RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Tuesday, September 27, 2011

మహత్‌ తాప్సీ స్నేహితుడు మాత్రమేనట

యువ నటుడు మహత్‌తో తన స్నేహాన్ని భూతద్దంలో చూస్తున్నారెందుకని నటి తాప్సీ ప్రశ్నిస్తున్నారు. వీరి గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాప్సీ షూటింగ్‌కు వెళ్లినా, పార్టీలకు హాజరైనా మహత్ పక్కనే ఉంటున్నారని, ఇద్దరు ప్రేమలో మునిగిపోయారని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇలాంటి వార్తలపై తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహత్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, అయినా వదంతుల ప్రవాహం.....

యువరాణిగా కత్రినా కోరిక... అప్పుడు చూస్తానంటున్న సమంత

కత్రినాకైఫ్ కొన్నేళ్ళ క్రితం తెలుగులో ‘మల్లీశ్వరి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యువరాణిగా కనిపించి తెలుగు ప్రేక్షకులని కత్రిన అలరించిన విషయం తెలిసిందే. అయితే అది పూర్తినిడివిగల పాత్ర కాకపోవడంతో సంతృప్తి చెందని కత్రినాకైఫ్‌కు యువరాణి తరహా పాత్రలో నటించాలనే కోరిక మిగిలి పోయిందట. అయితే ఈ మధ్యే తెలుగు చిత్రం...

Friday, September 23, 2011

ఇంద్రుడు చంద్రుడు కాదు... బ్రహ్మానందం 'హాస్య కళా విధాత' అట


సంస్కృతిక సంస్థలు సన్మానాలు చేస్తూ , రక రకాల బిరుదులూ ఇస్తుంటారు. అందులోని పదాలు ఒక్కో సారి మరీ అతిగా ఉంటాయి. సన్మాన గ్రహీతలే ఏరి కోరి అటువంటి బిరుదులు స్వీకరిం చడమూ జరుగుతుంటుంది. ఇంద్రుడు, చంద్రుడు, సామ్రాట్ ,సార్వ భౌమ ...వంటి పదాలు ఈ బిరుదుల్లో పాతబడి పోయాయి. అందుకే సుబ్బరామిరెడ్డి బ్రహ్మానందానికి కొత్త తరహా బిరుదు ప్రధానం చేస్తున్నారు. 24 న జరిగే సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ విశాఖ శాఖ ప్రారంభ సభలో....

'దూకుడు' - Mahesh Babu's 'Dukudu' - చిత్ర సమీక్ష

'ఖలేజ' ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు, 'నమో వెంకటేశ' నిరాశ తర్వాత శ్రీను వైట్ల కలిసి చేసిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు. వారిని శ్రీను వైట్ల నిరాశ పరచలేదు. అయితే ప్రేక్షకులు ఆశించే కొత్తదనం కూడా ఈ చిత్రం లో ఎక్కడా కనిపించదు. చాలా సన్నివేశాలు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో, కొన్ని శ్రీను వైట్ల చేసిన సినిమాల్లో చూసినవే. పోలీసుగా, తండ్రిని కాపాడుకునే కొడుకుగా హీరో పాత్రీకరణ రొటీన్ గానే నడిచింది. కేవలం కామెడీ డ్రామా ఫై శ్రీను వైట్ల కున్న పట్టుతో , గోపీ మోహన్ ల సహకారం తో సినిమాను వినోదాత్మకం గా మలచడంలో....

Saturday, September 17, 2011

క్రిష్‌ దర్శకత్వంలో మహేష్... రేటు పెంచిన రామ్‌...'లేడీస్ టైలర్' గా సునీల్

మహేష్‌బాబు 'దూకుడు' పెంచాడు. ఓ సినిమా ఫినిషింగ్‌కు వచ్చేసరికి కాస్త స్పీడ్‌ పెంచాలని భావిస్తున్నాడు. 'దూకుడు' ముగింపులో ఉండగానే పూరి జగన్నాథ్‌తో 'బిజినెస్‌మేన్‌'మొదలెట్టాడు. అలాగే మరోపక్క వెంకీతో కలిసి మల్టీస్టారర్‌ చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌తో కూడా ఓ సినిమా.....

వయసుకు తగ్గ పాత్రల్లోనే...అజిత్

Wednesday, September 14, 2011

తెలుగు సినిమా మరో సారి చిన్నబోయింది...

నడవడికలోనూ జాగ్రత్తగాఅక్షయ్

అక్షయ్ కుమార్‌ పేరు వినగానే ఫిల్మ్‌మేకర్స్‌కు మినిమమ్‌ గ్యారెంటీ అన్న నమ్మకం వస్తుంది. ఖాన్‌ త్రయాన్ని తట్టుకొని ప్రేక్షకున్ని థియేటర్‌ వరకూ తీసుకొచ్చే సత్తా అక్షరుయ్ కుమారుకుందనేది బాలీవుడ్‌ నమ్మకం. అయితే ఈ స్టార్‌డమ్‌ సంపాదించడానికి, యాక్షన్‌ హీరో అనిపించుకోవడానికి అతనికి 20 సంవత్సరాలు పట్టింది. 1991లో 'సౌగంధి' అనే చిత్రంతో బాలీవుడ్‌ ప్రవేశం చేశాడు. 24 వయస్సులో అతను చూపిన హీరోయిజానికి విజయం దక్కకపోయినా, యువతను బాగానే....

Tuesday, September 13, 2011

ప్రేక్షకుల పల్సు - ఏక్తాకు తెల్సు

బుల్లితెరపై నవశకానికి నాంది పలికిన ఏక్తా కపూర్‌ సినిమా రంగంలోనూ సంచలన విజయాలు సాధించింది. టీవీ సీరియళ్ళలో కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏక్తా, సినిమాకు మాత్రం మసాలా జోడించడం విశేషం. విజయవంతమైన ఈ ఫార్మూలానే నేటికీ ఆమె కొనసాగిస్తోంది. బాలాజీ టెలీ ఫిలింస్‌ పేరిట తీసిన సీరియళ్ళు అనేకం విజయఢంకా మోగించాయి. ఆ సీరియళ్ళు వచ్చే సమయంలో మహిళలు టీవీకి అతుక్కుపోతారంటే....

ఇదంతా కాజల్ - ఎఫ్.హెచ్.ఎమ్ పత్రిక ఆడుతున్ననాటకం

అజయ్ దేవ్‌గన్ నటించిన ‘సింగం’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ ప్రముఖ పురుషుల పత్రిక ఎఫ్.హెచ్.ఎమ్ కవర్ పేజీపై టాప్‌లెస్‌గా దర్శన మిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అది నా ఫోటో కాదని, మార్ఫింగ్ ఫోటో అని ఎఫ్.హెచ్.ఎమ్ పత్రిక యాజమాన్యం నా ఫోటోతో చీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారని కాజల్ నానా హంగామా చేస్తూ ఎఫ్.హెచ్.ఎమ్ యాజమాన్యాన్ని కోర్టు కీడుస్తానని బెదిరిస్తోంది. ఇదిలావుంటే....

Monday, September 12, 2011

నేనొక పక్షి లాంటి వాడిని

'బుడ్ఢా... హోగా తేరా బాప్‌'లో ఒక సన్నివేశంలో హీరో విజు (అమితాబ్‌ బచ్చన్‌) గ్యాంగ్‌స్టర్‌ డెన్‌లో అనుచరులందరిని మట్టి కరిపిస్తాడు. ఇక డెన్‌ నాయకుడు కబీర్‌ (ప్రకాష్‌ రాజ్‌) మాత్రమే మిగులుతాడు. సాధారణంగా హిందీ సినిమాల్లో వచ్చే ఇలాంటి సన్నివేశాల్లో అప్పటిదాకా గంభీరంగా ఉన్న విలన్‌ ఒక్కసారిగా నీరుగారిపోతాడు. కానీ ఇక్కడ కబీర్‌గా తెరపై కనిపిస్తోంది ప్రకాష్‌ రాజ్‌. దాంతో చితకబాదటానికి విజు ఎదురుగా వచ్చిన నిలబడిన సందర్భంలో....

వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ పోటీ... అయ్యప్పమాల లో రామ్‌ చరణ్‌

వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. టాలీవుడ్ తరపున క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి టివితో మాట్లాడారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని కూడా ఆయన చెప్పారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి అయ్యే......

Sunday, September 11, 2011

కౌబోయ్ గా మహేష్ బాబు ?.... మంచు విష్ణు ఫై కేసు

Saturday, September 10, 2011

ఐశ్వర్య చిత్రంలో శ్రుతి మించిన రొమాన్స్

ధనుష్, శృతిహాసన్‌ల రొమాన్స్ దృశ్యాల పోస్టర్లు సంచలనం కలిగిస్తున్నాయి. ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘3’. ఇందులో కమలహాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా ధనుష్ భార్య ఐశ్వర్య తొలిసారిగా మెగా ఫోన్ పట్టారు. దీన్ని ఆర్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రచురించిన పోస్టర్లలో....

Friday, September 2, 2011

మహేష్‌బాబు ‘దూకుడు’కి విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌

మహేష్‌బాబు ‘దూకుడు’కి విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ఓవర్‌ అందిస్తున్నారు. ఈ సినిమాలో అత్యంత కీలకఘట్టం అయిన మాఫియా పరిచయం అంతా...వెంకీ స్వరంలోనే వినిపిస్తుందని సమాచారం. ఇటీవలే పతాకసన్నివేశాల చిత్రణ పూర్తిచేసుకుని.. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోందీ సినిమా. వెంకటేష్‌, మహేష్‌ల కాంబినేషన్‌లో శ్రీనువైట్ల ఓ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ దోస్తీ.. సినీవర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. మల్టీస్టారర్‌ సినిమాలంటే...

ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా