RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 31, 2010

నూతన సమత్సర శుభాకాంక్షలు

ఒక్క ఫ్లాప్ తో పోయేదేం లేదంటున్న జెన్నీ

‘ఆరెంజ్’ నా ఇమేజ్ ని డామేజ్ చేసిందని, జెన్నీ పని అయిపోయిందని మీడియాలో కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. హిట్ రాగానే ఎత్తేయడం, ఫ్లాప్ రాగానే పడేయడం మీడియాకు మామూలే. అయితే ఒక్క ఫ్లాప్ తో తరిగిపోయే క్రేజ్ కాదు నాది. హిట్ కి పొంగిపోయి, ఫ్లాప్ కి కుంగిపోవడం నాకు తెలీదు. సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న నాకు ఫ్లాపుల గురించి ఆలోచించేందుకు టైమ్ లేదంటోంది - జెనీలియా.....

Wednesday, December 29, 2010

హాలీవుడ్ సినిమా సంగతులు

రవితేజ ‘మిరపకాయ్’ ఫోటో గ్యాలరీ


అదుపు తప్పిన తెలుగు సినిమా

మూస కథలు, ఫార్ములాలతో నష్టాల్లో కొట్టుకుపోవడం నిన్నటి మాట. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు అసలు సిసలైన సంక్షోభం అంచున వేలాడుతోంది. సమస్యలన్నీ ఏకకాలంలో తిరగబడటంతో.. బయటపడే దారి తెలీక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మూలిగే నక్కపై తాటిపండులా చిత్రసీమలోని వ్యక్తులకీ, డగ్స్ రాకెట్‌కీ మధ్య వెలుగు చూస్తున్న సంబంధాలు చిత్రసీమ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నాయి.......

హాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ కి...భామలు

హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు సందడి చేసే భామల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతంలోనూ కొందరు హాలీవుడ్‌ సుందరాంగనలు తమ అందాలను ఆరబోసి బాలీవుడ్‌ ప్రియులను రంజింపజేశారు. ఇప్పుడు అదే కోవలో క్యాండీబూచర్‌ అనే ప్లేబాయ్‌ సౌతాఫ్రికా సుందరి ‘ఆప్కా సురూర్‌’ చిత్రం తీసిన దర్శకుడు ప్రశాంత్‌ చద్దా తీయబోయే లేటెస్ట్‌ చిత్రంలో తన అందాల ఆరబోతకు సిద్ధమౌతోంది. ఆర్యబబ్బర్‌, సచిన్‌జోషిల సరసన నటించనుంది. గతంలో హాలీవుడ్‌నుంచి బాలీవుడ్‌లో నటించిన కొందరు భామలను .....

Tuesday, December 28, 2010

‘బెజవాడ రైడీల’కు పోటీగా ‘ఆటో నగర్ సూర్య’ .....మాధురి ‘ఓకె’... అనూష్క ‘నో’

విజయవాడ రౌడీల కథాంశంతో రాంగోపాల్ వర్మ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రారంభం అవుతోంది. అయితే, దాదాపు ఇదే నేపథ్యంతో ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ దర్శకుడు దేవ్ కట్టా ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. దీనికి ‘ఆటో నగర్ సూర్య’ అని పేరు పెట్టారు. నటీనటుల ఎంపిక చేసుకుని త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం రౌడీయిజం గురించి కాకుండా, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల నేపధ్యంలో ఉంటుందని దేవ్ కట్టా చెబుతున్నారు.....http://cinevinodam.com/news/flash_news1.htm

త్వరలో మనకు ‘మేడిన్‌ చైనా’ సినిమాలు

నాణ్యమైన, చవకైన వస్తువులకు మారుపేరుగా భారత్‌లో వినిపించే పదం...మేడిన్‌ చైనా. మనదేశంలోనే కాకుండా, ప్రపంచమార్కెట్‌లోనూ నమ్మకమైన స్థానాన్ని చైనా ఉత్పత్తులు సంపాదించుకున్నాయి. రానున్న రోజుల్లో భారతీయ సినిమా పోస్టర్‌పైనా చైనా-భారత్‌ కథలు కనిపించనున్నాయి. షాంఘై, బీజింగ్‌...మొదలైన చైనా నగరాల్లో మన షారూక్‌ఖానో, సల్మాన్‌ఖానో, షాహిద్‌ కపూరో అగుపించనున్నారు. అసలు విషయమేమంటే..చైనా ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బాలీవుడ్‌ నటీనటులతో, టెక్నీషియన్లతో చిత్రాలు తీయబోతున్నాయి. దీనికోసం ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌కు చైనా ప్రభుత్వం తగిన ఆర్థిక వనరులని సమకూరుస్తోంది. ఈ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ భారత్‌లోని నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు ......

నేనూ బికినీలో నటిస్తా! ....నికిషా పటేల్.

నటించడానికి భాషతో పనిలేదు. నేను నటించేటప్పుడు ఇది పెద్ద సినిమానా... చిన్న సినిమానా... లేక పరభాషా చిత్రమా అని ఆలోచించలేదు. బాగా నటిస్తే చాలు అనుకున్నా. అందులోనూ సౌతిండియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నదంతా పరభాషా హీరోయిన్లని విన్నా. అయినా మీరే చూస్తారుగా... నేను కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నా. తెలుగలో నేనే డబ్బింగ్ చెబుతా!.....

కష్టంతో ప్రియాంక సాధించింది!

‘సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. ప్రతిరోజూ ఒక పనిని ఒకేలా చేయాలంటు చాలా బోర్’ అని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చెబుతున్నారు. బాలీవుడ్ అగ్రస్థాయి నటీమణిగా వెలుగొందుతున్న ఈ భామ.. ‘ఏదైనా పనిని కాస్త కొత్తగా చేస్తే సరదాగా అనిపిస్తుంది. ప్రతిరోజూ ఒక పనిని ఒకేలా చేయాలంటే బోర్ గా ఉంటుంది. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాన్ని అధిగమించడానికి మరింత మెరుగ్గా కృషి చేయాలి. ఏదైనా పెద్ద సమస్యను విజయవంతంగా ఛేదించగలిగితే కలిగే తృప్తి ......

Monday, December 27, 2010

ప్రేక్షకుడిలా ఆలోచిస్తా! ....షారూక్‌ఖాన్‌.

చాలా భిన్నమైన పాత్రలు చేశాను. తెరపై అద్భుతంగా దూసుకెళ్లాను. కానీ నా వ్యక్తిగత విషయం వచ్చేసరికి, మనోభావాల్ని వెలుబుచ్చే కళ నాలో లోపించింది. నిజానికి నేను...చాలా సిగ్గరి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానూ చాలా తక్కువగా చొరవ చూపుతాను. ఇది నన్ను కొన్ని విషయాల్లో ఇబ్బందిపెడుతోంది. సహజసిద్ధంగా అబ్బింది కదా ! అధిగమించలేకపోతున్నా. కొంతమంది పట్ల నాకున్న ప్రేమ, ద్వేషం, స్నేహం, కోపం...బయట పెట్టలేపోయాను......

హన్సిక ఫోటో గ్యాలరీ

దాసరి మ్యూజియం...కె.బాలచందర్ కు అక్కినేని....అమీర్ కావాలంటున్న కత్రీనా, త్రిష

ఎప్పటికైనా అమీర్ ఖాన్ తో నటించాలి. ఆయన ఎంచుకునే కథలే ఎంతో వైవిధ్యంతో ఉంటాయి. అందుకు తగ్గట్టే అందులో నాయిక పాత్రలూ ఉంటాయి- అని అమీర్ పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేస్తోంది కత్రీనా కైఫ్. ఇక త్రిష ఆ గొప్ప నటుడితో నటించడం తన చిరకాల వాంఛ అని చెబుతోంది. అతనితో కలిసి నటించడం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తానని అంటున్న త్రిష కేవలం మాటలతోనే వదిలేయకుండా, అమీర్ తో నటించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందట.....

నయన కెరీర్ కు ‘ప్రేమ’నష్టం

 ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం’ అన్నట్లుగా వుంది ప్రస్తుతం నయనతార పరిస్థితి. ఇన్నాళ్లు ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించి ఇప్పుడేమో.. ఆయనతో లవ్‌ఎఫైర్ కారణంగానే కెరీర్‌ను నష్టపోయనంటూ తన అక్కసు వెల్లగక్కుతున్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నయన తన మనసులోని బాధను బయటపెట్టారు. ప్రభుతో ప్రేమ, పెళ్ళి అన్నీ సాఫీగా సాగిపోతాయనుకుంటే ఆ వ్యవహరం కాస్తా వివాదస్పదమై పోయిందని, ఇదంతా ప్రభుదేవా వల్లే ......

Sunday, December 26, 2010

విద్యా - రాణి పబ్లిక్ ముద్దులు

  అందాల మడోన్నా..క్యూట్‌ బ్రిట్నీని ముద్దాడినా, ఇద్దరు లెస్బియన్‌లు పబ్లిగ్గా రొమాన్స్‌ చేసినా..అది హాలీవుడ్‌కే చెల్లింది! అంతకు మించిన సంచలనం తాజాగా బాలీవుడ్‌ మెరుపుతీగల నడుమ చోటుచేసుకోవడం విశేషం. ఓ ఇమ్రాన్‌హస్మి, మరో రణబీర్‌ కపూర్‌ తమ నాయికలను ఏ స్థాయిలో చుంబిస్తారో..అంతకు ఏమాత్రం తగ్గని రీతిలో ఘాటైన లిప్‌ టు లిప్‌ ముద్దులతో సందడి చేశారు ఇద్దరు బాలీవుడ్‌ భామామణులు .....

ప్రతి పాత్రా కొత్తగా... విద్యాబాలన్‌.

సినిమా గ్లామరస్‌ ఫీల్డ్‌ అయినప్పటికీ, అవకాశం ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజింగ్‌ పాత్రలు స్వీకరిస్తున్నా. నటిగానూ గుర్తింపు పొందాలి కదా ! గ్లామర్‌ ఒక్కటే సరిపోదు. అందులో భాగంగానే ఇష్కియా, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా...సినిమాలు ఒప్పుకున్నా. మొదటిదాంట్లో ఫైర్‌బ్రాండ్‌ రోల్‌, దానికి విభిన్నంగా సాధారణ యువతిగా రెండో చిత్రంలో కనబడతా. ఇవి రెండూ చేయడం .....

ముద్దుగుమ్మ ప్రియమణి ఫోటో గ్యాల్లరీ

‘ఐరన్ లెగ్’ అనిపించుకోలేదు! ...త్రిష

ఇన్నేళ్లల్లో నేను నటిగా ఏనాడూ ఫెయిల్‌ కాలేదు. సినిమాలపరంగా అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ నా కెరీర్‌కి అవి ఆటంకం కాలేదు. 'త్రిష ఐరన్‌ లెగ్‌'లాంటి ముద్ర నా మీద పడలేదు. అందుకు ఆనందంగా ఉంది. ప్రతి సినిమాని నా మొదటి సినిమాలా భావించి చేస్తాను. ప్రతి సినిమా విడుదలప్పుడు పరిక్ష రాసిన విద్యార్థినిలా రిజల్ట్‌ కోసం ఎదురు చూస్తాను......

Saturday, December 25, 2010

బికినీకి మొదట ఒప్పుకోలేదు!...ముద్దుగుమ్మ ప్రియమణి.

అప్పటికీ తెలుగుతెరపై బికినీలో ఎవరైనా కనిపించారా అన్నది తెలియదు. చాలా స్లయిలిష్‌గా పాటను తీయనున్నట్టు 'ద్రోణ' దర్శకుడు చెప్పాడు. హిందీ 'తుషాన్‌'లో కరీనాకపూర్‌లా చూపెట్టాలన్నది ఆయన తపన. మొదట అంగీకరించలేదు. పలుమార్లు ఆలోచించిన తర్వాత చేస్తానన్నాను. తెలుగు తెరపై ఎవరూ ఇలా చేయలేదు కాబట్టి, కొన్ని విమర్శలు వచ్చాయి......

నటిగా గెలిచింది... జీవితంలో ఓడింది

  ‘‘శారీరక భాషకు, ఇమేజ్‌కు విరుద్ధమైన పాత్ర చేసినప్పుడే నటిలోని సామర్థ్యత బయటకొస్త్తుంది. ఈ సూత్రాన్ని బాగా నమ్ముతాన్నేను. ఈ విషయంలో కమల్ నాకు ఆదర్శం’’ అంటున్నారు నటి విద్యాబాలన్. ఆమె సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘డర్టీ పిక్చర్’ (చెత్త సినిమా) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హోమ్లీ ఇమేజ్ ఉన్న మీరు ఇలాంటి ఐటమ్ బాంబ్ పాత్ర చేయడం వెనుక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా...? .....

ప్రేమలో అనూష్క... రెండేళ్ళలో పెళ్ళి ----- పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్

యువహీరో గోపీచంద్ తో ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలకెక్కిన అనూష్క తను నిజంగానే ప్రేమలో పడ్డానంటూ ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకొంది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు ఇప్పుడే చెప్పడానికి ఆమె అంగీకరించలేదు. అతను తనతో గాఢమైన ప్రేమలో ఉన్నాడని మాత్రం చెప్పగలనని అంటోంది. రెండేళ్ళలో అతనితో తన పెళ్ళి జరుగుతుందని చెప్పింది. తన ఇంట్లో అంతా డాక్టర్లు, ఇంజనీర్లు కావడం వల్ల తను నటిని కావడానికి ఎవరూ అభ్యంతర పెట్టలేదని, తను సన్యాసిని కాకుండా ఉంటే చాలునని ......

జెనీలియా మహారాణిగా ‘‘ఉరిమి’’

 ‘బొమ్మరిల్లు’ చిత్రంతో తన కెరీర్‌ను మలుపు తిప్పిన భాస్కర్ నిర్దేశకత్వంలో రూపొందిన ‘ఆరెంజ్’చిత్రం మరోసారి తన కెరీర్ గ్రాఫ్‌ను మార్చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జెనీలియా. కానీ ఆ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో కాస్త నిరాశకు లోనైన ఈ తార ప్రస్తుతం మలయాళంలో తన అదృష్టాన్ని ‘ఉరిమి’ చిత్రంతో పరీక్షించుకోవటానికి రెడీ అయ్యారు. మలయాళ చిత్రాల్లోనే అత్యంత భారీ ఖర్చుతో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సంతోష్ శివన్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా తన గత చిత్రాలకు పూర్తిభిన్నంగా ......

Friday, December 24, 2010

అందం ఒక్కటే చాలదు!...దీపిక

 చాలామంది అంటారు- అందం మాత్రమే ఉంటే చాలదు, ప్రతిభ కూడా ఉండాలి అని. ప్రతిభ మాత్రమే ఉంటే చాలదు, అందం కూడా ఉండి తీరాలని నేనంటాను. ఎందుకంటే మొదట రూపం తెలుస్తుంది. తర్వాతే ప్రతిభ తెలుస్తుంది. అందుకే నేను నా అందాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తాను. నాకు పర్సనల్‌గా ఓ ట్రెయినర్ కూడా......

నాగార్జున 'రగడ ' చిత్ర సమీక్ష

‘మాస్’ తర్వాత నాగార్జున నటించిన మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. విషయం కన్నా మసాలాకే ఇందులో ప్రాధాన్యత కనిపిస్తుంది. దాదాలు, ముఠాలు, హీరో ఒంటి చేత్తో వందమందిని కొట్టేయడాలు... అంతా పాత వాతావరణమే అయినా సన్నివేశ రూపకల్పనలో వీరుపోట్ల కాస్త కొత్తదనాన్ని చూపించగలిగాడు. పూర్తిగా నాగార్జున ఇమేజ్ పైనే ఆధారపడ్డ ఈచిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించడంలో దర్శకుడు.....

నేను పిచ్చి పిల్లనే! ......జేనీలియా

 ''జనం గుర్తుపడతారు... మన ఆనందం దూరమవుతుందనే భయం నాకు లేదు. జనం మధ్యకు వెళ్లడాన్ని కూడా సరదాగానే తీసుకొంటాను. వారు నన్ను పేరు పెట్టి పిలుస్తుంటే తిరిగి వారికి 'హాయ్‌' అని సమాధానం కూడా ఇస్తాను. గట్టిగా అరుస్తూ సమాధానం చెబుతాను. కొన్నిసార్లు ఇది తికమకగా అనిపించొచ్చు. నా పిచ్చి పనులు చూసి కొందరు నన్ను పిచ్చిది అని........

పసుపులేటి ‘సినీ ఆణిముత్యాలు’ ఆవిష్కరణ

నిజాయితీ నిబద్దతలతో తన వృత్తిలో ఇన్నేళ్లుగా రాణిస్తూ.. అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ, వివాదరహితుడిగా పేర్గాంచిన పసుపులేటి.. తన వృత్తిలో భాగంగా పలువురు ప్రముఖులను చేసిన ఇంటర్వ్యూలలో అతి ముఖ్యమైన ఇంటర్వ్యూలను ఎంపిక చేసి, ఎంతో విలువైన సమాచారాన్ని పొందుపరుస్తూ చేసిన ప్రయత్న ం ఎంతైనా అభినందనీయమని దాసరి అన్నారు.....

Thursday, December 23, 2010

రామ్ చరణ్ కి కోపమొచ్చింది......కృష్ణ భగవాన్ మందు మాటల వివాదం

రచయిత నటుడు కృష్ణ భగవాన్ మందేసి, మాటలతో చిందేయడంలో దిట్ట. ఈ మధ్య ఆంధ్రాలో ప్రముఖులు పాల్గొన్న సభలో ఇలాగే మాట్లాడుతూ- ఘనాపాటి గరికపాటి నరసింహారావు అవధానం గురించి పిచ్చి జోకులేసి అవమానించాడు. అతని నోటి దూలని అంతా నిరసించి, స్థాయిలేని వ్యక్తిని వేదికనెక్కించినందుకు అక్కడి వాళ్ళంతా చెంపలేసుకున్నారు.....http://cinevinodam.com/news/flash_news2.htm

నిజాన్ని నిజాయితీగా...'బ్రోకర్‌'.

''మనకు మార్కెట్‌లో కనిపించే దళారీనో, ప్రభుత్వ కార్యాలయం దగ్గర కనిపించే మధ్యవర్తో... మొత్తం అవినీతికి కారణం అని అనలేం. అవినీతి అనేది ఏ విధంగా వ్యవస్థీకృతమైపోతోందనే విషయాన్ని మా చిత్రంలో చూపించాం. వ్యవస్థను సమూలంగా నాశనం చేసే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. కుర్చీలను సైతం కదిల్చే శక్తి ఈ దళారీలకు ఉంది. ఇక్కడ మోసం చేసేవాడి గురించి మాత్రమే చెప్పడం లేదు. మోసపోయేవాడూ మా సినిమాలో ఉన్నా......

Tuesday, December 21, 2010

తానా చైతన్య స్రవంతి ....తెలుగు వైభవం

మన తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. మన సంగీత, నృత్య కళలకు నేడు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో రవీంధ్రభారతిలో జరిగిన తెలుగు వైభవం మన కళల మాధుర్యాన్ని అవగతం చేశాయి. తెలుగు వైభవం కార్యక్రమాలు ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగగా ఉదయం జరిగిన కార్యక్రమానికి రాష్ర్ట మొదటి మహిళ విమలా నరసింహన్‌, సాయంత్రం.....

మీడియా రాణి నీరా రాడియా కథతో...

ఈ మధ్య దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన ‘2 జి స్పెక్ట్రమ్‌’ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నీరా రాడియా గురించి దేశ ప్రధాన ఛానళ్లన్నీ తెగ మోతెక్కించడంతో... బాలీవుడ్‌ నిర్మాతల దృష్టి నీరారాడియాపై పడింది. ఒక సాధారణ మహిళ అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థికవ్యవస్థనే సవాల్‌ చేయడమేగాక...రాజకీయ దురంధరులుగా పేరుగాంచిన హేమాహేమీలను తన వలలో ఎలావేసుకుంది...తన ఆర్థిక లావాదేవీలను ఇన్నాళ్లుగా ఎలా.....

పూరి ‘దేవుడా’... చౌదరి ‘నిప్పు’... దాసరి ‘రామసక్కని తల్లి’

ఫిలిం ఛాంబర్ లో కొత్త చిత్రాల పేర్లు కొన్ని ఆసక్తి కరంగా ఉన్నాయి. దాసరి ఫిలిం యూనివర్సిటీ ‘రామసక్కని తల్లి’, వైష్ణో అకాడమీ ‘దేవుడా’, బొమ్మరిల్లు వారి ‘నిప్పు’, సంతోషం స్టూడియోస్ ‘వాటర్’, స్నేహచిత్ర ‘దండకారణ్యం’ పేర్లు నమోదు చేసుకున్నారు.......

మధురిమ ఫోటో గ్యాలరీ

Monday, December 20, 2010

త్రీ డి యానిమేషన్ లో ఛార్లీ చాప్లిన్‌!

ఛార్లీ చాప్లిన్‌ చిత్రాలంటే చూడనిదెవరు? చూసి కడుపుబ్బా నవ్వుకోనిదెవరు? అలా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న చాప్లిన్‌ కథ ఆధారంగా యానిమేషన్‌ టీవీ సీరియల్స్‌ను రూపొందిస్తున్నారు. డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కంపెనీ తీస్తున్న వీటిలో చాప్లిన్‌ సినిమాల్లోని సన్నివేశాలు కూడా ఉంటాయి. ఆరేసి నిమిషాల నిడివి ఉండే 104 చిత్రాలను సుమారు 50 కోట్ల రూపాయల.....

సూపర్ హీరోకు షష్టిపూర్తి

సూపర్‌స్టార్ రజనీని చూసే. ఆరు పదుల వయసులోనూ అరనవ్వులతో జనాల్ని ఆకట్టుకున్న 'తలైవర్'(నాయకుడు) రజనీకి ఆదివారం పుట్టినరోజు. మరాఠీ కుటుంబంలో పుట్టిన రజనీ అప్పుడు శివాజీరావ్ గైక్వాడే. ఆయన్ని లాలించింది కన్నడ గడ్డ. దేశమంతా గర్వంగా మావాడు అని చెప్పుకునే స్థాయికి రావడానికి అవకాశాలను కల్పించింది మాత్రం తమిళ పరిశ్రమ. 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ మరాఠీ వీరుడు .....

హాలీవుడ్ కోసం కొత్త బిపాసా

హిందీ చిత్రసీమలో గ్లామర్ నాయికగా రాణిస్తోంది బెంగాలీ భామ విపాసా బసు. ఈమెకు తొలిసారి హాలీవుడ్ అవకాశం వచ్చింది. ఇంగ్లీష్ - ఫ్రెంచ్ దర్శకుడు రొలాండ్ జోఫె దర్శకత్వంలో ఆమె నటించబోతోంది. రొలాండ్ రూపొందించే ‘సింగ్యులారిటీ’ అనే సినిమాలో ఈమె నటించడానికి సంతకం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘‘నటిగా ఇదో మైలురాయి. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నా జీవితంలో అనూహ్యమైన మార్పు అని చెప్పుకోవచ్చు. రోలాండ్ సెప్టెంబరులో ముంబయి వచ్చినపుడు ఒకసారి కలిశాను. కథ చెప్పారు. రెండు ఖండాల మధ్య.. రెండు కాలాల నడుమ జరిగిన ప్రేమకథ ఇది. రూ.150 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని రూపొందిస్తున్నారు. 18వ శతాబ్దంలో జరిగిన ఆంగ్లో - మరాఠా యుద్ధం నేపథ్యంలో......

అనుష్క ఫోటో గ్యాలరీ

Sunday, December 19, 2010

స్పందించే చిత్రాలు తీస్తానంటున్న దియా

నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయంపైనా నాకు అవగాహన ఉంది. ఆ విషయాల్ని ఎక్కువగా పరిశీలిస్తుంటాను. ఈ రంగంలో స్థిరపడ్డ నా స్నేహితులు కూడా ఇదే విషయం చెప్పారు. 'నిర్మాతగా మారితే తప్పకుండా విజయం సాధిస్తావు'అని వాళ్లు చాలాసార్లు నాతో చెప్పారు. మొదట్నించీ నాకు సినిమా తప్ప మరో వ్యాపకం తెలియదు. పైపెచ్చు నిర్మాతగా మారాలి. మంచి సినిమాలు తీయాలన్న కసి నాలో బలంగా ఉంది. అలాంటప్పుడు .....

సినిమా అవగాహన పెంచే ‘చలనచిత్ర నిర్మాత’

ఓ మంచి చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుడికి ఆనందం కలకిగించాలంటే ఆ పనికి శ్రీకారం చుట్టవలసిన వ్యక్తి నిర్మాత. దర్శకుడు, పాటలు, మాటలు, కథ రాసేవారు మిగతా సాంకేతిక వర్గమంతా నిర్మాత మనసులో పుట్టిన సినిమా నిర్మాణ ఆలోచన లేనిదే వారికి పని దొరకదు. కనుక ఇంతమందికి అన్నం పెట్టేవాడు నిర్మాత. అటువంటి నిర్మాత పరిస్థితి ఇప్పుడు తారుమారు అయింది. అతనికి గౌరవం తగ్గింది. హీరోలకు, దర్శకులకు అపార గౌరవం ఆపాదించబడుతోంది. ఇందుకు కారణం సరైన అవగాహన లేకుండా పరిశ్రమకు వస్తున్న నిర్మాతలు.సినిమా తీయాలని......

అది నా వల్ల కాదు! :అందాల భామ కరీనాకపూర్‌

 బాలీవుడ్‌ అందాల భామ కరీనాకపూర్‌కు పెద్ద కష్టమొచ్చింది. అదేంటంటే బీభత్సమైన ఫైటింగ్‌లు చేసేసి ప్రత్యర్థులను మట్టికరిపించాలి. దానికి తగ్గట్టు ఆరవీర భయంకరమైన ఫోజుల్ని ప్రదర్శించాలి. ఓ చోట నుంచి మరోచోటకు దూకాలి. విలన్‌ మనుషుల్ని దెబ్బకొట్టాలి. ఇవన్నీ రా.వన్‌, ఏజంట్‌ వినోద్‌ చిత్రాలకు సంబంధించి కరీనా కపూర్‌ సన్నివేశాలు. 'అందచందాలతో, అభినయంతో, అల్లరితో ప్రేక్షకుల్ని అలరించమంటే, చేస్తాను ! కానీ ఈ ఉరకడం, దూకడం,.....

టాప్ 10 బాలీవుడ్ చిత్రాలు

ఇప్పటిదాకా బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్లపరంగా టాప్ పొజిషన్ గా చెప్పబడుతున్నచిత్రాల గురించి చెప్పుకోవాలంటే... ముందుగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కాజోల్ లు జంటగా నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం గురించి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. మరోసారి షారుక్, కాజోల్ జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 62 కోట్ల 8 లక్షల 89వేల 48 రూ. వసూలు చేసింది. 2001లో......

Saturday, December 18, 2010

రియాల్టీ షోలో మల్లికా షెరావత్‌

ఒకప్పుడు మర్డర్‌ సినిమాతో తారాపథంలోకి దూసుకెళ్లిన అందాల తార మల్లికా షెరావత్‌ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు. హిస్‌స్‌..సినిమా తుస్సుమనడంతో ఈ శృంగార తార పాపులారిటీ చాలా వరకు తగ్గింది. దీంతో టివి రియాల్టీ షోలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది మల్లికా. బుల్లి తెరపెై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్‌ రియాల్టీ షో తనకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తుందని ఈ తార ఆశిస్తోంది.....

జేమ్స్ బాండ్ గా మహేష్ ....కోడిరామకృష్ణతో బాలకృష్ణ... హనుమంతుడు శ్రీహరి

‘గూఢచారి 116’ హీరో కృష్ణకు ఎంతో పేరు తెచ్చింది. అదే తరహాలో కృష్ణ తనయుడు మహేష్ బాబు ఓ చిత్రం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘శక్తి’ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మెహర్ - మహేష్ కాంబినేషన్ లో ఈ చిత్రం భారీ చిత్రాల నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.....http://cinevinodam.com/news/flash_news1.htm

అవకాశాలు అడగనంటున్న అనన్య


     ''రాస్తా దియే హేతెన్‌ గెలె అమెకె కి దెఖ్‌బి?''...బెంగాలీ చిత్రం 'అబోహోమాన్‌'లో అనన్య ఛటర్జీ పాత్ర అడుగుతుంది. దీని అర్థం...'ఆర్ట్‌హౌస్‌ హీరోయిన్లను దారిలో పోయేవాడు గుర్తుపడతాడా ?' అని. దారిలోపోయేవాడేమోగానీ దేశం గుర్తించింది. ఆవిడ నటనకు, నటించిన చిత్రానికి అవార్డులు దక్కాయి. మానవ సంబంధాల్లో వచ్చే మార్పులు ఈ చిత్రంలో పధానంగా చూపెట్టారు. బుల్లితెర నటిగా అనన్య ఛటర్జీకి మంచి పేరుంది. జాతీయ ఉత్తమ అవార్డుతో ....

శ్రియ ఫోటో గ్యాలరీ

Thursday, December 16, 2010

కత్రీనా మనసు దోచిన మాధురి

‘‘అందం, అభినయంలో మాధురి దీక్షిత్‌ని మించినవారు ఇంకొకరు ఉండబోరు. డాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆమెకు సరితూగేవారే లేరు. తెరపై ఏం చేసినా అందులో పెర్ఫెక్షన్‌ విషయంలో మాధురితో సరిపోల్చదగినవారు అస్సలు లేనేలేరు’ అని తన ఫేవరెట్‌ హీరోయిన్‌పై తన అభిమానాన్ని వెల్ల్లడించింది. పైగా మాధురికి తాను పెద్ద ఫ్యాన్‌ని అని, తన నటనకు ప్రేరణ మాధురియేనని.....

‘నాగవల్లి’ చిత్ర సమీక్ష...సినీవినోదం రేటింగ్‌ : 2.5/5

‘చంద్రముఖి’ పకడ్బందీ స్క్రిప్టుతో చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ గా నడిపితే, అందుకు భిన్నంగా - ఏ మాత్రం అర్థం కాని గందరగోళంతో ఈ చిత్రం నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లతో కథ నడిపిన తీరు ప్రేక్షకుడిన అయోమయంలోకి నెడుతుంది. ఒక్కోసారి మన రెగ్యులర్ హార్రర్ సినిమాల్లా అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా స్పష్టత లేదు. పైగా సినిమా అంతా అర్థంలేని విషయాలే. ఇందులో ప్రధాన పాత్రతో పాటు రాజుగా వెంకటేష్ చేశారు. గతంలో దీన్ని రజనీకాంత్ చేసి ఉండటంతో, అతన్ని చూసిన ప్రేక్షకులు వెంకటేష్ తో సంతృప్తి చెందలేకపోయారు.....

నిర్మాతగా రాంగోపాల్ వర్మ కూతురు?

రాంగోపాల్‌వర్మ కుమార్తె రేవతి సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు టాలీవుడ్‌ విశ్వసనీయ సమాచారం ! ఆయా రంగాల్లోని ప్రముఖులు తమ వారసులనూ అదే రంగంలోకి తీసుకురావటం ఆశ్చర్యపరిచే విషయమేమీ కాదని కొంతమంది సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న మొదట యాంకర్‌గా....

మహేష్, విజయ్ పోయి సూర్య వచ్చాడు....మహేష్ తో బెడిసిన సమంత... మోసపోయిన రవితేజ

‘ఏం మాయ చేశావె’, ‘బృందావనం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పరిశ్రమ వర్గాలను ఆకట్టుకున్న సమంత మహేష్ బాబుతో శ్రీనువైట్ల ‘దూకుడు’లో చేస్తోంది. ఈ చిత్రం కోసం ఇటీవల టర్కీలో ఓ షెడ్యూల్ జరిగింది. అక్కడ మహేష్ తో తగినంత సాన్నిహిత్యం దొరకని సమంత నిరాశపడిందట......

Wednesday, December 15, 2010

ఒంటరితనమే బాగుందన్న ఊర్మిళ

‘రంగీలా’తో కుర్రకారు హార్ట్ బీట్ ను పెంచిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ. 36 ఏళ్ల వయసులోనూ నాజూకైన అందం ఆమె సొంతం. పెళ్లి మాటెత్తిన ప్రతి‘సారీ’, దాని గురించి మర్చిపోమని చెప్పే ఈ అమ్మడు... ఒంటరి సెక్సీ మహిళగా ఉండటమే ఇష్టమంటోంది. సినిమాలకు విరామమిచ్చి.....

‘‘తెలుగు చలన చిత్ర అకాడమీ’’ కావాలి! - వారాల ఆనంద్.

చలన చిత్ర అకాడమీ భావనను స్ఫూర్తిగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1985లో కలకత్తాలో ‘నందన్’ సినిమా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసింది. దీనిలోని నాలుగు థియేటర్లను ప్రదర్శనలకే కాకుండా, ప్రొడక్షన్ తప్ప మిగతా అన్ని కార్యక్రమాలకు వేదికగా మార్చారు. కేరళ 1998లో, కర్ణాటక 2009లో చలన చిత్ర అకాడమీలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటి ద్వారా ఉత్తమ సినిమా ఉద్యమాలను ముందుకు తెస్తున్నాయి. మంచి సినిమా సంస్కృతిని......

Tuesday, December 14, 2010

మూస పాత్రలకి ప్రియాంక ‘నో’

నేను నటించిన చిత్రాల్లో మంచి ప్రారంభ వసూళ్లు రాబట్టుకున్న చిత్రం 'అంజానా అంజానీ'. నా నటన అందర్నీ ఆకట్టుకుంది. ఫ్యాషన్‌, కమినే, వాట్స్‌ యువర్‌ రాశి...ప్రతీ చిత్రానికి నటనలో మార్పు వస్తోందని అభిమానులు, విమర్శకులు అంటున్నారు. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 'అంజానా అంజానీ'లో రణబీర్‌ కన్నా పెద్దగా కనిపించావు' అన్న విమర్శకూడా.....

ఇక డిజిటల్ థియేటర్ల జోరు

బాక్స్ ఆలస్యమైన కారణంగా సినిమా ప్రదర్శించలేకపోతున్నామన్న బోర్డులు ఇకనుంచి కనిపించే అవకాశం లేదు. అలాగే అభిమాన నటుడి సినిమా రిలీజ్ రోజు చూడలేకపోయామని ఫ్యాన్స్ బాధపడి గొడవ చేయాల్సిన అవసరమూ వుండదు. డిజిటల్ టెక్నాలజీ పుణ్యమా అని రాష్ట్రమంతా ఒకే సమయానికి సినిమా రిలీజ్ అయ్యే రోజులు త్వరలోనే రానున్నాయి. సినిమా రీళ్ళతో అవసరంలేకుండా నేరుగా డిజిటల్ రూపంలో సినిమాలను పూర్తి స్థాయిలో రిలీజ్ చేయడానికి....

Monday, December 13, 2010

జెనీలియా కోరుకునేవాడు...

‘హెయిర్ నీట్ గా కట్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి డ్రెస్లు అంటే టైట్ టీ షర్ట్స్, ఫ్యాన్సీ బేగీ జీన్స్ ఇలాంటివి అస్సలు వేసుకోకూడదు. అవంటే నాకు అస్సలు నచ్చదు. కాళ్ళు, వేలి గోళ్ళు ఎప్పటికప్పుడు నీట్ గా కట్ చేసుకొని ట్రిమ్ గా వుంచుకోవాలి. ఇకపోతే అతగాడు మంచి డ్యాన్సర్ అయి వుండాలి. ఇక అందం విషయానికి వస్తే... మగవాళ్ళు సింపుల్ గా వుంటేనే అందంగా వుంటారు. అలాంటి వారినే నేను ఇష్టపడతాను. ఇకపోతే ఆఖరిది... అన్నిటికంటే ముఖ్యమైంది.....

మడి కట్టుకోలేనంటున్న తాప్సీ

   ‘నాయకా నాయికల అధర చుంబనాలు చూడటానికి, ఈత దుస్తుల్లో నాయికల అందాలను చూసి తరించడానికి సినిమాలకే రావాల్సిన అవసరం లేదు. సినిమా హీరోయిన్లను సైతం తలపించే రేంజ్‌లో నేటి తరం అమ్మాయిలు దుస్తులు ధరిస్తున్నారు. పార్కులకి వెళితే ప్రేమికుల సరస సల్లాపాలు బోల్డన్ని చూడొచ్చు. కానీ తెరపై హీరో, హీరోయిన్ రొమాన్స్ చేస్తే చూసేవారికి....

విజయం సాధిస్తాయనుకోలేదు! :‘స్నేహగీతం’శ్రీధర్ రెడ్డి

'స్నేహగీతం'తో దర్శకుడుగా నా ప్రస్థానం ప్రారంభమైంది. ఇదొక చిన్న అడుగు మాత్రమేనని నాకు తెలుసు. ఐటి రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టే సాహసం చేసిన నన్ను చాలా మంది అభినందించారు. దర్శకత్వ శాఖలో పూర్వానుభవం ఏమాత్రం లేకపోయినా ఒక దర్శకుడిగా చాలా నిజాయితీగా నేను చేసిన ప్రయత్నాన్ని పలువురు ప్రశంసించారు. నా మీద చూపించిన ప్రేమ, కురిపించిన ప్రశంసలకు బదులుగా.....

బాలీవుడ్లో చక్రం తిప్పాలనుకున్నా! :నికోల్‌ ఫారియా.

డాక్టర్‌... ఇంజినీర్‌... ఇంకేదో... భవిష్యత్తు గురించి అడిగితే ఎవరైనా ఇలాగే చెబుతారు. నేను మాత్రం చిన్నప్పట్నుంచి నటిగా మారాలనుకున్నా. బాలీవుడ్‌లో చక్రం తిప్పాలనుకున్నా. సినిమాలు ఎక్కువ చూసే అలవాటు, నాకంటూ ఓ గుర్తింపు కావాలని కోరుకోవడమే కారణం కావొచ్చు. దానికి ప్రారంభమే ఈ అందాల పోటీలు.....

Sunday, December 12, 2010

సమ్మె మంచిదేనంటున్న నాగార్జున...రవిబాబు ‘మనసారా’ మరో ఫ్లాప్

‘అనసూయ’, ‘నచ్చావులే’ వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన రవిబాబు ఆ తర్వాత ‘అమరావతి’, ఇప్పుడు ‘మనసారా’ చేసి పరాజయం పాలయ్యాడు. ఈ చిత్రాలకి కనీస ప్రచారం కూడా చేయకుండా కేవలం తన దర్శకత్వ ప్రతిభతోనే సినిమాలు ఆడేస్తాయనే రవిబాబు భ్రమలను ఈ చిత్రాలు పటాపంచలు చేసాయి....

సూపర్ హీరోకు షష్టిపూర్తి

ఆరు పదుల వయసులోనూ అరనవ్వులతో జనాల్ని ఆకట్టుకున్న 'తలైవర్'(నాయకుడు) రజనీకి ఆదివారం పుట్టినరోజు. మరాఠీ కుటుంబంలో పుట్టిన రజనీ అప్పుడు శివాజీరావ్ గైక్వాడే. ఆయన్ని లాలించింది కన్నడ గడ్డ. దేశమంతా గర్వంగా మావాడు అని చెప్పుకునే స్థాయికి రావడానికి అవకాశాలను కల్పించింది మాత్రం తమిళ పరిశ్రమ. 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ మరాఠీ వీరుడు కెరీర్ ప్రారంభంలో ప్రతినాయక పాత్రల్లో, మల్టీస్టారర్ చిత్రాలతోనూ....