RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, September 28, 2012

'రెబల్' చిత్ర సమీక్ష


'రెబల్' చిత్ర సమీక్ష     2.5

బాలాజీ సిని మీడియా పతాకం ఫై లారెన్స్ దర్శకత్వం లో భగవాన్,పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

రిషి అనే యువకుడు  వైజాగ్  నుండి హైదరాబాద్ వచ్చిఎవరికీ కనపడని  మాఫియా లీడర్లు    స్టీఫెన్-రాబర్ట్ ల కోసం మిత్రుడు నస రాజు తో కలిసి  అన్వేషిస్తుంటాడు.   స్టీఫెన్-రాబర్ట్ ల ప్రధాన అనుచరుడు నాను కూతురు, బ్యాంకాక్ లో డాన్స్ మాస్టర్ గా చేస్తున్న నందినిని ప్రేమలోకి దించి, తద్వారా   స్టీఫెన్-రాబర్ట్ ల ఆచూకీ తెలుసుకోవచ్చనుకుంటాడు.ఆ ప్రయత్నం లో సఫలమవుతాడు.ఆ సందర్భం గానే అతని గతం నందినికి చెప్పాల్సి వస్తుంది.   వైజాగ్ లో మంచికోసం నిలిచే భూపతి కొడుకు రుషి.తమ అక్రమాలకు అడ్డుగా నిలుస్తున్న భూపతి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న సింహాద్రి భూపతి తమ్ముడిని ఆశపెట్టి తన వైపుకి తిప్పుకుని భూపతి దంపతులను చంపిస్తాడు.ఆసందర్భం లో రుషి ప్రియురాలు దీపాలి కూడా వారి చేతుల్లో హతమవుతుంది.ఈ హత్యా కాండలో భూపతికి తోడ్పడిన స్టీఫెన్-రాబర్ట్ లను అంతం చెయ్యడమే ధ్యేయం గా పెట్టుకున్న రుషి ఎలా  విజయవంతం అయ్యాడనేది  సినిమాలో చూడాలి...

మంచి కమర్షియల్ చిత్రాలకుదర్శకుడిగా  పేరు పొందిన  లారెన్స్ ప్రభాస్ తో చేసిన చిత్రం ఇది.ఈ చిత్రం కోసం  సుధీర్గ కాలంపాటు , ఒకటికి రెండు సార్లు కధను మార్చి భారీ గా బడ్జెట్ పెంచి లారెన్స్ నిర్మాతను ఇబ్బంది పెట్టారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఒక్క ప్రభాస్ నటన తప్ప ఈ చిత్రం లో చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు ఏమీ లేవు. రొటీన్ కధతో,పట్టు లేని కధనం ,కొత్తదనం లేని సన్నివేశాలతో చేసిన రెబల్ ప్రేక్షకులను నిరాశ పరిచింది.సినిమాలో మితి మించిన యాక్షన్..వయొలెన్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి.  డాన్స్ మాస్టర్ గా చేస్తున్న నందినిని ప్రేమలోకి దించే  సన్నివేశాలు- తమన్నా చేసిన రామ్ చరణ్ 'రచ్చ' ను గుర్తు చేస్తే,సినిమా క్లైమాక్స్ మొత్తం ఇదే లారెన్స్ చేసిన నాగార్జున  ' డాన్'  క్లైమాక్స్ మరోసారి చూసినట్లుంటుంది.సినిమా ప్రారంభ సన్నివేశాలు,బ్రహ్మానందం తో కొన్ని సన్నివేశాలు,దీపాలి ఆశ్రమం సన్నివేశాలు,రుషి జాతకాన్ని పండితులు చూసే సన్నివేశం,డాన్స్ మాస్టర్ అలీ తో గాయకుడు ప్రభాస్ పోటీ ...వంటి సన్నివేశాలతో పాటు కొన్ని పోరాట సన్నివేశాలు బాగున్నాయి.దర్శకుడు అవసరం  లేకపోయినా విపరీతంగా ఖర్చు పెట్టించినట్లు మనకి స్పష్టంగా అర్ధమవుతుంది.గతంలో సంగీత దర్సకుడుగా ఒకటి,రెండు మంచి పాటలు ఇచ్చిన లారెన్స్ ఇందులో పూర్తిగా విఫలమయ్యాడు.పైగా పాటల్లో అరవవాసన ఎక్కువయ్యింది.చిన్నా నేపధ్య సంగీతం ఈ చిత్రం లోచెప్పుకోదగ్గ  ప్రధాన అంశం. రాం ప్రసాద్ ఫోటో గ్రఫి ,రామ్-లక్ష్మణ్ ఫైట్స్,మార్తాండ్ ఎడిటింగ్  కూడా బాగున్నాయి.

ప్రభాస్ నటనలో చాలా పరిణితి కనిపించింది.చాలా బాగా తన పాత్రను పోషించాడు.నందినిగా తమన్నా బొడ్డు సౌందర్యాన్ని చూపిస్తూనే పాత్రను కూడా బాగా చేసింది.చిన్న పాత్ర అయినా దీక్షా సెథ్ ఓకే,కృష్ణం రాజు చేసిన ప్రత్యేక పాత్ర అంతగా ఆకట్టుకోలేదు.అతని పోలీస్ స్టేషన్ పరిచయ సన్నివేశం మరీ అతిగా వుంది.బ్రహ్మానందం -కోవయ్ సరళ కామెడీ చిరాకు పుట్టించింది.సుప్రీత్ హీరో నమ్మిన బంటుగా ఓ వెరైటీ పాత్ర పోషించాడు.ఇతర పాత్రలు మోహన్ రుషి,ప్రభ తదితరులు పోషించారు.                                              -రాజేష్ 

'బావలను' మరిచిన నమిత

మచ్చా (బావ) అనే పదాన్ని నటి నమిత పూర్తిగా మరచిపోయారు. అడవిలాంటి అందాన్నే ఆక్రమించాడే అంటూ సింహా సినిమాలో బాలకృష్ణను రెచ్చగొట్టిన అందాల భామ నమిత. ఈ సొగసుల సుందరి నటిస్తుందంటే ఎప్పుడెప్పుడు ఆ చిత్రం చూద్దామా అని యువత ఎదురు చూసిన రోజులున్నాయి. తమిళం, తెలుగు తెరపై అందాలను పిచ్చపిచ్చగా ఆరబోసి రచ్చరచ్చ చేసిన ఈ గుజరాతీ అమ్మడికి పేటెంట్ పదం ఒకటుంది. అదే మచ్చాన్స్ (బావలు). నమిత ఏ కార్యక్రమంలో పాల్గొన్నా....

మనీషా మనసూ,ఆత్మ సినిమానే !

‘ఇప్పటిదాకా విశ్రాంతి లేకుండా ప్రయాణించాను. ఆరు నెలలపాటు అమెరికాలో, రెండు నెలలు ప్యారిస్‌లో ఆ తర్వాత కొన్ని నెలలపాటు నేపాల్‌లో గడిపాను. ప్యారిస్‌లో ఉన్నప్పుడు అక్కడే ఓ ఇల్లు కొనుక్కొని స్థిరపడదామనుకున్నా. అక్కడే ఏదేదో చేసేద్దామనుకున్నా. అన్నీ పిచ్చిపిచ్చి ఆలోచనలే. అయితే నా ఆలోచనలు సినీ పరిశ్రమను కూడా ఆందోళనకు గురిచేశాయని...

Wednesday, September 26, 2012

సన్నీలియోన్‌కు పెద్ద కష్టమే వచ్చింది !

ఇండో-కెనడియన్ శృంగార తార సన్నీలియోన్‌కు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఏ ఇమేజ్ అయితే సన్నీని ప్రపంచానికి పరిచయం చేసిందో ఇప్పుడు ఆ ఇమేజే ఆమె ‘కొంప’ ముంచుతోంది. విషయమేమిటంటే జిస్మ్-2 సినిమాలో నటించిన తర్వాత సన్నీకి బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. సినిమా సక్సెస్‌తో సంబంధం లేకుండా సన్నీ లియోన్ ఎవరో ఇండియా మొత్తానికి అంతకుముందే తెలిసిపోయింది. ఆమె నటిం చిన జిస్మ్-2 సినిమా కూడా సక్సె కావడంతో....

తారల పుకార్లూ పబ్లిసిటీయే !

గ్యాసిప్స్, ఇవిలేని రంగం లేదనే చెప్పాలి. ఇతరుల గురించి ఏదైనా ఆసక్తికరమైన వార్త ప్రచురణ అయినప్పుడు పాఠకులు ఆసక్తిగా చదువుతారు. ఇక చిత్ర పరిశ్రమకు సంబంధించిన వార్త అయితే మరింత ఆసక్తిగా చదువుతారు. ఎందుకంటే ఇది గ్లామర్ ప్రపంచం గనుక. అదే తారల గురించిన వార్త అయితే ఇంకా కుతూహలంగా చదవడంతో పాటు, ఆ వార్తను ఇతరులతో చర్చిస్తూ దాన్ని మోతాదు పెంచి ప్రచారం చేసి ఆనందపడుతుంటారు. వదంతులకు ముందు తరం తారలు ఎక్కువగా స్పందించేవారు. ఆవేదన పడేవారు. సత్యదూర వార్తలంటూ ఖండించేవారు. ఈ తరం తారల్లో ఆ ధోరణి మారింది. ఈ రంగం గ్యాసిప్స్‌కి బాధపడేవారు కొందరున్నా డోంట్‌కేర్ ...

Sunday, September 23, 2012

'దర్శక మహేంద్రుడు' కే.వి.రెడ్డి పుస్తకావిష్కరణ

యువకళావాహిని -అక్షరం ఆర్ట్స్' ఎన్' పబ్లికేషన్స్ నిర్వహణలో సెప్టెంబర్ 9న ఫిలిం చాంబర్ లో చాగం కొండా రెడ్డి రచించిన 'దర్శక మహేంద్రుడు' కే.వి.రెడ్డి -పుస్తకావిష్కరణ డా"సి.నారాయణ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.తెలుగు వారు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుత చలన చిత్రాలను అందించిన కే.వి.రెడ్డిజీవిత విశేషాలతో పుస్తకం వెలువరించడం ఆనంద దాయకం అని -డా"సి.నారాయణ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కే.వి.రెడ్డి కుమారుడు ,' మోస్ చిప్'అధినేత రామ చంద్రా రెడ్డి మాట్లాడుతూ- కే.వి.రెడ్డి ఎంతో ఆత్మాభిమానం గలిగిన వ్యక్తి అని చెప్పారు.అతని నుంచి క్రమ శిక్షణను నేర్చుకున్నామని అన్నారు. తమ్మా రెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాల క్రిష్ణ, సారి పల్లి కొండల రావు, బేత వోలు రామ బ్రహ్మం, ప్రసన్నకుమార్ , పరుచూరి హనుమంత రావు, డా"కే.వి.క్రిష్ణ కుమారి , జి.వి.నారాయణ రావు, వై.కే.నాగేశ్వర్ రావు, అక్కినేని లక్ష్మీ శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డా"అక్కినేని నాటక కళాపరిషత్ 18 వ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు

'యువకళావాహిని'  నిర్వహణ లో సారిపల్లి కొండల రావు సారధ్యం లో డా"అక్కినేని నాటక కళాపరిషత్ 18 వ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు రవీంద్రభారతి లో విజయ వంతంగా జరిగాయి.ముగింపు సమావేశాల్లో పాల్గొని విజేతలను అభినందించిన అక్కినేని -కళాకారులకు తల్లివడి నాటక రంగం.నాటకాలవల్ల చాలామంది వృద్ది లోకి వచ్చారు.మహా నటులకు మూలాలు నాటక రంగం లోనే వున్నాయని అన్నారు.ఉత్తమ నటుడిగా గోపరాజు రమణ,ఉత్తమ నటిగా సురభి ప్రభావతి,ఉత్తమ విలన్ గా గణేష్,హాస్య నటునిగా జయప్రకాష్ రెడ్డి,ఉత్తమ రచన( శ్రీకారం) భవానీ ప్రసాద్ ఎంపికయ్యారు.పీ.లక్ష్మణ్ రావు,యన్.రవికుమార్ లకు 'నాటక రత్న' అవార్డులు బహూకరించారు.ఈ కార్యక్రమం లో డా"సి.నారాయణ రెడ్డి, మంత్రి కాసు కృష్ణా రెడ్డి, దీక్షిత్, జి.వి.నారాయణ రావు, జి.రవీంద్ర నాద్, గుండు హనుమంత రావు, వై.కే.నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.

Monday, September 17, 2012

హిందీ సినిమా మాత్రం అలాగే వుంది:ప్రీతిజింటా

బాలీవుడ్‌లో ఇప్పుడంతా రూ.100 కోట్ల మంత్రం జపిస్తున్నారు. సినిమా రూ.100 కోట్లు వసూలు చేస్తేనే హిట్ కొట్టిందని చెబుతున్నారు. 14 ఏళ్లుగా 35 సినిమాల్లో నటించి, ఇష్క్ ఇన్ పారిస్‌తో నిర్మాతగానూ మారిన ప్రీతిజింటా లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి. వసూళ్ల లెక్కలు మారినా హిందీ సినిమా మాత్రం అలాగే ఉందని ఈ సొట్టబుగ్గల సుందరి చెప్పింది. అయితే హిందీ చిత్రాలు రూ.100 కోట్ల మార్కును దాటడం సంతోషకరమే అయినా ప్రేక్షకాదరణే ముఖ్యమని....

Sunday, September 16, 2012

పాలకుర్తి మధుసూధనరావును సత్కరించారు.

'శ్రీ వెంకటేశ్వరా భక్తి చానెల్' సి.ఈ.ఓ.గా నియమితులయిన'దూరదర్శన్' పూర్వ సంచాలకులు పాలకుర్తి మధుసూధనరావును 'యువకళావాహిని'-'సుస్వర మ్యూజిక్ అకాడెమీ'రవీంద్ర భారతి లో నిర్వహించిన కార్యక్రమం లో మంత్రి కాసు కృష్ణా రెడ్డి,సారిపల్లి కొండల రావు,వై.కే.నాగేశ్వర్ రావు సత్కరించారు.

Thursday, September 13, 2012

బాలీవుడ్‌లో మూఢనమ్మకాలెక్కువే!

దిన పత్రికలు, సినిమాలు ఒకప్పుడు సమాజం నుంచి తరిమేసిన మూఢనమ్మకాలను సాధనాలు. కానీ ఇప్పుడు సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు, నటీనటులు మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ నటి బిపాసా బసు స్పందిస్తూ.. ‘బాలీవుడ్‌లో కూడా మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు బాగా పెరిగిపోయాయి. వాటిని నమ్ముతున్నవారి సంఖ్య కూడా పెరిగింది. ఇందులో తారలేకాదు నిర్మాతలు, దర్శకులు కూడా ఉంటున్నారు. తమ చిత్రం ప్రారంభమైననాటి నుంచి విడుదలై, సక్సెస్ సాధించేవరకు ఎక్కువగా మూఢనమ్మకాలమీదే....

మనకు ఇలియానా బైబై

బాలీవుడ్ చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు నటి ఇలియానా అంటోంది. కేడీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ గోవా సుందరికి ఆ చిత్రం ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. టాలీవుడ్‌లో తొలి చిత్రం దేవదాసు అనూహ్య విజయాన్ని అందించింది. దీంతో తెలుగులో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగింది. సుదీర్ఘ కాలం తరువాత తమిళంలో నన్బన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం హిట్ అయినా అమ్మడికి మరో అవకాశం రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ అమ్మడికి ఇదే పరిస్థితి. బాలీవుడ్‌లో ఒకే ఒక్క చిత్రం చేస్తోంది. బర్ఫీ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పైనే ఇలియానా ....

Monday, September 3, 2012

‘సింగ్యూలారిటీ' లో గర్వంగా బిపాసా

శృంగార పాత్రల్లో రెచ్చిపోయి నటించే బాలీ వుడ్ నటి బిపాసా బసు ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది. ఆర్థిక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు అటకెక్కిం దనే విషయం తెలిసిందే. అయితే సమస్యలన్నింటిని పరి ష్కరించుకొని త్వరలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ‘సింగ్యూలారిటీ’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ మరాఠా యోధుడికి జోడీగా బిపాసా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘సిటీ ఆఫ్ జాయ్’ ఫేమ్ రోనాల్డ్ జాఫ్ దర్శకత్వం వహించాడు. బిపాసాతోపాటు.....

అందరి చూపు 'మాట్రాన్', 'చారులత' పైనే

మాట్రాన్, చారులత ఈ రెండు చిత్రాల గురించే ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చిత్రాలపై ఇంతగా చర్చ జరగడానికి కారణమేమిటని అనుకుంటున్నారా? ఈ రెండూ అవిభక్త కవలల కథలతో తెరకెక్కిన చిత్రాలు కావడమే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ తరహా కథలతో రూపొందిన చిత్రాలు ఈ రెండేనంటున్నారు దర్శక, నిర్మాతలు. వీటి కంటే ముందుగా ఇరువన్ అనే కొత్తవారు నటించిన ఒక లోబడ్జెట్ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇది అంతగా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లలేదు కాబట్టి......

Sunday, September 2, 2012

'కరువు' ఇలియానా బరువు పెరుగుతుందట

బర్ఫీ తెచ్చిన తంటా ఇలియానాను చాలా ఇబ్బందుల్లో నెట్టింది. రాక రాక బాలీవుడ్‌లో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇలియానా తన గ్లామర్‌ విషయంలో అతి జాగ్రత్తకు వెళ్లింది. చాలా సన్నబడింది. కేవలం ఈ సినిమాకోసమే ఆహార అలవాట్లు మార్చుకుంది. దీంతో దక్షిణాది ప్రేక్షకులు ఇలూ మరీ ఇలా అయిపోందేమిటి ! అనుకున్నారు.....

పరిశ్రమలోనే నేర్చుకున్నాను:తాప్సి

 మంచి కథా పాత్రల్లో నటించాలనేది నా ఆశ. ఆ విధంగా నాకు నచ్చని పలు తమిళ చిత్రాలను నిరాకరించాను. తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయడానికి కారణంఅక్కడ మంచి పాత్రలు లభిం చడమే. ప్రస్తుతం నేను నటిస్తున్న చిత్రాలన్నీ ప్రముఖ నిర్మాణ సంస్థలవే. తమిళంలోనూ మంచి అవకాశాలు వస్తే వదులుకోను. అజిత్‌తో నటిస్తున్న చిత్రం అలాంటిదే.....