RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, January 31, 2013

దీనిపై ఏదో ఒకటి చేయాలి!: ఎస్‌.జానకి

గాయనిగా నా ప్రయాణం చాలా దూరమే సాగింది. పద్మభూషణ్‌ కన్నా ఉన్నతమైన గౌరవపురస్కారాన్ని ఆశించాను. ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చాక, అనేక ఫోన్‌ కాల్స్‌ సన్నిహితుల నుంచీ, హితుల నుంచీ వస్తున్నాయి. వారు నా మాటను బలపరుస్తున్నారు. అభిప్రాయాన్ని సమర్థించారు. ఇదే పురస్కారాన్ని ఇంకా ముందు అందజేయాల్సింది. దక్షిణాది వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్న విషయాన్ని ....

సినీ నిర్మాతగా మారిన హర్భజన్

Saturday, January 26, 2013

'కడలి' ముద్దు సీన్లపై విమర్శలు

' సినీ వినోదం.కామ్' ఆధ్వర్యం లో 'షార్ట్ ఫిలిం ఫెస్టివల్'

త్వరలో' సినీ వినోదం.కామ్' ఆధ్వర్యం లో 'షార్ట్ ఫిలిం ఫెస్టివల్' 

Friday, January 25, 2013

'కె.వి.రెడ్డి అవార్డు' ను అందుకున్న బి.గోపాల్

'కె.వి.రెడ్డి అవార్డు' ను అందుకున్న బి.గోపాల్ 
విఖ్యాత దర్శకుడు 'కె.వి.రెడ్డి అవార్డు' ప్రదానోత్సవం 'యువకళావాహిని' ఆధ్వర్యంలో 24న రవీంద్రభారతిలో ఉల్లాసభరితంగా జరిగింది. ఈ అవార్డును డా"అక్కినేని నాగేశ్వరరావు, కె.విశ్వనాధ్,డి.రామానాయుడుల చేతులమీదుగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కు ప్రదానం చేశారు. కె.వి. రెడ్డి చలనచిత్ర పరిశ్రమ మరిచిపోలేని గొప్ప వ్యక్తని, అంతకంటే గొప్ప దర్శకుడని చెబుతూ - ప్రేక్షకులను రంజింపజేసే పకడ్బందీ కధనం(స్క్రీన్ ప్లే)అందించడం లో కె.వి.రెడ్డి దిట్ట -అని డా"అక్కినేని కొనియాడారు.పరుచూరి సోదరుల గురించి అక్కినేని విసిరిన ఛలోక్తులు నవ్వులు పూయించాయి.

డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ- బి.గోపాల్ తమ సంస్థకు బిడ్డలాంటి వాడని అన్నారు.ఈ ఏడాది తను దర్శకత్వం వహిస్తానని చెప్పారు. బి.గోపాల్ మాట్లాడుతూ- థియేటర్లో నేలపై కూర్చొని అక్కినేని సినిమాలు చూసిన తాను ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవటం నమ్మలేనంత ఆనందంగా ఉందన్నారు. రామానాయుడు దర్శకుడిగా అవకాశం ఇవ్వకుంటే తాను ఈ స్థితిలో వుండే వాడిని కాదని,ఈ అవార్డును రామానాయుడుకే అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ సభలో పరుచూరి సోదరులు, సారిపల్లి కొండల రావు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్,నిర్మాత యస్.గోపాల్ రెడ్డి, నిర్మాత డా"వెంకటేశ్వరరావు, 'జాతీయ అవార్డు గ్రహీత' వాసిరాజు ప్రకాశం, 'సినీ వినోదం.కామ్' సంపాదకుడు రాంబాబు అడ్ల , వై.కె.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.యస్.వి.రామారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గంగాధర్,విజయలక్ష్మి ,చింతలపాటి సురేష్ ల 'కె.వి.రెడ్డి సినీ సంగీత విభావరి' ఆహుతులను ఆకట్టుకుంది.

Thursday, January 24, 2013

'సినీ వినోదం .కామ్' సంపాదకుడు రాంబాబు అడ్ల ను జ్ఞాపికతో సత్కరిస్తున్న డా"అక్కినేని నాగేశ్వర రావు

విఖ్యాత దర్శకుడు కె.వి.రెడ్డి అవార్డ్ ను బి .గోపాల్ కు ప్రదానం చేసిన సభలో అవార్డు కమిటీ సభ్యుడు, 'సినీ వినోదం .కామ్' సంపాదకుడు రాంబాబు అడ్ల ను జ్ఞాపికతో సత్కరిస్తున్న డా"అక్కినేని నాగేశ్వర రావు

Wednesday, January 23, 2013

విక్రమ్ స్టైల్ నాకిష్టం!:అమలాపాల్

తనకింకా పెళ్లి ఆశ కలగలేదని పేర్కొం టున్నారు నటి అమలాపాల్. అనతి కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుని ప్రస్తుతం దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మలయాళి ముద్దుగుమ్మ అమలాపాల్. ఈ భామ సంక్రాంతి వేడుకను రెట్టింపు సంతోషంతో జరుపుకున్నారట. గత ఏడాది ఆమె నటించిన వేట్టై చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ ఏడాది ఆమె టాలీవుడ్ యువ హీరో రామ్‌చరణ్‌తో జత కట్టిన చిత్రం నాయక్ సంక్రాంతికి విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. సంక్రాంతి తనకు మంచి రాశిగా మారిందని....

ఇక డిటిహెచ్‌లో చిన్న సినిమాలు ?

సంక్రాంతి సీజన్‌ వచ్చింది...వెళ్లింది...పెద్ద సినిమాలు వచ్చినవి రెండే...రెండూ మంచి కలెక్షన్లతో దూసుకెళుతున్నాయి. ఏ థియేటర్‌లో చూసినా పెద్ద హీరోల చిత్రాలే కనిపిస్తున్నాయి. నెల రోజులపాటు ఇక చిన్న సినిమాలకు థియేటర్లే దొరకని పరిస్థితి. మళ్లీ ఖర్మకాలి శివరాత్రికి మళ్లీ పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే...ఇక దాదపు సమ్మర్‌ దాకా చిన్న సినిమాలు విడుదల చేసుకోలేని పరిస్థితి. ఒకవేళ చిన్న సినిమా బాగుండి మంచి టాక్‌ సంపాదించుకుని ...

Tuesday, January 22, 2013

'బిగ్ బాస్' విజేత ఊర్వశి ధోలకియా

దేశవ్యాప్తంగా బాగా పాపులర్‌ అయిన కలర్స్‌ ఛానల్‌ రియాల్టీషో ‘బిగ్‌ బాస్‌’ 6వ సీజన్‌ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అందరు పోటీదారులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది హిందీ బుల్లితెర నటి ఊర్వశి ధోలకియా. రూ.50 లక్షల ఫ్రైజ్‌ మనీ కూడా గెలుచుకుంది. 33 ఏళ్ల ఊర్వశి ధోలకియా నేపథ్యం విషయానికొస్తే....హిందీ బల్లి తెరపై వ్యాంప్‌ పాత్రలు పోషించే ....

మన సంగీత ఘన కీర్తి 'బొంబాయి జయశ్రీ'

Friday, January 18, 2013

వివేకానంద జయంతి ఉత్సవంలో జాగృతి పురస్కారాలు

'యువకళా వాహిని' ఆధ్వర్యం లోజనవరి 11న  జరిగిన వివేకానంద జయంతి ఉత్సవంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు,జే .బాపురెడ్డి చేతులమీదుగా  జాగృతి పురస్కారాలు అందుకుంటున్న జి .సత్య వాణి, ఇప్పన పల్లి హరికిషన్, పి .మంజుల , కే.వెంకట రమణ మూర్తి. ఈ కార్యక్రమం లో 'వివేకానంద విజయం' పాటల సి.డి ని విడుదల చేసి, వై.కే.నాగేశ్వర్ రావు బృందం చే 'స్వామి వివేకానంద' నాటకాన్ని ప్రదర్శించారు.

Monday, January 14, 2013

విధి నిర్ణయంతోనే సినిమాల్లోకి

రాజ్ 3లో హాట్‌హాట్ దుస్తులతో రెచ్చిపోయిన మాజీ మోడల్ ఇషాగుప్తా సినిమాల్లో రావాలని తాను ఎన్నడూ కోరుకోలేదని చెబుతోంది. విధిరాత వల్లే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది. నిజానికి న్యాయశాస్త్రం చదవాలన్నది ఈ ఢిల్లీ బ్యూటీ కోరికట. ఆరేళ్ల క్రితం గ్లామర్ రంగంలోకి వచ్చింది. ఇషా 2007లో ఫెమీనా మిస్ ఇండియా పీజెంట్‌లో మూడోస్థానం సాధించిన తరువాత...

'సదా బహార్ నగ్మే' సినీగీత విభావరి

మహతి మ్యూజిక్ - శ్రీ నాగ రంజని లలిత సంగీత అకాడమీ ఆధ్వర్యం లో జనవరి 5న రవీంద్ర భారతి లో 'సదా బహార్ నగ్మే'( హిందీ చలన చిత్ర ఆపాత మధురాలు) సినీగీత విభావరి జరిగింది.మూడు దశాబ్దాల హిందీ చలన చిత్ర స్వర్ణయుగం (1950-1980)లోని జన రంజకమైన "జ్యోతి కలష్ ఛల్ కే ", "తేరే మేరె సప్నే", "బయ్య నాదరో", "గుమ్ నామ్ హాయ్ కోయి", "మేరే సప్నోంకి రాణి", "ఓ మేరే సోనారే ", "ధీరె ధీరె మచల్", "రైనా బీత్ జాయే" వంటి ఎంపిక చేసిన గీతాలను ఆలపించి పాత పాటల తీయదనాన్ని అందించారు.లతా మంగేష్కర్,ఆషా భోంస్లే ,మన్నాడే,రఫీ,కిషోర్ కుమార్,జేసుదాస్,సుమన్ కళ్యాణ్ పూర్ వంటి మహా గాయకులు నాడు ఆలపించిన గీతాలను డా"చిత్తరంజన్, డా"యం.విజయకుమార్ ,మురళి,కౌశిక్,విజయ లక్ష్మీ దేశికన్,వందన పవన్,మహతి రాఘవన్, అమృత వల్లి ఆనంద్ తదితరులు ఆలపించి ప్రేక్షకులను పులకరింప జేసారు.ఈ కార్యక్రమం లో పాడిన వారంతా మహాభాష్యం కుటుంబ సభ్యులే కావడం విశేషం.ఈ కార్య క్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీత్ ,మహేంద్ర సత్యం సీనియర్ ఉపాధ్యక్షులు శివానంద తనేజ ముఖ్య అతిధులుగా హాజరై గాయనీ గాయకులను అభినందించారు.'సంగీత్ సాగర్' అశోక్ బృందం వారు వాద్య సహకారం అందించారు.సినీ గీత చిత్రీకరణలను వీడియో స్క్రీన్ ద్వారా రఘురామ్ ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఈ కార్యక్రమాన్ని సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శులు రాఘవ దేశికన్,డా"యం.విజయ కుమార్ రసవత్తరం గా నిర్వహించారు.

మీకు...మీ కుటుంబానికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

మీకు...మీ కుటుంబానికీ సంక్రాంతి శుభాకాంక్షలు! 
-రాంబాబు అడ్ల సినీవినోదం.కామ్

Monday, January 7, 2013

ఎమిజాక్సన్ పరిస్థితి కూడా అదే!

ప్రేమ గుడ్డిదని పెద్దలు ఊరికే అనలేదు. మన హీరోయిన్ల ప్రేమ కూడా అంతే. ఎందుకో ఏమో తెలీదు గానీ కొందరు హీరోయిన్లు ఇట్టే ప్రేమలో పడతారు. అంతే వేగంగా విడిపోతారు. మొన్న ప్రభుదేవా, నయనతారలది ఇదే పరిస్థితి. వీరిద్దరూ అమితంగా ప్రేమించుకున్నారు. సహ జీవనం చేశారు. ప్రేమకు గుర్తుగా నయనతార తన చేతిపై ప్రభుదేవా పేరును పచ్చబొట్టు....

Friday, January 4, 2013

గాయని శ్వేతా పండిట్‌ నటిస్తోంది

Thursday, January 3, 2013

ఈ జీవితమే బాగుంది!:ప్రభుదేవా

Tuesday, January 1, 2013

నూతన సంవత్సర శుభాకాంక్షలతో....
                                                        -రాంబాబు అడ్ల   సినీవినోదం.కామ్