RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, May 31, 2013

'ఇద్దరమ్మాయిలతో' చిత్ర సమీక్ష 2.5/5



పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్  పతాకం ఫై  పూరి జగన్నాధ్ దర్శకత్వం లో బండ్ల గణేష్  ఈ చిత్రాన్ని నిర్మించారు . 

              సైకాలజీ లో పీజీ చెయ్యడానికి కేంద్ర మంత్రి కూతురు ఆకాంక్ష  స్పెయిన్ వెళ్తుంది . అక్కడ ఆమె వుండే ఇంట్లో- గతం లో అక్కడ వున్న కోమలి డైరీ దొరుకుతుంది .దాని ప్రకారం ....  సంగీతం నేర్చుకోవడానికి అక్కడికి వచ్చిన కోమలి గిటారిస్ట్ సంజూ రెడ్డి తో ప్రేమలో పడుతుంది . వారి ప్రేమకు రెండు కుటుంబాల వారూ అంగీకరిస్తారు . ... ఆ తర్వాత జరిగింది డైరీ లో వుండదు . అయితే , సంజూ ఆకాంక్ష కు తారస పడతాడు .ఒక మాఫియ గ్యాంగ్ చేతుల్లో కోమలి చనిపోయిందని చెబుతాడు . క్రమంగా ఆకాంక్ష సంజు కి దగ్గరై అతనితో ప్రేమలో పడుతుంది . తన ప్రేమను సంజూ తో సహా , తల్లి దండ్రులకు కూడా చెప్పేస్తుంది .ఆ తర్వాత కధ  అనుకోని మలుపులు తిరుగు తుంది .... 

                 'దేశముదురు' కాంబినేషన్ పూరి-అల్లు అర్జున్ లతో వచ్చిన ఈ చిత్రం ఫై మంచి అంచనాలున్నాయి .
దీన్ని  భారీ బడ్జెట్ తో,చక్కటి సాంకేతిక విలువలతో , ఎక్కువ భాగం విదేశాల్లోనే చేసారు . అయితే బలహీన మైన కధ,కధనం వల్ల సినిమా అంచనాలను చేరుకోలేకపోయింది .తెలుగు సినిమా స్థాయి పెంచుకోవడం అంటే - కొత్తదనంతో సినిమాని చూపగలగడం లోనే తప్ప, అడ్డమైన కధలకీ విదేశాలకి వెళ్లి నిర్మాత డబ్బుని విచ్చలవిడిగా తగలెయ్యడం కాదని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది .   అందరూ చూసే చోట విలన్లు ఓ  హత్య చేసి,దాన్ని వీడియో తీసిందని చెప్పి, కోమలిని ... వారి కుటుంబాలను చంపాలనుకోవడం చాలా  హాస్యాస్పదంగా వుంది .మొదటి భాగం పర్లేదనిపించినా రెండవభాగం సహనానికి పరీక్ష పెడుతుంది . చివరిలో వచ్చే ట్విస్ట్-ఫ్లాష్ బ్యాక్ కొంతవరకూ బాగుంది . సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రదాన ఆకర్షణ . ఇందులోని పాటలన్నీ బాగున్నాయి . పాటల చిత్రీకరణ కూడా బాగుంది . మరీ ప్రత్యేకంగా అర్జున్ బృందం ఫై చేసిన మొదటి పాట చిత్రీకరణ కు అభినందించాలి . చివర్లో వచ్చే 'టాప్ లేచిపోద్ది' మాస్ పాట  కూడా మంచి ఊపుతో ఉంది  . రీ రికార్డింగ్ లో కూడా దేవి ప్రత్యేక శ్రద్ధ కనిపించింది .సినిమా అంతా  అందం గా చూపించిన  అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో మరో ప్రత్యేకత . విదేశీ డాన్సర్స్ తో పాటు,  లొకేషన్స్ కూడా బాగున్నాయి . భారీ ఖర్చుతో విదేశీ  ఫైట్ మాస్టర్ కెచ్చా చిత్రీకరించిన  ఫైట్స్ బాగున్నాయి . ప్రత్యేకంగా ఇంటర్వెల్ ముందు  చాకు ఫైట్  కొత్తగా వుంది . అయితే , సినిమాలో ఫైట్స్ మోతాదుకు మించాయి . అందులోనూ  హింస ఇంకా ఎక్కువయ్యింది . సెన్సార్ వారి సౌజన్యంతో వీటిని విజయవంతంగా ప్రేక్షకులకు అందించారు . 
               
                   సంజు గా అల్లు అర్జున్ స్టైలిష్ గా నటించి పాత్రకు న్యాయం చేసాడు . పాత్ర కు అనుగుణంగానే  అయినప్పటికీ -అవసరాన్ని మించి నిర్మాత డబ్బు ఖర్చు చేయించి, నటుడిగా తన కోరికల్ని తీర్చుకున్నాడు .సంప్రదాయిక అమ్మాయి కోమలిగా అమలా పాల్ బాగా చేసింది . ఆకాంక్ష గా కేధరిన్ అందం గానే వున్నా,నటన కొంచం అతిగానే అనిపించింది .కేధరిన్ తొడలు చూపించడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు . బర్రె లాంటి మాఫియాడాన్ తో ఆమె పెళ్లి కెలా  వప్పుకుందో అర్ధం కాదు . ఫిడేల్ బ్రహ్మిగా ఒక్క పాటలో తప్ప బ్రహ్మానందం ఆకట్టుకోలేకపోయాడు . ఇక మెంటల్ అలీ తో బ్రహ్మానందం కామెడీ చిర్రెత్తించింది . ఇతర పాత్రలు  షవర్ అలీ , రావు రమేష్ , సుబ్బరాజు , భరణి , తులసి , ప్రగతి , నాజర్ , ప్రియ , ఖయ్యుం , శ్రీనివాస రెడ్డి పోషించారు.  -రాజేష్ 

Wednesday, May 29, 2013

ఆ పాత్ర చేసి, సిగ్గు పడ్డాను! -అమలాపాల్

ఇకపై వివాదాస్పద పాత్రల్లో నటించనని నటి అమలాపాల్ స్పష్టం చేసింది. నిజం చెప్పాలంటే అలాంటి పాత్రతోనే ఈ కేరళ కుట్టి పేరు కోలీవుడ్‌లో మార్మోగింది. తొలుత సొంతగడ్డపై నటిగా తెరంగేట్రం చేసింది అమలాపాల్. తర్వాత తమిళంలో చిరు బడ్జెట్ చిత్రాల్లో నటించింది. అలా నటించిన చిత్రం సింధు సమవెలి. సామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేనమామతో సంబంధం పెట్టుకునే పాత్రలో....

Saturday, May 25, 2013

హాట్‌ హాట్‌ నటీమణి ఎవరు?

అందాల ఆరబోతలో నటీమణులు ఒకరితో ఒకరు పోటీపడు తున్నారు. సెక్సీగా కనిపించడం కోసం ఆరాటపడుతు న్నారు. హాలీవుడ్గ, బాలీవుడ్గ ఇలా ఏ రంగంమైనా అంగాంగ ప్రదర్శనకు సిద్ధం అంటూ ముందుకు వస్తున్నారు. కురక్రారును వెర్రెత్తించడంలో ఎవరు ముందు అంటూ పరుగుతీస్తున్నారు. ఇది సినిమాలేక పరిమితం కాదండోయ్‌... సెక్సీయెస్ట్‌ సుందరాంగులు కోసం ఏటా వందలాది సర్వేలు జరుగుతాయంటే ఆశ్చర్యపోవా ల్సిన అవసరం లేదు. అవన్నీ వీరి అందాల ప్రదర్శనకు కొలమానం అనే చెప్పాలి. 2013లో హాటెస్ట్‌ నటీమణులు ఎవరనే ఆసక్తికర విషయాలు ...

గాడ్‌ఫాదర్‌ లేకుండా..ఇన్నేళ్లుగా:దియా మీర్జా

సామాజిక మార్పు తీసుకురావటంలో సినిమా ఒక బలమైన మాధ్యమం అన్నదాన్ని నేను నమ్ముతాను. నటుడు కావచ్చు, కథలు రాసే వ్యక్తి కావచ్చు..తప్పకుండా సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాల్సిందే. ప్రతీ సినిమా ఇదే మూసలో నడవాలని నేను చెప్పటం లేదు. సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాలను ప్రతిబింబించేట్టు సినిమాలో కొంత చోటు కల్పిస్తే ...

లూలియాతో సల్మాన్ ప్రేమ

సంగీతా బిజలానీ, సోమీ అలీ, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్... ఇలా సల్మాన్‌ఖాన్ ప్రియురాళ్ల జాబితా చాలానే ఉంది. ఈ ముద్దుగుమ్మలతో సల్మాన్ ప్రణయ గీతాలు పాడుకున్నప్పుడు, కచ్చితంగా మూడు ముళ్లు వేసేస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ‘లూలియా వంటూర్’తో ఈ కండలవీరుడు సాగిస్తున్న ఎఫైర్ పెళ్లికి దారి తీస్తుందనే టాక్....

Wednesday, May 22, 2013

శర్మణ్‌జోషితో యామీగౌతం రొమాన్స్?

'వికీ డోనర్‌'లో నటనకు మంచి మార్కులు సంపాదించుకున్న బ్యూటీ యామీగౌతమ్ తాజా సినిమాలో శర్మణ్‌జోషితో ఆడిపాడుతుందట. నిర్మాత, రచయిత అంజుమ్ రిజ్వీ తీస్తున్న తదుపరి సినిమాకు ఆమె సంతకాలు చేసింది. ‘మా సినిమాలో ఆమెకు భాగం కల్పించాలని నిర్ణయించాం. ఆమె తప్పకుండా ఈ సినిమా చేస్తుంది. శర్మణ్‌జోషితో సంప్రదింపులు ....

జయాపజయాలను సమానంగానే చూస్తా!-కంగనా రనౌత్

పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో చేసినందువల్ల సినిమా కెరీర్‌లో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేర్కొంది. సినిమారంగంలోకి అడుగిడిన తర్వాత తాను చేసినవన్నీ దాదాపు భారీ ప్రాజెక్టులేనంది. కంగనా నటించిన ‘షూటౌట్ ఎట్ వడాలా’ ఈ ఏడాది ఈ భామ కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచింది. గ్యాంగ్‌స్టర్, ఫ్యాషన్, వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై, రాజ్-2 వంటి సినిమాలతో ....

నా సంసారం ఇబ్బందుల్లోనే వుంది !-చిత్రాంగద సింగ్

గోల్ఫ్ క్రీడాకారుడైన భర్త జ్యోతి రంధవాతో విడాకులు తీసుకుంటోందంటూ వచ్చిన వార్తలన్నీ అబద్ధాలని స్లిమ్‌బ్యూటీ చిత్రాంగద సింగ్ చెప్పింది. అతనితో కలిసి గుర్గావ్ కోర్టుకు వెళ్లిన మాట నిజమే అయినా, అది ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మాత్రమేనని వివరించింది. ఈ దంపతుల మధ్య గొడవలు బాగా ముదరడంతో గుర్గావ్ కుటుంబ న్యాయస్థానంలో శుక్రవారం విడాకుల పిటిషన్ వేశారంటూ మీడియా వార్తలు వచ్చాయి. ‘నా సంసారం కాస్త ఇబ్బందుల్లో....

Monday, May 20, 2013

మళ్ళీ చేసేందుకు కాజోల్ సిద్ధమే!

ఓవైపు తల్లిగా పిల్లల బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు భర్త అజయ్ దేవ్‌గణ్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ నిర్వహణ బాధ్యతలను కూడా మోస్తూ బిజీగా ఉన్నా సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనంటోంది బాలీవుడ్ నటి కాజోల్. మంచి కథ, మంచి స్క్రిప్ట్, చక్కని స్క్రీన్ ప్లే ఉన్న ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నానని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. నటి తనూజా, చిత్ర దర్శకుడు షోము ముఖర్జీల ఈ గారాలపట్టి ‘బేఖుదీ’ సినిమాతో 1992లో బాలీవుడ్‌లో....

పాట పై మండిపడ్డ షబానా

''ఇష్క్‌కి..మా..కి..వంటి పదాలతో గేయ రచయిత పల్లవి మిశ్రా పాట రాయటాన్ని నేను నమ్మలేక పోతున్నా. అందునా ఆమె ఓ మహిళ. ఈ పాటలో వాడిన పదాలను వింటే సిగ్గేస్తోంది. ఇది అవమానకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా'నంటూ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌లో ప్రముఖ నటి షబానీ ఆజ్మీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆగ్రహమంతా పల్లవి మిశ్రా అనే గేయ రచయితపైనే. అయితే ఇక్కడ షబానా ఆగ్రహం వ్యక్త చేయటం....

కమల్ ని ఆహ్వానించిన 'కోచ్చడయాన్'

రజనీ తన మిత్రుడు కమలహాసన్‌కు 'కోచ్చడయాన్' చిత్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని నిర్ణయించుకున్నారు. కోచ్చడయాన్ చిత్రాన్ని వీక్షించి అభిప్రాయం వెల్లడించమని కమల్‌కు ఆహ్వానం పంపారట. ఆయన ఏమైనా సూచనలు చేస్తే ఆ ప్రకారం చిత్రంలో మార్పులు చేయాలని రజనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మిత్రుడి ఆహ్వానాన్ని స్వీకరించిన కమల్ త్వరలోనే...

హాలీవుడ్-భారతీయ కథల కలబోత ‘ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్’

ఒకవైపు హాలీవుడ్, మరోవైపు భారతీయ కథలతో ఎన్నో సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న ప్రవాస భారతీయ దర్శకురాలు మీరానాయర్ మరో వినూత్న ప్రయత్నం చేశారు. హాలీవుడ్, భారతీయ కథల కలబోతగా ‘ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్’ పేరుతో తాజాగా ఒక సినిమా తీశారు. గుర్తింపు, సంబంధాల చుట్టూ తిరిగే ఈ కథ పూర్తిగా యువత కోసం తీసిందేనట. మీరా గతంలో తీసిన సలామ్ బాంబే, మిసిసిపీ మసాలా, మాన్‌సూన్ వెడ్డింగ్, అమీలియా సినిమాలకు మంచి పేరు వచ్చింది. పాకిస్థాన్ రచయిత మొహిసిన్ హమీద్ నవల ఆధారంగా అమీలియా తీశారు. ఒక యువ పాక్ జాతీయురాలు అమెరికాపై....

Wednesday, May 15, 2013

సన్నీకి పోటీగాప్రియా అంజలీరాయ్‌!

పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌కి పోటీగా మరో పోర్న్‌స్టార్‌ వస్తోంది. బాలీవుడ్‌లో క్రమంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న సన్నీని మించిపోవాలని చూస్తున్న ఇండో-అమెరికన్‌ పోర్న్‌స్టార్‌ ప్రియా అంజలీరాయ్‌కి సినిమాలలో నటించే ఛాన్స్‌ లభించింది. కోలీవుడ్‌కు సంబంధించిన ఓ తమిళ నిర్మాత ఆర్‌.బాబూనాయర్‌ ఇటీవలే....

ఇసబెల్లా కైఫ్‌ కూడా సల్మాన్‌ తోనే...

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లను, నటులను వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌తో పాటు, జరీన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లు సల్మాన్‌ ఖాన్‌ ద్వారానే ఈ రేంజికి ఎదిగారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌ కత్రినా కైఫ్‌ చెల్లెలు ఇసబెల్లా కైఫ్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే....

Friday, May 10, 2013

' సుకుమారుడు' చిత్ర సమీక్ష


' సుకుమారుడు' చిత్ర సమీక్ష   1.5 / 5                                            


శ్రీ సౌదామిని పతాకం ఫై అశోక్ దర్శ కత్వం లో వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు . 

 ఆది, నిషా అగర్వాల్‌, కృష్ణ, శారద, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, చలపతిరావు, రావురమేష్‌ తదితరులు ఈ చిత్రం లో నటీ నటులు . 

    సాయికుమార్‌ వారసుడిగావచ్చిన ఆది 'ప్రేమకావాలి'తో ప్రేక్షకుల ప్రేమను పొందాడు. ఆ తర్వాత 'లవ్‌లీ'  లవర్‌బాయ్‌గా నటించాడు. ముచ్చటగా మూడవ సినిమా ' సుకుమారుడు' గా చేశాడు. అయితే కథల ఎంపికలో ఎలా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయం లో కొంత తమాషా జరిగినట్లు అనిపిస్తుంది .  ఎండుకంటే... ఇటీవలే విడుదలైన' గ్రీకువీరుడు' చిత్ర కథను పోలినట్లు  ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత. ' పిల్లజమిందార్‌' తీసిన దర్శకుడు అశోక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. లోగడ 'సుందరకాండ' వంటి చిత్రాన్ని నిర్మించిన  కెవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని సమర్పించారు  . 

    యూరప్‌లో తండ్రి పెంపకంలో కమర్షియల్‌ మైండ్‌తో పెరిగినవాడు సుకుమార్‌ (ఆది). ఇండియా అంటే చికాకు. యూరప్‌లోనే వ్యాపారం చేసుకుని సెటిల్‌ అవ్వాలని తాపత్రయపడుతుండాడు. దానికి తగినట్లు బిజనెస్‌ చేయాలను ట్రై చేస్తాడు. కానీ అందుకు తగిన సొమ్ముఉండదు. బ్యాంక్‌లు ససేమిరా అంటాయి. దాంతో 150 కోట్ల ఆస్తి తన తాత ఊరైన ఇండియా వస్తాడు.  తాత అమ్మమ్మగా కృష్ణ, శారద నటించారు. సుకుమారుడు కోట్ల ఆస్తిని అమ్మేసి చెక్కేయాలని ట్రై చేస్తాడు. కానీ అతనికి అడుగడునా  రావురమేష్‌ అడ్డుపడుతుంటాడు. ఇంకోవైపు అసలు వారసురాలిని నేనే అని శారద కొడుకు కూతురు వస్తుంది. ఈ ట్విస్ట్‌తో ఆది ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సినిమా.

    ఆది ఇందులోతన  నటనను హైలైట్‌ చేయాలనుకున్నాడు అందుకు మూడు పార్శాలున్న పాత్ర చేశాడు. అయితే దేనికి సూట్‌కాలేదు. నటన ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. డైలాగ్‌ డెలివరీ పర్వాలేదు. కానీ.. ఎన్‌టి.ఆర్‌ చెప్పే యమసభ డైలాగ్‌ను మాట్లాడినా.. అంత ఎఫెక్ట్‌ అనిపించలేదు.

    నిషా అగర్వాల్‌ పాత్ర  హీరోను పడేయమనే రొటీన్‌ కాన్సెప్ట్‌తో ఉన్నదే. అందులో ప్రత్యేకత ఏమీలేదు. బామ్మగా శారద చాలా కాలం తర్వాత తెరపై కన్పించింది. తాతగా కృష్ణ కన్పిస్తాడు. పాత్ర పరిమితమే. ఊరిలో దుష్టపాత్రగా తనికెళ్ళభరణి, రఘుబాబు పాత్రలు అలరిస్తాయి. హీరోకు స్నేహితులుగా  'పిల్లజమిందార్‌'లో ఉన్న బ్యాచ్‌నే దర్శకుడు తీసుకోవడం విశేషం . 

    ఈ చిత్రానికి ప్రధానమైన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. పల్లెటూరి అందాల్ని చక్కగా చూపించాడు. సంగీతపరంగా అనూప్‌ బాణీలు ఏమంత ఎఫెక్ట్‌గా లేవు. 'నీలాకాశంలో మెరిసే చందురుడివి' అనే పాట కాస్త మెలోడీగా ఉంది. ఎడిటర్ కు చాలా పనికల్పించాడు. ఎక్కడ ఏ సన్నివేశం వస్తుందో అర్థంకాకుండా ఉంది. దాన్ని కటింగ్‌ చేయడం లో  సాహసమే చేశాడనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే ప్రధాన లోపం. మాటలు ఎఫెక్ట్‌గా లేవు. ప్రాసకోసం పాకులాడుతూ సన పెట్టిస్తాడు.

    సినిమాలో ముక్కలు ముక్కలుగా కథను చెప్పడంతో సుకుమారుడు డెప్త్‌పోయింది. ఏ సన్నివేశం బాగోదు. కొత్తగా మెగాఫోన్‌ పట్టుకున్న వ్యక్తి చేసినట్లుగా వుంది . ' పిల్లజమిందార్‌' అనే చిత్రం ఓ మలయాళ రీమేక్  కనుకదర్శకుడు  దాన్ని చక్కగా డీల్‌ చేసాడు . అదే 'సుకుమారుడు'కు వచ్చేసరికి అసలు సరుకు  బయటపడింది. దర్శకుడు ఎక్కడా మెప్పించలేకపోయాడు. కథకూడా అదే తరహాలో లో ఉంటుంది.' పిల్లజమీందార్' లో...జల్సాగా తిరిగే   నానికి తాత 'తన ఆస్తి మనవడు బాగుపడితేగానీ' ఇవ్వరాదని వీలునామా రాస్తాడు. 'సుకుమారుడు'లో.... విదేశీవ్యామోహంలో బిజినెస్‌కోసం డబ్బుకావాల్సివస్తే... ఆస్తికోసం ఇండియా వస్తే.. వీడు తగినవాడాకాదా? అని బామ్మ టెస్టింగ్‌ పెడుతుంది. ఈ కథ నాగార్జున నటించిన 'గ్రీకువీరుడు'కు డిటోనే. ఇద్దరు దర్శకులకు ఒకే ఐడియా రావడం కామనే అయినా.. దాన్ని తీసేవిధానంలో ఇంకాస్త ఎఫెక్ట్‌ పెడితే బాగుండేది. 

    ఇది  ప్రధానంగా దర్శకుడి సినిమా. భారీ తారాగణం ఉన్న ఈ కథను నడిపించడంలో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడు. ఏ సన్నివేశాం ఇంట్రస్ట్‌గా ఉండదు. పంచ్‌ డైలాగ్స్‌ పేరుతో వచ్చే డైలాగ్స్‌ విసుగు తెప్పిస్తాయి. పాటలుకూడా ఏమంత బాగోలేవు. నవ్వుకోవాలంటే.. గిలిగింతలు పెట్టుకోవాల్సిందే. 
-రవళి

'తడాఖా' చిత్ర సమీక్ష

'తడాఖా' చిత్ర సమీక్ష  2.5 / 5    

శ్రీ సాయి గణేష్ పతాకం ఫై కిషోర్ దర్సకత్వం లో బెల్లం కొండ సురేష్ ,గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు .

   అక్కినేని వారసుడిగా నాగచైత్య 'జోష్‌'తో మొదలైన కెరియర్‌ తర్వాత ఎత్తుపల్లాలుగా మారింది. '100%లవ్‌' మినహా 'దడ', 'జెజవాడ' మాస్‌ ఇమేజ్‌ చూపించి భంగపడ్డాడు. మళ్ళీ అటువంటి ఇమేజ్‌కోసం ట్రై చేస్తున్నాడు. చాలా కథలు విన్నాక... ఏదీ నచ్చకపోవడంతో తమిళచిత్రం 'వెట్టయ్‌' ను 'తడాఖా' గా రీమేక్  చేశాడు. ఇందులో మరో హీరో సునీల్‌కూడా ఉన్నాడు.విశేషమేమంటే - నిర్మాత బెల్లం కొండ సురేష్  హక్కులు కొని ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం .

    తాతనుంచి వస్తున్న ఆస్తిగా పోలీసు ఉద్యోగం తన తండ్రి వెంకట్రామ్‌ (నాగబాబు) చనిపోతే పెద్దకొడుకైన   శివరామకృస్ణ (సునీల్‌)కు వస్తుంది. చిన్నకొడుకు ఉద్యోగంసద్యోగంలేక బేవార్స్‌గా తిరుగుతుంటాడు. దానికి తగ్గట్లు ధైర్యవంతుడుకూడా. ఇతనికి రివర్స్‌ శివరామకృష్ణ.   ఎస్‌.ఐ.గా సిటీకి వెళ్ళిన శివరామకృష్ణకు మొట్టమొదటి డ్యూటీ... ఊరినే శాసిస్తున్న రౌడీల ఆటలు కట్టించడమే. ఈ విషయాన్ని తమ్ముడికి చెప్పడంతో ఆ సమస్యలన్నీ తనే తీరుస్తాడు కార్తీక్‌ (నాగచైతన్య).చివరికి అసలు విషయం తెలిసిన రౌడీలు శివరామకృష్ణకు టార్గెట్‌ పెడతారు. అది తెలిసిన తమ్ముడు కార్తీక్‌ ఏంచేశాడు? అన్నలో ధైర్యాన్ని రెచ్చగొట్టి ప్రత్యర్ధులను ఎలా చిత్తు చేసాడన్నదే ఈ  సినిమా.

ఇక దర్శకుడిగాకిషోర్  'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తో ఫీల్ వున్న  మంచి కదా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందాడు .   ఈ యాక్షన్ మసాలా 'తడాఖా'  చిత్రానికి అతన్ని దర్శకుడిగా ఎంపిక చెయ్యడమే పెద్ద తప్పు . తమిళ చిత్రాన్ని  కాపీ చేయడానికి కూడా తడబడ్డాడు. సొంత తెలివితో కాస్త స్టోరీని మార్చాడు. అయితే , సన్నివేశాలు ఆసక్తి కరం గా లేకపోవడం ... టేకింగ్ మరీ నీరసం గా వుండటం వల్ల సినిమా చూసిన వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది . 
 
   ఈ చిత్ర కథ చాలా సింపుల్‌. గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి. అన్నదమ్ములుగా సునీల్‌, చైతన్య సరిపోయారు.  కేవలం మాస్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ పెట్టుకుని ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. హీరో ను ఎలివేట్  చేయాలి కాబట్టి- చైతన్యకు అనుగుణంగా ఫైట్స్‌, పాటలు పెట్టారు. ఇందుకు రివర్స్‌లో సునీల్‌ పాత్ర ఉంటుంది.   తమిళవర్షన్‌ మార్చి దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తీశాడు.    ముఖ్యంగా సంభాషణల విషయం లో కొంత  జాగ్రత్తపడ్డారు. ఫస్టాఫ్‌లో హీరో ఆడిన గేమ్‌ను సెకండాఫ్‌లో విలన్‌ రివర్స్‌లో ఆడి చూపిస్తాడు.మాస్‌ ఆడియన్స్‌ కోసమే ఇందులో  చాలా అంశాలు  ఉన్నాయి. యాక్షన్‌ పార్ట్‌ సినిమాటిక్‌గా ఉంది. పాతకాలపు సినిమాని మళ్ళీ కొత్త ఆర్టిస్ట్ లతో చూస్తున్నట్లుంది .
    
' దడ', 'బెజవాడ'తో మాస్‌ ఇమేజ్‌ కావాలనుకున్న నాగచైతన్య '100%లవ్‌స్టోరీ'తో లవర్‌బాయ్‌గా మారాడు.   గతంలో చేసిన తప్పుల్ని  సరిదిద్దుకోవడం కోసం చేసిన ప్రయత్నమే' తడాఖా'.అయితే  అంతగా ఆకట్టుకోలేక పోయాడు . నిష్కర్షగా చెప్పాల్సి వస్తే ఈ చిత్రానికి అతనే పెద్ద మైనెస్ అయ్యాడు . నాగ చైతన్య నటనను అన్ని విధాలుగా  మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఇందులో సునీల్‌ పాత్ర కథాపరంగా భయస్తుడు కావడంతో.. అతనికి డాన్స్‌లు ఫైట్లు పెద్దగా లేవు. కానీ సెకండాఫ్‌లో ధైర్యవంతుడుగా ఆయన చేసిన బాడీ బిల్డప్‌ కథకు సరిపోయింది. తమన్నా పాత్ర పరిమితమనే చెప్పాలి.అయినా అందాలొలికించింది .ఆండ్రియా పాత్ర , నటన అంతంత మాత్రమే .

    హిందీ విలన్‌ అశుతోష్‌ రాణా కు బగ్గా పాత్ర సరిపోయింది. క్రూరత్వంతో నిండిన ఆ పాత్రతో  దాదాపు అందరినీ డామినేట్‌ చేశాడనే చెప్పాలి. బ్రహ్మానందం పొరుగింటి బాబాయి గా చేసినా ఆకట్టుకోలేకపోయాడు .  వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, రమాప్రభ, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి  ఇతర పాత్రలు చేసారు .

 ఈ చిత్రం లో ఆర్ధర్ విల్సన్  సినిమాటోగ్రఫీ హై లైట్ గా చెప్పుకోవాలి .   డైలాగ్స్‌లు  సన్నివేశపరంగా బాగానే రాశారు .  నిర్మాణపు విలువు బాగున్నాయి. పాటల పరంగా తమన్‌ ఇచ్చిన ట్యూన్స్‌ గత చిత్రాలతరహాలో ఆకట్టుకోలేకపోయాయి. ఒక్క మాస్‌పాట మిగిలినవి సోసోగా ఉన్నాయి.రీ రికార్డింగ్ కొన్ని చోట్ల బాగుంది .                                       -రవళి