RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 28, 2012

తెలుగు వారంతా ఏకం కావాలి!తెలుగుదనం వెల్లివిరియాలి!!

ప్రపంచ తెలుగు మహా సభలు విజయవంతం కావాలి! తెలుగు వారంతా ఏకం కావాలి!! తెలుగుదనం వెల్లివిరియాలి!!! 

                                -రాంబాబు అడ్ల (సంపాదకుడు,ప్రచురణ కర్త) సినీ వినోదం.కామ్ (తొలి తెలుగు సినీ-సాంస్కృతిక వెబ్ సైట్)

ప్రేమ వ్యవహారంతో సంధ్య విరక్తి

సహనటుడితో కాస్త క్లోజ్‌గా మాట్లాడితే కథలు ప్రచారం చేస్తున్నారని నటి సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాదల్ ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ మలయాళి గుమ్మ తొలి చిత్రంతోనే ఉత్తమనటి అవార్డును అందుకుంది. తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటించిన సంధ్యకు కోలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. ఆమె కేరళకు మకాం మార్చినట్లు ....

Wednesday, December 26, 2012

'ఖిలాడీ 786'తో బాలీవుడ్ కి క్లాడియా సీస్లా

బిగ్‌బాస్-3లో అడుగుపెట్టి అందరి దృష్టినీ ఆకర్షించిన పోలిష్-జర్మన్ మోడల్ క్లాడియా సీస్లా ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ఖిలాడీ 786లో ఓ ఐటమ్ సాంగ్‌లో చిందేసింది. ఈ పాటతో తాను భారతదేశ సినీ పరిశ్రమలో చాలా పాపులర్ అయ్యానని చెబుతోంది ఈ 35 ఏళ్ల మోడల్-నటీమణి. ఖిలాడీ 786లో హీరో అక్షయ్‌కుమార్, నాయిక అసిన్‌తో కలిసి ఈ సుందరాంగి ఓ పాటలో డ్యాన్స్....

ప్రపంచ సుందరి ఒలీవియా కల్పోని

ఉత్కంఠతో సాగిన ప్రపంచ సుందరి పోటీల్లో విజేతని ప్రకటించి, మొత్తానికి తెరదించింది అమెరికా. భారత దేశంతో సహా 89 దేశాల సుందరాంగులు ఈపోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో న్యాయనిర్నేతలు రోడీ ఐలాండ్గకి చెందిన ఒలీవియా కల్పోని విజేతగా ప్రకటించింది. దానితో విశ్వసుందరి పోటీలు మొదలు పెట్టిన 60 సంవత్సరాల్లో 8వ సారి ఈ మకుటాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఫిలిప్పిన్స్‌కు చెందిన 23 ఏళ్ళ జనైన్‌ తుగాన్‌, వెనుజువెలాకు చెందిన ....

Saturday, December 22, 2012

తెర ఫైకి అర్జున్ కూతురు ఐశ్వర్య

అవును..వెండితెరపై మరో సౌందర్యం ఆవిష్కారం కానుంది. నాజూకుగా, నందివర్ధనంలా కనిపించే ఆ అందాల కథానాయిక పేరు ఐశ్వర్య. యాక్షన్‌కింగ్‌గా పేరు తెచ్చుకున్న నిన్నటితరం కథానాయకుడు అర్జున్‌ కూతురే ఈ ఐశ్వర్య. 'పట్టుత్తు యానై' అనే ఓ తమిళ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయం కానున్నట్టు ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. ఈ వార్తను నిజం చేస్తూ...

‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’తోనే నా కల...:అంజలి

Friday, December 21, 2012

''సారొచ్చారు'' చిత్ర సమీక్ష


''సారొచ్చారు'' చిత్ర సమీక్ష    2/5

త్రీ ఏంజల్స్  స్టూడియో పతాకం ఫై పరశురాం  దర్శకత్వంలో ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటలీ లో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ ను, తాను చాలా అందగత్తెననుకునే సంధ్య ఇష్టపడుతుంది .అతన్ని ప్రేమలోకి దించాలని చాలా ప్రయత్నిస్తుంది.అందుకు ఇష్టపడని కార్తీక్  ఇండియా కు తిరిగి వస్తున్న సమయం లో సంధ్యతో   - తనకు  ఇంతకుముందే  పెళ్లయ్యిందని చెబుతాడు.ఊటీలో ఫుట్ బాల్  కోచ్ గా వున్నపుడు వసు అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ....పెళ్ళికి ముందు బాగానే వున్న వసు, పెళ్లి తర్వాత వేధించడం మొదలుపెట్టిందని...ఆ కారణంగా ఆమెతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతాడు.అతనికి పెళ్ళయిపోయిందని తెలిసి సంధ్య బాధపడుతుంది.అయితే వసు తో వచ్చిన విభేదాల్లో, కార్తీక్ పరిస్థితిని అర్ధం చేసుకుని సానుభూతి చూపుతుంది.వారు ఇండియా కు తిరిగి  వచ్చిన తర్వాత సంధ్యకు,  కార్తీక్ పెళ్లి గురించి అసలు విషయం తెలుస్తుంది.ఆతర్వాత ఏం జరిగిందీ సినిమాలో చూడండి...

'సోలో' తో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పరశురాం ఇందులోనూ తనదైన శైలి చూపడానికి ప్రయత్నించాడు.పెళ్ళికి ముందు ప్రేమ  కాదు ,పెళ్లి తరువాత ప్రేమ ప్రధానం అనే  విషయాన్ని బలంగా చెప్పడానికి కష్టపడ్డాడు .  అందుకు ,కొన్ని చక్కటి సన్నివేశాలనూ సృష్టించాడు.సందర్భానుసారంగా  మంచి సంభాషణలు కూడా సమకూర్చాడు. అయితే మాస్ మహారాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ను క్లాస్ పాత్ర లో చూపాలనే సాహసం చేసి ఇబ్బందుల పాలయ్యాడు.రవితేజ తో ఈ కధను చెయ్యడమే సినిమాకు  పెద్ద మైనస్.రవితేజ నుంచి మంచి మసాలా సన్నివేశాలు,పంచ్ డైలాగ్స్ ఆశించే ప్రేక్షకులు నిరాస పడ్డారు. హీరోకు ముందే పెళ్ళయ్యిందంటూ- ప్రభాస్ 'డార్లింగ్' తరహాలో చూపిన ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు నిజంగా కధలో వుంటే బాగుండునని అనిపిస్తాయి. ఇటలీ లో ఐ.టి జాబ్ చేసే రవితేజను ఊటీ  ఫ్లాష్ బ్యాక్ లో ఫుట్ బాల్  కోచ్ గాచూపిస్తారు. సరే,అది ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాకే  కదా అనుకుంటే...క్లైమాక్స్ లో  మళ్ళీ  ఫుట్ బాల్  కోచ్ గా చూపిస్తారు.నారా రోహిత్ తో క్లైమాక్స్ సన్నివేశాలు బాగానే వున్నా, అటువంటి ముగింపులు గతంలో చాలా సినిమాల్లో చూసినవే కావడంతో ఆకట్టుకోలేదు.కారు ప్రయాణంలో హీరో హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పేవిధానం బాగుంది.  ఈ చిత్రం కధకూ, 'సారొచ్చారు' అనే పేరుకూ ఏ మాత్రం సంబంధం లేదు.


ఈ మధ్య చిత్రాల్లో  రెచ్చిపోయి చేసిన కామెడీకి భిన్నంగా రవితేజ కార్తిక్ గా  జంటిల్మన్ పాత్ర  ఇందులో  చేసాడు.అతను ఎంత సెటిల్డ్ గా,బాగా చేసినప్పటికీ-అతని ఇమేజ్  కి విరుద్ధంగా వున్నపాత్రలో  ప్రేక్షకులు అంగీకరించలేదు. సంధ్యగా కాజల్ ఎంతో చురుకైన పాత్రని చాలా చలాకీ గా పోషించి మంచి మార్కులు కొట్టేసింది .ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాక్ లో వసుగా రిచా బాగా నటించింది.కాజల్ బావగా ప్రత్యేక పాత్ర చేసిన నారా రోహిత్ క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా చేసాడు.ఈ కాలంలోనూ కాజల్ ని ప్రేమిస్తున్నానంటూ- నారా రోహిత్ 'సత్తెకాలపు' ప్రేమలేఖలు రాయడం బాగులేదు. కాసేఫైనా ప్లాటినం ప్రణీత్ గా  యం.యస్.నారాయణ నవ్వించాడు. ఇతర పాత్రల్లో జయసుధ,చంద్రమోహన్,శ్రీనివాస్ రెడ్డి,రవి ప్రకాష్ ,చిత్రం శ్రీను,మాస్టర్ భరత్  నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మొహమాటానికి ఈ సినిమా చేసినట్లు అర్ధమవుతుంది. పాటలు అతని మార్క్ తో లేవు."గుస గుసలాడుతోంది","కాటుక కళ్ళు" పాటలు గుడ్డిలో మెల్ల. రీరికార్డింగ్ బాగుంది. విజయ్ .కే.చక్రవర్తి ఫోటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ చిరాకు పుట్టించాయి-రాజేష్ 

Monday, December 17, 2012

నిజాయతీగా శ్రమిస్తే నిలదోక్కుకోవచ్చు:జాక్వెలిన్

ఏ రంగంలోనైనా నిజాయతీ, నిర్విరామ శ్రమతో అద్భుతాలు సాధించవచ్చని, బాలీవుడ్‌కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని బాలీవుడ్ నటి, శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెస్ చెబుతోంది. బాలీవుడ్ పోటీ తీవ్రంగా ఉందని, నిజాయతీగా కష్టపడితే నిలదొక్కుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటోంది. ‘సినీ పరిశ్రమలో పోటీ ఎక్కువ. ఇక్కడ మనుగడ సాగించాలంటే ....

Friday, December 14, 2012

'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్ర సమీక్ష


'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్ర సమీక్ష       3/5


తేజ సినిమా , ఫోటోన్ కధాస్ సంయుక్తంగా సి.కళ్యాణ్ నిర్మాణంలో గౌతం వాసుదేవ  మీనన్ దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందించారు.

వరుణ్-నిత్య చిన్ననాటి స్నేహితులు.వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఎన్నో సందర్భాల్లో వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తు తుంటాయి.కొన్నాళ్ళ పాటు దూరంగా వున్నా , వారు మళ్ళీదగ్గరవుతుంటారు.వరుణ్ తన కుటుంబం కోసం తన కెరీర్ ని మలుచుకునే సందర్భంలో  వరుణ్-నిత్య ల మధ్య వచ్చిన విభేదాలు తారా స్థాయికి చేరుకుంటాయి.చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాయించుకున్న వరుణ్ నిత్య ని కలవాలని ...తిరిగి ఆమె ప్రేమను పొందాలని ప్రయత్నిస్తాడు.అప్పటికే సోషల్ వర్కర్ గా మారిన నిత్య అతన్ని తిరస్కరిస్తుంది.దాంతో వేరే అమ్మాయి తో వరుణ్ పెళ్ళికి అంగీకరిస్తాడు.అది తెలిసిన  నిత్యకు   తను చేసిన తప్పు ఏమిటో అర్ధమవుతుంది.ఒకరినొకరు వదులుకోలేక వరుణ్-నిత్య లు పడ్డ మానసిక సంఘర్షణ కు ముగింపు ఏమిటనేది సినిమాలో చూడాలి....

మణిరత్నం వంటి దర్శకుల తర్వాత వచ్చిన దర్శకుల్లో  తనకంటూ  ప్రత్యేకత ను సంతరించుకున్న దర్శకుల్లో గౌతం మీనన్ ఒకరు. అతని చిత్రాలు రొటీన్ కధనం తో కాకుండా...పాత్రల ఆత్మ కధలా ప్రేక్షకుల మనసులకు దగ్గరవుతుంటాయి.సున్నితంగా ..సునిశితంగా చెప్పడం అతనిలో విశేషం. .ఇందులో వరుణ్-నిత్య అనే రెండు పాత్రల ప్రేమ పరిణామ క్రమం ఎంతో హృద్యం గా చూపించారు.  అసహమైన నాటకీయతకు తావు లేకుండా వారి స్నేహం...ప్రేమ...కలహాలు...ఎడబాటు...కలయికలను విపులంగా, సహజంగా చూపుతూ కధను నడిపించారు.అయితే ఈ క్రమంలో సినిమాలో చాలా చోట్ల నడక నెమ్మదించి...సాగదీసిన ఫీలింగ్ తో ప్రేక్షకులు  అసహనానికి గురవుతున్నారు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సన్నివేశంలో పది నిముషాల పాటు  లాంగ్ షాట్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు.క్లైమాక్స్ కూడా సుదీర్గంగా వుంది...అయినా బలమైన సన్నివేశం కావడంతో దాన్ని సహించారు. సినిమా ప్రారంభంలో ఒకేసారి వరసగా కృష్ణుడు,నానిలఫై రెండుపాటలు పెట్టడం ఎందుకో అర్ధం కాదు. 'సూర్య సన్  ఆఫ్ కృష్ణన్' తరహా లోనే ఇందులో, హీరో హీరోయిన్లను చిన్న వయసునుండి చూపడంలో విజయవంతం అయ్యారు. రవిప్రకాష్ పెళ్లి సంబంధం కేన్సిల్ తర్వాత, వారి ఇంట్లో సన్నివేశం మనసుని తాకుతుంది. ప్రేమ విఫలమైన నిత్య సోషల్ వర్కర్ గా మారడం బాగుంది. ప్రేమికులు ఇష్టపడే  సన్నివేశాలు ఇందులో బాగానే  వున్నాయి.  కాస్త క్లాస్ టచ్ వున్న చిత్రాలు చూడగలిగే యువతకు  ఈ చిత్రం బాగా నచ్చుతుంది.

వరుణ్ గా  నాని అ పాత్రని చాలా బాగా చేసాడు.ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎంతగానో ఆకట్టుకున్నాడు.నిత్య గా సమంత అన్నివిధాలా రాణించింది. వివిధ వయసులను ప్రతిబింబిస్తూ, తనలోని ప్రతిభావంతురాలైన  నటిని ప్రేక్షకుల ముందుంచింది. నాని ఫ్రెండ్ గా కృష్ణుడు పాత్ర కొంత రిలీఫ్ నిచ్చింది. రవిప్రకాష్, రవి రాఘవేంద్ర,వివేక్ పాథక్ ,అనుపమా కుమార్ ఇతర పాత్రలు పోషించారు.హీరో జీవా ఒకసారి తళుక్కున కనిపించడం ప్రేక్షకులకు బోనస్ . చాలా కాలం తర్వాత ఈ  ప్రేమ కదా చిత్రంలో  ఇళయ  రాజా సంగీతం ప్రత్యేకతను సంతరించుకుంది.'ఏది ఏది కుదురేది', 'లాయి లాయి హాయి','ఇంతకాలం కోరుకున్న' వంటి చాలా బాగున్న పాటలు ఇందులో  వున్నాయి .దర్శకుడి అభిరుచి మేరకు సందర్భానుసారం అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది.  గేయరచయితగా అనంత శ్రీరామ్  మరోసారి ఈ చిత్రాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.మసాలా రచయితగా పేరున్న కోనవెంకట్ కు ఈ చిత్రం నిజంగా కత్తిమీద సామే...ఐనా అతను న్యాయం చెయ్యగలిగాడు.   -రాజేష్ 

Thursday, December 13, 2012

సినీ చరిత్రలో కమల్‌హాసన్ సంచలనం

ప్రపంచ శృంగార నాయిక ప్రియాంక చోప్రా

అందానికైనా, ఆనందానికైనా కొలమానాలు సహజం. అందం అనేది ేకవలం ఒక్క కోణానిేక పరిమితం కాదు. ఒకొక్కరు ఒకో్క కోణంలో అందంగా కనిపిస్తారు. అరుుతే ఆ కోణాలు కూడా ఒక లెఖప్రకారం ఉంటేనే వాళ్ళని పోటీకి అర్హులుగా నిర్ణరుుస్తారు. అదే విధంగా శృంగార దేవతలుగా కూడా కొన్ని పోటీలు నిర్వహిస్తారు. అటువంటి పోటీల్లో కూడా లెఖ్ఖలు తప్పవు. పోటీలకు నిర్థేశించిన కొలమానాలకి సరితూగితేనే వారిని శృంగార తారగా ఎంపికచేస్తారు. వాళ్ళనే ‘మోస్ట్‌ సెక్సియస్ట్‌ వుమెన్‌’ అవార్డ్‌తో సత్కరిస్తారు. సెక్సీ అన్నంత మాత్రన ఇక్కడ విపరీతార్థాలు తీసుకోనక్కర్లేదు. శరీర అవయవ సౌష్టవం ఒక తీరుగా పోతపోసిన....

Tuesday, December 11, 2012

రాముడికి హనుమంతుడిలా...రజనీకి లారెన్స్


సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన పుట్టిన రోజు కానుకగా రజనీ సాంగ్ పేరుతో ఒక ఆల్బమ్‌ను అందించనున్నారు. గీత రచయిత అన్నామలై రాసిన ఈ రజనీ సాంగ్ ఆల్బమ్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు, వర్ధమాన నటుడు విజయ్ ఆంటోని సంగీతాన్ని అందించారు. ఈ ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది.

విశ్వరూపుడు కమల్ తో గోచీ కట్టించానా!

నటుడు కమల్‌హాసన్ సినీ భాండాగారమని నటుడు ప్రభు పేర్కొన్నారు. పద్మశ్రీ కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం విశ్వరూపం. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్‌కపూర్ ముఖ్యపాత్ర పోషించారు. బాలీవుడ్ సంగీత దర్శక త్రయం శంకర్ మహాదేవన్ - ఇషాన్ - లీ సంయుక్తంగా సంగీతాన్ని అందించారు.. ఆరా 3డి అనే ఆధునిక సౌండ్ సిస్టమ్‌లో....

Thursday, December 6, 2012

'ది టేస్ట్ ఆఫ్ మనీ' పుస్తకావిష్కరణ


అంతర్జాతీయ సినిమాకు కొన్ని ప్రమాణాలుంటాయనీ, మనకి పాటలు, డాన్సులు, ఫైట్లు, మెలోడ్రామాలు కావాలనీ, అలాంటప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో మన సినిమాలకి ఎలా పేరొస్తుందని సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ ఎడిషన్ ఎడిటర్ జగన్.. కాన్స్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించిన 15 సినిమాల కథలతో రాసిన 'ది టేస్ట్ ఆఫ్ మనీ' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు అందజేశారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కాన్స్ సినిమా మీద రాసినట్లే భారతీయ సినిమా గురించి కూడా జగన్ పుస్తకం రాయాలని కె.శ్రీనివాస్ ఆకాంక్షించారు. కొన్ని ప్రమాణాలు పాటిస్తే, సరిగ్గా చెప్పగలిగితే చిన్న కథతోటే మన సినిమాని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చనే సంగతిని ఈ పుస్తకంలో తెలియజేశానని రచయిత జగన్ చెప్పారు. ఈ పుస్తకాన్ని తన మాతృమూర్తికి అంకితమిచ్చారు. ఆమెను అక్కినేని చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్ గ్రూప్స్ అధినేత ఎ.రమేశ్ ప్రసాద్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

వేదాంతం సత్యనారాయణ శర్మ సంస్మరణ

'అపర సత్యభామ'గా విశ్వవిఖ్యాతి గాంచి, కుగ్రామంలోని కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన, లాస్య, సాత్వికాభినయ నాట్యాచార్యుడు డా.వేదాంతం సత్యనారాయణ శర్మ అని వక్తలు కొనియాడారు. 'యువకళావాహిని' ఆధ్వర్యంల
ో డిసెంబర్ 6న త్యాగరాయగాన సభలో ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ సంస్మరణ సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన డా.కె.వి.కృష్ణకుమారి మాట్లాడుతూ- వేదాంతం కూచిపూడి ప్రాశస్త్యానికి కృషి చేసిన మహోన్నతుడని పేర్కొన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు డా.శోభానాయుడు మాట్లాడుతూ- భామాకలాపంలో సత్యభామగా, విప్రనారాయణలో దేవదేవిగా, ఉషగా స్త్రీ పాత్రలో వయ్యారాలు ఒలకబోస్తూ తన అభినయంతో అందర్నీ మైమరపించే వారన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణ మాట్లాడుతూ- భామాకలాపం ఆయన కోసమే రాసినట్లుగా ఉందన్నారు. రంగ స్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ- వేదాంతం కూచిపూడి నాట్యానికి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారన్నారు. శర్మ పాత్రధారణ అవయవ సౌష్టవంతో, అభినయంతో స్త్రీ లోకాన్నే మరిపించేదని అన్నారు. నాట్యాచారిణి మద్దాళి ఉషాగాయత్రి, గజల్ శ్రీనివాస్, డా"వి.ప్రకాశరావు, వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Wednesday, December 5, 2012

నేను బాగుండడం ఇష్టం లేదా?:లక్ష్మీరాయ్

స్టేడియం పక్కకు ఎందుకు వెళ్లాలి. నేను బాగుండడం ఇష్టం లేదా? ఒకప్పుడు క్రికెట్ క్రీడపై ఆసక్తి చూపిన సంగతి నిజమే. అయితే ప్రతి సంఘటన జీవితంలో ఒక అనుభవమే. అది తీయని అనుభవం కావచ్చు, లేక చేదు అనుభవం కావచ్చు. అయితే క్రికెట్ అనేది నా వరకు మంచి అనుభవమా? చెడు అనుభవమా? అనేది అర్థం కాలేదు. ఇప్పుడు దానిపై దృష్టి సారించడం లేదు. షూటింగ్‌లతో చాలా బిజీగా....

Saturday, December 1, 2012

'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్ర సమీక్ష


 'కృష్ణం వందే జగద్గురుమ్'  చిత్ర సమీక్ష  3.5/5


ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం ఫై రాధా కృష్ణ (క్రిష్ ) దర్శకత్వంలో  సాయిబాబు జాగర్లమూడి , వై.రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

బి.టెక్ చేసిన  సురభి నాటక సంస్థ కళాకారుడు బాబు ఈ రంగం లో ఏ ఉపయోగం ఉండదని ,ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటాడు.తాత సురభి సుబ్రహ్మణ్యం  చెప్పినా  వినడు.ఆ బాధతో అతను చని పోతాడు.తాత కోరిక ప్రకారం  అస్థికలు అతని స్వగ్రామం బళ్ళారి చెరువులో నిమజ్జనం చేసి,అతను రాసిన 'కృష్ణం వందే జగద్గురుమ్' నాటకాన్ని అక్కడ ప్రదర్శించి, అమెరికా వెళ్లి పోవాలని బాబు తన నాటక బృందం తో వెళ్తాడు.అక్కడ అక్రమ ల్యాండ్ మైనింగ్ చేస్తూ స్వంత సామ్రాజ్యాన్ని నడుపుతున్న రెడ్డప్ప మనుషుల దౌర్జన్యానికి గురవుతారు.వారిని ప్రతిఘటిస్తున్న బాబు కు -రెడ్డప్ప అక్రమాలను బయటపెట్టేందుకు ఆధారాలు సేకరిస్తున్న మీడియా ప్రతినిధి దేవిక కలుస్తుంది.అనాధ అయిన  బాబుకు, అనుకోని విధంగా తన కుటుంబ విషయాలు తెలుస్తాయి.తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం లో బాబు ఎంతవరకు సఫమయ్యాడనేది  సినిమాలో చూడాలి...

చిత్త శుద్ధి ...డొక్క శుద్ధి వున్న దర్శకులు మన తెలుగు సినిమా రంగంలో అతి తక్కువగా వుండటం  వల్లనే మన చిత్రాల స్థాయి దయనీయంగా ఉంటుందనేది విచారించదగ్గ వాత్సవం. ఇటీవల వికసిస్తున్న కొత్తతరం మంచి దర్శకుల్లో రాధా కృష్ణ ఒకరు.సమాజం గురించీ ...మనిషి గురించీ అధ్యయనం చేసి, తాత్వికత మేళవించి సినిమాలు చేసి -ప్రేక్షకులను మెప్పించడం తేలికైన విషయం కాదు.'గమ్యం','వేదం' అందించి అభినందనలు అందుకున్న రాధాకృష్ణ ,మన కోసం మనం కాదు ...మంది కోసం బతకడం లోనే జీవిత సాఫల్యం వుందని చెబుతూ-ప్రేక్షకులను స్పందింప జేస్తూ  'కృష్ణం వందే జగద్గురుమ్'ను మంచి అనుభూతి మిగిల్చే సినిమాగా మలిచారు.రెగ్యులర్ సినిమాలో వుండే ఐటమ్ సాంగ్స్,ఫైట్స్ ,ట్విస్ట్ లు ఉన్నప్పటికీ 'ఆత్మ'ని కోల్పోకుండా సినిమాని నడిపించడమే ఈ దర్శకుడిలో గొప్పదనం.సురభి నాటక సమాజాన్ని సినిమాలో ప్రముఖంగా చూపడం అభినందనీయం.  సినిమా మొదటి భాగం చూసి ...అద్భుతమైన తెలుగు సినిమా చూసిన ఆనందాన్ని పొందే ప్రేక్షకుడు- రెండవ భాగం లో హీరో ఫ్లాష్ బ్యాక్ ద్వారా మేనమామ ఫై పగ సాధిస్తానంటూ తిరగడం ఇబ్బందినే కలిగిస్తుంది.అలాగే ఆంధ్ర-కర్నాటక సరిహద్దు  బళ్లారి లో కధ జరగడం తో- సహజత్వం కోసం పెట్టిన కన్నడ సంభాషణలు సగటు ప్రేక్షకుడుకి కొరుకుడు పడవు.అయితే, ఒక మంచి సినిమాలో ఇటువంటివి ప్రేక్షకుడు పట్టించుకోడు.దర్శకుడి పనితనంతో పాటు ఈ చిత్రంలో సిరివెన్నెల సాహిత్యం, సాయి  మాధవ్ సంభాషణలు,జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ,మణి శర్మ సంగీతం  హైలైట్స్ .సినిమాలోప్రధానంగా తీసుకున్న  అక్రమ  మైనింగ్ అంశం ... సిరివెన్నెల' పాట 'జరుగుతున్నది జగన్నాటకం'  ప్రస్తుత  అరాచకీయాన్ని కళ్ళకు కడతాయి.దర్శకుడి మార్గ దర్సకత్వంలో సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు చిత్రంలో ఎన్నోసందర్భాల్లో  'ఓహో' అనిపిస్తాయి...జీవిత సారాన్ని కురిపిస్తాయి.ఈ మధ్య రొటీన్ ట్యూన్స్ తో తెర మరుగై పోతున్న మణి శర్మ మరో సారి ఈ చిత్రం లో తన విశ్వరూపాన్ని చూపించాడు.సందర్భోచితంగా  పాటలూ, సినిమాకు ప్రాణం పోసిన అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు.  కధకు తగ్గ  దృశ్య వైభవాన్ని జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీతో అందించాడు.

హీరో గా చాలా  చిత్రాలు చేసినా, తన బాడీ లాంగ్వేజ్ కి పక్కాగా సూట్ అయ్యే బి.టెక్ బాబు  పాత్రలో  రాణించాడు దగ్గుబాటి  రానా. ఎక్స్ ప్రెషన్స్  లోనూ అభివృద్ధి సాధించాడు. అందంతో పాటు అభినయం లోనూ దేవికగా నయన తార రాణించింది.ఆమె తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.సురభి సుబ్రహ్మణ్యం గా కోట,రెడ్డప్ప మనుషులు నాలుక తెగ్గోసే  వీర్రాజుగా రఘుబాబు, రంగస్థల పండిట్ (రంపం)గా బ్రహ్మానందం, రత్నప్రభ గా హేమ, మట్టిరాజుగా ఎల్బీ శ్రీరామ్, రెడ్డప్పగా మిలింద్ గునాజి, చక్రవర్తిగా మురళీ శర్మ,టాక్సీ డ్రైవర్ టిప్పు గా పోసాని ,సత్యం రాజేష్,రవి ప్రకాష్,రూపా దేవి, మరి కొందరు సురభి కళాకారులు ఈ చిత్రం లోని పాత్రలను పండించారు.'బళ్ళారి బావ'పాటలో సమీరా రెడ్డి సరసన , వెంకటేష్ కాసేపు కనిపించి ఆనందింప జేశాడు.ఇందులో  ఓ ఇంగ్లీష్ తరహా డాన్స్ కూడా బోనస్.                                                         -రాజేష్