RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, March 30, 2013

ఆర్యతో నయనతార లవ్ నిజమేనా?

'లవకుశ' 50 ఏళ్ల పండగ

'లవకుశ' 50 ఏళ్ల పండగ

'లవకుశ' 50 ఏళ్ల పండగ సందర్బంగా 'యువకళావాహిని' శుక్రవారం శ్రీ త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన చిత్రగానలహరి, చిత్రంలో నటించిన నటీనటుల సత్కార సభలో వివిధరంగాల ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.తెలుగు సినిమా చరిత్రలో తొలి రంగుల సినిమాగా ప్రసిద్దికెక్కి.. అవార్డులతో పాటు ప్రశంసలు పొందిన గొప్ప పౌరాణిక దృశ్యకావ్యం 'లవకుశ' అని వక్తలు కొనియాడారు. లవకుశ చిత్రంలోని పాటలు, సంగీతం, ఘంటసాల గానం, పద్యాలు చిత్ర విజయానికి దోహదపడ్డాయని వారు అన్నారు.
ఈ సందర్భంగా' లవకుశ 'చిత్రం లో లవకుశులుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం, భరతుడుగా నటించిన ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణలను, ఒరియా 'లవకుశ 'చిత్రంలో సీతారాములుగా నటించిన రోజారమణి, చక్రపాణిలను, లవకుశలో లక్ష్మణుడిగా నటించిన దివంగత నటుడు కాంతారావు సతీమణి హైమవతిలను అతిథులు ఘనంగా సత్కరించారు. సభలో శాసనమండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు, సారిపల్లి కొండలరావు పాలకుర్తి మధుసూదనరావు, జె.బాపురెడ్డి, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డా.కె.వి.కృష్ణకుమారి, యం.వెంకటేశ్వర్లు, జంధ్యాల రవికాంత్, సత్కార గ్రహీతలు వై.కె.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు .
'లవకుశ' చిత్రంలోని పాటలను 50ఏళ్ల పండుగలో మిత్రా, వి. వి. రామారావు , పవన్ కుమార్ ,సాయిరమ్య, లక్ష్మీ మేఘన, అనఘ, తన్మయి, పద్మశ్రీలు ఆలపించి ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేశా రు. ముఖ్యంగా సాయిరమ్య, లక్ష్మీమేఘనలు ఆలపించిన లవకుశ పాటలు, పద్యాలు మైమరపింపజేశాయి.

Wednesday, March 27, 2013

సమంతా-సిద్దార్ధ ల పెళ్లి ఖాయం?

పిల్లలతో కూడిన కుటుంబాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాననీ, త్వరలోనే ఆ రోజు వస్తుందని ఆశిస్తున్నాననీ హీరో సిద్ధార్థ్ తెలిపాడు. పెళ్లికి తాను సిద్ధంగా ఉన్నాననీ స్పష్టం చేశాడు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన తెలిపాడు. చాలా కాలంగా సిద్ధార్థ్ ప్రేమ కథల గురించి మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతూ....

జీవితంలోని క్రూరత్వాన్నిచూపే నాగేష్‌కుకునూర్‌ 'లక్ష్మి'

ఫిలిమ్‌మేకర్‌ నాగేష్‌కుకునూర్‌ టీవీ షోలో ప్రత్యక్షమవబోతున్నారు. నేషనల్‌ జియోగ్రాఫికల్‌ ఛానల్‌లో ప్రతీ వారం ప్రసారమయ్యే ఈ టీవీ పేరు 'మిషన్‌ కవర్‌షాట్‌'. ఇవాల్టి నుంచి ఇది మొదలవుతోంది. 'వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా ఈ కార్యక్రమంలో తొలిసారి చేయబోతున్నా. ఇతర రియాల్టీ షోల మాదిరిగా వుంటుందని తప్పక చెప్పగలను. అంతేగాక వారి మాసపత్రికను తప్పక చదువుతాను. ఈ షో ఎప్పుడు మొదలవుతుందా.....

జాతీయ ఉత్తమ నటి ఉషా జాదవ్‌

'దాగ్‌ 'అనే మరాఠి చిత్రంలో ప్రతిభచూపిన హీరోయిన్‌ ఉషా జాదవ్‌ జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది. ఉషా ప్రస్తుతం ముంబయ్‌లో ఉంటున్నా... ఈమె సొంత ఊరు కొల్హాపూర్‌. పాట్నాలోని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ బాలికల ఉన్నత పాఠశాల, మిచిగాన్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసించింది. చిన్నతనం నుంచి అణుకువ ఉన్న అమ్మాయిగా పెరిగింది. ఏడో తరగతి చదివే రోజుల్లో ఓ నాటకంలో పాల్గొని అందరినీ ఆకట్టుకుని....

అంతా కర్మ ఫలమేనంటున్న‘లైఫ్ ఆఫ్ పై’ అంగ్ లీ

‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రానికి ఆస్కార్ పురస్కారం అందుకున్న దర్శకుడు ఆంగ్ లీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఈ చిత్రప్రదర్శనకు హాజరుకాకపోయినా ఇందుకోసం పంపించిన ప్రత్యేక సందేశంలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సినిమా కథకు భారతదేశమే ప్రేరణ అని చెబుతూ.. ఇక్కడి నుంచి లభించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు. తైపే భారత ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం (టీఈసీసీ) గురువారం సాయంత్రం పై సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇందులో హీరో సూరజ్ శర్మ, సహనటుడు అదిల్ హుస్సేన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. అంతేకాదు శర్మ పుట్టినరోజు కూడా....

Friday, March 22, 2013

'మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌' అమీర్‌ఖాన్‌ తో కష్టమే!

మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ను ఒప్పించడం అంత తేలికైందేమీ కాదని మరోమారు రుజువైంది. ఎంతోమంది దర్శకనిర్మాతలు అమీర్‌ఖాన్‌ ఆఫీస్‌ చుట్టూ స్క్రిప్ట్‌లు పట్టుకొని తిరుగుతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, నిర్మొహమాటంగా అభిప్రాయాన్ని చెప్పేస్తున్నాడు. విశాల్‌ భరద్వాజ్‌, ప్రదీప్‌ సర్కార్‌, ప్రియదర్శన్‌..వంటి స్టార్‌ డైరక్టర్లంతా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ను ఒప్పించలేకపోయారు. ఒకటికాదు, రెండు కాదు..200 కథల్ని (స్రిప్ట్‌తో సహా) అమీర్‌ఖాన్‌ పక్కకు పడేశారు.ఇదంతా కేవలం సంవత్సరకాలంలో ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ చేసిన పని. మరోవైపు ఇతర నటుల ప్రొడక్షన్‌ సంస్థలన్నీ 2015 వరకూ షెడ్యూల్‌ సిద్ధం చేశాయి. ఒక్క అమీర్‌ఖాన్‌ నిర్మాణ సంస్థే ఈ విషయంలో చాలా వెనకబడిపోయింది. ఆయన ఆమోద ముద్ర....

Thursday, March 21, 2013

నన్ను సవాలు చేసే పాత్రలనే ఎంచుకుంటాను! -ఇర్ఫాన్‌ఖాన్‌

ఇటీవల జాతీయ సినిమా అవార్డ్స్ లో'పాన్‌ సింగ్‌ తోమర్‌' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికైన ఇర్ఫాన్‌ఖాన్‌ భిన్నమైన కథాంశాలను ఎంచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడ తాడు . 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రం ద్వారా అంతర్జాతీయంగానూ గుర్తింపు సాధించిన ఇర్ఫాన్‌ఖాన్‌ తాజా చిత్రం 'సాహిబ్‌ బీవీ అవుర్‌ గ్యాంగ్‌స్టర్‌ రిటర్న్‌' ఇటీవలే విడుదలైంది. అటు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ఈసినిమాపై మంచి స్పందనలే వచ్చాయి. సినిమా ఎంపికలో సాహసోసేత నిర్ణయాలు....

ఉదితా గోస్వామి దర్శకత్వం చేస్తుందట!

Wednesday, March 13, 2013

తెరపై స్క్వాష్ క్రీడాకారిణి కోమల్‌శర్మ

స్క్వాష్ క్రీడాకారిణిగా జాతీయస్థాయిలో ఎదుగుతున్న కోమల్‌శర్మ తాజాగా వెండితెరపై నటిగా ప్రత్యక్షం కానున్నారు. జూనియర్ స్క్వాష్ క్రీడావిభాగంలో ఐదవ స్థానాన్ని సీనియర్ స్క్వాష్ విభాగంలో 8వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ సాహస క్రీడాకారిణి ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన స్క్వాష్ క్రీడా పోటీల్లో రెండవ స్థానాన్ని దక్కించుకుని తన సత్తా చాటుకున్నారు. అలాంటి కోమల్‌శర్మ సత్యరాజ్ ప్రధానపాత్ర పోషిస్తున్న నాగరాజ చోళన్ ఎంఏ ఎంఎల్‌ఏ చిత్రం ద్వారా నటిగా...

Saturday, March 9, 2013

చిన్న చోళీ, గాగ్రా తో సన్నీలియోన్‌

నీలి చిత్రాల నాయకి సెక్సీఫిగర్ సన్నీలియోన్ బాలీవుడ్‌లో ఇప్పుడు బిజీ బిజీగా మారుతోంది. ‘రాజ్-2’ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశించిన ఈ భామకు ఆ చిత్రం తెచ్చిన స్టార్‌డమ్ అంతా ఇంతా కాదు. దాంతో రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగింది. అప్పటికే నీలి చిత్రాల ద్వారా తన అంద చందాలను తిలకించిన యువతరం ‘రాజ్-2’లో ఆమెను చూసి వెర్రెత్తిపోయారు. అటు తర్వాత వరసగా వస్తున్న ఆఫర్లలో.....

జయప్రద రాజమండ్రి రాజకీయం

నందమూరి తారక రామారావు ఆహ్వానంతో 1994 అక్టోబర్‌ 10న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసింది నాటి అందాల తార జయప్రద. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షంలో చేరి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 1996 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ఆ తరువాత ....

Wednesday, March 6, 2013

నయనతార, హన్సిక మధ్య పోటీ

రాత్రి పగలు యథేచ్ఛగా నటించలేను!-మీనా

Saturday, March 2, 2013

సామాన్యుడిఫై సినిమాకి ఆసక్తి లేదు!:జావెద్ అఖ్తర్

నాది 'డిమాండ్ అండ్ సప్లై' సూత్రం

కుర్రకారు హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాందించుకున్న శృంగార నాయిక నమిత తెలుగు, తమిళ భాషల్లో మంచి పాత్రల కోసం ఎదురుచూస్త్తోందట. ‘సొంతం’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు నాయికగా పరిచయమైన ఈ సూరత్ సుందరి తెలుగులో పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడు హీరోయిన్‌గా మాత్రం క్రేజ్ దక్కించుకోలేకపోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ తారకు ఇప్పటి వరకు అగ్రకథానాయికల జాబితాలో...