RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, October 26, 2012

కొత్త సంచలనం 'గంగ్ నమ్ స్టైల్'

పరభాషా సీరియళ్లను నియంత్రించాలి

పరభాషా సీరియళ్లను నియంత్రించాలి

టెలివిజన్‌పై ఆధారపడి జీవించే నటీనటుటు, సాంకేతిక నిపుణులు పరభాషా సీరియళ్ల వల్ల ఉపాధిని కోల్పోతున్నారు. ఈ బెడద తొలగింపుకే కాదు.. టీవీ కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక సమాఖ్య ఏర్పాటు చేయాలి. అందుకోసం తెలుగు టీవీ నిర్మాతల సంఘం (టిటిపిసి) ప్రయత్ని స్తోంది’’ అన్నారు ఏపీ ఫిలింఛాంబర్‌ అధ్యక్షులు, టిటిపిసి గౌరవ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా యూనియన్లలో సభ్యత్వం ఖరీదైన వ్యవహారం. టీవీ కార్మికులకు అందుబాటులో ఉండదు కనుక..ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయడం అత్యావశ్యకం. అందుకోసం ప్రత్యేక నిబంధనలను తయారు చేసి ప్రభుత్వాన్ని సంప్రదించాలి..అనీ తమ్మారెడ్డి సూచించారు. హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిపిసి కార్యవర్గ సభ్యులు (2012 సెప్టెంబర్‌ 29న ఎన్నికయ్యారు) పాల్గొన్నారు.
టిటిపిసి కార్యవర్గం 2012: అధ్యక్షులు: ఎ.ప్రసాద్‌రావు, ఉపాధ్యక్షులు: పి.ప్రభాకర్‌, వి.వి.రావు, ప్రధానకార్యదర్శి: ఎమ్‌.వినోద్‌బాల, సంయుక్త కార్యదర్శులు: కె.వి.కిరణ్‌కుమార్‌, డి.వెై.చౌదరి, ట్రెజరర్‌: కె.రమేష్‌బాబు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు: విజయ్‌యాదవ్‌, జి.తాండవకృష్ణ, కె.వెంకటేశ్వర ప్రసాద్‌, మహతి, యాట సత్యనారాయణ, వెై.రాజీవ్‌రెడ్డి, కో ఆప్టెడ్‌ సభ్యులు: కె.వి.శ్రీరామ్‌, కె.శ్రీనివాస్‌. గౌరవ ఛెైర్మన్‌గా డాదాసరి నారాయణరావు, గౌరవ అధ్యక్షులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సలహాదారుగా టి.సంజయ్‌ రెడ్డి..వ్యవహరిస్తారు. .

Friday, October 19, 2012

కులవ్యవస్థ ఇతివృత్తంగా 'శూద్ర'

నిర్మాతగా గతంలో ఒక చిత్రం నిర్మించిన సంజీవ్ జైస్వాల్ ఈసారి తానే మెగాఫోన్ పట్టి భారతదేశంలోని కులవ్యవస్థను ఇతివృత్తంగా తీసుకొని ‘శూద్ర- ది రైజింగ్’ పేరుతో సినిమా తీశారు. ‘‘కులతత్వం అనేది ఏ సమాజానికైనా విషంలాంటిది’ అని చెప్పే సంజీవ్ అంబేద్కర్ రచనలను విస్తృతంగా చదివారు. సినిమాలో అందరూ కొత్త నటులనే....

భేషుగ్గా సాగిన నందుల పంపకం

భేషుగ్గా సాగిన నందుల పంపకం

Thursday, October 18, 2012

' కెమెరా మేన్ గంగతో రాంబాబు' చిత్ర సమీక్ష

' కెమెరా మేన్  గంగతో  రాంబాబు'  చిత్ర సమీక్ష          2.5/5


యూనివర్సల్ మీడియా పతాకం ఫై పూరి జగన్నాద్ దర్శకత్వం లో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించే వెల్డర్  రాంబాబు లో ఆవేశాన్ని గమనించిన ఓ టి.వి ఛానెల్ కెమెరా ఉమన్ గంగ అతన్ని తమ ఛానెల్ లో రిపోర్టర్ గా చేర్పిస్తుంది. రాంబాబు తన  దూకుడు తో అందరి దృష్టిని ఆకట్టు కుంటాడు.నిజాన్ని నిర్భయం గా చెప్పే జర్నలిస్ట్ దశరధ రామ్ ను హత్య  చేసిన మాజీ ముఖ్య మంత్రి జవహర్ నాయుడును ఎదుర్కొని, అతని రాజకీయ వారసుడు రానా ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు. తెలివిగా ఆ కేసునుండి బయటకొచ్చిన రానా రాష్ట్ర ముఖ్య మంత్రి కావాలని ప్రయత్నిస్తుంటాడు.ఇక్కడ వ్యాపారాలు చేస్తూ దోచేస్తున్న  పక్క రాష్ట్రాల వారిని తరిమేసి , రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ-ప్రజల్లో తన రాజకీయ ప్రాభవం పెంచుకోవడం కోసం భావోద్వేగాలను రెచ్చగొడతాడు.అయితే,అతన్నిమీడియా ముందు నిలదీసి - అతని వాదన లోని సంకుచితత్వాన్ని ప్రజల్లో  ఎండగడతాడు రాంబాబు.ఎంతో కష్ట పడి ప్రజల్లో  పెంచుకుంటున్న ఇమేజ్ ని దెబ్బ తీసిన రాంబాబు ని అడ్డు తొలగించు కోవాలని రానా  ప్రయత్నిస్తుంటాడు. ప్రజల సానుభూతిని పొందడానికి మరో నీచమైన పధకాన్ని వేస్తాడు. రానా వంటి దుష్ట శక్తి ని  రాష్ట్ర ముఖ్య మంత్రి కాకుండా అడ్డుకోవడానికి రాంబాబు ఏం చేసాడో సినిమాలో చూడాలి...   


'పోకిరి' జంట పవన్-పూరిల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఫై సహజం గానే భారీ అంచనాలు వుంటాయి.అయితే ఇది పూరీ రెగ్యులర్ గా చేసే సరదా టైప్ సినిమా  కాదు. పవన్ ఆలోచనా విధానానికి అనుగుణం గా, సామాజిక చైతన్యం పెంచేలా దీన్నిరూపొందించాల్సి వుంది. ఈ తరహా సబ్జెక్ట్ ఫై అవగాహన లేని పూరి దీని ఫై మరింత ఎక్కువ కష్టపడాల్సి వుంది. అయితే, ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాద్ ప్రారంభించిన  మూడు నెలలకో సినిమా స్కీం వల్ల పూరి  తన చిత్రాల ఫై ఏమాత్రం శ్రద్ధ చూపలేక పోతున్నాడు.దాంతో, ఇప్పుడు వస్తున్న అతని చిత్రాల క్వాలిటీ దారుణం గా పడిపోయింది.ఇటీవల వచ్చిన అతని 'దేవుడు చేసిన మనుషులు' ఇందుకు తాజా ఉదాహరణ .ఈ ' కెమెరా మేన్  గంగతో  రాంబాబు' కూడా ఆ కోవలోనే పేలవంగా వచ్చింది.దాంతో ఈ చిత్ర నిర్మాణ సమయం లోనే' కొన్ని సన్నివేశాలను హీరో రీ షూట్ చెయ్య మన్నారని,అందుకు పూరీ అంగీకరించలేదంటూ'-వార్తలు వచ్చాయి.దానికి తగ్గట్టుగానే సినిమాలో పాత్రలు, పాత్ర దారులు,సన్నివేశాలు ...అన్నీ రొటీన్ గా, నిస్సత్తువుగా వున్నాయి. ఒక్క మీడియా నేపధ్యం మాత్రమే వున్నంతలో కొత్తది. మీడియాను చూపడం లోనూ దర్శకుడి అవగాహనా లేమి,గందర గోళం కనిపిస్తుంది. ప్రస్తుతం  మీడియా రాజకీయ పార్టీలు,నాయకుల చేతుల్లో పడి వారి ప్రయోజనాలు కాపాడేందుకే పని చేస్తోంది.అందువల్ల, వారంతా కలిసి కట్టుగా రాంబాబు వంటి 'ప్రజల మనిషి'కి మద్దతు పలుకుతారనడం ఉత్త భ్రమ.అలాగే  రాంబాబుకు ప్రజల్లో  విశేష ప్రాచుర్యం రావడాన్ని బలంగా  చూపలేక పోయారు.అతను పిలిస్తే అంతమంది జనం రావడం ...తక్కువ స్థాయి గ్రాఫిక్స్ తో క్లైమాక్స్ చెయ్యడం ... ఆర్టి ఫిషియల్ గా వుంది. .టి .వి చానెల్ లో అలీ 'మేలుకొలుపు' కార్యక్రమం, మరో చానెల్ లో బ్రహ్మానందం కోట ఫై చేసిన కార్యక్రమం..వార్తలను మార్చి చదివే సన్నివేశం  మంచి వినోదాన్ని అందించాయి.పరాయి రాస్ట్రీయులను పార ద్రోలాలనే రానా  ఉద్యమం మన తెలంగాణా  ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. ఆ సందర్భంగా -జాతీయ సమైక్యత ను చెప్పే  పవన్ ప్రసంగం ఈ చిత్రం లో హై లైట్ గా నిలుస్తుంది.అది ఇక్కడి తెలంగాణా వాదులకి కూడా వర్తిస్తుంది.

 కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫైనే ఆధార పడి ఈ చిత్రం చేసారు. దానికి పవన్ పూర్తి న్యాయం చేసారు.  డైలాగ్స్ పవర్ ఫుల్ గా చెప్పడమే కాకుండా,డాన్స్ కూడా మరింత ఈజ్ తో చేసాడు. అయితే స్క్రీన్ ప్లేలో విషయం లేకపోవడం వల్ల అతని శ్రమ వృధా అయ్యింది .తమన్నా అందం గానే వుంది, బాగా చేసింది ... కానీ 'ఎక్ష్త్రార్డినరీ' అమ్మాయి గా మాత్రం సరిపడ లేదు.ఆమె క్యారక్ట రైజేషన్లో ' అతి' వల్ల  ప్రేక్షకులు బాధపడ్డారు.గబ్రియేల కూడా ఇబ్బంది పెట్టింది. విలన్లుగా కోట,ప్రకాష్ రాజ్ లు కొత్తగా చేసింది ఏమీ  లేదు.మహిళా నేత గుండక్కగా శృతి,ముఖ్య మంత్రి గా నాజర్,ఇతర పాత్రల్లోసూర్య, ధర్మవరపు,యమ్మెస్,తనికెళ్ళ భరణి,ఉత్తేజ్,స్కార్లెట్ ఓ పాటలో  నటించారు.మణిశర్మ సంగీతం లో పాటలు అంతంత మాత్రం గానే వున్నాయి.'ఎక్ష్త్రార్డినరీ', 'రెడీ 123' పాటల చిత్రీకరణ,నేపధ్య సంగీతం బాగుంది.ఈ చిత్రాన్ని 40 ఏళ్ళుగా ప్రజా సమస్యల ఫై చిత్రాలు నిర్మిస్తున్న ఆర్ .నారాయణ మూర్తి కి అంకితం ఇవ్వడం విశేషం.  -రాజేష్ 

Friday, October 12, 2012


' బ్రదర్స్' చిత్ర సమీక్ష  3/5

'స్టూడియో గ్రీన్' జ్ఞానవేల్‌ రాజా సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకం ఫై  కే.వి. ఆనంద్ దర్శకత్వం లో బెల్లంకొండ సురేష్ ఈ  చిత్రాన్ని తెలుగులో అందించారు.

జెనెటిక్ శాస్త్రవేత్త రామచంద్ర  తన భార్య మీద చేసిన ప్రయోగం వికటించి ఆమెకు అవిభక్త కవల పిల్లలు విమల్ , అఖిల్ పుడతారు. వారిద్దరూ అవిభక్త కవలలుగా ఉండటం రామచంద్రకి ఇష్టం లేకపోయినా భార్య కోరిక మేరకు వారిని అలాగే పెంచుతారు. రామచంద్ర  ఎనర్జియోన్ అనే మిల్క్ పౌడర్ కనిపెడతాడు. అతి తక్కువ సమయంలోనే ఈ ఎనర్జియోన్ ప్రభావవంతంగా పేరు సంపాయించి,  అమ్మకాలు విపరీతంగా పెరగడంతో అందరి చూపు ఎనర్జియోన్ పై పడుతుంది. ఎనర్జియోన్ ఎలా తయారు చేస్తారు? అనేవిషయాన్ని   కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న రష్యన్ జర్నలిస్ట్ వోల్గా కి  విమల్ , అఖిల్  మిత్రురాలు  అంజలి  కూడా సహాయం చేస్తుంటుంది.ఆ క్రమంలోరష్యన్ జర్నలిస్ట్ తో సహా ,విమల్ కూడా మరణిస్తాడు.అసలు ఈ ఎనర్జియోన్ మిల్క్ పౌడర్ ఫార్ములాలో ఏముందో తెలుసుకోవడానికి అఖిల్-అంజలి అందులో వాడుతున్న పదార్ధాల మూల కేంద్రం అయిన ఉక్రెయిన్ వెళ్తారు.ఆ తర్వాత ఏం జరిగిందీ సినిమాలో చూడాలి...

విభిన్నమైన పాత్రలకి పేరు పొందిన సూర్య హీరోగా ,'వీడొక్కడే' 'రంగం' వంటి విలక్షణమైన  చిత్రాల దర్శకుడు ఆనంద్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో  నిర్మించిన చిత్రం ఇది. అవిభక్త కవలలుగా సూర్య రెండు పాత్రలు  చెయ్యడం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.. స్వార్ధం  కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే సైంటిస్ట్ దుర్మార్గాన్ని  అతని పిల్లలే బయట పెట్టడం ...అనే మంచి కధాంశంతో చేసిన ఈ చిత్రంలో అవిభక్త కవలలు గా సూర్య ఉన్నంత వరకూ... సినిమా   మొదటి భాగం చాలా బాగుంది.విమల్ చనిపోయాక ఎనర్జియోన్ రహస్యాన్ని తెలుసుకోవడానికి అఖిల్ ఉక్రెయిన్ వెళ్లినప్పటినుండి సినిమా  ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సస్పెన్స్ తెలిసిన తర్వాత దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా నడపలేకపోయాడు.  మేధావి అయిన దర్శకులతో వచ్చే ఓ పెద్ద ఇబ్బంది ఏమిటంటే-వారు వారి స్థాయిలో ఆలోచిస్తూ సగటు  ప్రేక్షకుడికి  దూరంగా పోతుంటారు.అదే ఇందులోనూ జరిగింది.చిత్రంలో  సైన్స్ విషయాలు ప్రధానం  కావడం వల్ల, అవి  ప్రేక్షకులకు అర్ధం కాలేదు.ఇక రెండవ భాగం మొత్తం ఉక్రెయిన్ లో జరగడం ...అదీ సుదీర్ఘంగా సాగడం...ఆ భాగంలో  వినోదం ఏమాత్రం లేకపోవడం సినిమాని నిరాసక్తంగా మార్చాయి.ఆ సన్నివేశాల్లో  హీరోతోపాటు  హీరొయిన్ కూడా ఉన్నప్పటికీ, వారి మధ్య రొమాన్స్ ని  వినోదాత్మకంగా  వాడుకోలేకపోయారు. అవిభక్త కవలల  చిత్రీకరణ గొప్పగా వుంది. విరామానికి ముందు జాయింట్ వీల్ ఫై ఫైట్ ,ఉక్రెయిన్ అడవిలో ఫైట్ పీటర్ హైన్స్ బాగా చేసాడు. విమల్ చనిపోయాక అతన్ని అఖిల్ తో విడదీసే సన్నివేశం మనసులను కదిలిస్తుంది. హీరో క్రూరుడైన తండ్రిని ఎలకలకు  ఆహారంగా వదిలేసే  క్లైమాక్స్ సన్నివేశం  కూడా బాగుంది.

అవిభక్త కవలలుగా సూర్య అద్భుతం గా నటించాడు.రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపడానికి చాలా శ్రమించాడు.అంజలి గా కాజల్ కూడా బాగా చేసింది.సినిమా అంతా అందంగా కనిపించింది.అఖిల్ కి సూర్య తమ్ముడు  కార్తి, అంజలికి చిన్మయి చెప్పిన డబ్బింగ్ బాగుంది.సూర్య తండ్రి సైంటిస్ట్ రామ చంద్రగా సచిన్ ఖేడేకర్ ,తల్లిగా తార చేసారు.చాలా కాలానికి రవిప్రకాష్ కి ఇందులో చెప్పుకోదగ్గ  విలన్ పాత్ర లభించింది.హారిస్ జైరాజ్  హిట్  ట్యూన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే 'రాణి రాణి' వంటి  పాటల చిత్రీకరణ కలర్ ఫుల్ గా వుంది. నేపధ్య సంగీతం ,విజువల్ ఎఫెక్ట్స్ , సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ, అంటోనీ ఎడిటింగ్  బాగున్నాయి.                                                                              -రాజేష్  

Monday, October 8, 2012

జేమ్స్‌బాండ్ కు 50 ఏళ్లు

జేమ్స్‌బాండ్ 007...ఈ పేరు చెప్పగానే మనకు బాండ్ పాత్రలో ఒదిగిపోయే నటులు ఒళ్లు గగుర్పొడిచేలా చేసే అద్భుత యాక్షన్ సన్నివేశాలు, శత్రు రహస్యాలు రాబట్టే క్రమంలో సాయపడే అతివలతో సాగించే రాసలీలలు ఠక్కున గుర్తొస్తాయి. ప్రత్యేకించి బాండ్ పాత్రధారి మూడు అడుగులు ముందుకు నడిచి ఒక్కసారిగా పక్కకు తిరిగి తుపాకీని గురిపెట్టి కాల్చే....

Thursday, October 4, 2012

చీర నప్పదు కాబట్టే అనుష్క శర్మ టీషర్ట్

ప్రముఖ దర్శకనిర్మాత యశ్‌చోప్రా మరోసారి అవకాశం ఇవ్వడంతో బెంగళూరు బ్యూటీ అనుష్క శర్మ ఫుల్ ఖుషీగా ఉంది. రొమాన్స్ సినిమాలకు బాస్ అయిన యశ్ సినిమాల్లో హీరోయిన్లు తెలుపు షిఫాన్ చీరల్లో మెరిసిపోవడం రివాజు. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌తో ఆయన రూపొందిస్తున్న జబ్ తక్‌హై జాన్‌లో అనుష్క కూడా హీరోయిన్. అయితే ఇందులో మాత్రం ఆమె చీరలో కనిపించడం లేదు. కలల సాకారం కోసం ఎంతగానో శ్రమించే అమ్మాయిగా కనిపించాలి కాబట్టి....

ప్రచారం కోసమే శ్రీదేవికి ఎక్కువ శ్రమ

సినిమాలో నటించడం కంటే ఆ సినిమా గురించి ప్రచారం చేయడమే కష్టంగా ఉందని సెకండ్ ఇన్నింగ్ బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి పేర్కొంది. పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చిన తనకు నటించడం పెద్దగా కష్టంగా అనిపించకున్నా తాను నటించిన సినిమా గురించి ప్రచారం చేయడం కష్టంగా అనిపిస్తోందని చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు 15 సంవత్సరాలు కెమెరా ముందుకు రాని శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో మళ్లీ అభిమానుల ముందుకు ....

Tuesday, October 2, 2012

అమ్మగా జరీనా నేర్చుకోవాల్సింది లేదు

ఫరీదా జలాల్, నిరుపారాయ్, రాఖీ గుల్జార్... వీరందరూ బాలీవుడ్ హీరోలకు సినిమాల్లో అమ్మలు. కానీ తాజాగా బాలీవుడ్ హీరోలందరికీ అమ్మగా చెప్పుకుంటున్న పేరు మాత్రం జరీనా వహాబ్. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, జాన్ అబ్రహాంతోపాటు కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్న హీరోలకు కూడా జరీనా వహాబ్ అమ్మగా నటిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషా చిత్రాల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన జరీనా అకస్మాత్తుగా తెరపైనుంచి...

మల్లికా శెరావత్ పెళ్లి టైం దాటిపోయింది!