RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, October 30, 2011

సెన్స్‌లెస్‌ 'సెవెంత్‌సెన్స్‌' [చిత్ర సమీక్ష]

సెన్స్‌లెస్‌ 'సెవెంత్‌సెన్స్‌' [చిత్ర సమీక్ష]
చారిత్రక, జానపద, పౌరాణిక కథాంశాలు...సినిమాలో చూపించాలంటే...రెండు వైపులా పదునున్న కత్తిని వాడటమే. ఏ మాత్రం పరిధి తప్పినా అభాసుపాలవటం ఖాయం. బద్రినాథ్‌, శక్తి...ఇలాగే చారిత్రక నేపథ్యాన్ని సరైన పంథాలో చూపలేక విఫలమయ్యాయి. అదే ధోరణిలో...ఈసారి
ఓ డబ్బింగ్‌ చిత్రమొచ్చింది. అంతే తేడా. 'సెవెన్త్‌సెన్స్‌' అంటే ఏడో జ్ఞానం. ఏడో జ్ఞానానికి...ఏడో శతాబ్దానికి... పొరుగుదేశానికి దర్శకుడు మురుగదాస్‌ ముడిపెెట్టబోయి గందగోళంలో పడ్డాడు. చారిత్రక నేపథ్యానికి కల్పనలు అతిగా జోడించటం దర్శకులకు అలవాటైపోయింది. దీనివల్ల ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించటమే అవుతుంది. మురుగదాస్‌ తీసుకొచ్చిన 'సెవెంత్‌సెన్స్‌' అలాంటిదే. 'మగధీర' కాన్సెప్ట్‌తో రావటంలో కొత్తదనమేంటో అర్థం కాదు. చైనాను విలన్‌గా చూపి ప్రయోజనం పొందాలని ప్రయత్నించి బోర్లాపడ్డాడు. ఏతావాతా సెన్స్‌లేని సినిమాగా
సెవెంత్‌సెన్స్‌ మిగిలిపోయింది.
ఇక కథలోకి వెళితే...16వ శతాబ్దంలో తమిళనాడుకు చెందిన పల్లవరాజు బోధిదర్మ (సూర్య) పలు విద్యలు నేర్చుకుని చైనా వెళతాడు. వారు అతన్ని దుష్టశక్తిగా భావిస్తారు. అక్కడ ఓ పల్లెలో అంతుపట్టని వ్యాధి సోకి ప్రాణహాని జరగడంతో తన వైద్యజ్ఞానంతో నయం చేస్తాడు. దాంతో పాటు శత్రువులెవరైనా హఠాత్‌గా దాడిచేస్తే ఎదుర్కొరేందుకు ఆత్మరక్షణ కళలో భాగంగా వశీకరణ (అదే సెవెన్త్‌సెన్స్‌) అనే ప్రాచీన యుద్ధ కళనీ వారికి నేర్పిస్తాడు. చివర్లో వారి కోరికమేరకు అక్కడే తనువు చాలిస్తాడు. తదనంతర కాల పరిస్థితులరీత్యా చైనీయులు ఆలోచనలు మారి.. బోదిధర్మ నుంచి నేర్చిన విద్యను భారత్‌కు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ఇప్పటి చైనా కుట్రపన్నుతుంది.
కట్‌చేస్తే... వర్తమానంలో.. జెనెటిక్‌ విద్యార్థి శుభ (శృతిహాసన్‌) బోదిధర్మ శక్తి పై పరిశోధన చేస్తుంది. అది ఫలిస్తే.. చైనీయుల కుయుక్తులు చెల్లవు కనుక.. ఆమెను చంపి, ఇండియాలో ప్రాణాంతకమైన వ్యాధిని పుట్టించమని డాంగ్‌లీ (జాన్‌ట్రీ) అనే వ్యక్తిని పంపిస్తుంది. అలా అతను ఓ కుక్కద్వారా వ్యాధి కణాలు చొప్పించి దేశం మొత్తం వ్యాపించేలా చేస్తాడు. మరోవైపు శుభ తన పరిశోధనల్లో బోదిధర్మ వంశీయులు ఉన్నారని తెలుసుకుని కాంచీపురం వెళ్ళి అరవింద్‌ (సూర్య) అతని వారసుడని తెలుసుకుని, తన ప్రయోగాలకు సాయపడమంటుంది. అందులో భాగంగా డిఎన్‌.ఎ.ద్వారా బోధిదర్మలోఉన్న శక్తిని అరవింద్‌లో ప్రవేశపెట్టే ప్రక్రియ మొదలుపెడుతుంది. ఇది తెలిసిన డాంగ్లీ ఏం చేశాడు? తర్వాత పరిణామాలు ఏమిటి? అన్నది సినిమా.
బుద్దిడి బోధనల్ని ఆచరించినవారు నాటి కాలంలో అనేకమంది ఉన్నారు. ఆ పరంపంరలో వచ్చినవాడే బోదిధర్మ. ఇతను చైనాకెళ్ళి ఆత్మరక్షణ విద్యల్ని నేర్పుతాడు. ఈయన వెళ్లి వైద్యం, యుద్ధ విద్యలు నేర్పడం వరకూ చరిత్రలో ఉందని కొంతమంది అంటారు. షావొలిన్‌లో అతనికొక మందిరాన్ని కట్టారట ! ఈ విషయమూ చాలామందికి తెలీదు.
అయితే బోదిధర్మ అనే వ్యక్తిని తీసుకొని, అనేక కల్పనలు జోడించి దర్శకుడు మురుగదాస్‌ కథను అల్లుకున్నాడు. తను ఎంచుకున్న కథలో చాలా డెప్త్‌ ఉంది. దానిని నేటి కాలమనానికి అన్వయించడంలో గాడి తప్పాడు. కథానాయకుడిని చివరి ఘట్టం వరకు పాజిటివ్‌గా ఉంచి చివర్లో తేల్చేయడం బాగోలేదు. హీరో శక్తి, విలన్‌శక్తి చూపించడానికే అల్లిన కథలా అనిపించింది.
హీరోయిన్‌ను చంపడానికి విలన్‌ వచ్చిన గమనంలో ఉత్కంఠత లేదు. సన్నివేశాల్లో డెప్త్‌లేదు. స్క్రీన్‌ప్లేలో పట్టులేకపోవడం ప్రధాన లోపం. ముందుగానే బోదిధర్మ గురించి చెప్పేసి...తర్వాత.. అరవింద్‌ గురించి చెప్పడంతో కథ తేలిపోయింది. బోదిధర్మ ఎపిసోడ్‌ సెకండాఫ్‌లో ఉండేలా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌లో జాగ్రత్తలు తీసుకుంటే కథ మరోలా ఉండేది. చివరి వరకు ఉత్కంఠ ఎదురుచూసే విధంగా లేకపోగా... హీరో, విలన్ల మధ్య జరిగే పోరాటాలే ఆకట్టుకున్నాయి. విలన్‌ పాత్ర ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో 'హాంటర్స్‌', టెర్నినేటర్‌ చిత్రాల్లో విలన్‌ శైలిని దించేశాడు. హాలీవుడ్‌లో హీరోగా చేసిన తను తమిళ సినిమాలో విలన్‌గా చేయడం విశేషమే.
సినిమాకు పెద్దగా ఉపయోగం లేకపోయినా బోధిదర్మ ఆహార్యం సూర్యకు నప్పింది. సిక్స్‌పాక్‌ బాడీని చూపించి సూర్య యూత్‌ను అలరిస్తాడు. శ్రతిహాసన్‌ నటన పెద్దగా చెప్పేదేమిలేదు. ఆమె పాత్ర కీలకమేకానీ కొన్ని సన్నివేశాల్లో బెరుకుగా కన్పిస్తుంది. మురుగదాస్‌ సినిమాలు సాంకేతికంగా ఉన్నతంగా ఉంటాయనేది పేరు. కానీ ఈ చిత్రంవరకు టెక్నికల్‌గా కూడా కొంత ఫెయిల్‌ అయ్యాడు. అరవింద్‌పై సూర్య కిరణాలు పడితే పడ్డ శ్రమ వృధా అవుతుందని శృతి చెబుతూనే.. మరుషాట్‌లో సూర్యకిరణాలపడడం.. వెంటనే బోదిధర్మశక్తి ఆవహించడం విచిత్రంగా అనిపిస్తుంది.
దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన డాంగ్‌లీ చేసే అరాచకాలు అవి ఇవీ కావు. పోలీసు క్వార్టర్లో ప్రవేశించి విచక్షణా రహితంగా చంపేయడం, రోడ్డుపై అరాచకాన్ని సృష్టించినా ప్రభుత్వం స్పందించకపోవడం వంటివన్నీ.... టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌లా అనిపిస్తాయి. గత చరిత్ర తెలియదని వేలెత్తిచూపే మురుగదాస్‌కు దేశానికి సంబంధిన వర్తమానకథను కేవలం ఆరుగురు సైంటిస్టులకే పట్టినట్లు, అసలు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించకపోవడం అనేది.. అసంబద్ధంగా ఉంది.
రవిచంద్రన్‌ ఫొటోగ్రఫీ ఫర్వాలేదు. ఒక్కపాటకూడా గుర్తుండేలా లేదు. హరీస్‌జైరాజ్‌ పాత ట్యూన్స్‌ ఇచ్చాడు. శంకర్‌లా 'అపరిచితుడు' తరహాలో గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకుని.. కథను ఎటునుంచో ఎటో తీసుకుకెళ్ళడంతో క్లారిటీ దెబ్బతింది. వశీకరణ విద్యే.. సెవెన్స్‌ సెన్స్‌.. అని చెప్పాడు. ఇప్పటి జనరేషన్‌ పసుపు ఒంటికి రాసుకోవడం మర్చిపోతున్నారు.. ఇంటిముందు పేడతో కళ్ళాపు జల్లడం తెలీదు...అంటూ క్లైమాక్స్‌లో సూర్య చెప్పటం, విదేశీయులు చెబితేనేగానీ నమ్మేట్లు లేరు అనడం...మరీ టూమచ్‌ అయింది. ఈ విషయాలు నేటి గ్రామాల్లో చాలామందికి తెలుసు. ఏదో చెప్పాలనుకుని ఏమీ చెప్పలేకపోయినట్లుంది. చేసిన ప్రయత్నం గొప్పదే. దాన్ని మరింత సెన్స్‌గా తీస్తే బాగుండేది.
దీపావళికి తెలుగు చిత్రాలేవీ లేకపోవడంతో రెండు అనువాద చిత్రాలు తమ సత్తా చూపేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో షారూఖ్‌ 'రా.వన్‌' అయితే, రెండవది సూర్య నటించిన 'సెవెన్త్‌సెన్స్‌'. సూర్యను తెలుగు హీరోగా చూడ్డం అలవాటుపడిన ప్రేక్షకులను రాబట్టేందుకు బంపర్‌ ఓపెనింగ్స్‌ ఎగ్జిబిటర్లు ప్లాన్‌చేశారు. అండర్‌ ప్రొడక్షన్స్‌లోనే ఆసక్తి రేకెత్తించే అంచనాలు విడుదలనాటికి మరింత పెరిగాయి. గజని తర్వాత వస్తున్న కాంబినేషన్‌ కావడంతోపాటు సూర్య విచిత్రమైన గెటప్స్‌ చర్చనీయాంశమయ్యాయి. కానీ సినిమా చూశాక ఆ అంచనాలు అందుకోలేదని తెలిసిపోతుంది.
                                                                                                                                                    - మురళి

Friday, October 28, 2011

రిలీజైన రోజే ఇంటర్‌నెట్‌లో 'సెవన్త్ సెన్స్', 'వేలాయుధమ్' చిత్రాలు

సయాలీ చెప్పిన బాలీవుడ్ బాగోతాలు

‘‘కొంతమంది మగాళ్లు ఆడవాళ్లను మాంసం ముక్కలా భావిస్తారు. ప్రతి ఒక్కరూ ఆ ముక్క కావాలనుకుంటారు. ఆ మాంసం ముక్కను దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా వెనుకాడరు’’ అని ఘాటుగా స్పందిస్తున్నారు సయాలీభగత్. ‘ది ట్రైన్’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయమైన ఈ మరాఠీ బ్యూటీ ‘బ్లేడ్ బాబ్జీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇటీవల ముంబయి మీడియావారికి ఆమె లిఖితపూర్వకంగా.....

Thursday, October 27, 2011

దీపికాకు దూరమైన సిద్దార్థ మాల్యా

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా తన యుడు సిద్దార్థ మాల్యా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీక్వీన్‌ దీపికా పదు కునేతో కలిసి పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతూ దర్శనమిచ్చి సిద్దార్థ మీడియాలో తరచుగా కనిపిస్తుం డేవాడు. కానీ కొద్ది రోజుల క్రితం దీపికా, సిద్దార్థల మధ్య మనస్పర్థలు వచ్చి వారిద్దరూ విడిపోవడంతో ప్రస్తుతం సిద్దార్థ ఒంటరిగా పార్టీలకు హాజరవుతున్నాడు. ప్రస్తుతం దీపికా, సిద్దార్థలు విడి,విడిగా పార్టీలకు హాజరవుతున్నా...

రన్వీర్ తో సోనాక్షి సిన్హా మరొసారి రొమాన్స్‌

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, హీరో రన్వీర్‌ సింగ్‌ల మధ్య కొంతకాలం పాటు కొనసాగిన రొమాన్స్‌ అర్ధాంతరంగా ముగిసింది. కొంతకాలం క్రితం వరకు జరిగిన ఈ రొమాన్స్‌ గురించి అప్పట్లో బాలీవుడ్‌లో పలువురు చర్చించుకున్నారు. కానీ ఇరువురి మధ్య మనస్పర్థల మూలంగా దూరమయ్యారు. కానీ త్వరలో షూటింగ్‌ జరుపుకోనున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమాలో ఈ జంట.....

Monday, October 24, 2011

అయ్యప్ప కటాక్షం వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డా:రామ్‌చరణ్‌

'ఆ రోజు సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డానంటే కారణం అయ్యప్ప కరుణా కటాక్షాల వల్లే. ఇదనే కాదు, జీవితంలో ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశం అయ్యప్ప దీక్ష చేయటం ద్వారా నాకు లభించింది' అని హీరో రామ్‌చరణ్‌ అంటున్నారు. రామ్‌చరణ్‌ అయ్యప్ప మాల ధరించటం ఇది ఏడోసారి.ఇటీవల శబరిమల వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. వీటి అనుభవాల్ని రామ్‌చరణ్‌ ఈ విధంగా చెబుతున్నారు... 'ఆస్తులు, అంతస్తులు, సౌకర్యాలు ఇవి కాదు.....

రణబీర్- నర్గిస్ ల ఘాటు ప్రేమ

చాక్లెట్ బాయ్ రణబీర్‌కపూర్, హాట్ గాళ్ నర్గిస్ ఫక్రి మధ్య ‘ఏ మాయ చేశావె’లాంటి ప్రేమకథ నడుస్తోంది. ఆ సినిమాలో నాగచైతన్య కంటే సమంత రెండేళ్లు పెద్ద. ఇక్కడేమో రణబీర్ కంటే నర్గిస్ మూడేళ్లు పెద్ద. అయినా ఫర్వాలేదు. ప్రేమకు వయసుతో పని లేదనుకున్నారో ఏమో ఇద్దరూ పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘రాక్‌స్టార్’ చిత్రంలో రణబీర్, నర్గిస్ జంటగా నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందన్నది....

'ఆయన’ను డెరైక్ట్ చేయడం సవాలే!:హేమమాలిని

హిట్‌పెయిర్‌గా పేరుతెచ్చుకున్న ధర్మేంద్ర, హేమమాలిని దంపతులు నటించిన ఎన్నో సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హేమమాలిని దర్శకత్వంలో ధర్మేంద్ర నటిస్తున్నారు. ఆయన నటించే సినిమాకు దర్శకత్వం వహించడం తనకు సవాల్‌గా మారిందని హేమ అన్నారు. ‘టెల్ మీ ఖుదా’ అనే ఈ సినిమాలో వీరి ముద్దుల కూతురు ఈశా డియోల్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ప్రతీ పాత్రలో జీవించే ధర్మేంద్రకు సినీ పాఠాలు చెప్పడం....

ఇకఫై ఒత్తిడి లేకుండా పనిచేస్తా:ఎ.ఆర్‌.రెహమాన్‌

స్వర మాంత్రికుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ మధ్య పూర్తిగా నల్లపూసైపోయాడు. పలు అంతర్జాతీయ ప్రోగ్రామ్స్‌తో చాలా బిజీగా గడుపుతున్నారు. ఓ రోజు లాస్‌ ఏంజిల్స్‌ స్టూడియోలో ఉంటే, మరొక రోజు ముంబైలో బాణీలతో కుస్తీపడతారు. ఆ తర్వాత రోజు చెన్నైకి కేటాయిస్తున్నారు. ఇలా పలు ప్రాంతాల్లో ఆయన సంగీతం ప్రయాణిస్తోంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌...ఇలా వివిధ చిత్ర సీమల్లో ఆయన తనదైన ట్యూన్‌ను వినిపిస్తున్నారు. ఈ మధ్య....

Thursday, October 20, 2011

స్టార్ హీరో ఒక్కడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ :రాంగోపాల్‌వర్మ


ఈ రోజుల్లో సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ దర్శకుడు కాదనీ, నిజమైన కెప్టెన్ స్టార్ హీరోనే అనీ రాంగోపాల్‌వర్మ అభిప్రాయపడుతున్నారు. "కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అనే అపోహని బాలీవుడ్ స్టార్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. స్టార్ హీరో ఒక్కడే కెప్టెన్ ఆఫ్ ద షిప్'' అని ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. 'శివ', 'రంగీలా', 'సత్య', 'కంపెనీ', 'సర్కార్' వంటి సినిమాలతో దర్శకుడిగా ఎంతో కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించిన వర్మ సినిమా వ్యాపారంలో స్టార్ హీరోలే నేడు కేంద్రస్థానంలోకి వచ్చారని....

ప్రేమ - తిరస్కారాన్నీ చవి చూశా :దేవానంద్

విమర్శలను విజయానికి మెట్లుగా మలచుకొని వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నానని ఎవర్‌గ్రీన్ హీరో దేవానంద్ చెప్పారు. ఆరు దశాబ్దాలకుపైగా బాలీవుడ్‌లో ఉన్న తాను ఎప్పుడూ ఇలాగే భావించానని తెలిపారు. ఈ 88 ఏళ్ల నటుడు నగరంలో మంగళవారం జరిగిన ‘ఎన్‌డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ కార్యక్రమంలో లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి....

Sunday, October 16, 2011

పౌరాణిక చలన చిత్ర సప్తాహం ప్రారంభం

నేటి సినిమాలు పొగిడే స్థితిలో లేవని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయినా తన తల్లిని తాను తిట్టు కోలేనని పేర్కొన్నారు. తెలుగు వైభవాన్ని చాటి చెప్పే మంచి చిత్రాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు శబ్దచిత్రం విడుదలై 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న పౌరాణిక చలన చిత్ర సప్తాహం ఆదివారం అమీర్‌పేట కమ్మ సంఘం హాల్‌లో ప్రారంభమైంది. కార్యక్రమానికి అక్కినేని ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీతత్వం ఉన్నప్పుడే ఏ రంగమైనా ముందుకు సాగుతుందని అన్నారు. పౌరాణిక పాత్ర అంటే ఇలా ఉండాలని చేసి చూపిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌కు దక్కుతుందని కొనియాడారు. పౌరాణిక చిత్రాలతోపాటు సామాజిక స్పృహ, చారిత్రాత్మక, హాస్య, శృంగార, ప్రేమ చిత్రాల ప్రాధాన్యాన్నీ చాటిచెప్పాలని సూచించారు. ‘మిస్సమ్మ’ చిత్రంలో మాత్రమే తాను అడిగి నటించానన్నారు.

కమ్మసంఘం, యువ కళావాహిని ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు పౌరాణిక చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు. మొదటి రోజు మాయాబజార్ చిత్రాన్ని ప్రదర్శిం చారు. శ్రీవేంకటేశ్వర మహత్మ్యం, లవకుశ, పాండవ వనవాసం, భక్త ప్రహ్లాద, సీతారామ కళ్యాణం చిత్రాలను వరుసగా ప్రదర్శిస్తారు. సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు చిత్రాలను విశ్లేషిస్తారని నిర్వాహకులు తెలిపారు. అంతకు ముందు శబ్దచిత్ర ఆద్యుడు హెచ్‌ఎం రెడ్డి చిత్రపటానికి అక్కినేని పూలమాల వేశారు. ఇటీవల మృతిచెందిన గేయ రచయిత జాలాది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు స్వాగతోపన్యాసం చేశారు. సినీనటుడు సాయిచంద్, ఎస్వీ రామారావు పాల్గొన్నారు.

Saturday, October 15, 2011

కరీనాకపూర్ కు అచ్చొచ్చిన తిట్ల పురాణం

కరీనాకపూర్ సాక్షాత్తు బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌పై తిట్ల దండకం అందుకుంది... ‘తేరే బాప్‌కీ’అం టూ . షారూక్‌తో జతగా కరీనా కపూర్ ‘రా.వన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో షారూక్ భార్యగా జీవితాన్ని సరదాగా అల్లరిచిల్లరగా గడిపే పంజాబీ అమ్మాయి పాత్రలో నటిస్తోంది కరీనా. ఇటీవలే ఈ చిత్రం తాలూకు ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. అందులోకరీనా షారూక్‌పై తిట్లతో విరుచుకుపడే సన్నివేశాల్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమోస్....

'ఇండియాస్‌ బెస్ట్‌ డ్రెస్స్‌డ్' వనితగా ప్రియాంకా చోప్రా

'అదిరేటి డ్రెస్సు నువ్వేస్తే దడ'- అంటూ ఫ్యాషన్‌ ట్రెండును ఆవిష్కరించిన సినీ గీతం ప్రియాంకా చోప్రాను చూసి ఇప్పుడు పాడుకోవాలి. ఎందుకంటే యావత్‌ దేశంలో ఈ ముద్దుగుమ్మ ముస్తాబుకి మరెవరూ సాటిరారని ఒక సర్వే చాటిచెప్పింది. సాధారణ దుస్తుల్లో కూడా స్టయిలిష్‌గా మెరుపులు మెరిపించే బాలీవుడ్‌ సుందరి ప్రియాంకా చోప్రా ’ఇండియాస్‌ బెస్ట్‌ డ్రెస్స్‌డ్‌’ వనితగా ఎంపికైంది. వస్తధ్రారణలో ఈ ఒయ్యారిదే అగ్రస్థానమని' పీపుల్స్‌ మ్యాగజైన్‌' తేల్చిచెప్పింది. సందర్భోచిత వస్తధ్రారణలో....

Friday, October 14, 2011

అది నా అదృష్టం:షారూక్‌ఖాన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనకంటూ ఒక ఇమేజ్‌ సృష్టించుకున్నారని, ఆయన చిత్రాలను రీమేక్‌ చేయడం సాధ్యం కాదని బాలీవుడ్‌ నటుడు షారూక్‌ఖాన్‌ అంటున్నారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ మరియు రెడ్‌ ఛిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో షారూక్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా రూపొందించిన చిత్రం 'రా.వన్‌'. తమిళ, తెలుగు, హిందీ భాషలలో ఈనెల 26న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్ర తమిళ ఆడియోను....

'సీతాదేవి' నయనతారకూ తమిళ నాట ఆలయం

కుష్బూ, నమితలకు అప్పట్లో ఆలయాలు కట్టించారని తమిళనాట ప్రచారం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రభుదేవాతో జతకట్టనున్న నయనతారకు కూడా తమిళంలో ఆలయం కట్టించేందుకు కొంతమంది అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నయనతార దక్షిణాది సినిమాలన్నింటిలోనూ నటించడంతో బాగా పాపులర్‌ అయ్యారు. త్వరలో నయనతార-ప్రభుదేవాలు పెళ్లిచేసుకోనున్నారు. తెలుగులో బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో కలిసి నయనతార ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీతాదేవి పాత్ర చేసింది . లేటెస్ట్‌గా ఆ చిత్రం తాలూకు నయనతార స్టిల్స్‌ కూడా.....

Wednesday, October 12, 2011

మాధురీ దీక్షిత్‌ స్వదేశ ఆగమనం

తన అందచందాలతో, హావభావాలతో బాలీవుడ్‌ను ఏలిన నాయికా మణుల్లో మాధురీ దీక్షిత్‌ ఒకరు. మాధురీ చేసే నాట్యమంటే అభిమానులు పడిచస్తారు. అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీరామ్‌ నెనేతో వివాహమైన తర్వాత అమెరికాకు వెళ్లిపోయింది. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి పలు కార్యక్రమాల్లో, షూటింగ్స్‌లో పాల్గొనేది. రాను రాను ఇండియా వైపు ......

ఎన్నింటినో అధిగామించాను :జయప్రద

సహజ సౌందర్య రాశి..ఒకనాటి యువత కలల రాణి..నేటి యువ అందగత్తెల రోల్‌మోడల్..ఇంతలా చెబుతున్నారు ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు.. ఇంకెవరు మన అడవిరాముడుతో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ చిందేసి..అక్కినేనితో మేఘసందేశం పంపిన నెరజాణ..మన జయప్రద..వయసు పెరిగినా వన్నె తగ్గని అందం ఆమె సొంతం..1980 ప్రాంతంలో భారతీయ ప్రఖ్యాత నటులందరి సరసన నటించి మేటి నటిగా కీర్తి గడించిన జయప్రద ఇప్పటికీ....

Tuesday, October 11, 2011

ఇది ఏ 'నాయిక' జీవితం?

దక్షిణాదిన ఆసక్తిని కలిగిస్తున్న చిత్రం 'నాయిక'. మలయాళంలో ఈ చిత్రాన్ని జయరాజ్ రూపొందిస్తున్నాడు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డుల్నే కాక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్న జయరాజ్ తీస్తున్నందువల్లే 'నాయిక' పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు తార అయివుండీ, మలయాళ చిత్రాల ద్వారా మూడుసార్లు జాతీయ నటిగా 'ఊర్వశి' అవార్డును పొందిన శారద జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారని.....

తెలుగు సినిమా రంగాన - బోగస్ రికార్డుల హంగామా


మంచి సినిమా తీసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. మన తెలుగు సినిమా రంగం లో మాత్రం ....పెద్ద ఆర్టిస్టులతో స్థాయి లేని సినిమా తీసి , మీడియా లో హైప్ చేసి ఓపెనింగ్స్ భారీగా రాబట్టుకోవాలని చూస్తారు. అంతటితో సరిపెట్టుకోకుండా ....తెలుగు సినిమా చరిత్రలో రికార్డ్ వసూళ్లు- అంటూ భోగస్ అంకెలతో జనాన్ని గందర గోళం లోకి నెడుతున్నారు. మొదటి వారం వసూళ్ళ రికార్డ్ పోయి, మొదటి రోజు వసూళ్ళ రికార్డ్ ....మొదటి ఆట రికార్డ్ అంటూ.....

Saturday, October 8, 2011

అభిరుచి గల నిర్మాత రాజశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Thursday, October 6, 2011

ఊసర వెల్లి' చిత్ర సమీక్ష

                                     ఊసర వెల్లి'  చిత్ర సమీక్ష         2/5                      

                            శ్రీ వెంకటేశ్వర  సిని చిత్ర పతాకం ఫై  సురేంద్ర రెడ్డి  దర్శకత్వం లో  భోగవల్లి ప్రసాద్  ఈ చిత్రాన్ని నిర్మించారు.
            టోనీ డబ్బు కోసం ఏ పని కైనా సిద్ధ పడే చిల్లర దొంగ . ఓసారి  కాశ్మీర్ లో తీవ్రవాదుల చేతిలో బందీ అయిన టోనీ కి నీహారిక అనే అమ్మాయి పరిచయమై ఆ తర్వాత కనబడకుండా వెళ్లి పోతుంది.  ఆతర్వాత నీహారిక మరో చోట తారస పడటంతో ... ప్రేమ పేరుతో , స్నేహం పేరుతో టోనీ  వెంటపడుతుంటాడు. ఆక్రమంలో అజ్జూ భాయి అనే మాఫియా డాన్ మనుషులని చంపుతుంటాడు. అయితే , వారిని టోనీ  చంపుతూ పోవడానికి  ఒక బలమైన కారణం ఉందని ...ఒకరికి ఇచ్చిన మాటకోసం అలాచేస్తున్నాడని ఆ తర్వాత తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బాక్ లో నీహారికకు  కూడా ప్రధాన పాత్ర ఉంటుంది . అది ఏమిటి? బలమైన మాఫియా డాన్ అజ్జూ భాయి తో తల పడ్డ టోనీ ఎలా నెగ్గుకు రాగలిగాదనేది ఈ చిత్రం లో చూడాలి.
                          గతంలో ఎలాంటి సినిమాలు చేసినా ' కిక్' తో మంచి కమర్షియల్ దర్శకుడిగా  మారాడనిపించుకున్న సురేంద్ర రెడ్డి ఈ చిత్రం తో ఒకే సారి నాలుగు మెట్లు దిగజారాడు.   ఏ చిత్రాని కైనా  మంచి కధ , కొత్తదనం...వినోదం ఉన్నకధనం అవసరం.  అర్ధం లేని వక్కంతం వంశీ  కధతో,  గందరగోళం  స్క్రీన్ ప్లే  తో, ఏ ప్రత్యేకతలు లేకుండా  ఈ చిత్రం నిర్మించారు.   ట్విస్టులు, ఫైట్లు  ఎక్కువై పోయి ప్రేక్షకుడిని  చిర్రెత్తించాయి.   మాఫియా  సన్నివేశాలు  పరమ  రొటీన్ గా ఉన్నాయి.  హీరో  ఫై నే పూర్తిగా ఆధార పడ్డారు.  అయితే, హీరో పాత్రీకరణ' కిక్' లో రవితేజ లానే ఉండటం ...  ఆ స్త్తాయిలోపండక పోవడం మైనెస్ అయ్యింది.  ఉన్నంతలో యన్. టి. ఆర్ బాగానే చేసాడు. పాటల్లో, ఫైట్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం లో కొంతవరకూ  సఫలం అయ్యాడు. అయితే 'యమ దొంగ' కు ముందు అతని శరీరం లో  ఉన్న భారీ తనం మళ్ళీ కనిపించి అతని గ్లామర్ ని దెబ్బ తీసింది.  ఇంటర్ వెల్  ముందు ఇర్ఫాన్ ని చంపడం  , క్లైమాక్స్ సన్నివేశాలు మరీ కృతకం గా ఉన్నాయి.    సినిమా ప్రారంభం లో కాసేపు బాగానే ఉందనిపించినా ....     ఆ తర్వాత సినిమాలో వినోదం శూన్యం .  దాని కోసం పెట్టిన  జయప్రకాష్ రెడ్డి - రఘు బాబు బృంద కామెడీ మరీ చప్పగా ఉంది. మంచి కామెడీ లేకపోవడం కూడా ఈ చిత్రం లో మరో పెద్ద లోపం.   తమన్నా నీహారిక గా కీలకమైన పాత్రని బాగా చేసింది.  అయితే ఆమె పాత్రలో ఉన్న మెలికలు, ప్రేక్షకుడి ని కూడా తికమక పెడతాయి. ఫ్లాష్ బాక్ లో  ఆమె హీరో నుండి 'వాగ్దానం'  తీసుకునే అత్యంత ప్రధానమైన సన్నివేశం కూడా పేలవం గా ఉంది.   అజ్జూ భాయి  గా ప్రకాష్ రాజ్ పాత పాత్రనే చేసాడు. శ్యాం ఓ చిన్న పాత్రలో కనిపించాడు. తమన్నా స్నేహితురాలిగా పాయల్ ఘోష్ ,ఇతర పాత్రల్లో రెహమాన్ , భరణి, సయ్యాజి షిండే ,మురళి శర్మ         
         కొరటాల శివ సంభాషణల్లో పస లేదు. ' కరెంట్ స్థంభం కూడా సన్నగానే ఉంటుంది' వంటి డైలాగులు  నవ్వు తెప్పించాయి.ఇటీవల  తెలుగు లో దేవిశ్రీ ప్రసాద్ బలహీనమైన సంగీతం అందించిన చిత్రం ఇదే.  పాటలు ఆకట్టుకోలేక పోయాయి. రీ రికార్డింగ్ పరిస్థితి కూడా అదే. పాటల చిత్రీకరణ కూడా అంతంత మాత్రమే. రసూల్ చాయాగ్రహణం పర్వాలేదు. రాం లక్ష్మణ్ త్రిల్ల్స్ చెత్తగా ఉన్నాయి.