RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Monday, January 31, 2011

తల్లిని ధ్వేషించే తనయ ;నయనతార.

మలయాళంలో ‘ఎలక్ట్రా’ అనే చిత్రం కూడా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రధారులు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజవుతుంది. అలెగ్జాండ్రా అనే గ్రీక్ డ్రామా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ‘ఎలక్ట్రా’లో నా పాత్ర వేరు. నా తల్లి డయానాగా మనీషా నటిస్తున్నారు. తల్లిని ద్వేషించే తనయ పాత్రలో .....

గజల్ శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా ‘నాట్స్’ సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాంస్కృతిక సంబరాలు అంబరాన్ని అంటాయి. సినీనటి జయలక్ష్మి నాట్యం రసజ్ఞులను రక్తికట్టించింది. నృత్యగురువు వెంకట్ ప్రదర్శించిన ‘అర్థనారిశ్వరం’ ఆసాంతం ఆకట్టుకుంది. నటీనటులు కృష్ణుడు, గౌతంరాజు, కోట శంకర్‌రావు, వేణు, ఢిల్లీ రాజేశ్వరి, జయలక్ష్మి, సౌమ్యరాయ్, గీతాసింగ్‌ల బృందం వినిపించిన హాస్యవల్లరి నవ్వించాయి. గీతామాధురి, శ్రీకృష్ణ, అంజనా, సౌమ్య, రేవంత్, సింహ, అనూప్, మాళవికల బృందం......

Friday, January 28, 2011

'బాలరాజు వాయిదా'... 10న వర్మ 'అప్పలరాజు'

ఐశ్వర్య అడుగుజాడలో దక్షిణాదికి దీపిక

ఎన్ని భారీ చిత్రాలు బాలీవుడ్లో చేసినా దక్షిణాది 'రోబో' మాత్రమే ఐశ్వర్య పరువు కాపాడింది. అందుకనే ఆమె దక్షిణాదిని ఎప్పుడూ మర్చిపోదు. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే టాప్ లోకి వెళ్తున్న దీపికాపదుకొనే అర్ధం చేసుకుంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే కొత్త చిత్రంలో చేసేందుకు వప్పుకుంది. మంచి సినిమా ఐతే నా డేట్స్ అడ్జెస్ట్ చేసైనా దక్షిణాదిలో చెయ్యాలనుకుంటున్నానని దీపిక చెబుతోంది. నచ్చిన సినిమా ఆఫర్ దక్షిణాది నుండి వస్తే కేవలం కోటి రూపాయల పారితోషికానికే.....

Thursday, January 27, 2011

'వీర' ఫోటో గ్యాల్లరీ


వర్మ ‘దొంగల ముఠా’ మార్చి 4న విడుదల

ఇలియాన ఫోటో గ్యా ల్లరి


'వాంటెడ్ ' చిత్ర సమీక్ష

రచయిత రవి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇందులో కొంత ఆసక్తికలిగించే కథ ఉన్నప్పటికీ, దాన్ని పట్టుగా చెప్పే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. దాంతో భారీ తారాగణం సాంకేతికవర్గం ఉన్నప్పటికీ మంచి సినిమాగా రూపొందించలేకపోయారు. చిత్రంలో హీరోకన్నా ప్రాధాన్యత వున్న హీరోయిన్ నందిని పాత్రకు నూతననటి దీక్షాసేథ్ ను ఎంపిక చేయడంలోనూ తప్పు......

Wednesday, January 26, 2011

పర్వతారోహకుని కథతో డానిబోయిలే

'127 అవర్స్‌' పలు చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకీ కథలో విశేషమేంటి ! డానీబోయల్‌ మాటల్లో...'ఇది చాలా అద్భుతమైన కథ. ఆరాన్‌ రాల్‌స్టన్‌ ఆటోబయోగ్రఫీ అందరికీ చెప్పాలనిపింది. జీవన పోరాటానికి మించిన కథ. తన జీవితంలో కొంతమంది విలువేంటో......

నాగచైతన్యతో రామానాయుడు... సుమంత్ అశ్విన్ తో ఎంఎస్ రాజు

ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు నాగచైతన్యతో ఓ భారీ చిత్ర నిర్మాణం చేస్తున్నారు. సుకుమార్, అజయ్ భుయాన్ ల దర్సకత్వంలో ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న నాగచైతన్య వాటి తర్వాత రాంగోపాల్ వర్మ 'బెజవాడ రౌడీలు' చేసే అవకాశం ఉంది . భారీ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. దానికి మొదట ఆదిత్యని దర్శకుడిగా పెట్టాలనుకున్నారు. అయితే ఇప్పుడు రాజు తనే......

పనిని నమ్మి చేస్తాను! :అమీర్‌ఖాన్

పేరు, అవార్డులు తమన్నాకి ప్రధానం!

Tuesday, January 25, 2011

కరీనా - ఖాన్ ల బంధం

ఆమె ‘కాస్ట్ లీ’ కాల్షీట్స్ ఉన్న డైరీ అంతా ‘ఖాన్’ మయంతో నిండిపోనుంది. ఇప్పటికే బెబో (కరీనా ముద్దు పేరు) షారుఖ్ ‘ఖాన్’ సరసన ‘రా.వన్’, తన ప్రియుడు సైఫ్ అలీ ‘ఖాన్’ సరసన ‘ఏజెంట్ వినోద్’, ఇమ్రాన్ ‘ఖాన్’ సరసన ‘షార్ట్ టెర్మ్ షాదీ’, సల్మాన్ ‘ఖాన్’ సరసన ‘బాడీగార్డ్’ చిత్రాలలో నటిస్తోంది. అలాగే మరో ఖాన్ అమీర్ ‘ఖాన్’ సరసన కూడా పేరు నిర్ణయించని ఓ చిత్రంలో కరీనా కపూర్తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమె పేరును ఖరారు చేసే .....

దాసరి, కోడి రామకృష్ణలతో విజయశాంతి

‘ఒసే రాములయ్య’ కాంబినేషన్ దాసరి నారాయణరావు దర్శకత్వలో విజయశాంతి త్వరలో ఓ చిత్రం చేస్తోంది. అలాగే గతంలో పలు విజయవంతమైన చిత్రాలను తనకు అందించిన కోడిరామకృష్ణ దర్శకత్వంలో కూడా విజయశాంతి మరో చిత్రం ప్రారంభిస్తున్నారు. దాసరి చిత్రం తెలంగాణ నేపధ్యంలో, కోడిరామకృష్ణ చిత్రం నేటి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తూ ....

గుసగుసల దశ దాటిన జెన్నీ ప్రేమ

‘‘ఇంకెన్నాళ్లు దాస్తారు. అందుకే విజృంభించేశారు’’… జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ గురించి బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్న మాటలివి. గత ఎనిమిదేళ్లుగాఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ జెన్నీ, రితేష్ ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో అసలు మేమిద్దరం స్నేహితులు కూడా కాదనే టైపులో మాట్లాడారు కూడా. అయితే ఆ మాటలను ఎవరూ .....

నటకుటుంబంతో తెలుగులో ‘యమ్ల పగ్లా దీవానా’

Monday, January 24, 2011

అడ్డదారి తారలు వార్తలకెక్కారు

వెండి తెరపై వెలుగు జిలుగులు. ఆ తెర వెనుకే చీకటి జీవితాలు! సినీ రంగంలోకి అడుగుపెడుతూనే అలవాటయ్యే కాస్ట్‌లీ పోకడలు.. పబ్బులు, పార్టీలతో మొదలై డ్రగ్స్‌కు బానిసలయ్యే దాకా అతి వేగంగా మారిపోయే జీవన విధానం. సీన్ కట్ చేస్తే.. ఆ విచ్చలవిడి జీవనాన్ని కొనసాగించేందుకు, భారీగా సంపాదించేందుకు పెడదారులు తొక్కడం!! ఇదీ ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా వ్యభిచార కూపంలో అడుగు పెడుతున్న నటీమణుల తీరూతెన్నూ! ఇటీవలి కాలంలో వ్యభిచార రాకెట్లలో భాగస్వాములన్న ఆరోపణలపై అరెస్టయిన ......

మూడు చిత్రాల సన్నాహాల్లో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి

‘స్నేహగీతం’ చిత్రంతో మంచి ఫీల్ గుడ్ మూవీ దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతోపాటు ‘ఉత్తమ నూతన దర్శకుడి’గా ప్రతిష్టాత్మక ‘సూపర్ హిట్’ అవార్డు గెలుచుకున్న ‘మధుర’ శ్రీధర్ రెడ్డితో వరుసగా మూడు చిత్రాలు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు ప్రవాసాంధ్ర వైద్యులు డాక్టర్ మున్న వెంకట కృష్ణారావు. నెల్లూరు వాస్తవ్యులైన వెంకటకృష్ణారెడ్డి గత 20 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా మరియు బోట్స్ వానా దేశాల్లో చిన్న పిల్లల ఆసుప్రతి నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు. సినిమా రంగం పట్ల చిన్నప్పటినుంచి ఆసక్తి కలిగిన డాక్టర్ మున్నా వెంకట కృష్ణారెడ్డి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో .....

అనారోగ్యంతో ఆసుపత్రిలో కపూర్లు

కపూర్‌ కుటుంబానికి బాలీవుడ్‌లో ప్రముఖ స్థానముంది. రాజ్‌ కపూర్‌ నుంచి నేటి రణబీర్‌ వరకూ ఆ కుటుంబ సభ్యులు బాలీవుడ్‌లో తమ హవా కొనసాగిస్తున్నారు. కోయి ముజే జంగ్లీ కహే...అంటూ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఒక్క ఊపు ఊపిన హీరో షమ్మీ కపూర్‌. ఇక నాటి తరం అమ్మాయిల కలల హీరోగా శశికపూర్‌ సైతం బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ సోదరులు ఇద్దరూ తమ చిత్రాలతో అభిమానులను అలరించారు. ఒకప్పటి ఈ స్టార్‌ హీరోలు ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఉండడం ....

స్వామి నిత్యానందపై రంజిత స్వంత చిత్రం

శృంగార కార్యకలాపాలకు పేరు బడ్డ స్వామి నిత్యానందపై తెలుగులో రాంజేద్ర ప్రసాద్ తో ‘అయ్యారే’, కన్నడలో ‘సత్యానంద’ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. నిత్యానంద సన్నిహితురాలిగా వీడియో క్లిప్పింగ్స్ లో కనిపించిన నటి రంజిత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అతనిపై సినిమా తీయాలనుకుంటోందట. మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలకి తగిన సమాధానం ఇవ్వడానికి చిత్ర నిర్మాణమే మార్గమని....

Sunday, January 23, 2011

అనుష్క ఫోటో గ్యాల్లరీ


అవార్డులంటే గౌరవం పోతోందంటున్న కరీనా

శృంగార తారా విహారం

పలు తెలుగు, కన్నడ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ యమున నాటకీయ రీతిలో గురువారం అర్ధరాత్రి బెంగళూరులోని హోటల్ ఐటీసీ రాయల్ గార్డేనియాలో వ్యభిచారానికి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. యమున, ఓ క్యారెక్టర్ నటి, రాజకీయ నేత కొడుకు, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారణ జరుపుతున్నారు. ఈ సెక్స్ రాకెట్‌తో ప్రముఖుల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సినీ నటి యమునను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్న మాట నిజమేనని నగర పోలీసు కమిషనర్ ....

ఈవీవీ సత్యనారాయణ కన్నుమూశారు.

వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఇవివికే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ విన్నప్పుడల్లా కిసుక్కున నవ్వొస్తుంది. అదే ఇవివి స్టైలంటే. ఇవివి తల్లిదండ్రులు స్థిరపడింది నిడదవోలు మండలం కోరుమామిడిలో. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇవివికి ....

Friday, January 21, 2011

నన్ను హాట్, సెక్సీ అనకండి ప్లీజ్!

 వ్యక్తిగతంగా నన్ను నేను హాట్ అనీ, సెక్సీ అనీ అనుకోను. చూసే కళ్లను బట్టి రూపం ప్రత్యేకంగా కనిపిస్తుందంతే. ప్రేక్షకులనుకున్నంత హాట్ మాత్రం కాదు. సంప్రదాయబద్దమైన పాత్రలు విద్యాబాలన్ కు బాగా నప్పుతాయి. ఆమెను ప్రేక్షకులు అలా చూడడానికి ఇష్టపడతారు. నా వరకూ వస్తే... ఫన్నీగా ఉండే పాత్రలే కుదురుతాయి. నాకు సౌకర్యం కూడా అవే. అందుకే అలాంటివి .....

మోనికని వాడుకుని వదిలేసారు

తెలుగులోనూ ఒకటీ అరా చిత్రాల్లో నటించిన మోనికాబేడీ అవకాశాల కోసం మాఫియాని ఆశ్రయించి, ఆ తర్వాత పోలీసులకు చిక్కి కటకటాల్లెక్కెట్టిన సంగతి తెల్సిందే. రీ - ఎంట్రీలో బుద్ధిగా అవకాశాల కోసం ప్రయత్నించినా, మాఫియా బ్యాక్ గ్రౌండ్ కాస్తా ఆమెకు ఛీత్కారాలు, చీదరింపుల్నే మిగిల్చింది.
అయితే మాఫియాని అడ్డం పెట్టుకుని అవకాశాలు గతంలో రాబట్టుకున్నప్పటికీ ......

చిరంజీవి ‘అధినాయకుడు’ దర్శకుడు వినాయక్

మళ్ళీ సిక్స్ ప్యాక్ కి సల్మాన్ సిద్ధం!

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తన సిక్స్‌ప్యాక్‌ బాడీని పరిపూర్ణంగా ఉంచుకునేందుకు ఈ మధ్యన మద్యానికి దూరంగా ఉంటున్నారు. ఆయన తన బావ అతుల్‌ అగ్నిహోత్రి సినిమా ‘మై లవ్‌ స్టోరీ’ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు మద్యాన్ని ముట్టుకోవద్దని సల్మాన్‌ నిర్ణయించుకున్నారు. తన సిక్స్‌ప్యాక్‌ బాడీ కోసమే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అతుల్‌ అగ్నిహోత్రి నిర్మిస్తున్న మై లవ్‌ స్టోరీలో సల్మాన్‌ హీరోగా చేస్తున్నారు. మళయాళం సినిమా బాడీగార్డ్‌ రీమేక్‌గా ....

Thursday, January 20, 2011

వెండితెరకు కత్రీనా చెల్లి ఇసబెల్లా

 బాలీవుడ్‌కు మరో ప్రముఖ హీరోయిన్‌ చెల్లెలు రాబోతోంది. ఎవరో చెల్లెలు అంటే అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు కానీ ఆమె అలాంటి ఇలాంటి హీరోయిన్‌ చెల్లెలు కాదు...తెలుగువారు ముద్దుగా మల్లీశ్వరిగా పిలుచుకునే కత్రినాకైఫ్‌కు స్వయానా సహోదరి. కరిష్మా చెల్లెలుగా కరీనా ఇప్పటికే బాలీవుడ్‌ రికార్డుల్ని చెరిగేస్తోంది. ఫరాఖాన్‌ కన్నా ఆమె చెల్లెలు టబు టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. కాజోల్‌ చెల్లెలు కూడా ఇప్పటికే......

అక్కకూ, నాకు అచ్చొచ్చిన అమీర్ ఖాన్

అక్క కరిష్మాకి, నాకూ అమీర్ ఖాన్ కలిసొచ్చిన హీరో అనుకుంటా. ‘రాజా హిందూస్తానీ’ కోసం అమీర్ కు జంటగా నటించిన అక్క అప్పుడు ఇదే అవార్డు తీసుకుంది. ఇప్పుడు నేను. ‘త్రీ ఇడియట్స్’లో నన్ను సాధ్యమైనంత సహజంగా చిత్రీకరించారు. అమీర్, నిజజీవితంలో ఎలా వుండటానికి .....

Wednesday, January 19, 2011

విడాకులు తీసుకుని, తిరిగి వెండితెరపైకి కరిష్మా

సంజయ్ కపూర్ తో ఏడేళ్ళ అనుబంధాన్ని వదులుకోవాలని కరిష్మాకపూర్ నిర్ణయించుకుని ఢిల్లీ నుండి ముంబాయికి వచ్చేసింది. నటిగా తిరిగి వెండితెరపై కనిపించాలనుకుంటున్నఆమె ఇటీవల అందాల ఫొటోసెషన్ చేయించుకుంది. కొన్ని యాడ్ ఫిలింస్ కూడా ....

విమలా రామన్ ఫోటో గ్యాలరీ

Tuesday, January 18, 2011

‘దొంగల ముఠా’లో లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం

రామ్ గోపాల్ వర్మ ప్రయోగాత్మకంగా 5 రోజుల్లో నిర్మిస్తున్న ‘దొంగల ముఠా’లో రవితేజ, ఛార్మితో పాటు లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అజయ్ నటిస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీతో కేవలం 8 మంది టెక్పీషియన్స్ తో ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి ఓ ప్రముఖ దర్శకుడు కో-డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉంది. డబ్బు కన్నా......

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘ద సోషల్ నెట్‌వర్క్’

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ‘ద సోషల్ నెట్‌వర్క్’ చిత్రం హవా కొనసాగింది. ‘ఫేస్‌బుక్’ ఆవిర్భావం కథాంశంగా నిర్మించిన ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, స్క్రీన్‌ప్లే సహా మొత్తం 4 అవార్డులను సొంతం చేసుకుంది. గతేడాది తరహాలో ఈమారూ ఏఆర్ రెహ్మాన్‌కు గోల్డెన్ గ్లోబ్ వరిస్తుందని ఆశించిన భారతీయులకు నిరాశే మిగిలింది. ఉత్తమ సంగీత విభాగం అవార్డునూ ‘ద సోషల్ నెట్‌వర్క్’ చిత్రమే దక్కించుకుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ట్రెంట్ రెజ్నార్, అటికస్ రాస్ ద్వయం ఈ అవార్డును గెలుచుకుంది. ఆదివారమిక్కడి బెవర్లీ హిల్టన్ హోటల్‌లో......

హిప్ హాప్ డాన్స్ ప్రాణమంటున్న అక్షర

మీకో సంగతి తెలుసా? 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో లాటిన్‌ బాల్‌రూమ్‌ డ్యాన్స్‌ పోటీలో ఇండియా తరపున బరిలోకి దిగేది నేనే. దీనికోసం రోజూ ప్రాక్టీస్‌ చేస్తూ కష్టపడుతున్నా. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నానని అంటోంది కమల్ హసన్ కుమార్తె.....

చార్మి .... ఫోటో గ్యాలరీ

 

Monday, January 17, 2011

విజయశాంతి నాయికగా దాసరి చిత్రం

తన 150వ చిత్రంగా ఇటీవల ‘పరమవీరచక్ర’ అందించిన దాసరి నారాయణరావు త్వరలోనే 151వ చిత్రం ప్రారంబించే ప్రయత్నంలో వున్నారు. సంచలన విజయం సాధించిన ‘ఒసేయ్ రాములమ్మ’ కాంబినేషన్లో విజయశాంతిని నాయికగా పెట్టి దాసరి తన బ్యానర్ పై....

ప్రదర్శించడమే పనికాదు! ....సనాఖాన్

అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది. కొందరు జీన్‌‌సలో కూడా గ్లామరస్‌గా ఉంటారు. కొందరు చీర కట్టుకున్నా సెక్సీగా ఉంటారు. గ్లామరస్‌గా ఉండటంలో తప్పేమీ లేదు. పాత్ర డిమాండ్ చేసినప్పుడు బికినీ అయినా వేసుకోవచ్చు. కానీ అందాన్ని ప్రదర్శించడమే పనిగా.....

Sunday, January 16, 2011

అమీర్ ఖాన్ భార్యకూ ఇబ్బందులున్నాయి

'ప్రముఖ నటుడి భార్యగా కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెలబ్రటీ వైఫ్‌గా కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి. వ్యక్తిగతంగానూ కొన్ని నచ్చని పద్ధతులూ భరించాలి. ఉదాహరణకు... ప్రతీ రోజు శుభ్రంగా స్నానం చేయడం అతనికి ఇష్టముండదు. ఇది నిజం ! ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు చేస్తాడు' అమీర్‌ఖాన్‌ భార్య కిరణ్‌ .....

సంక్రాంతి సినిమాల్లో మళ్ళీ బయటపడ్డ డొల్లతనం

గత సంవత్సరం మనకు మిగిల్చినచేదు అనుభవాలు ఇంకా మర్చిపోనేలేదు. ఈఏడాది సంక్రాంతికి ఎన్నో అంచనాలతో ఎదురుచూసిన భారీ చిత్రాలు కూడా తీవ్ర నిరాశ పరిచాయి. ఆడంబరాలు... హడావుడి తప్ప విషయంలేని డొల్లతనం మరోసారి బయటపడింది. బాలకృష్ణ తొలి కాంబినేషన్లో దాసరి దర్శకత్వం వహించిన 150వ చిత్రం ‘పరమవీరచక్ర’ పాతికేళ్ళనాటి సినిమా .....

Saturday, January 15, 2011

ఆస్కార్ ను మళ్ళీ ఆశిస్తున్న రెహమాన్

పోస్టర్‌ బాయ్ ఆఫ్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ మరో సంచలనానికి చాలా దగ్గరలో ఉన్నారు. 2009లో గోల్డెన్‌ గ్లోబ్‌, ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుని భారత కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. 2011లోనూ అది పునరావృతమవనుందా ! అన్నది సంగీతాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. కొత్త సంవత్సరంలో రెహమాన్‌ బాణీలు గోల్డెన్‌ గ్లోబ్‌ నామినేషన్‌ను రెండోసారి కొల్లగొట్టాయి. అంతేగాక ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో సైతం ఆయన మరోమారు చోటు సంపాదించారు. టాప్‌-5 నామినేషన్‌లో చోటు దక్కుతుందో.....

గోవింద కూతురు నర్మద సిద్ధం!

బాలీవుడ్‌లోకి కొత్త జనరేషన్ ప్రవేశిస్తోంది. హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా చేస్తే మన తెలుగువారు ఒప్పుకోరు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఇది చాలా సర్వసాధారణం. రణదీర్ కపూర్ కూతుళ్లు కరీష్మా కపూర్, కరీనా కపూర్‌లు బాలీవుడ్‌ని ఊపేశారు. అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా బాలీవుడ్‌లో రాణిస్తున్నారు. పోయినేడాది శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా కూడా దబాంగ్ సినిమాలో సల్మాన్ సరసన....

Friday, January 14, 2011

మంచి పనులు త్రిష కూడా కొంచెం..!

తాము సంపాదించిన ఖ్యాతితో తారలు అనేకరకాల వాణిజ్య ఉత్పత్తులకి ప్రతినిధిగా ఈ సబ్బునే వాడండి...లాంటి ప్రకటనల్లోకి ప్రవేశించి యధాశక్తి సొమ్ము చేసుకోవడం మనకు తెలుసు. ఇక పోటీ ప్రపంచంలో సరుకుల సంఖ్య పెరగడం, దానికి సమానంగా తారామణుల నెంబరూ లెక్కకు మించి ప్రారంభోత్సవానికో ముడిసరుకుగా మారిపోవడం లేటెస్టుగా వచ్చేసిన ట్రెండు. ఇంక ఈ రెండింటి మధ్యా కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా ‘కింగ్‌ఫిషర్’ వంటి భారీ సంస్థ తమ సంస్థకు చెందిన వాటి ప్రచారకర్తల రూపంలో ఆకర్షణీయమైన కేలండర్స్‌కి తారల తళుకుల్ని....

‘అనగనగా ఓ ధీరుడు’ చిత్ర సమీక్ష

మంచికథ, కథనం లేకుండా ఎవరెంత చేసినా వృధా ప్రయాసేనని ఈ చిత్రం విషయంలో కూడా మరోసారి రుజువయ్యింది. సాంకేతికంగా ఎంతబాగున్నా, మంచి స్క్రీన్ ప్లే లేకపోవడం ఈ చిత్రానికి మైనస్. ఈ చిత్రం స్క్రీన్ ప్లే మరీ దయనీయంగా వుంది. ఈ చిత్రానికి క్రియేటివ్ సూపర్ విజన్ చేసిన కె.రాఘవేంద్రరావు ఏంచేశారో అర్థంకాదు. దర్శకుడు ప్రకాష్ అపరిపక్వతకు తోడు, మేధావి హీరో సిద్దార్థ పైత్యం కూడా కలగలిపి ఈ చిత్రాన్నినిజంగానే పిల్లల చిత్రంగా మార్చేసాయి. ఎంతబాగా చేయాలని....

త్వరలో రజనీ ‘హర’....పైరసీలోనూ రికార్డ్ సృష్టించిన ‘అవతార్’

 హాలీవుడ్ చిత్రం ‘అవతార్‘ ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ చిత్రం పైరసీలోనూ ప్రపంచ రికార్డు నెల కొల్పడం విశేషం. ఈ చిత్రాన్ని ఇప్పటి వరకూ కోటి అరవై అయిదు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట నెటలో. ఇది కాక సిడిల.....

'సినీవినోదం' సంక్రాంతి శుభాకాంక్షలు http://cinevinodam.com/

Thursday, January 13, 2011

‘బిగ్ బాస్’ విజేత శ్వేతా తివారీ

. ‘ఓ ఒంటరి మహిళగా నేను ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానో నాకే తెలుసు...కానీ నేనెప్పుడూ ఒంటరి తల్లిగా ఎవరి నుండి సానుభూతి ఆశించలేదు. నాకు నేనుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఈ బహుమతి మొత్తం నా కూతురు పలక్‌ ఉన్నత చదువు కోసమే’అని శ్వేత ఉద్విగ్నంగా చెప్పిన మాటలు...

‘మిరపకాయ్’ చిత్ర సమీక్ష

అదే రవితేజ... అదే నటన... అతి చిన్న కథాంశం... కొత్తదనం లేని కథనం... ఎన్నో సినిమాల్లో చూసేసిన సన్నివేశాలు... ఇదీ మిరపకాయ్ సినిమా. రవితేజ నటనంటే ఇష్టపడే వారు ఈ సినిమా చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. కొత్తదనం కోరేవారికి మాత్రం రొటీన్ సినిమా అనిపిస్తుంది. రవితేజ ఎనర్జిటిక్ కామెడీ, తమన్ సంగీతం ఈ చిత్రంలో హైలైట్స్. ఒకే తరహా నటనే అయినప్పటికీ రవితేజ ప్రేక్షకులను ఎప్పటిలానే వినోదపరుస్తారు. యాక్షన్, డాన్స్ లు కూడా బాగా చేశాడు. పట్టు గట కథ ఉంటే .....

అక్కినేని అవార్డ్ అందుకున్న బాలచందర్

''నా యాభయ్యేళ్ల సినీ జీవితంలో ఇలాంటి పురస్కార వేడుకను నేను చూడలేదు. కళకు భాష, ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించిన పురస్కారమిది. తెలుగు నటీనటులతో నాకు ఎంతో అనుబంధం ఉంది. దేవదాసు సినిమాలో అక్కినేని నటన చూశాక జీవితంలో మద్యం ముట్టాలనిపించలేదు. అంత ప్రభావం చూపిన నటుడాయన. ఈ పురస్కారాన్ని....

‘పరమవీరచక్ర’ చిత్ర సమీక్ష

బాలకృష్ణతో చేసేటప్పుడు మెలోడ్రామాకు ప్రాధాన్యతనిస్తూ పవర్ ఫుల్ సంభాషణలతో సినిమాను నడిపినప్పుడే విజయానికి ఆస్కారముంటుంది. అయితే, పాత కాలపు కథ, కథనంతో ఈ చిత్రం నడుస్తుంది. ఎక్కడా కొత్తదనం కనిపించదు. సంభాషణలు సైతం రొటీన్ గా సాగుతాయి. కొన్ని చోట్ల కాస్త బాగున్నట్లనిపించినా, మరికొన్ని చోట్ల మరీ నాసిగా ఉంటాయి. ‘బొబ్బిలి పులి’ నుండి ఎన్టీఆర్ సన్నివేశంతో ఇప్పటి జయసుధను కలిపిన ప్రారంభమే పేలవంగా ఉంది. రావణ బ్రహ్మగా బాలయ్యతో చేయించిన సన్నివేశం కూడా....

Wednesday, January 12, 2011

ఫిబ్రవరి 4న ‘గగనం’... లైవ్ యాక్షన్ లో ‘ఈగ’

నాగార్జున - ప్రకాష్ రాజ్ హీరో విలన్లుగా రాధా మోహన్ దర్శకత్వంలో నటించిన ‘గగనం’ ఫిబ్రవరి 4న తెలుగు తమిళంలో విడుదలవుతుంది. సనాఖాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలగులో దిల్ రాజు, తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మించారు. రాజమౌళి దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్న ‘ఈగ’ యానిమేషన్ చిత్రమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఇది రెగ్యులర్ లైవ్ యాక్షన్ చిత్రమేనని ....

కే .అచ్చి రెడ్డి కి జన్మ దిన శుభా కాంక్షలు

http://cinevinodam.com/

Tuesday, January 11, 2011

సందేశాలు ఇష్టపడను!...సల్మాన్‌

మనసులో ఉన్న దాన్ని సూటిగా చెప్పే వ్యక్తుల్లో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఒకరు. ఈయన చేసే కామెంట్స్‌ బాలీవుడ్‌లో బాగా పండుతాయి. ఆనందం వచ్చినా, ఆక్రోషం వచ్చినా ఆపుకోకుండా కక్కేయడం ఈ కండలవీరుడి తరహా. తోటి నటీనటుల చిత్రాలను మొహమాటం లేకుండా విమర్శిస్తుంటారు. దీనివల్ల చాలామంది స్నేహితులు దూరం జరిగారు ! తాజాగా ఆ జాబితాలో హృతిక్‌రోషన్‌ చేరాడు. వీటి గురించి .....

ప్రేక్షక అభిమాన భామలు

‘షీలాకి జవాని’ అంటూ రీసెంట్‌గా ‘తీస్‌మార్‌ ఖాన్‌’లో కుర్రకారు గుండెల్ని పిండేసిన కత్రినాకైఫ్‌పై జనాభిమానం చెక్కుచెదరలేదు. 2010 సంవత్సరానికిగాను డబ్ల్యు.డబ్ల్యు.ఐటైమ్స్‌ డాట్‌కామ్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ జనాభిప్రాయ సేకరణలో బాలీవుడ్‌కు సంబంధించి హీరోయిన్లలో కత్రినాకైఫ్‌కు అత్యధిక మెజారిటీ ఓట్లు వచ్చాయి. ఈ రేసులో కత్రినా నం.1గా నిలిచింది. కాగా గత సంవత్సరం ఐశ్వర్యరాయ్‌ నటించగా, బాలీవుడ్‌లో విడుదలైన చిత్రాలన్నీ దాదాపు ఫెయిల్యూర్స్‌ కాగా .....

Monday, January 10, 2011

రణబీర్ తాజా ప్రియురాలు

రణబీర్‌కి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ. అందుకే వదిలేశా’ అని ఆ మధ్య ఓ సందర్భంలో దీపికా పదుకొనే బహిరంగంగా ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడదే మాటలను రిపీట్‌ చేసే పరిస్థితిలో ఉంది మరో అందాల తార కత్రినా కైఫ్‌. దీపికాని ఓ రేంజ్‌లో లవ్వాడిన రణబీర్‌ కపూర్‌ ఆమె నుంచి విడిపోయిన తర్వాత అదే రేంజ్‌లో కత్రినాతో లవ్‌స్టోరీ మొదలుపెట్టారు. రణబీర్‌ కుటుంబానికి కూడా కత్రినా అంటే చాలా ఇష్టం. ఆ రకంగా ఈ ప్రేమికులకు రూట్‌ క్లియర్‌ అయ్యింది కాబట్టి ఓ శుభముహూర్తాన పెళ్లాడేస్తారని .....

దీపిక స్పేహం ఎంత దాకా వెళ్తుందో?....శ్రియ డాన్స్ ఇన్సిట్యూట్

నా ఫిజిక్ వెనకున్న నిజమైన రహస్యం స్విమ్మింగ్, డాన్సింగ్. త్వరలో ఓ ఫిట్ నెస్ స్టూడియోను, డాన్స్ ఇన్సిట్యూట్ ను నెలకొల్పాలనుకుంటున్నాను. నేను శాస్త్రీయ నృత్యకారిణిని కూడా. అందుకే నా కళను నాలోనే దాచుకోకుండా - త్వరలో దేశ విదేశాల్లో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు .....

Sunday, January 9, 2011

తరుణ్ పుట్టిన రోజు... కొత్త చిత్రం

తన 28వ పుట్టినరోజు అభిమానుల సమక్షంలో తరుణ్‌ జరుపుకున్నాడు. నట్టికుమార్‌ ప్రస్తుతం జగపతిబాబుతో 'చట్టం' సినిమా తీస్తున్నాడు. నట్టికుమార్‌ మాట్లాడుతూ...'19న సినిమాను ప్రారంభిస్తున్నాం. భారతీగణేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డి.ఎస్‌.రెడ్డి పాత్రలో శ్రీహరి నటిస్తున్నాడు. సింగిల్‌ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేస్తాం. ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం 'చట్టం' షూటింగ్‌ జరుగుతోంది. 302 ప్రింట్లతో విడుదల చేయబోతున్నాం. మరోవైపు శ్రీహరి నటించిన 'మార్క్‌' కూడా తుదిదశలో....

టాప్ 5 ఫ్లాప్ తెలుగు సినిమాలు :2010

1విలన్ ... 2.ఆరెంజ్ ... 3.పులి ...4.వరుడు ....5.ఖలేజా

‘ఆటో నగర్ సూర్య’ పవన్... ‘మెరుపు’లో మార్పులు....త్వరలో రజనీ ‘హర’

రోబో’తో సంచలన విజయం స్వంతం చేసుకున్న రజనీకాంత్ నటిస్తున్న ‘హర’ 3డి యానిమేషన్ చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. రజనీకాంత్ కుమార్తె సౌదర్య స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దేశంలోనే అతి పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యానిమేషన్ తో పాటు ఇందులో అరగంట పాటు రెగ్యులర్ సినిమా కూడా ఉంటుంది. దానికి కె.ఎస్.రవికుమార్.....

టాప్ 5 హిట్ తెలుగు సినిమాలు :2010

http://cinevinodam.com/1 సింహ ..... 2 రోబో ...3 డాన్ శీను ....4 మర్యాద రామన్న  ...5. రగడ

Saturday, January 8, 2011

నిత్యానందపై సినిమా ‘సత్యానంద’

నిత్యానంద రాసలీలల ఆధారంగా కన్నడలో సత్యానంద పేరిట సినిమా తీస్తున్నట్టు బీజేపీ సీనియర్ నాయకుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు మదన్‌పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతోపాటు పలు భాషల్లోకి అనువదించనున్నట్లులిపారు. నిత్యానంద స్వామి పోలికలు ఉన్న ఒక యువకుడు ఈ సినిమాలో....

తమన్నాలాంటి భార్య కావాలి!

‘యుగానికొక్కడు’ అనువాద చిత్రం ద్వారా పరిచయమైన తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తికి ‘ఆవారా’ విజయంతో టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆ చిత్రంలో హీరోయిన్‌ తమన్నాతో కలిసి హాట్‌ హాట్‌ సన్నివేశాలు బాగా పండించాడు. తమిళనాట ఆ చిత్రం అఖండ విజయం సాధించి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. దాంతో ఈ జంటపై కోలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌ అనే.....

రాజబాబు విగ్రహావిష్కరణ... 75 మందికి సన్మానం

ప్రముఖ హాస్యనటుడు రాజబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో అతని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న భారీ స్థాయిలో జరుగుతుంది. తెలుగులో చిత్ర పరిశ్రమలోని 75......

17 నుండి తిరిగి ప్రారంభమవుతున్న షూటింగ్స్

ఇటీవల ఫైటర్స్ గొడవతో ప్రారంభమై నిరవధికంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్ లు నెల రోజుల తర్వాత, ఈ నెల 17 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. సినిమా వర్కర్ల వేతన సవరణ అంశంతో పాటు, చిత్ర నిర్మాణంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న దుబారా ఖర్చును నియంత్రించడంపై క్షుణ్ణంగా చర్చించి కొన్ని మార్గ దర్శకాలు రూపొందించారు. దీని ప్రకారం పనిచేయడమే ప్రస్తుతం.....

Friday, January 7, 2011

మంచి స్క్రిప్టే స్టార్ - అంటున్న ప్రకాష్ రాజ్

జాతీయ స్థాయి అవార్డు అందుకున్న నటుడు ప్రకాష్ రాజ్ పలు చిత్రాలు నిర్మించారు. ‘ఆకాశమంత’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కన్నడలో చేసి ప్రశంసలందుకున్నారు. త్వరలో రానున్న ‘గగనం’ తమిళ వెర్షన్ కి నిర్మాత అయిన ప్రకాష్ రాజ్ మంచి స్క్రిప్టే స్టార్ - అని అంటున్నారు. మంచి స్క్రిప్టు అద్భుతాలు చేస్తుందని అంటున్న ప్రకాష్ రాజ్ త్వరలో దేశంలోని విద్యావ్యవస్థ పై తమిళ - తెలుగు భాషల్లో స్వీయ దర్శకత్వంలో........http://cinevinodam.com/news/flash_news2.htm

సాకర్ ప్లేయర్ బెక్ హామ్ సినిమాల్లోకి...

ఇంగ్లాండ్‌ సాకర్‌ స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ తొందరగా హాలీవుడ్‌ కెరీర్‌ను ప్రారంభించాలని ఒకప్పటి సాకర్‌ దిగ్గజం పీలే ఆశిస్తున్నారు. తనకు కూడా సినీ అవకాశం దక్కితే బెక్‌హామ్‌తో కలిసి నటిస్తానని ఆయన పేర్కొంటున్నారు. బాబీ మూర్‌, సిల్వర్‌స్టర్‌ స్టాలోన్‌ నటించిన హిట్‌ సినిమా ‘ఎస్కేప్‌ టు విక్టరీ’ని రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరగడం పట్ల పీలే సంతోషం వ్యక్తంచేశారు. ఈ సినిమా రీమేక్‌ వార్తను తెలుసుకొని తాను ఆనందపడ్డానని ఆయన చెప్పారు. ‘సినిమాలో హీరోగా చేస్తున్న బెక్‌హామ్‌తో కలిసి నటించేందుకు .....

సెలీనా జెట్లీ పెళ్ళికి సిద్ధం!

ఫెమీనా మిస్‌ యూనివర్స్‌ విజేత సెలీనాజెట్లీ దుబాయ్‌కి చెందిన పారిశ్రామికవేత్త పీటర్‌హాగ్‌తో చాలా నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగిపోయింది. దాదాపు ఆరువారాల క్రితమే రహస్యంగా దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. కాగా గత ఏడాది కాలంగా సెలీనా పీటర్‌తో సహజీవనం చేస్తున్న సంగతి చాలామందికి తెలుసు. తెలుగులో విష్ణు సరసన ‘సూర్యం’ చిత్రంలో నటించిన సెలీనాకు......

2010 తెలుగు సినిమా : మేడిపండు పగిలింది!

మంచి కథ, కథనం... వాటికి సహకరించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మంచి చిత్రాలు వస్తాయనే విషయం సాధారణ సినిమా ప్రేక్షకుడిని అడిగినా చెబుతారు. అయితే, ఈ విషయం తన సినిమా దర్శక నిర్మాతలకు తెలియక పోవడం దురదృష్టకరం. దాని ప్రభావం మన సినిమాల నాణ్యత... విజయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదికేడాది సినిమా రంగం నష్టాల సంద్రంలో కొట్టుకు పోతోంది. సినిమా నిర్మాణ ఖర్చు నలభై కోట్లకు చేరడం వాపే తప్ప బలుపుకాదని 2010 నిరూపించింది. ఢాంబికాల మేడిపండు పగిలింది. విడుదలైన ప్రతి సినిమాకు మొదటివారం అంతా ‘హిట్’, ‘సూపర్ హిట్’ అంటూ, భారీ వసూళ్ళ పేరుతో బోగస్ అంకెలు ప్రచారం చేస్తూ - నిర్మాతలు ఆత్మవంచన చేసుకుంటూ.....