RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, August 30, 2012

'శ్రీమన్నారాయణ' చిత్ర సమీక్ష              2 / 5

ఎల్లో ఫ్లవర్స్ పతాకం ఫై  రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రజా సేవకుడు కల్కి నారాయణ మూర్తి కుమారుడు శ్రీమన్నారాయణ ఓ టీవీ చానెల్ జర్నలిస్ట్ గా  అవినీతి పరులకు సింహ స్వప్నం అవుతాడు.అతనికి మరదలితో నిశ్చితార్ధం జరుగుతుంది.అయితే మరో చానెల్ లో పనిచేసే స్వప్నిక అతని వెంటపడుతూ వుంటుంది. అన్నదాతల సంక్షేమం కోసం   కల్కి నారాయణ మూర్తి  చేపట్టిన  'జైకిసాన్' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. అది  కార్య రూపం దాల్చే సమయం లో అకస్మాత్ గా కల్కి నారాయణ మూర్తి మరణిస్తారు. 'జైకిసాన్' కోసం పోగయ్యిన కోట్ల  విరాళాలు మాయమవుతాయి.  దానికి బాధ్యుడు గా చేసి శ్రీమన్నారాయణ ను అరెస్ట్ చేస్తారు. నిజానికి  ఆ డబ్బు దోపిడీ లో ఆరుగురు ప్రముఖులున్నట్లు , దాచిపెట్టిన సొమ్ము కు సంబంధించి  ఈ ఆరుగురు ఆరుఅంకెల  పాస్ వర్డ్ పెట్టుకున్నట్లు శ్రీమన్నారాయణ తెలుసుకుంటాడు. ఆ తర్వాత,జైలు లో వుంటూనే - ఆ ఆరుగురి నుండి రైతు సంక్షేమం కోసం పోగుచేసిన డబ్బు ఆచూకీ చెప్పే  పాస్ వర్డ్  తెలుసుకుంటూ,తండ్రి మరణానికి కారణమైన వారిని చంపే పని ప్రారంభిస్తాడు శ్రీమన్నారాయణ. ఈ పనిలో అతను ఎంతవరకూ విజయవంతం అయ్యిందీ  సినిమాలో చూడాలి...

అంతంత మాత్రం అనుభవమున్న దర్శకుడు  రవి చావలి బాలకృష్ణను జర్నలిస్ట్ గా చూపుతూ  విజయవంతం కాలేక పోయాడు.( అతనికి చేదోడు వాదోడుగా వుండే సినిమాటోగ్రాఫర్  సి.విజయకుమార్ ఈ చిత్రానికి  లేకపోవడం కూడా ఒక కారణమేమో? ). "తండ్రి మరణం...తన అకారణ జైలు జీవితానికి కారణమైన వారి ఫై హీరో ప్రతీకారం తీర్చుకునే" -ఈ కధ ఎప్పటినుండో, ఎన్నో సినిమాల్లో మనం చూసేసాం. పోనీ, ఆ పాత కధని  కొత్తగా చూపించినా బాగుండేది.అలా కాకుండా పరమ రొటీన్ గా ఈచిత్రాన్ని నడిపించారు.ఆసక్తికి అవకాశం లేకుండా , ప్రతి సన్నివేశం మనం ముందే ఊహించేస్తాం . బాలకృష్ణ  నుండి ప్రేక్షకులు ఆశించే స్థాయి లో అతని పాత్రీకరణ లేదు.  లెక్కలేనన్ని సినిమాల్లో చూసినట్లుగానే ఇందులోనూ  బాలకృష్ణ కు ఇద్దరు హీరోయిన్లతో  అరిగిపోయిన  రొమాన్సునే  మళ్ళీ  పెట్టారు . ఇంతకు ముందు చిత్రాల్లో  రెండు అర్దాల మాటలుంటే... ఇందులో' A ' సర్టిఫికేట్ ని అడ్డం పెట్టుకుని  - "దాన్నిపెళ్లి చేసుకో... నన్ను ఉంచుకో" అంటూ సూటిగా  మాట్లాడేసుకుంటారు. విలన్లు కొట్టేసిన డబ్బు ఏ ఎకౌంట్ లోకి పోయిందీ? ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో తేలిగ్గా తెలుసుకోవచ్చు.అది వదిలేసి పాస్ వర్డ్ కోసం పాకులాడ్డం, అందరి కళ్ళు అతని ఫైనే వున్నా, హీరో  జైలు నుండి ఈజీగా వచ్చి చంపేసి పోవడం,  క్లైమాక్స్ లో పాస్ వర్డ్ సంపాయించకుండానే, విలన్ హీరో కుటుంబాన్ని చంపెయ్యమని చెప్పడానికి  డజన్ సెల్ ఫోన్లు విరగ్గొట్టడం ....లాంటిఅర్ధం లేని విషయాలు   ఈ చిత్రంలో చాలా చూడొచ్చు. విలన్లు గా చేసిన ఆరుగురు ప్రతిభావంతులైన నటులను కూడా  సరిగా  వాడుకోలేకపోయారు. పరిమిత బడ్జెట్ లో చెయ్యడం ఒక్కటే ఈ చిత్రం లో నిర్మాతకు కలిసొచ్చే అంశం....కానీ ప్రేక్షకుడిని     మాత్రం ఏ విషయం లోను ఆనంద పరచాలేకపోయారు. 

శ్రీమన్నారాయణ గా చేసిన బాలకృష్ణ నటన ఒక్కటే ఈ చిత్రంలో హైలైట్ గా  చెప్పు కోవాలి. అందమైన  గెటప్ తో బాలకృష్ణ తన పాత్రను చాలా బాగా పోషించారు.నరసింహ స్వామి వంటి వివిధ గెటప్స్ లో కూడా బాగున్నారు.  అయితే తన  వయసు - శరీరానికి సరిపడని డాన్స్ లు చెయ్యాలని ప్రయత్నించి ఇబ్బంది పెట్టారు. బక్క చిక్కిన జర్నలిస్ట్ గా పార్వతి మెల్టన్, హీరో మరదలిగా ఇషా చావ్లా పెద్ద ప్రాధాన్యం లేని పాత్రల్లో, పాటలకోసమే వున్నారని అనిపించారు. ఆరుగురు విలన్లుగా కోట, సురేష్, జయప్రకాష్ రెడ్డి ,నాగినీడు, రావు రమేష్, సుప్రీత్ లు షరా మామూలు గానే చేసారు.ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్ ల కామెడీ అంతగా లేకపోయినా...దువ్వాసి మాత్రం ఆకట్టుకున్నాడు. కల్కి నారాయణ మూర్తిగా విజయ కుమార్,   సి .బి.ఐ అధికారిగా వినోద్ కుమార్, జైలర్ గా ఆహుతి ప్రసాద్, ఛానెల్ అధిపతిగా ధర్మవరపు...నటించారు. చక్రి సంగీతం లో కొత్త ట్యూన్ లు కాకపోయినా, సగటు ప్రేక్షకుడికి కావాల్సిన మసాలా మాత్రం బాగానే వుంది .సురేంద్ర రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది. ఘటికా చలం మాటలు కొన్ని సన్నివేశాల్లో చాలా బాగున్నాయి.                                                                     -రాజేష్                                  
                                                                                                                                                                                                                                                    

Tuesday, August 28, 2012

రానా - త్రిషల పెళ్లి?

యువ నటుడు రానా, నటి త్రిష పెళ్లి చేసుకోనున్నారని, వీరి పెళ్లి వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనుందనే సంచలన కథనాన్ని ఒక తమిళ పత్రిక ప్రచురించింది. ప్రఖ్యాత తెలుగు నిర్మాత డి.రామానాయుడు మనువడు రానా. ఈయన లీడర్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు. తెలుగులోనే కాకుండా హిందీలోను యువ హీరోగా గుర్తింపు పొందుతున్న రానా తాజాగా అజిత్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రంలో ఒక కీలక పాత్ర ....

ఆ చిత్రాలకు ఇక ఇబ్బందే

‘ఎ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలను టీవీ ఛానెల్స్‌లో ప్రసారం చేయడానికి వీలులేదంటూ కేంద్ర సెన్సార్ బోర్డ్ తీసుకున్న తాజా నిర్ణయం బాలీవుడ్ అగ్రనిర్మాతల పాలిట అశనిపాతంలా పరిణమించనుంది. సినిమా తాలూకు శాటిలైట్ హక్కుల్ని అమ్ముకోవడం ద్వారా కోట్ల రూపాయల్ని ఆర్జిస్తున్న నిర్మాతలకు సెన్సార్ తాజా నిర్ణయం ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ‘ఎ’ సర్టిఫికెట్ వున్న సినిమాలు టీవీ ఛానెళ్లలో ప్రసారానికి అనుమతిపొందాలంటే సెన్సార్ నుంచి..... 

Sunday, August 19, 2012

'తిండి సినిమా'ని ఎగబడి చూస్తున్నారు

ఇక నుంచి తారలే ఆ ఖర్చులను భరించాలి

అసలు కంటే కొసరే ఎక్కువవుతోందని నిర్మాతలు నెత్తీనోరు మొత్తుకున్న నేపథ్యంలో స్పందించిన నిర్మాతల మండలి తమ తమ వ్యక్తిగత సహాయకుల ఖర్చులను తారలే భరించాలని స్పష్టం చేసింది. ఆదేశాలు జారీ చేసి దాదాపుగా నెలవుతున్నా ఎవరో కొందరు మాత్రమే అందుకు అంగీకరించారు. మిగతావారు అందుకు ససేమిరా అంటుండడంతో నిర్మాతల మండలి మరోసారి ఈ విషయమై సమావేశమైంది. ఈ సమావేశంలో కూడా తొలుత తీసుకున్న నిర్ణయాన్నే.....http://cinevinodam.com/masala/tharalu140812.htm

Wednesday, August 15, 2012




'దేవుడు చేసిన మనుషులు' చిత్ర సమీక్ష          1.5/5


శ్రీ వెంకటేశ్వరా సినీచిత్ర పతాకంఫై పూరి జగన్నాద్ దర్శకత్వంలో బీ.వి.యస్.యన్.ప్రసాద్  ఈ చిత్రాన్ని నిర్మించారు.

               అక్షయ తృతీయ రోజు అలిగిన లక్ష్మీదేవిని సముదాయించడానికి విష్ణుమూర్తి -భూలోకంలో ఇద్దరు అనాధలు ఒక్కటయ్యే కధను చెబుతాడు. హైదరాబాద్ లో  సెటిల్మెంట్స్ చేసే రవి తేజ అందులో ఒకరు. బ్యాంకాక్ లో కారు డ్రైవర్ ఇలియానా మరొకరు.పోలీసు అధికారి సుబ్బరాజుకి బ్యాంకాక్ లోని మాఫియా డాన్  ప్రకాష్ రాజ్ తో వచ్చిన సమస్యను సెటిల్ చెయ్యడానికి రవి తేజ బ్యాంకాక్ వెళ్తాడు. ప్రకాష్ రాజ్ ను కలిసేక్రమంలో కారు డ్రైవర్ ఇలియానా,మరో కారు డ్రైవర్ గోలి పరిచయమవుతారు.ఇలియానాతో ప్రేమలో పడతాడు.అనుకోని గొడవలో ప్రకాష్ రాజ్ ని కలిసిన రవితేజ మరో ఇబ్బందిని ఎదుర్కొంటాడు.రవితేజ  చెప్పిన సుబ్బరాజుపని చెయ్యడానికి వప్పుకున్న  ప్రకాష్ రాజ్, ఇలియానాను తనకు అప్పగించమంటాడు.ఆతర్వాత జరిగిన కధ వెండి తెరఫై చూడాలి...
             
                 'నేనింతే' జంట పూరిజగన్నాద్ -రవితేజ కలిసి చేసిన  'తొక్కలో సినిమా' ఇది. ఇది తిట్టు అనుకునేరు...ఈ సినిమా కధ  ప్రారంభానికి  అరటి పండు తొక్కే కీలకం.'రిలయెన్స్' వారు కొన్న సినిమా కనుక, 'ప్యాకేజి' పద్ధతిలో నాలుగు డబ్బులు మిగలేసుకోవడమే ధ్యేయంగా చుట్టేసిన చిత్రం ఇది. పేరున్న  దర్శకుడు పూరి జగన్నాద్ బాధ్యత లేకుండా ...పని మీద సీరియస్ నెస్ లేకుండా తీసిన చెత్త చిత్రం ఇది.తలా తోకా లేని కధ...హాలీవుడ్ చిత్రాల్లో నుండి కొట్టేసిన స్క్రీన్ ప్లేతో ,తన విహార విడిది బ్యాంకాక్ లో హరీ బరీగా చేసేసి చేతులు దులిపేసుకున్నాడు.సినిమా ప్రారంభంలో అక్కడక్కడా సరదాగా ఉందనిపించినా ...రాను రానూ చిరాకు పెరిగి దియేటర్ లోంచి పారి పోదామనిపించే స్థాయికి చేరుతుంది. విష్ణు-లక్ష్మిల అర్ధం లేని సంవాదంతో  ప్రారంభమయ్యే ఈ చిత్రం అంతా అసంబద్ధమే. తమిళంతో సహా, కొన్ని ఎత్తేసిన ట్యూన్లు ఉన్నప్పటికీ  రఘు కుంచే పాటలు,చిన్నా నేపధ్య సంగీతం వున్నంతలో బాగున్నాయి.గీత రచయిత భాస్కర భట్ల కష్టపడ్డాడు.ఎప్పుడూ హైలైటే గా నిలిచే పూరి పంచ్ డైలాగ్స్ ఇందులో ఏమాత్రం పండలేదు. విదేశీ డాన్సర్  గాబ్రియేలాఫై చిత్రీకరించిన 'డిస్ట్రబ్ చేస్తున్నాడే' పాట కూడా అంతంత మాత్రం గానే వుంది.మొత్తం మీద శ్యాం ఫోటో గ్రఫీ, పాటల చిత్రీకరణ బాగుంది.
                
                   చాలా కాలం  తర్వాత రవితేజ అతి కామెడీ చెయ్యకుండా కొంతవరకూ ప్రేక్షకులను కాపాడేడు.గతంలో కన్నా బాగా చేసాడు.బక్క పల్చని భామ ఇలియానా  హావ భావాలు బాగానే పలికించినా...తనఆకారంతోనూ,విగ్
తోనూ ఇబ్బంది పెట్టింది.రెండు పాటల్లో మాత్రం అందంగా కనిపించింది.మతి మరుపు డాన్ గా ప్రకాష్ రాజ్ పాత్ర వినోదాన్ని పంచినా, చివరికొచ్చేసరికి ఇలియానాని 'చెల్లీ' అంటూ చిర్రెత్తించాడు.   ధనలక్ష్మిని ఆవాహన చేసుకోవాలని చూసే కార్ డ్రైవర్ గోలి గా అలీ బాగా చేసినా అంతగా ఆకట్టుకోలేక పోయాడు .విష్ణు-లక్ష్మిలు గా బ్రహ్మానందం, కోవై సరళ రొటీన్ గా చేసారు.అలీకి లక్ష్మిదేవి  కనిపించే సన్నివేశం బాగుంది.ఈ చిత్రంలో ఇతర పాత్రలు సుబ్బరాజు,యం.యస్.నారాయణ, జ్యోతి రాణా, 'ఫిష్' వెంకట్ పోషించారు.                             -రాజేష్                                                                                                                                                                                                                 

Tuesday, August 14, 2012

'తాప్సి' లొంగదీసుకోవడానికి ప్రయత్నించినా ....

'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు సినీ తెర ఫైకి దూసుకొచ్చిన అందాల చిన్నది 'తాప్సి'....ఓ టి.వి. ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను ఇలా వెల్లడించింది.......ఇక్కడికి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఇంతలోనే సగం తెలుగమ్మాయిగా మారిపోయాను. షూటింగుల్లో మాట్లాడుతూనే తెలుగు నేర్చుకున్నా. బీటెక్ చదివాను. ఇన్ఫోసిస్‌లో జాబ్ వచ్చింది. కానీ, డిఫరెంట్‌గా ఉండాలనే నా ఆలోచన సినిమా రంగం వైపు వచ్చేలా చేసింది.మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చా. 2008 మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ను. టీవీ యాడ్స్‌లో కూడా చేశా. అది చూసిన డైరెక్టర్లు కొందరు సినిమాల్లో చేయడానికి అడిగారు. తెలుగులో మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి, రాఘవేంద్రరావు గారు నన్ను....

' సినీవినోదం.కాం' ఎడిటర్ రాంబాబు అడ్ల ను సత్కరించారు

హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో డా"అక్కినేని నాగేశ్వర్రావు 'గురుప్రసాద్ ('యువకళావాహిని') మీడియా డైరెక్టరీ-2012' ని ఆవిష్కరించిన సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ,' సినీవినోదం.కాం' ఎడిటర్ రాంబాబు అడ్ల ను సత్కరించారు.

Friday, August 10, 2012

ఇద్దరం పోట్లాడుకున్నాం: కిరణ్‌ ఆమిర్ ఖాన్

దర్శకుడు, నిర్మాతలతో పోలిస్తే సినీ రంగంలో కథ/మాటల రచయితల పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. నిర్మాత, దర్శకుడు తనకు నచ్చినట్టుగా సినిమాను తెరకెక్కిస్తే కథ/మాటల రచయితలు మాత్రం నిర్మాత, దర్శకుడికి నచ్చినట్లు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి వారు రాసిన స్క్రిప్ట్‌కు, తెరపై కనిపించే సంభాషణలకు ఎటువంటి పొంతన లేని పరిస్థితి ఉంటుంది. అయినా కూడా వారు సర్దుకుపోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో తాను సర్దుకుపోకుండా .....

హన్సిక వయసు 21... పిల్లలు 22

గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి హన్సిక నటించిన చిత్రాలు అరడజను పైనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా స్కోర్ తక్కువ కాలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్న మాదిరే సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా పెంచుకుంటున్నారు హన్సిక. అక్షరజ్ఞానం లేని జీవితం శూన్యం అంటారు కాబట్టి ఆర్థికంగా వెనుకబడి, చదువుకోలేని స్థితిలో ఉన్న 20మంది పిల్లలను హన్సిక చదివిస్తున్నారు. చదువుతో పాటు ఈ పిల్లలకు అవసరమైన ఇతర సదుపాయాలను కూడా ....

Thursday, August 9, 2012

గురు ప్రసాద్(యువకళావాహిని) మీడియా డైరెక్టరీ ఆవిష్కరణ

గురు ప్రసాద్(యువకళావాహిని) మీడియా డైరెక్టరీ ఆవిష్కరణ

'యువకళావాహిని' ఆధ్వర్యం లోఆగస్ట్ 7న తెలుగు విశ్వ విద్యాలయంలో ' గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ-2012 ' ని  డా"అక్కినేని నాగేశ్వర్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ-కళలను,కళాకారులను ప్రోత్సహించడంలో' యువకళావాహిని' కృషిని అభినందించాలి. సాంస్కృతిక రంగానికి చెందిన ఎంతో మంది వివరాలు సేకరించి, ప్రతి ఏటా మీడియా డైరెక్టరీని  వెలువరించడం ఎంతో కష్టంతో కూడుకున్నది. అందరికి ఉపయోగపడేలా దీన్ని క్రమం తప్పకుండా వెలువరిస్తున్న వై.కే.నాగేశ్వర్రావును అభినందిస్తున్నానని -అన్నారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో ' గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ-2012 ' తొలి ప్రతిని గజల్ శ్రీనివాస్ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య  ఎల్లూరి శివారెడ్డి, దూరదర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధుసూదన్ రావు, హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు మంగళగిరి ఆదిత్య ప్రసాద్, ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్, రచయిత్రి డా"కే.వి.కృష్ణకుమారి, డా"శ్రీలత, 'కార్నేషన్' రాందొర,'ప్రగతి ప్రింటర్స్' అధినేత  పరుచూరి హనుమంతరావు, వై.కే.నాగేశ్వర్రావు  పాల్గొన్నారు. ఆశాశ్రీలత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో భాగంగా  పసుపులేటి రామారావు, రాంబాబు అడ్ల (సినీవినోదం.కాం)వంటి సీనియర్ జర్నలిస్టులను,ప్రముఖ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులను అక్కినేని చేతులమీదుగా సత్కరించారు.ఈసభ ప్రారంభంలో యస్.వి.రామారావు వ్యాఖ్యాతగా నిర్వహించిన " డా"దాశరధి చిత్రగీతలహరి " లో చంద్ర తేజ, వీ.కే.దుర్గ, వీ.వీ.రామారావు.శారదారెడ్డి,సుహాసిని,వీణా రాజు,పద్మశ్రీ,నాగరాజప్రసాద్  పాల్గొన్నారు.

Monday, August 6, 2012

అర్ధవంతమైన పాత్రలు చేస్తా:అసిన్

వరుసగా రెడీ, హౌస్‌ఫుల్-2, బోల్ బచ్చన్ వంటి కామెడీ చిత్రాల్లో నటించిన అసిన్ తొట్టుమ్‌కల్ ఇక మార్పు కావాలంటోంది. కామెడీ పాత్రలపై తనకు భిన్నాభిప్రాయం లేదని అయితే అభినయానికి అవకాశం ఉన్న పాత్రలో నటించేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. స్త్రీ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండే పాత్రలో నటించాలని ఉన్నట్టు తెలిపింది. అయితే అది మహిళా ఆధారిత చిత్రమే కావాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొంది. తాను నటించిన కామెడీ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాలు నమోదు చేసుకున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. ‘‘హిట్‌లు దక్కడం విశేషమే. కానీ ఓ నటికి సజనాత్మక సంతప్తి ఉండాలి కనుక.....

హాలీవుడ్ కాపురంలో సైంటాలజీ మంట

హాలీవుడ్గ లో విభిన్న మతాలకు, జాతులకు చెందిన వారు వివాహం చేసుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి.అలాంటి జంటలు కాలక్రమంలో విడిపోయిన దాఖలాలూవున్నాయి.   తన బిడ్డను తండ్రి ‘విశ్వాసం’ బారి నుంచి కాపాడాలని తల్లి ప్రయత్నించడం, అందుకు గాను విడాకులు తీసుకోవాలని అనుకోవడం మాత్రం సంచలన అంశమే. హాలీవుడ్గ అగ్రతారల జీవితంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు పాశ్చాత్యదేశాల్లో పలుకోణాల్లో పతాకశీర్షికల్లో దర్శనమిస్తోంది. తండ్రి విశ్వసించిన ‘మతం’పై వ్యతిరేక భావాన్ని ప్రజల్లో కలిగిస్తోంది. ఆ జంటనే టామ్‌ క్రూజ్‌‌, కేటీ హోమ్స్‌.....