమర్షియల్‌ పంథాకు ఆవల నేను చేసిన ఈ ప్రయత్నానికి గొప్ప ప్రతిఫలం. సాంకేతిక నిపుణులు, నటీనటుల వల్లే ఇది సాధ్యమైంది' అని చిత్ర దర్శకురాలు అజిత్‌ సుచిత్రా అన్నారు. ఇంతకీ సినిమాలో ఏముంది ? అంటే.....

నాకు చాలా లక్ష్యాలున్నాయి!

కంగనా రనౌత్.. తాను అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేనని చెబుతోంది. తనకు జీవితంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని అంటోంది. ''నాకు ఒంటరిగా ఉండటం అంటేనే ఇష్టం. నా జీవితంలో పెళ్లి కాక ఇంకా చాలా విషయాలున్నాయి. పెళ్లి అంటే జీవితాంతం కట్టుబడి ఉండాలి గానీ ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన లేదు'' అని కంగనా తెలిపింది.తనకు ఎవ్వరి కంపెనీ అక్కర్లేదని, తన సొంతకాళ్లపై నిలబడేందుకు చాలా పని చేస్తున్నానని....

ఏకంగా పెద్ద పులినే పట్టేసింది !


'పులి కారాదా నెచ్చెలి' అంటోంది ప్రియమణి. ఒకప్పుడు పులి, సింహం వంటి జంతువులను క్రూర మృగాలంటూ భయపడి దూరంగా ఉండేవారు. ప్రస్తుత సమాజంలో మానవమృగాలు వాటికంటే భయంకరంగా మారడంతో క్రూరమృగాల సావాసమే మెరుగనిపిస్తోంది. పలువురు నటీమణులు కూడా జంతువులపై మమకారం చూపిస్తుండటం గమనార్హం. నటి త్రిష, సమంత తదితర హీరోయిన్లు శునకం, మార్జాలంపై ప్రేమను కురిపిస్తున్నారు. వాటిని పెంచుకుంటూ సంరక్షణ కల్పిస్తున్నారు. గత వారం నటి త్రిష గాడిదలపై కరుణ చూపిస్తూ వాటికి ఆహారాన్ని అందించి ఫొటో దిగారు. అయితే ప్రియమణి ఏకంగా పెద్ద పులినే....

అతనితో చెయ్యడానికి భయపడ్డాను!


నేను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమానిని-అంటున్నారు'ధూమ్ 3' తో కొత్త చరిత్ర సృష్టిస్తున్న అమీర్ ఖాన్. 'రజనీకాంత్ హిందీలో నటించిన 'ఉత్తర దక్షిణ్',' జానీ', 'గిరీఫ్తార్' చిత్రాలు చూసి ఆయన అభిమానిగా మారిపోయా ను. నేను అదృష్టంగా భావించే మరో విషయమేమిటంటే... నేను హీరోగా పరిచయమైన తొలి రోజుల్లోనే రజనీకాంత్‌తో 'ఆతంక్ హి ఆతంక్ ' చిత్రంలో నటించే అవకాశం రావడం. అప్పట్లోనే రజనీ చాలా పెద్ద స్టార్ హీరో కావడంతో ఆయనతో నటించడానికి భయపడ్డాను....

పవన్ కి స్ఫూర్తి అతనేనా ?


తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్ కు ధీటుగా హీరోగా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న జెమినీ గణేషన్ బాలీవుడ్ తార రేఖ తండ్రి. తమిళ తెరకే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సుపరిచితుడైన రామస్వామి గణేశన్ ఉరఫ్ జెమిని గణేశన్ ప్రముఖ నటి సావిత్రికి భర్త. ఓ దశలో ఎంజీ రాంచంద్రన్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతుంటే.. ..

బాలీవుడ్ భారీ రికార్డులు !


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ధూమ్-3 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ఈ చిత్రం తొమ్మిది రోజుల్లోనే 211 కోట్ల రూపాయల వసూళ్ల రాబట్టింది.ధూమ్-౩లో అమీర్ తో పాటు అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా నటించారు. ఈ చిత్రం ఈ నెల 20న దేశవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలైంది. హిందీలో మాత్రమే 211 కోట్లు వసూలు చేసింది. ఇతర భాషల్లో మరో 11 కోట్లు రాగా, ఓవర్సీస్ కలెక్షన్లు భారీ మొత్తంలో వచ్చినట్టు సినీ వర్గాలు తెలిపాయి. మొత్తం కలెక్షన్లు కలుపుకొంటే 300 కోట్ల రూపాయలు దాటింది. షారుఖ్ ఖాన్ సినిమా 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' కలెక్షన్ల రికార్డును (పది రోజుల్లో 216 కోట్లు) అధిగమిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.. ...

చిన్న సినిమాకీ చేయూత!



'చెన్నయ్ఎక్స్‌ప్రెస్‌', 'క్రిష్‌ 3', 'ధూమ్‌ 3'...మొదలైన భారీ చిత్రాలనేగాక, నూతన తారలతో..వచ్చిన భిన్నమైన కథాంశాల్నీ హిందీ ప్రేక్షకుడు ఆదరించాడు. కథాపరంగా, యాక్షన్‌పరంగా ఉన్నత ప్రమాణాల్ని పాటించి ఇక్కడి దర్శకనిర్మాతలు ఈ సంవత్సరం మంచి విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా భారీ తారాగణం, బడ్జెట్‌తో సంబంధం లేకుండా హిందీ సినిమాకి ఈ ఏడాది ఆదరణ దక్కింది. 'షిప్‌ ఆఫ్‌ థీసెస్‌', 'ద లంచ్‌ బాక్స్‌' వంటి భిన్నమైన కథాంశాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఊహించని విజయాన్ని అందుకున్నాయి. ఇది ఎంతోమంది నూతన దర్శకనిర్మాతల్ని ఉత్సాహపర్చింది. కొత్తపంథాలో తెరపైకి వస్తే తప్పకుండా ప్రేక్షకుడు ఆదరిస్తాడని మరోమారు ఇక్కడ రుజువైంది. హిందీ సినిమా-2013లో చోటు దక్కించుకున్న పది సినిమాల గురించి ....

నన్ను చూడాలంటే, తల ఎత్తి చూడాల్సిందే!


ఏ మనిషీ ముళ్లు ఉన్న చోట అడుగు వేయడు. ముళ్లున్నాయని తెలిసి కూడా ఆ తోవలో వెళ్లాలని అనుకోడు. తను వెళ్లాల్సిన దారిలో ముళ్లు పరిచివుంటే ఏం చేయగలరు ఎవరైనా? వాటిని ఏరి పారేసుకుంటూ వెళ్లాలి. లేదంటే వాటి మీద అడుగులు వేయకుండా తప్పించుకుంటూ నేర్పుగా నడవాలి. అది కూడా కాదంటే... ముళ్లు గుచ్చుకున్నా నొప్పిని భరిస్తూ సాగిపోగలగాలి? వీటిలో ఏది తేలిక? ఒక్కోసారి ఒక్కో మార్గం మేలనిపిస్తూ ఉంటుంది-అంటూ చెబుతోంది చాట్ షో రారాణి ఓప్రా విన్ ఫ్రే .....

Sunday, January 12, 2014

                                        'ఎవడు' చిత్ర సమీక్ష        3/5
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  పతాకం ఫై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు . 


గత యేడాది  సంక్రాంతి కానుకగా  రామ్ చరణ్  'నాయక్'  వచ్చింది. యాక్షన్ తో పాటు బోలెడంత వినోదాన్నీ పంచిన ఆ సినిమా చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన 'తుఫాన్' అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ చరణ్ పట్ల ఉన్న సదభిప్రాయన్ని పటాపంచలు చేసేసింది. దాంతో మెగాఫ్యాన్స్ అంతా ఈ సంక్రాంతికి వచ్చిన 'ఎవడు' మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు. వారందరినీ రంజింప చేయడంలో 'ఎవడు' సక్సెస్ సాధించాడనే చెప్పాలి.
కథలోకి వెళితే... అల్లు అర్జున్, కాజల్ ప్రేమికులు. గొడవలకు దూరంగా తన ప్రియుడితో జీవితాన్ని గడపాలని కాజల్ భావిస్తుంది. వైజాగ్ లో ఉండే వీరుభాయ్ అనే పెద్ద గుండా దృష్టి కాజల్ మీద పడుతుంది. ఆమెను కోరుకుంటాడు. వాడి అనుచరుల నుండి తప్పించుకుకోవడం కోసం అర్జున్ తో సహా వైజాగ్ నుండి హైదరాబాద్ కు బస్సులో బయలు దేరుతుంది. అయితే మధ్యలోనే వీరుభాయ్ గ్యాంగ్ వీళ్ళిద్దరినీ చంపేస్తారు. అంతేకాదు... బస్ నూ తగలబెట్టేస్తారు. అయితే ఆ ప్రమాదం నుండి కొనఊపిరితో అల్లు అర్జున్ బయటపడతాడు. అతనికి హైదరాబాద్ లో ట్రీట్ మెంట్ జరుగుతుంది. అల్లు అర్జున్ ఫేస్ చాలా వరకూ కాలిపోవడంతో, అదే సమయంలో హత్యకు గురైన తన కొడుకు రామ్ చరణ్ పోలికలు వచ్చేట్టుగా సర్జరీ చేస్తుంది డాక్టరైన జయసుధ. అక్కడ నుండి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది... ప్రథమార్ధంలో తన ప్రియురాలిని చంపిన వారిపై పగ తీర్చుకున్న అల్లు అర్జున్ (మనకి కనిపించేది మాత్రం రామ్ చరణే) ద్వితీయార్థంలో రామ్ చరణ్ హత్యకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
నిజానికి ఈ కథను తెరకెక్కించడం కత్తి మీద సాము అనే చెప్పాలి. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు అందుకు సిద్ధపడ్డాడు. ప్రేక్షకులు ఏ విధమైన కన్ ఫ్యూజన్ కూ  లోను కాకుండా... అల్లు అర్జున్, రామ్ చరణ్ పాత్రలను చాలా క్లారిటీతో దర్శకుడు సిల్వర్ స్ర్కీన్ మీద ప్రెజెంట్ చేశాడు. ఎలాంటి అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ లు లేకుండా స్రైయిట్  గా స్టోరీని నడిపేశాడు. అదే ఒకరకం గా సినిమా సక్సెస్ కు కారణమైంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీలో కాస్త రిలీఫ్ అన్నట్టుగా అప్పుడప్పుడు పాటలు వచ్చిపోతుంటాయి. నిజానికి వాటికి అంత ప్రాధాన్యం కూడా లేదు. తెలుగు సినిమా అన్న తర్వాత ఐదారు పాటలు ఉండాలి కాబట్టి పెట్టినట్టుగా ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటనలో కొత్తదనం ఏమీ కనిపించదు. అదే నటన... పాటల్లోనూ అదే ఎనర్జీ. అల్లు అర్జున్ ఉన్నది కాసేపే అయినా యాక్షన్ లో కానీ, ఎమోషన్స్ లో కానీ తన మార్కు చూపించాడు. హీరోయిన్లు శ్రుతి హాసన్, అమీ జాక్సన్ కంటే.. కొద్దిసేపే కనిపించినా కాజల్ బాగా నటించింది. అలానే ఆమె మీద చిత్రీకరించిన పాటా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలన్నీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. వాటి చిత్రీకరణ కూడా ఓకేనే. ఐటమ్ సాంగ్ లిరిక్స్ ను దృష్టిలో పెట్టుకుని లోకల్ ఆర్టిస్టులతో తీసి ఉండాల్సింది, కనీసం ఇండియన్స్ తో! కథపరంగా ఏ అవసరం లేకపోయినా అమీ జాక్సన్ లాంటి ఫారిన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్న దర్శక నిర్మాతలు ఐటమ్ సాంగ్ కు ప్రాధాన్యం ఇస్తారనుకోవడం అత్యాసే!
ఇది రెండు రివెంజ్ లు మిళితమైన కథ కాబట్టి సహజంగానే విలన్స్ చాలామందే ఉన్నారు. సాయికుమార్, కోట, అజయ్, సుబ్బరాజు, రాహుల్ దేవ్, సుప్రీత్ ఇలా వాళ్ళ లిస్టు పెద్దదే ఉంది. రామ్ చరణ్ స్నేహితులుగా శశాంక్, 'కేక' మూవీతో హీరోగా  పరిచయం అయిన సీతారామశాస్త్రి కుమారుడు రాజా నటించారు. ఇద్దరి పాత్రలూ ప్రాధాన్యం ఉన్నవే. బ్రహ్మనందం కామెడీని, ఎల్.బి. శ్రీరామ్ ఎమోషన్స్ ను అందించే ప్రయత్నం చేశారు కానీ, ఆకట్టుకోలేకపోయారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉందని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కు వచ్చేసరికీ దానిని పూర్తిగా విస్మరించాడు. పొలిటీషియన్లు, గూండాల చేతనే  ప్రభుత్వం నడుస్తున్నటుగా చూపించాడు. ఎంత వద్దనుకున్నా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలను ఒకదానితో ఒకటి పోల్చి చూసుకోవడం సహజం. ఆ రకంగా రెండు రోజుల ముందొచ్చిన 'వన్' కంటే 'ఎవడు' బెటర్ మూవీ అనే భావన సగటు ప్రేక్షకుడిలో కలిగింది. అందువల్లే ఈ సినిమా హిట్ నుండి       సూపర్ హిట్ దిశగా సాగే అవకాశం కనిపిస్తోంది. పండగ సెలవలు పూర్తయితే కానీ 'ఎవడు' రేంజ్ ఏమిటనేది చెప్పలేం!               -ఓం ప్రకాష్ వడ్డి 

Friday, January 10, 2014

'1'(నేనొక్కడినే ) సినిమా సమీక్ష

                                                     '1'(నేనొక్కడినే ) సినిమా సమీక్ష

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ - ఇరోస్ ఇంటర్నేషనల్ పతాకం ఫై సుకుమార్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు . 



                     ప్రసిద్ధ ' రాక్ స్టార్' గౌతమ్ కలలతో బాధ పడుతుంటాడు . చిన్న తనంలో  తల్లి దండ్రులను ముగ్గురు వ్యక్తులు చంపేసి, తనని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అతను ఊహించుకుంటుంటాడు  . అతని పరిస్థితిని చూసి సహాయకారిగా చేరువవుతుంది సమీర అనే టి .వి .ఛానల్ రిపోర్టర్. తల్లిదండ్రు లెవరు ,తన గతం ఏమిటో? తెలుసుకునే ప్రయత్నంలో నిజమేమిటో భ్రమ ఏమిటో? తెలియని పరిస్థితిని ఎదుర్కొంటాడు  గౌతమ్ .  తన అన్వేషణ కొనసాగిస్తున్న గౌతమ్  కొత్త విషయాలు తెలుసుకుంటాడు  . ఇంతకీ అతని  తల్లి దండ్రులు ఎవరు ? వారిని ఎవరు, ఎందుకు చంపారు? గౌతమ్ కలలు యదార్ధమేనా ? అతని అన్వేషణ ఫలించిందా ?అనేది   తెర ఫై చూడాలి ....  

                    సుకుమార్ దర్శకుడిగా ఇక రిటైర్ కావచ్చు... అన్నంత  గొప్పగా ఈ చిత్రాన్ని తీసాడు . ఒక హాలీవుడ్ చిత్రం చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది .  తెలుగు సినిమా దర్శకుల్లో సుకుమార్  విలక్షణమైన వాడు . అతని ఊహా శక్తికి ఈ చిత్రం ఒక గొప్ప అవకాశం ... గొప్ప నిదర్శనం . అయితే ఏ దర్శకుడైనా మొదట గుర్తుంచుకోవాల్సింది ... 'మనం ఏ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం చేస్తున్నాం?'అని . ఆ ప్రేక్షకుల అవగాహనా స్థాయిని ఎప్పుడూ దృష్టి లో ఉంచుకోవాలి.  అది వదిలేసి తమ మేధా స్థాయి లోనో...హాలీవుడ్ స్థాయి లోనో  సిన్మాలు తీసి  చిక్కుల్లో పడు తుంటారు కొందరు  . సుకుమార్ చేసిన పనికూడా అదే . నేల  విడిచి  సాము చేసాడు. గొప్ప స్క్రీన్ ప్లే చేశాడు ...కానీ, నిజమేమిటో భ్రమ ఏమిటో?...అంటూ  సామాన్య ప్రేక్షకుడిని  కన్ఫ్యూజ్  చేసాడు. అందులోనూ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి . సినిమాలో ఎంతో కొంత మసాలాను , కామెడీ ని ఆశించే ప్రేక్షకుడికి  మూడు గంటలపాటు సీరియస్ సినిమా చూపించాడు .బోల్డంత బిల్డప్ ఇచ్చిన ఒక విలన్ ని  సిల్లీగా (సినిమాటిక్ గా) టాయిలెట్ లో చంపేసాడు.  రెగ్యులర్ ఫార్మేట్ లో సినిమా అయిపోయాక (విలన్ ని హీరో చంపేసాక ) కూడా తల్లి దండ్రుల సెంటిమెంట్ తో  క్లైమాక్స్ లో సినిమాని సాగదీసాడు .నిజానికి- కొత్తగా ,ఆసక్తికరం గా వున్న  ఈ చిత్రం కధని 'ఓకే' చేసిన  హీరో , నిర్మాతలు- దర్శకుడు ఇంత క్లాసిక్ గా ...విపులంగా ...నిదానంగా ...అత్యంత భారీగా తీస్తాడని ముందుగా ఊహించి వుండరు . కొంత షూటింగ్ తర్వాత  పరిస్థితి అర్ధం అయినా,  చేసేదేమీ లేక చేతులెత్తేసి వుంటారు .ఇరోస్ ఇంటర్నేషనల్ వారు ముందుకు  రావడం కొంతఊరట కలిగించే విషయమే !

                నటుడిగా మహేష్ బాబు చిత్ర చిత్ర ప్రవర్ధమానం అవుతున్నాడు . 'రాక్ స్టార్' గా ... తల్లిదండ్రు లెవరు ,తన గతం ఏమిటో? తెలుసుకోవాలనే  గౌతమ్ గా  ఆద్యంతం అద్భుతంగా చేసాడు . చొక్కా విప్పి ప్రదర్శించకున్నా, పాత్ర కోసం 6 ప్యాక్ తో  ఫిట్నెస్  సంతరించుకున్నాడు . సినిమా అంతా తన ఒక్కడి ఫై నే నడిపించి  ' 1'(ఒక్కడినే ) అనే పేరుకు న్యాయం చేసాడు . ఇందులి చిన్న నాటి మహేష్ గా మహేష్ కుమారుడు మాస్టర్ గౌతమ్ కృష్ణ  నటించడం ఒక విశేషం .రెగ్యులర్ హీరోయిన్ల బదులు కృతి సనన్  ను ఎంపిక చెయ్యడం కరెక్ట్  నిర్ణయం . ఆమె అందమే ఈ చిత్రం లో ప్రేక్షకులకు కొంతవరకు రిలీఫ్ .అలాగే, పాత్ర పరంగా  కృతి బాగా నటించింది కూడా . నాజర్ , ప్రదీప్ రావత్ , కెల్లీ దోర్జీ , పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస రెడ్డి , సయ్యాజి షిండే , ఆనంద్ , అను హసన్, బెనర్జీ , విక్రం సింగ్ ఈ చిత్రంలో ఇతర పాత్ర దారులు .

                  సుకుమార్ ఆనవాయితీ ప్రకారం ఈ చిత్రం లోనూ ఓ స్పెషల్ సాంగ్ పెట్టాడు . ముంబై డాన్సర్ సోఫీ చౌదరి చేసిన ఈ పాట సాహిత్యం  సుకుమార్ గత చిత్రాల ఐటెం సాంగ్స్ మూసలోనే సాగింది  . దీనికి  ప్రేక్షకులు ఏమాత్రం స్పందించలేదు . దేవిశ్రీ ప్రసాద్ పాటలు చెప్పు కోదగ్గవి కాకపోయినా, సినిమా సందర్భానికి తగ్గట్టుగానే వున్నాయి . రీ  రికార్డింగ్ మాత్రం అదిరిపోయింది  .ధీమ్  మ్యూజిక్  ఈ చిత్రానికి చక్కటి సన్నివేశ  బలాన్నిచ్చింది . ఎంత మోడ్రన్ ట్యూన్స్ లో  అయినా 'తెలుగు మాట' మిస్ కాకపోవడం దేవిశ్రీ గొప్పదనం . రత్న వేలు ఫోటోగ్రఫీ,  పీటర్ హైన్స్ థ్రిల్స్  ఈ చిత్రం లో చెప్పుకోదగ్గ   హై లైట్స్  . కొన్ని మరీ అతిగా అనిపించినా బోట్ చేజ్ , గన్ మెన్ చేజ్ ,పార్కింగ్ ప్లేస్ ఫైట్ వంటి  థ్రిల్స్ మంచి స్థాయి లో వున్నాయి .ఈ చిత్రంలో సంభాషణలు ,కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ,
చంద్ర బోస్ పాటలు, ప్రేమ్ రక్షిత్ డాన్సులు బాగున్నాయి                                                    రాజేష్                            

తెలుగు ప్రేక్షకులకు ఓ స్థాయిగల  చిత్రాన్ని అందించాలని తపన పడ్డ దర్శకుడు సుకుమార్, హీరో మహేష్ బాబు , నిర్మాతలు  రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకరల ఫై గౌరవంతో ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం లేదు .