RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, June 29, 2013

రాంబాబు అడ్ల ను డా"అక్కినేని గ్యాపికతో సత్కరించారు

భారతీయ సినిమా వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా ' తెలుగు సినిమా సహస్ర పూర్ణ చంద్ర దర్శనం' పేరిట జూన్ 26న త్యాగరాయ గాన సభ లో ' గాన లహరి' నిర్వహించింది  .ఈ కార్యక్రమం లో డా"అక్కినేని నాగేశ్వర రావు ఉత్సవ కమిటీ సభ్యుడు,సినీవినోదం .కామ్ సంపాదకుడు రాంబాబు అడ్ల ను గ్యాపిక తో సత్కరించారు . 

యాక్షన్ కన్నా హాస్యానికే ప్రాధాన్యం!

Sunday, June 23, 2013

అనుమాండ్ల భూమయ్యకు బి.యన్.సాహితీ పురస్కారం

'యువ కళా వాహిని' వై .కె .నాగేశ్వర్ రావు ఆధ్వర్యం లో త్యాగరాయగాన సభలో 21న జరిగిన కార్యక్రమం లో డా" అనుమాండ్ల భూమయ్యకు బి.యన్.సాహితీ పురస్కారాన్ని డా" సినారే అందజేశారు . సినారే మాట్లాడుతూ - 'అగ్ని వృక్షం' వంటి ప్రౌఢ కావ్యాన్ని అందించిన అనుమాండ్ల భూమయ్య సాహితీ వ్యక్తిత్వం గొప్పది . సాహితీ విమర్శకుడిగా ప్రారంభించి, కవిత్వ రంగానికి వచ్చిన భూమయ్య తన రచనల ద్వారా అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు . ' వాస్తు శిల్పి' గా అందరికీ సుపరిచితుడైనా, ' అక్షర శిల్పి' గా కూడా అభినందనలు అందుకున్న బి.యన్.రెడ్డి నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని మానవీయ కవి అనుమాండ్ల భూమయ్యకు ఇవ్వడం సముచితం గా వుందని - సభకు అధ్యక్షత వహించిన డా"ఓలేటి పార్వతీశం అన్నారు . పురస్కార గ్రహీత అనుమాండ్ల భూమయ్యను డా" సి .హెచ్ .లక్ష్మణ చక్రవర్తి సభకు పరిచయం చేసారు . సభ ప్రారంభం లో పద్మశ్రీ ఆలపించిన అన్నమయ్య కీర్తనలు సభికులను అలరించాయి .

ప్రేక్షకుల్లో 3డి చిత్రాల పట్ల పెరిగిన ఆసక్తి!

తెలుగు తెరపై ఇప్పుడిక మరో కొత్త హంగామా మొదలవుతోంది. రానున్న పదిహేను రోజుల వ్యవధిలోనే ఏకంగా రెండు నేరు తెలుగు 3డి చిత్రాలు విడుదలవుతున్నాయి. 'అల్లరి' నరేశ్‌ హీరోగా నటించిన వినోదభరిత చిత్రం 'యాక్షన్‌ - 3డి' కాగా, నందమూరి కల్యాణరామ్‌ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న 'ఓం' 3డి చిత్రం పూర్తిస్థాయి యాక్షన్‌ మూవీగా ఆ వెంటనే జనం ముందుకు రానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని తయారవుతున్న ఈ రెండు చిత్రాలూ తెలుగు నాట సరికొత్త వినోద హంగామాకు తెర తీస్తున్నాయి.

నందితాదాస్‌ 'బిట్వీన్‌ ది లైన్స్‌'

కాన్స్‌ చిత్రోత్సవానికి హాజరై, ఇటీవల వార్తలలోకి ఎక్కిన నటి నందితా దాస్‌ ఇప్పుడు మళ్లీ తన రంగస్థల కృషితో వార్తలలోకి వచ్చారు. కాన్స్‌లోని చిత్రోత్సవానికి ఆమెతో ఓ గాంభీర్యం వచ్చిందన్నారు అక్కడి చిత్రోత్సవ విశ్లేషకులు. ఫ్యాషన్‌లకే పరిమితమయ్యే ఇతర తారలకు నందిత భిన్నమైన వ్యక్తి అని వారు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఓ పక్క సినీ నటిగా ఉంటూనే తీరిక చేసుకొని తనకు ఇష్టమైన నాటక రంగానికి సేవ చేయాలని నందిత తలపోయడం ....

Monday, June 17, 2013

వెనకడుగు వెయ్యొద్దన్నారు !-రామ్‌చరణ్‌

నా కెరీర్ ఆరంభమే బావుంది!-నందిత


టాలీవుడ్‌ సినిమాలో తెలుగు హీరోయిన్స్‌ శకం జయ ప్రద, జయసుధ ఆ తరువాత విజయశాంతి, రోజా లతో ముగిసిపొయింది. ఇప్పుడు తెలుగు సినిమాలలో అంతా బొంబాయి బ్యూటీ లదే హవా. ఒక్కొక్క హీరోయిన్‌కి కోట్ల మీద గుమ్మరిస్తున్నారు మన తెలుగు నిర్మాతలు. ఈ పరిస్థితులలో బాలీవుడ్‌ బ్యూటీలకు పోటీ ఇవ్వగల సత్తా ఉన్న హీరోయిన్‌ నందిత....

‘పోలీస్‌గిరీ’లో కవితా వర్మ వివాదం

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.... చివరకూ హాలీవుడ్ ఏ చిత్ర పరిశ్రమ వివాదాలకు మినహాయింపు కాదు. తాజాగా ఆ జాబితాలోకి సంజయ్ దత్ హీరోగా నటించిన 'పోలీస్ గిరి' చిత్రం కూడా చేరిపోయింది. ‘పోలీస్‌గిరీ’లో ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించిన కవితా వర్మ ఒక దృశ్యంలో జపమాలను ధరించడంపై ముంబయికి చెందిన ఓ క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. జపమాలకు ఉన్న సిలువ ఆ నటి బొడ్డుపైకి జారిందని ....

Friday, June 14, 2013

'సమ్ థింగ్ సమ్ థింగ్' చిత్ర సమీక్ష

                                    'సమ్ థింగ్ సమ్ థింగ్'  చిత్ర సమీక్ష    3/5



లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పతాకం ఫై  సుందర్. సి దర్శకత్వంలో బి .సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. 

                చేదు  అనుభవాల వల్ల  సాఫ్ట్ వేర్ కుర్రాడు కుమార్ కి అమ్మాయిలూ -ప్రేమ అంటే గిట్టదు . అయితే, వారి ఆఫీస్ కి కొత్త ఉద్యోగిని  సంజన రావడం తో తన  ఉద్దేశాలను  పక్కన పెట్టి,ఆమె ఆకర్షణలో పడతాడు .సంజన  ప్రేమను పొందడానికి 'లవ్ గురు' ప్రేమ్ జీ సలహాలను తీసుకుంటాడు .అతని సహాయంతో- మరో యువకుని ఆకర్షణలో పడ్డ సంజనను అతని నుండి విడదీసి,తన ప్రేమలో పడేటట్లు చేసుకుంటాడు . ఆ తర్వాత... సంజన స్వయానా తన మేనకోడలనే వాస్తవం'లవ్ గురు' ప్రేమ్ జీకి  తెలుస్తుంది . దాంతో-సంజనను ప్రేమలోకి దించిన కుమార్ నుండి  సంజనను విడదీసే ప్రయత్నాలు చేస్తాడు . ఆ తర్వాత జరిగింది సినిమాలో చూడాలి ... 

               డబ్బింగ్ సినిమా అని చెప్పకుండా...కొన్ని సన్నివేశాలను తెలుగు ఆర్టిస్టులతో చిత్రీకరించి 'ద్విభాషా చిత్రం' -అంటూ  పబ్బం గడుపుకునే బాపతు చిత్రాల్లో ఇదీ ఒకటి .బ్రహ్మానందం తో చిత్రీకరించిన  సన్నివేశాలు మినహా ఇది పూర్తిగా తమిళ చిత్రమే . నాలుగు పదుల  వయసున్నప్పటికీ ఇంకా కుర్ర వేషాలు వేస్తున్న సిద్దార్ధ ఇందులో  హీరో ఐనప్పటికీ,  నిజానికి హీరో బ్రహ్మానందమే.సినిమా అంతా అతని ఫై నడవడమే కాదు ...అతని నటనే ప్రేక్షకులను ఆకట్టుకుంది .దీనికి ప్రముఖ నటి ఖుష్బు భర్త సుందర్ దర్సకత్వం వహించారు . తెలుగులో చాలా  సినిమాల్లో చూసిన ప్రేమ కధతో చేసిన ఈ చిత్రం  రెండవ భాగం లో- హన్సిక బ్రహ్మానందం మేనకోడలనే ట్విస్ట్ తో సినిమా కొంత పర్వాలేదనే స్థితికి వచ్చింది . ఆ తర్వాత   కుమార్ నుండి  సంజనను ప్రేమ్ జీ విడదీసే ప్రయత్నాలు కూడా వినోదాత్మకంగా వున్నాయి . ఇందులో సత్య సంగీతం లో పాటలు మైనస్ ఐతే ... వెలిగొండ శ్రీనివాస్ రాసిన సంభాషణలు చాలా ప్లస్ అయ్యాయి . గోపి అమర్నాద్ ఫోటోగ్రఫీ, రీ రికార్డింగ్ ఓకే . మొత్తం మీద ఈ చిత్రం గొప్ప వినోదాన్ని ఇవ్వక పోయినా... నిరాశ పరచదు.  
               
               తెలుగులో ఎందరో  చేసిన ప్రేమికుడి పాత్రనే కుమార్ గా ఇందులో  సిద్ధార్ధ పోషించాడు . తను మంచి నటుడని  మరోసారి నిరూపించుకున్నాడు . అందగత్తె  హన్సిక సంజన గా  ప్రేక్షకులను ఆకట్టుకుంది . అక్కడక్కడా ఎక్కువగా...రొటీన్ గా అనిపించినా 'లవ్ గురు' ప్రేమ్ జీ గా బ్రహ్మానందం పెద్ద పాత్రలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాడు . హన్సిక మొదటి ప్రియుడిగా గణేష్ వెంకట్రామన్ నటించాడు.  అతిధి  పాత్రల్లో- సిద్ధార్ధ లేటెస్ట్ లవర్ సమంత,రానా ,సుధ ,వేణుమాధవ్ ,ఒకప్పటి నాయిక నళిని కనిపించారు . 'మగ ధీర' ఇన్స్పిరేషన్ తో సినిమా చివర్లో యూనిట్ అందరి ఫై చేసిన 'దొంగ భడవలు'  పాట  బాగుంది . హన్సికను తమిళ నాట 'చిన్న ఖుష్బూ' అని అంటారు . ఖుష్బూ కూడా ఈ పాటలో చెయ్యడం విశేషం                 -రాజేష్ 

Monday, June 3, 2013

నన్ను చాలాసార్లు తిరస్కరించారు! -విజయ్ సేతుపతి

తనకు విజయం రాత్రికిరాత్రే దక్కలేదంటున్నారు 'పిజ్జా' హీరో విజయ్ సేతుపతి. అపజయాలు విజయానికి తొలిమెట్టు అంటారు. ఇది నటుడు విజయ్ సేతుపతికి చక్కగా వర్తిస్తుంది. అతనిప్పుడు కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరో. 'తెన్‌మార్కు పరువకాత్తు', 'పిజ్జా', 'నడువుల కొంచెం పక్కత్తు కానోమ్', 'సూదుకవ్వుం' తదితర వరుస విజయాలతో ఊపు మీదున్నాడు . జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి చేతిలో ఇప్పుడు ఏడు చిత్రాలు ఉన్నాయి. మూడు కోట్ల హీరో విజయ్ సేతుపతి చెబుతున్న విశేషాలు ...

పెళ్లికాకున్నా సహజీవనం ఓకే! -రీమా కళింగళ్

అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలని, పెళ్లిచేసుకోకపోయినా సహజీవనం చేయవచ్చునని నటి రీమా కళింగళ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మలయాళ భామ కోలీవుడ్‌లో భరత్ సరసన 'యువన్ యువతి' చిత్రం ద్వారా పరిచయమైంది.
మాలీవుడ్‌లో 'కేరళ కబే', 'హ్యాపీ హజ్‌బెండ్స్', 'సిటీ ఆఫ్ గాడ్స్', 'నీలతామర' తదితర చిత్రాలలో నటించిన రీమా కళింగళ్ '22 ఫీమేల్ కొట్టాయం', 'నిత్యా' చిత్రాలలోని నటనకు గాను కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డును అందుకుంది. కాగా '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆ చిత్ర దర్శకుడు ఆషిక్ అబుతో స్నేహం ప్రేమగా మారింది.
ఆ తరువాత ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరి వ్యవహారం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టిస్తోంది. ఈ సహజీవనం గురించి రీమా కళింగళ్ తొలిసారిగా పెదవి విప్పింది. సహజీవనం చేయడంలో తప్పులేదని పేర్కొంది. కలిసి జీవించడానికి పెళ్లి తప్పనిసరి కాదని అంది. తనకు ఈ జీవితం నచ్చిందని అందుకే సహజీవనాన్ని కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలియజేస్తోంది.

హ్యాట్రిక్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్‌

బాలీవుడ్‌ విలక్షణ నటుడు, విలన్‌ శక్తి కపూర్‌ ముద్దుల తనయ శ్రద్ధాకపూర్‌ చాలా ఆనందంగా ఉంది. ఆమె లేటెస్ట్‌ మూవీ ‘ఆషికి-2’ సూపర్‌హిట్‌ అయి రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరింది. 2010లో ‘తీన్‌పత్తి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రద్ధ ముంబైలో జన్మించింది. బాలీవుడ్‌ నటి పద్మిని కొల్హాపూర్ శ్రద్ధాకు మేనత్త అవుతుంది. బోస్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి థియేటర్‌ ఆర్ట్స్ పూర్తిచేసింది. 'తీన్‌పత్తీ' (2010)తో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.
మొదటి చిత్రంలోనే బాలీవుడ్‌ షెహాన్‌షా అమితాబ్‌, మాధవన్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసింది. రెండవ చిత్రం 'లవ్‌కా ది ఎండ్‌ '(2011) మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని యష్‌రాజ్‌ సంస్థ నిర్మించింది. ఇక మూడో చిత్రం కూడా విజయం సాధించడంతో ఇప్పుడు బాలీవుడ్‌ నిర్మాతల దృష్టి శ్రద్ధాకపూర్‌ మీద ఉంది. టాలీవుడ్‌ నిర్మాతలు కూడా శ్రద్ధాపై శ్రద్ధచూపే అవకాశం మరెంతకాలమో లేదనిపిస్తోంది.