RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, October 25, 2013

' భాయ్' చిత్ర సమీక్ష

                                       ' భాయ్' చిత్ర సమీక్ష 2.25 /5




రిలయన్స్ సమర్పణ లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం ఫై వీరభద్రం దర్శకత్వం లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు . 

             పలుదేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించిన హాంగ్ కాంగ్ డాన్ డేవిడ్ తన కొడుకులు టోనీ , జేమ్స్ కన్నా భాయ్ నే ఎక్కువగా నమ్ముతాడు . హైదరాబాద్ లో ఒక గుర్తు తెలియని పోలీస్ అధికారి తన ముఖ్య అనుచరులను చంపేస్తున్నాడని తెలిసి -భాయ్ ని అక్కడికి పంపుతాడు . తమ వారిని చంపుతున్న పోలీస్ అధికారిని గుర్తించిన భాయ్ కి - అతన్ని చంపాలనుకున్న  సమయం లో తెలుస్తుంది ... 'అతను తన తమ్ముడు అర్జున్' అని  . అదేసమయం లో తన చెల్లెలు కూడా కలుస్తుంది.  ఆమెకు దగ్గరుండి పెళ్లిచేసేందుకు  వెడ్డింగ్ ప్లానర్ గా మారి, అడ్డంకులను తొలగించి  పెళ్లి జరిపిస్తాడు . అర్జున్ చేతిలో తన పెద్ద కొడుకు టోనీ చనిపోవడం తో, చిన్న కొడుకు జేమ్స్ తో  కలిసి ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి డేవిడ్ హైదరాబాద్ వస్తాడు .వారి బారి  నుండి  భాయ్  తన  వారిని ఎలా కాపాడుకున్నాడు ? అసలు ఈ భాయ్ గతమేమిటి ?అనేది సినిమాలో చూడాలి ...

 .              రెండు హాస్యప్రధానమైన చిత్రాలతో విజయవంతమైన దర్శకుడు వీరభద్రం ఈ సారి యాక్షన్ ప్రధాన చిత్రం చెయ్యడం విశేషం . "ఈ కధను ఏడేళ్ళ క్రితమే నాగార్జున కోసం తయారు చేసా"నని ఓ ప్రెస్ మీట్ లో వీరభద్రం చెప్పారు . ఈ సినిమా చూస్తే అది నిజమే అనిపిస్తుంది .ఎప్పుడో తియ్యాల్సిన కధతో ఈ చిత్రం ఇప్పుడు తీసారనిపిస్తుంది  . ఇలాంటి కధతో ఈ మధ్య కాలం లో 'గబ్బర్ సింగ్' ,'షాడో' తో సహా ఎన్నో సినిమాలొచ్చాయి . సరే, పాత కధతోనే అయినా- ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారా? 'తీర్ధానికి తీర్ధం- ప్రసాదానికి ప్రసాదం' అన్నట్లు తలా తోకా లేని సన్నివేశాలను గుదిగుచ్చి సినిమాగా మార్చారు .కామెడీ స్పెషలిస్ట్ అయిన దర్శకుడు -ఈ చిత్రం లో బ్రహ్మానందం వంటి నటులున్నా  హాస్యాన్నిబాగా  పండించ లేకపోయాడు .  మంచి కమర్షియల్ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఈ చిత్రానికి వున్నాఅందువల్లనే ఉపయోగం లేకుండా పోయింది .ఈ చిత్రం లో రత్నబాబు -సందీప్ రాసిన డైలాగ్స్ హైలైట్ . చాలా సన్నివేశాల్లో  పేలాయి .అయితే- ఏదన్నా మోతాదుకు మించితే ఇబ్బందే .ఇందులో అసందర్భ సంభాషణలు కూడా వినిపించాయి  .హీరో  మౌత్ ఆర్గన్ వాయించగానే చెల్లి 'అన్నయ్యా' అంటూ పరుగెత్తుకు రావడం- వంటి సిల్లీ సంగతులు  ఇందులో బోలెడు.  బిల్డప్ ఎక్కువ ఇచ్చిన  - హాంగ్ కాంగ్ డాన్ డేవిడ్ ని , పవర్ ఫుల్ పోలీస్ అధికారి అర్జున్ ని   సినిమా రెండవ భాగం లో డమ్మీలను చేసేసి సినిమాలో ఫోర్స్ ని చంపేశారు . 

             వయసు పెరుగుతున్నా నాగార్జున గ్లామర్ లో తరుగుదల లేదు . మూడు రకాల గెటప్స్ లో ఎంతో స్టైలిష్ గా, హుషారుగా చేసారు . తెలంగాణా  మాండలీకంలో మాట్లాడటం కూడా విశేషం . అయితే మాస్ యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం అతను గతం లో  చేసిన చిత్రాలు గుర్తుకొస్తాయి . హీరోయిన్ కావాలి కాబట్టి రిచా ను పెట్టారు .పాటల్లో ఆమె అందం గానే వుంది . కామ్న ఒక్క సీన్ లో  ఎందుకు వుందో అర్ధం కాదు . చెల్లిగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ జారా ఎంపిక కూడా కరెక్ట్ కాదు . ఆశిష్ విద్యార్ధి , సయ్యాజి షిండే, సోనూ సూద్ వంటి మంచి నటులను ఉపయోగించుకోలేక పోయారు . మందు మేన్షన్ రాజు గా ఎమ్మెస్ నారాయణ పాత్ర ...'రూలర్' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించడం బాగుంది . ఎన్నారై  విక్రం డోనర్ గా బ్రహ్మానందం పాత్ర  పర్వాలేదు.అతను అమీర్ పేట...అంబర్ పేటల మధ్య కన్ఫ్యూజ్  కావడం తమాషాగా వుంది . తమ్ముడు అర్జున్ గా స్నేహ భర్త ప్రసన్న ,ఇతర పాత్రల్లో నాగి నీడు , నర్సింగ్ యాదవ్, అజయ్ , పరుచూరి వెంకటేశ్వర రావు , జయప్రకాశ్ రెడ్డి ,రఘుబాబు , సత్యం రాజేష్ , వెన్నెల కిషోర్  తదితరులు నటించారు . కనువిందు కోసం ఒక పాటలో నటాలియా కౌర్ , మరో పాటలో హంసా  నందిని  కనిపించారు . దేవిశ్రీ ప్రసాద్ స్థాయి లో పాటలు లేవు కానీ, 'ఓకే' అనిపిస్తాయి . పాటల చిత్రీకరణ బాగుంది .రీ రికార్డింగ్ కూడా పర్వాలేదు .  సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది                        -రాజేష్ 

Monday, October 14, 2013

ఆస్కార్ రోడ్ లో 'ది గుడ్ రోడ్'

దర్శకుడు జ్ఞాన్‌ కొరీ తన తొలి చిత్రమైన గుజరాతీ సినిమా 'ది గుడ్‌ రోడ్‌' తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఆ చిత్రం విదేశీ భాషా చిత్ర విభాగంలో భారతదేశం నుంచి ఆస్కార్‌కు ఎంట్రీగా వెళ్ళింది. 'లంచ్‌ బాక్స్‌' కాకుండా ఈ చిత్రం ఎంట్రీగా వెళ్ళడం వివాదాస్పదమైంది. అదే సమయంలో తొలి సినిమాతోనే ఈ అరుదైన ఘనత సాధించిన జ్ఞాన్‌ను అభినందిస్తూ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. 60వ జాతీయ అవార్డుల్లోని ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఈ ఏడాది ఉత్తమ గుజరాతీ చిత్రంగా ఎన్నికైన ఘనత కూడా....

ఎంతైనా శ్రీదేవి కూతురు కదా మరి!



'పదహారేళ్ల వయసు' చిత్రంలో శ్రీదేవి వయసెంతో గుర్తులేదు కానీ, పదహారేళ్లున్న ఆమె పెద్దకూతురు జాహ్నవి కపూర్ మాత్రం ఇదే వయసులో.. అరంగేట్రం కోసం ప్రయత్నిస్తోందట! నవరస నటనామృతాన్ని ప్రేక్షకులకు ధారపోసిన శ్రీదేవి జ్ఞాపకాలను.. ఇప్పుడు జాహ్నవిలో చూసుకుని మురిసిపోయేందుకు ఆరాటపడుతున్నారు అభిమానులు. వారి కల నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాహ్నవి. ఈమధ్యనే జరిగిన ఒక ఫ్యాషన్‌షోలో అందరి దృష్టిలో పడిందీ అమ్మడు. అందులోను తొలిసారిగా ప్రత్యేక ఫోటోషూట్‌కు ఫోజులు ఇవ్వడంతో- కెమెరాలన్నీ ఈ చిన్నారి చిలకమ్మ వైపు తిరిగాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఫోటోలు అప్‌లోడ్ చేసే అలవాటున్న జాహ్నవి.. ఇప్పటికే బోలెడంత మంది అభిమానుల మనసుదోచుకుంది. రోజూ జిమ్‌కు వెళ్లడం, డ్యాన్స్ చేయడమంటే తనకిష్టమట! కరణ్‌జోహార్ తీయబోయే సినిమాతో జాహ్నవి తెరమీద మెరిసే అవకాశం ఉందని అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. తెలుగులో కూడా అగ్రహీరోల సరసన నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలూ వచ్చాయి. ఏవి ఎంత నిజమో కొన్నాళ్లు ఆగితేకానీ తెలియదు. జాహ్నవి అందరికీ ఇంత హాట్ ఫేవరెట్ అయ్యిందంటే.. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా మరి!

స్వచ్ఛమైన ప్రేమకోసమే మల్లికా షెరావత్

ఎదగాలనే తపనతో ముందుకు ...శ్రద్ధాకపూర్‌

‘ఎటువంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నా. ఫలానా పాత్రే కావాలని అనుకోవడం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయేవిధంగా నన్ను నేను మలుచుకుంటా. పరిశ్రమలో నాకంటూ ఒక స్థానం సంపాదించుకుంటా’ శ్రద్ధాకపూర్‌ అని తెలిపింది. ఆషిఖి 2 సినిమా హిట్‌ కావడంతో బాలీవుడ్‌లో మంచి స్థానం దక్కినట్టు నటి శ్రద్ధాకపూర్‌ భావిస్తోంది. సమకాలీక నటులతో పోల్చుకోవడం తప్పనిసరని అనుకుంటున్న శ్రద్ధ...అందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు....

రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ బురద పూసుకోలేను ! -కమలహాసన్

కళాకారుడనే పదానికి నిలువెత్తు నిదర్శనం కమలహాసన్. ఆరు పదులకు చేరువవుతున్న ఈయన ఐదు దశాబ్దాలు గా నటనా రంగంలో కొనసాగుతున్నారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నటులు ఇతరత్రా దృష్టి సారించడం పరిపాటి. అయితే కమల్ తన జీవితాన్నంతా నటనా రంగానికే అంకితం చేశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో తన మనసులోని భావాలను వెల్లడించారు....

Friday, October 11, 2013

'రామయ్యా వస్తావయ్యా' చిత్ర సమీక్ష

'రామయ్యా వస్తావయ్యా'   చిత్ర సమీక్ష      2. 5 / 5


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై హరీష్‌శంకర్‌ దర్శకత్వం లో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు


 ఎప్పుడూ నలుగురు అల్లరిచిల్లరి కుర్రాళ్ళను వెంటేసుకుని కాలేజీ పేరుతో అమ్మాయికి సైట్‌కొట్టేవాడు నందు (ఎన్‌టిఆర్‌ ). వేరే కాలేజీలో చదివే ఆకర్ష (సమంత) ఆకర్షణ కు  లోనై ఆమెను లైన్లే పెట్టడానికి రకరకాలుగా టీజ్‌ చేస్తుంటాడు. ఓసారి ఆ అమ్మాయిని కాపాడతాడు. దానితో తన అక్క పెళ్లికి నందును తన ఊరు తీసుకెళుతుంది ఆకర్ష. చట్టవ్యతిరేక వ్యాపారాలుచేసే ముఖేష్‌రుషికి.. శత్రువులునుంచి ప్రమాదం ఉండడంతో కూతురు పెళ్లికి కూడా..కార్డుఉంటేనే రానిస్తాడు. ఆకర్షతోపాటు వచ్చిన నందు... చిన్న ట్విస్ట్‌ఇచ్చి.... ఆమె తండ్రిని చుట్టుపక్కల అనుచరుల్ని చంపేస్తాడు. ఈ కేసును పోలీసుఆఫీసర్‌ రావురమేష్‌ డీల్‌ చేస్తూ... నందునే మీ నాన్నను చంపాడని  ఆకర్షకు చెప్పేస్తాడు.  మీ నాన్న నువ్వు అనుకున్నంత మంచివాడుకాదని- ఫ్లాష్‌బ్యాక్‌లో కథ చెబుతాడు హీరో . అదే సినిమా...

'గబ్బర్‌సింగ్‌' తర్వాత హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహించిన సినిమా, మాస్‌ హీరో ఎన్‌టిఆర్‌ కాంబినేషన్‌లో రావడంతో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంపై ఓ క్రేజ్‌ ఏర్పడింది. తెలుగు సినిమాలకు ఒకటే ఫార్మెట్‌ ఉందని దర్శకులు నిర్మాతలు నమ్మి సినిమాలు  తీస్తున్నారు.  నవరసారలపేరుతో అన్నింటిని కలిపి ఇదే చక్కటి భోజనం అంటూ.. వారే చెప్పేస్తున్నారు.  కొత్త పోకడలతో హీరోలను చూపించే ఒరవడిలో కథను రాసుకుంటున్నారు. కొన్ని సినిమాలకు కథలంటూ ప్రత్యేకంగా ఉండవు. సీన్‌నుబట్టి.. డైలాగ్‌లు,... దాన్నిబట్టి.. నడిపిస్తూ  పోతుంటారు. హరీష్‌శంకర్‌ ఈ చిత్రం కథ గురించి అడిగితే.. అదే చెప్పాడు .'కథంటూ పెద్దగా చెప్పడానికి ఏమీలేదు. చూడాల్సిందే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమానే తీశాను. ఏదో ఉద్దరిద్దామని కాదంటూ'  వల్లించాడు.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే.... హీరోయిన్‌ను టీజింగ్‌ చేయడం, బామ్మలచేత నాట్యం చేయించడం...కత్తులు కటారులతో కాళ్లు చేతులు నరకడమే?- అనే  కొత్త అర్థం వచ్చేలా ఈ చిత్రం లో చూపాడు . 

 పాత్రకు అనుగుణం గా  ఎన్‌టిఆర్‌ ...  ఎక్కడ ఏ ఎమోషన్స్‌ పలికించాలో... ఎక్కడ ఎలా డాన్స్‌ చేయాలో... ఎక్కడ డైలాగ్స్‌ ఎత్తుపల్లాలు పలకాలో అన్నీ బాగా చేశాడు. సమంత కూడా తన టాలెంట్‌ను పాత్ర లో  చూపించేసింది. ఫ్యాష్‌బ్యాక్‌లో వచ్చే శ్రుతిహాసన్‌ పాత్ర కొత్తదనంలేకపోయినా, రొటీన్‌ పార్మెట్‌లో చేసేసింది. తనికెళ్ళభరణి టీచర్‌గా , ముఖేష్‌రుషి కరడుగట్టిన వ్యాపారవేత్తగా నటించాడు. చిత్రంలో హైలైట్‌గా- మళ్ళీ అరుంధతి తరహాలోనే 'నచ్చింది కనపడితే చెంతచేరాలనే' పాత్రను మళ్ళీ రవిశంకర్‌ బాగా  పోషించాడు. అతని తండ్రిగా కోటశ్రీనివాసరావు పాత్ర చిన్నదే. పోలీసు అదికారిగా రావురమేష్‌ సరిపోయాడు. తనికెళ్ళ భరణి ,  రోహిణీ హట్టంగడి, అజయ్ కూడా ఇందులో వున్నారు.

చోటా  కె నాయుడు ఫోటోగ్రఫీ ఈ చిత్రానికే  ప్రత్యేక ఆకర్షణ .   థమన్‌ సంగీతం లో పాటలు గొప్పగా కాకున్నా కొన్ని  బాగున్నాయి .   బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో  కొంత గందరగోళం  చేశాడు.   'జాబిల్లి నువ్వే చెప్పమా...' అనే పాటను ఎంతో అందంగా తీస్తే బాగుండేది... జాబిల్లి సాంగ్‌లో వీధిలైట్లను పెట్టి తీయడం అతకలేదు.  ఎడిటింగ్‌ విషయంలో ఇకాస్త జాగ్రత్తపడాల్సింది. రొటీన్  కత్తిఫైట్లు... నరుక్కోవడాలు ఇంకా ఎడిట్‌ చేయాల్సింది. డైలాగ్స్‌ విషయంలో కొత్తదనం ఏమీలేకపోగా....' బుడ్డోడు' అనే మాటను ఎన్‌టిఆర్‌ చేత అనిపించి... ఫైట్స్‌ చేయించడం... ఒక్కటే కొత్తగాఅనిపిస్తుంది.

  పెద్ద హీరోలతో సినిమా చేయడం అంటే... ఏదో రకంగా తీసేస్తే... చాలు జనాలు చూసేస్తారనుకోవడం చాలా పొరపాటు.  ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా అంటే -  దర్శక నిర్మాతలకు, హీరోకు నచ్చింది చేయడమే అనుకుంటే ... అంతకంటే పొరపాటు..' నాకు నచ్చింది..  నాకు వచ్చింది..  చేయడం నా పాలసీ' అన్న హరీష్‌శంకర్‌ ప్రేక్షకుల్నీ దృష్టిలోపెట్టుకోవాలి. సమాజాన్ని బాగుచేయకపోయినా పర్వాలేదు. చెడగొట్టకూడదు అనే పాలసీని నమ్మి సినిమాలు తీయాలి.  గబ్బర్‌సింగ్‌ సినిమా తీసింది ఈయనేనా అనిపిస్తుంది.  కానీ ఇందులో కేవలం వ్యక్తిగత పగ, ప్రతీకారం నేపథ్యంలోసాగుతుంది.ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో రోహిణిహట్టంగల్‌తో ఎన్‌టిఆర్‌ను లవ్‌చేయడం, డాన్స్‌ చేయడం, తర్వాత మనవడు అంటూ సెంటిమెంట్‌ పలకడంవంటివి పెద్దగా వర్కవుట్‌ కాలేదు.  కధ లో విషయం తక్కువ ... హీరో బిల్డప్పులో మాత్రం చాలా ఎక్కువ .  సంభాషణల్లో పంచ్‌లకోసం ప్రాకులాడేకన్నా...కథ, కథనంలో కొత్తదనాన్ని చూపడం  చాలా అవసరం.  మొదటిభాగం ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాగానే వుందనిపిస్తాడు దర్శకుడు .సెకండాఫ్‌లో కథ ప్రారంభమవుతుంది. ఇందులోఎక్కువ ఎమోషన్స్‌  ఉన్నాయి. కానీ అయినా దేనికీ  ప్రేక్షకుడు కనెక్ట్‌కాలేడు. 'నరసింహుడు', 'దమ్ము' చిత్రాలు గుర్తుకువస్తాయి. భారీగా తీస్తే సరిపోదు.. ఇందులో చాలావిషయాలు  లాజిక్కులకు అందవు. ఏ లాజిక్కులు లేకుండా చట్టం అంటే ఎలా ఉండాలి.అంటూ స్పీచ్‌లు చెప్పేస్తే సరిపోదు. బొమ్మరిల్లు, బృందావనం వంటి చిత్రాల్లో కుటుంబ సంబంధాలు ,  మానవీయతను టచ్‌చేసి కాస్త హాస్యపు గుళికలతో ఆకట్టుకున్న  నిర్మాత దిల్ రాజు  ఎన్‌.టిఆర్‌తో - పగ, ప్రతీకారం...చంపడం, నరకడం వంటి అంశాలు పెట్టి  ఆకట్టుకోవాలనుకోవడం  తప్పే   
                                                                                                  -రవళి 

Friday, October 4, 2013

100 కోట్ల క్లబ్‌లోకి తెలుగు సినిమా ?

బాలీవుడ్‌ 100 కోట్ల క్లబ్‌ను దాటి.. 300కోట్ల క్లబ్‌లో ఎప్పుడో చేరిపోయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ 100కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా? అన్నదే ప్రశ్న. అయితే ఒకేసారి మనం అంత రేంజుకి వెళ్లిపోవడం కష్టమే. మన సినిమా పూర్తిగా ప్రాంతీయం. వేరే భాషల్లో మన హీరోలకు క్రేజు పెరగ లేదింకా. తెలుగు హీరోలకు ఇతర భాషల్లో మార్కెట్‌ పెంచుకునే వ్యూహం కొరవడడం వల్లే ఈ వెనుకబాటు తనం అని ఎప్పట్నుంచో విశ్లేషకులు విమర్శిస్తూనే ఉన్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌, మహేష్‌ లాంటివాళ్లకు...

కపూర్లు ఎంతో దయ చూపారు! -పల్లవీ శారద

రణ్‌బీర్ కపూర్‌తో పాటు అతని తల్లిదండ్రులు రిషి, నీతూ కపూర్‌లతో కలిసి నటించే అవకాశం కలగడం తనకు అదృష్టమని ఆస్ట్రేలియాలో పుట్టిన భారతీయ నటి పల్లవీ శారద అంటోంది. వీరందరూ కలిసి 'బేషరమ్' సినిమాలో నటించాను . 'మై నేమ్ ఇజ్ ఖాన్',' హీరోయిన్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తనకు బాలీవుడ్‌లో ఇంత పెద్ద నటీనటులతో కలిసి ప్రాధాన్యత గల పాత్రలో నటించే అవకాశం లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. కపూర్ కుటుంబం తనపట్ల....

సంతోషం కంటే సవాల్‌గానే తోచింది ! -వాణీకపూర్.

 నటనలోఅనుభవం లేకపోవడం వల్ల 'శుద్ధ్ దేసీ రొమాన్స్' షూటింగ్ సమయంలో చాలా కంగారు పడ్డానని చెప్పింది ఢిల్లీ యువతి వాణీకపూర్. ఇందులో సుశాంత్‌సింగ్, పరిణీతి చోప్రా ప్రధానపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. జైపూర్ నేపథ్యంగాసాగే ఈ ప్రేమకథను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆడిషన్‌లో అందరినీ మెప్పించిన వాణికి ఇందులో అవకాశం ఇచ్చారు. ఈ సంస్థ నుంచి ఎందరో పెద్ద నటులుగా ఎదిగారని, అందుకే షూటింగ్ సమయంలో ఎంతో బాధ్యతగా నడుచుకున్నానని....

రోబోలా నటించాను! -ఇలియానా

ఇలియానా డిసౌజా...అంటే పెద్దగా గుర్తుపట్టరు. కానీ ఇలియానా..అని కనబడ్డా, వినపడ్డా..థియేటర్‌కు ప్రేక్షకుడు తప్పక వస్తాడు. పొగురున్న అందమైన యువతిగా, తనదైన వ్యక్తిత్వంతో నడిచే కథానాయికగా తెరపైనే కాదు, తెరవెనుకా అదే తరహా అన్న సంగతి..ఇలియానా గురించి తెలిసినవారు చెబుతారు. సున్నితమైన, భావోద్వేగమైన మనస్తత్వం గల నటి ఇలియానా. ప్రతీ విషయంపై స్వతంత్ర భావాలతో అవగాహన కల్పించిన కుటుంబనేపథ్యం ఉండటం వల్ల ఆధునిక యువతిగా....

రంగు కాదు, విజయాలే ప్రధానం! - నందితా దాస్‌

నల్లగా ఉన్నావని ఎవరైనా అంటే ఏదో జరగరానిది జరిగి పోయినట్లు బాధపడిపోనని నందితా దాస్‌ అంటారు. కానీ తనను ఒంటి రంగును బట్టి పిలవడం ఏమిటని క్షణ కాలం ఆశ్చర్యపోతారు. తనలో అంతకంటె ఎన్నో చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నపుడు మేని ఛాయను బట్టి పిలవడం తప్పని గట్టిగా చెబుతారు. ఎవరి విషయంలోనైనా అలా మాట్లాడడం తప్పేనంటారు. ఒక మనిషి తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా అన్నది ఆ మనిషి వ్యక్తిత్వంలో భాగం కానేకాదని....

Thursday, October 3, 2013

ఆత్మ పరిశీలన చేసుకోవాలి!-గౌతమ్‌ ఘోష్‌

తాజాగా ఆస్కార్‌లో విదేశీ చలనచిత్ర విభాగంలో భారతీయ ఎంట్రీని ఎంపిక చేసిన జ్యూరీకి నేను అధ్యక్షుణ్ణి. సినిమాల స్క్రీనింగ్‌లో వచ్చిన వివిధ భాషా చిత్రాలను ఇతర సభ్యులతో కలసి చూశాను. అలా తెలుగు ఎంట్రీలను కూడా చూడడం జరిగింది. తెలుగు సినిమా ప్రమాణాలు బాగా లేవని అభిప్రాయ పడ్డాను -అని అంటున్నారు 'మా భూమి' చిత్రదర్శకుడైన గౌతమ్‌ ఘోష్‌ . విదేశీ చలనచిత్ర విభాగంలో ఆస్కార్‌ అవార్డుకు తుది భారతీయ ఎంట్రీగా తాజాగా గుజరాతీ చిత్రం 'ది గుడ్‌ రోడ్‌'ను ఎంపిక చేసిన జ్యూరీకి....