RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, July 30, 2011

భారీగా పరుచూరి సోదరుల సినిమా రజతోత్సవ వేడుకలు

అనువాదాలకే ఇది మంచి కాలం

ప్రస్తుతం చలనచిత్రరంగంలో అనువాదాల హవా నడుస్తోంది. స్ట్రెయిట్‌ చిత్రాలు భారీ సంఖ్యలో బేజారెత్తడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఎటువంటి సినిమాయైనా చీకట్లో రాయి విసరడమే. అందుకే అందరూ డబ్బింగ్‌ సినిమాలవైపు మొగ్గుచూపుతున్నారని సినిమాల మీడియేటర్‌ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. అనువాద చిత్రాలు 'గజని' కాకపోతుందా.. లేదంటే 'రోబో' అవ్వకపోతుందా.. అనే ఆశతో వ్యాపారాన్ని...

Thursday, July 28, 2011

మరణం ముందే తెలుసుకున్న అమీ వైన్‌ హౌజ్‌

పాపులర్‌ సింగర్‌ అమీ వైన్‌ హౌజ్‌ తన జీవితం ముగుస్తుందని తెలిసి చివరి రోజుల్లో తన స్నేహితులతో రోజూ మాట్లాడారు. దాదాపు మూడు వారాలపాటు ఆమె సంవత్సరాల నుంచి మాట్లాడని స్నేహితులకు మరీ ఫోన్‌ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం విశేషం. దీంతో అమీకి తన మరణం ముందే తెలుసని సన్నిహితులు భావిస్తున్నారు.
ఉత్తర లండన్‌లోని తన ఇంట్లో సింగర్‌ అమీ వైన్‌హౌజ్‌ శనివారం మృతిచెందారు. ఆమె చివరి ఆరు రోజుల పాటు ఉత్తర లండన్‌లోని కామ్డెన్‌లో ఉన్న తన నివాస గృహంలో రోజంతా తాగుతూ స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ గడిపారు. సంవత్సరాల పాటు మాట్లాడని.......

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పోటీలో విశాల్...విక్రమ్ ...

విశాల్...విక్రమ్...ఈ ఇద్దరిలో ఈ యేడాది జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎవరిని వరించనుంది? కమర్షియల్ హీరో అనే ఇమేజ్ నుంచి బయటపడి విశాల్ అవన్ ఇవన్ (తెలుగులో వాడు-వీడు)లో ప్రయోగాత్మక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ యేడాది జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యేందుకు ఆయన అన్ని విధాల అర్హుడని జాతీయ మీడియా సైతం అభిప్రాయ పడింది. అయితే ఇప్పుడు తాజాగా విశాల్‌కు విక్రమ్ రూపంలో పోటీ ఎదురుకాబోతుంది. దేవ తిరుమగన్ (నాన్న) చిత్రంలో మానసిక వైకల్యంతో బాధపడుతూ, ఐదేళ్ల పసిపిల్లాడి మనస్తత్వాన్ని....

Monday, July 25, 2011

పుట్టుమచ్చ వల్ల పవిత్రత దెబ్బతింటుందని భావించిన బాపు

పుట్టుమచ్చలు అతివల అందానికి మరింత వన్నె తెస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వెండితెర కథానాయికలు ఈ బ్యూటీస్పాట్స్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తారు. వాటిని తమలోని సెక్సప్పీల్‌కు సూచికగా భావిస్తారు. అయితే బాపు దర్శకత్వంలో ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీత పాత్ర పోషించిన నయనతారకు పుట్టు మచ్చ చిన్న అవరోధంలా మారింది. ఈ చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో నయనతార అద్భుతమైన అభినయాన్ని కనబర్చిందని....

ఆయన్ను చూసి స్ఫూర్తి పొందాను :దీపిక

Wednesday, July 20, 2011

హాలీవుడ్‌లో బెస్ట్ సౌష్టవ తారలు

అతివలు ముఖ సౌందర్యం గురించే కాదు తమ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకుంటే వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇటీవల లండన్‌లోని డైలీ మెయిల్‌ మ్యాగజైన్‌‌‌ నిర్విహంచిన బెస్ట్‌ బాడీస్‌ లిస్ట్‌లో ఆ సంస్థ అందంతో పాటు ఆరోగ్యవంతంగా ఉన్న మగువల గురించి వెల్లడించింది. కేవలం అందానికే పెద్దపీట వేయకుండా...మహిళల ఆరోగ్యంపైన, కొలతలపైన దృష్టి పెట్టి ఈ సర్వేని నిర్వహించింది. ఆ సర్వేలో పలువురు హాలీవుడ్‌ స్టార్లు అగ్రస్థానంలో నిలిచి....

గృహిణి శ్రీదేవి ఇంగ్లీష్‌ కష్టాలే ఈ సినిమా...

పదిహేనేళ్ల గ్యాప్‌ తర్వాత శ్రీదేవి మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'. టైటిల్‌ను బట్టి ఆంగ్ల నేపథ్యంలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రమని తెలుస్తూనే ఉంది. నిజం కూడా అదే. ఇంగ్లిష్‌ భాష తెలియని ఓ మధ్య తరగతి గృహిణి ఎదుర్కునే ఇబ్బందుల్ని....

Monday, July 18, 2011

నిరాశాజనకం - తెలుగు సినిమా ప్రథమార్థం

తెలుగు సినిమా రంగానికి కాలం ఇంకా కలిసిరాలేదు. ఆంగ్ల సంవత్సరాది వచ్చి ఆరు మాసాలు గడిచిపోయినా పర్‌ఫెక్ట్ హిట్స్ పెద్దగా పడలేదు. ఒకటీ అరా విజయాలతో ఆరు నెలల కాలం అలా అలా గడిచిపోయింది. నిజం చెప్పాలంటే ఈ యేడాది ప్రదమార్ధంలో వికసించిన సినీ కుసుమాల కంటే నేలరాలిపోయిన పువ్వులే ఎక్కువ. టాలీవుడ్ చరిత్రనే తిరగరాస్తాయని, పాత రికార్డుల్ని బద్దలు కొడతాయని భావించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో....

ఎన్టీఆర్‌- శ్రీనువైట్ల 'మాఫియా' ... వెంకటేష్‌ సరసన ఇలియానా

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో' ఊసరవెల్లి', బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న ఎన్టీఆర్‌, వీటి తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్‌లో తదుపరి ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. గణేష్‌బాబు నిర్మించే ఈ చిత్రానికి 'మాఫియా' అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇటీవల వచ్చిన' శక్తి', 'నేను నా రాక్షసి' చిత్రాలు పరాజయం పాలవటంతో ఇలియానా చాలా....

Saturday, July 16, 2011

ప్రపంచంలోనే ఉత్తమ తండ్రి జాక్సన్‌

పాప్‌ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన మైకేల్‌ జాక్సన్‌ బతికినంత కాలం విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఆయన నెవెర్‌ల్యాండ్‌ ఎస్టేట్‌లో హుందాగా బతికారు. చివరికి ఆర్థిక సమస్యలతో నెవెర్‌ల్యాండ్‌ను విక్రయించారు. కాగా జాక్సన్‌ మరణానంతరం ఆయన ఎంతగానో ప్రేమించి, నివసించిన నెవెర్‌ల్యాండ్‌ ఎస్టేట్‌ను తిరిగి కొనుగోలు చేయాలని ....

ముంబాయి పేలుళ్లు కథాంశంగా 'ఆపరేషన్‌ ముంబాయి'

26/11 ముంబారు పేలుళ్ల సంఘటనలను కథాంశంగా 'ఆపరేషన్‌ ముంబారు' అనే సినిమాను తీస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ చుట్టూ కథ నడుస్తుంది. 2008లో జరిగిన ఈ దారుణ సంఘటనల వెనుక ఉన్న విషయాల్ని పలు కోణాల్లో దర్శకుడు అజిత్‌ వర్మ చర్చింబోతున్నాడు. 'ఇది కేవలం హింసను పిక్చరైజ్‌ చేయటం కాదు. కొంతమంది యువకులు టెర్రరిజం వైపు ఎందుకు మోటివేట్‌ అవుతున్నారు ! చాలా రాక్షసంగా, మానవత్వం లేకుండా......

చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది

'కెరీర్‌ పదిలంగా ఉండాలంటే అందమొక్కటే సరిపోదు, అభినయ కౌశలం కూడా చూపాలి. రెండింటిలోనూ సమతూకం ఉండాలి' అని వివరిస్తోంది బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌. జీరోసైజ్‌ అందాలతో బాలీవుడ్‌ జనాన్ని అలరించింది. అలా అని కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, వైవిధ్యం ఉన్న పాత్రల్ని ఎంచుకుంది. ప్రస్తుతం కరీనా ముంగిట ఏడు సినిమాలున్నాయి. గత చిత్రాల అనుభవాల్ని....

బిజినెస్స్ లోకి బ్రిట్నీ స్పియర్స్‌...!

బేబీ వన్‌ మోర్‌ టైమ్‌..., ఊప్స్‌...ఐ డిడ్‌ ఇట్‌ అగెయిన్‌...’వంటి సూపర్‌ హిట్‌ పాప్‌ సాంగ్స్‌తో యువతను ఉర్రూతలూగించిన పాప్‌ క్వీన్‌ బ్రిట్నీ స్పియర్స్‌. ఆమె తన మొదటి రెండు హిట్‌ ఆల్బమ్స్‌తోనే పాప్‌ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా పాప్‌ సింగర్‌గా కొనసాగుతున్న ఆమె ఎంతో డబ్బు సంపాదించారు. ఈ డబ్బు వృథాగా ఖర్చుకాకుండా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి మంచి పెద్ద మొత్తంలో సంపాదించాలని....

Thursday, July 14, 2011

టాప్ 20 సెలబ్రిటీల్లో అమీర్ ఖాన్

అమిర్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, సల్మాన్‌ఖాన్‌లు సైబర్ ప్రపంచంలో టాప్-20 పాపులర్ సెలబ్రిటీలుగా నిలిచారు. ‘ఫేమ్‌కౌంట్’ వెబ్‌సైట్ రూపొందించిన ఈ జాబితాలో హాలీవుడ్ స్టార్ల హవా కొనసాగినా ఈ ముగ్గురు బాలీవుడ్ తారలకు కూడా చోటు లభించటం గమనార్హం. ‘గజినీ’, ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’ విజయాలతో మంచి ఊపు మీదున్న అమిర్‌ఖాన్‌కు టాప్-20 జాబితాలో పదో స్థానం దక్కింది. ఈ హీరోకి ‘ఫేస్‌బుక్’లో సుమారు 35,68,390 మంది అభిమానులు, సామాజిక సంబంధాల సైట్ ట్విట్టర్‌లో 8,47,524 మంది అనుయాయి(ఫాలోవర్)లున్నారు. ‘దేశీ గర్ల్’ ప్రియాంకా చోప్రా.....

షాహిద్‌తో డేటింగ్‌లో బిపాసా బసు

బాలీవుడ్‌ సుందరాంగి బిపాసా బసు గత కొన్ని రోజులుగా హీరో షాహిద్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తున్నారు. జాన్‌ అబ్రహంతో విడిపోయిన తర్వాత ఈ అందాలభామ షాహిద్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటూ కలిగి తిరుగుతుండడం విశేషం. పార్టీలు, ఫంక్షన్లలో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఈ కొత్త జంట.
బిపాసా బసు ఈ మధ్య తన స్నేహితులతో మాట్లాడుతూ తన జీవితంలో ఓ స్వీట్‌ గయ్‌...ప్రేవేశించాడని చెబుతున్నారు. అతనితో డేటింగ్‌ తనకు ఓ మధురానుభూతి అని ఆమె పేర్కొంటున్నారు. అతను మరచిపోలేని గిఫ్ట్‌లను ఇస్తూ అబ్బురపరుస్తున్నాడనీ....

Tuesday, July 12, 2011

ఇంటీరియర్‌ డిజైనర్‌గా షారుఖ్ భార్య గౌరీ

పలువురు హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఫ్యాషన్‌ డిజైనర్లుగా రాణిస్తుండడం తెలిసిందే. కానీ మన దేశంలో ఇటువంటి సెలబ్రిటీలు చాలా తక్కువమంది కనిపిస్తారు. కానీ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌ మాత్రం ఇంటీరియర్‌ డిజైనర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించడం విశేషం. ఇదివరకే స్టార్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఇంటీరియర్‌ డిజైనర్‌గా .....

మనం కోల్పోతున్నది చూపిస్తాం

..'నాకన్నా బలవంతుడ్ని ఎంచుకుంటాను. అతను శక్తి కోల్పోతున్నప్పుడు అలా కాదు, ఇలా అని సలహాలిస్తాను. తన శక్తుయుక్తులు పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశమమిచ్చి అప్పుడు రంగంలోకి దిగుతాను' అని సెలవిస్తున్నాడు. చిన్నప్పట్నించీ అలాంటి పోటీదారుడు ఎదురుకాలేదంట ! కైట్స్‌, గుజారిష్‌ సినిమా వైఫల్యాలతో రేసులో కాస్త వెనకబడ్డ హృతిక్‌...'జిందగీ నా మిలేగీ దోబారా' సినిమాతో మళ్లీ ....

Sunday, July 10, 2011

కొందరు నోరు తప్ప ఏమి కదపలేరంటున్నరామ్‌చరణ్‌

చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతవరకూ వివాదాలకు దూరంగా ఉండేవారు. ఆచితూచి మాట్లాడేవారు. కానీ తనయుడు రామ్‌చరణ్‌ మాత్రం కాస్త దూకుడుగానే వెళ్తున్నాడు. తాజాగా ట్విట్టర్‌లో ఆయన ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అది కాస్తా టాలీవుడ్‌లో వివాదానికి కేంద్రమవుతోంది. 'గొప్ప దర్శకులుగా పిలవబడే దర్శకులు ఈరోజు కేవలం వేదికల మీద ప్రసంగాలకు మాత్రమే ....

మహేష్‌బాబు సెల్ఫ్-హెల్ప్ సీక్రెట్

సినిమాల్లో ఎంతో సీరియస్‌గా రెండుమూడు డైలాగులు చెప్తూ మాటలను పొదుపుగా వాడే మహేష్‌బాబు కెమెరా బయట నిజజీవితంలో కూడా అలానే ఉంటాడు. పెదవుల మీద చిరునవ్వు చెరగదు. ఏ మాత్రం తొణకడు. ఇదెలా సాధ్యమవుతోంది మహేష్‌కి? సీక్రెట్ ఏమై ఉంటుందనే సందేహం వచ్చింది కదూ. దీని వెనక ఉన్న సింపుల్ సీక్రెట్ పుస్తకపఠనం. అవి కూడా స్వయంసహాయక (సెల్ఫ్-హెల్ప్) పుస్తకాలు. "ఆలోచనలు రేకెత్తింపచేసే ఈ పుస్తకాలే ఎదుటివ్యక్తులను ....

Saturday, July 9, 2011

సెలీనా కూడా లెస్బియనే అంటున్నారు

తరచుగా లెస్బియన్‌లు, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్లకు మద్దతు పలుకుతూ వార్తల్లోకెక్కుతున్నారు బాలీవుడ్‌ అందాల తార సెలీనా జైట్లీ. కానీ ఈ మద్దతుతో పలువురికి ఆమె పట్ల సందేహం కలుగుతోంది. ఆమె కూడా లెస్బియనే అని కొందరు ఆరోపిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో సెలీనా ఈ విషయంపై మాట్లాడి తనపై ఆరోపణలు చేసేవారు మతిలేని ....

జర్నలిస్టులు‘మాయగాడు’ యూనిట్ కు ప్లాటినం డిస్క్ లను .....

వేణు మాట్లాడుతూ - నేను నటించిన ‘గోపి గోపిక గోదావరి’ సినిమా చక్రి సంగీతం వల్ల మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తరువాత సంగీతపరంగా అంత మంచి పాటలు ఈ సినిమాకు కుదిరాయి. చక్రి చాలా మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాత ఈ సినిమా కోసం చాలా ....

Friday, July 8, 2011

రితీష్‌, జెనీలియాల రెండు పెళ్లిళ్లు

బాలీవుడ్‌ నటులు రితీష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియాలు ప్రస్తుతం పెళ్లైన కొత్త జంటలా కలిసి తిరుగుతున్నారు. వారిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌కు కలిసి వెళ్లడం, జెనీలియా తల్లి ముందు కూడా ఈ జంట కొత్త దంపతుల మాదిరిగా తిరగడం అందరికీ అనునాలు రేకెత్తిస్తోంది. జెనీలియా తల్లి కూడా వారిద్దరిని చూసి....

Thursday, July 7, 2011

15 నుండి హైదరాబాద్ లో కొరియన్ చిత్రోత్సవం

హైదరాబాద్ ఫిలిం క్లబ్ - హైదరాబాద్ నివాసిత కొరియన్ ల సంఘం నిర్వహణ లో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రసాద్ లాబ్స్ లో 15 నుండి కొరియన్ చిత్రోత్సవం జరుగుతోంది. ముంబై లోని కొరియన్ రాయభార కార్యాలయం సహకారం తోమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం లో ' మై గర్ల్ ఫ్రెండ్ ఈస్ యాన్ ఏజెంట్ ' ,' ఫర్ ఎవెర్ ది మూమెంట్ ' ,' ఏ బేర్ ఫుట్ డ్రీం ' , 'ఓల్డ్ పార్టనర్ ',' స్కాండల్ మేకెర్స్' చిత్రాలను ప్రదర్శిస్తారు. 15 సాయంత్రం 6.30 కు జరిగే ఈ ప్రారంభోత్సవం లో......

ఘనంగా ముగిసిన నాట్స్‌ సంబరాలు

సంప్రదాయ, జానపద నృత్యాలు, హాస్య కార్యక్రమాలు, మిమిక్రీ, జుగల్‌బంది, విలక్షణ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంగీత దర్శకుడు తమన్ తన బృందంతో నిర్వహించిన మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రూతలూగించింది. డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పిన డైలాగులు మెప్పించాయి. ఇవేకాక ప్రముఖ వైద్యులతో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాపు ఆర్ట్ గ్యాలరీ సందర్శకులను కట్టిపడేసింది. వేడుకలకు హాజరైన .....

Monday, July 4, 2011

ఆత్మతృప్తి కోసం మడోన్నా సేవా కార్యక్రమాలు

‘మన కోసం మనం బతకడం కామన్. కానీ జనాల కోసం బతికినప్పుడే ఆ జీవితానికి ఓ అర్థం ఉంటుంది’’ అంటున్నారు పాప్ స్టార్ మడోన్నా. గాయనిగా, నటిగా, దర్శకురాలిగా.. ఇలా సినిమాకి సంబంధించిన పలు శాఖల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు ఈ గ్లామర్ క్వీన్. మడోన్నాది కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అంతః సౌందర్యం కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. అందుకు నిదర్శనం ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలే.
2006లో ఆఫ్రికన్ కంట్రీకి చెందిన ఐదేళ్ల బాలుడ్ని, 2009లో ఆరేళ్ల పాపను దత్తత తీసుకున్నారు మడోన్నా. తన ఇద్దరు పిల్లలతో సమానంగా వీరిని....

దమ్మున్న హీరో షారుఖ్ ఖాన్

ఎటువంటి పాత్రలనైనా చేయగల దమ్మున్న షారుఖ్‌ఖాన్ హీరో నిర్వచనాన్చే మార్చేశాడని ప్రముఖ రచయిత, సినీ విశ్లేషకురాలు అనుపమ చోప్రా అన్నారు. ఆమె తాజా రచన ‘ఫస్ట్ డే, ఫస్ట్ షో:రైటింగ్స్ ఫ్రమ్ ది బాలీవుడ్ ట్రెంచెస్’ పుస్తకంలో షారుఖ్ జీవితం గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడిం చారు. ‘ముంబైలో ఓ మిట్ట మధ్యాహ్నం. అర్ధనగ్నంగా ఉన్న ఒక కుర్రాడి మెడలో లావైన బంగారు గొలుసు. చెదిరిపోయిన జుట్టులో వేళ్లు పెట్టి వెటకారంగా నవ్వుతూ.....

Saturday, July 2, 2011

కథానాయికల కథలు

సహజంగా చలనచిత్ర రంగంలో ఒక సినిమా హిట్‌ అయిందంటే అదేబాటలో మరికొన్ని సినిమాలు వస్తుంటాయి. కొన్నాళ్లు ఫ్యాక్షన్‌ కథాంశంతో... మరికొన్నాళ్లు లవ్‌ ట్రయాంగిల్‌తో...ి ఫక్షన్‌ కథాంశాలతో సినిమాలు వస్తుంటాయి. అవన్నీ కాదని ఇప్పుడు సరికొత్తగా సినిమా రంగంలో ఓ ట్రెండ్‌ నడుస్తోంది. పాతతరం సినిమా కథానాయికల ఆత్మకథలను బేసిక్‌గా తీసుకుని కొన్ని శృంగార చిత్రాలు రానున్నాయి. అసలు కథానాయికల తెరవెనుక గాథలను రసవత్తరంగా.....

సినీ నేస్తాలూ ఇక సెలవు!

సినీ నేస్తాలు ఇక సెలవు అంటూ నటి నయనతార గద్గద స్వరంతో నమస్కరిస్తూ కంటతడి పెట్టినట్టు తెలిసింది. ప్రభుదేవా, నయనతార త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో నయనతార నటనకు స్వస్తి పలకనున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన విల్లు చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకోవాలనే....

జేమ్స్‌బాండ్‌ హీరో రహస్య వివాహం

సిద్దార్థతో దీపిక పెయిడ్ డేటింగ్?

రముఖ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ మాల్యాతో బాలీవుడ్ సెక్సీభామ దీపికా పదుకునే డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ ఇటీవల ఐపిఎల్ మ్యాచ్ జరుగుతుండగా పబ్లిక్ గా లిప్ టు లిప్ కిస్ లు పెట్టుకున్న సంగతి అందరూ చూసిందే. అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ- ‘సిద్దార్థ మాల్యా ఎనర్జీని తట్టుకోవడం తనకు కష్టంగా వుందని తెలిపింది. సిద్దార్థలో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కవనీ, అవి కొంచెం తక్కువైతే....