RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 9, 2011

'పంజా' చిత్ర సమీక్ష

                                                            'పంజా' చిత్ర సమీక్ష  2.5/5

సంఘ మిత్ర ఆర్ట్స్ -అర్క మీడియా వర్క్స్ సంయుక్తం గా ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ దర్శకత్వం లో నిర్మించారు. నీలిమ తిరుమల శెట్టి , నగేష్ ముంతా , శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని ఈచిత్రానికి నిర్మాతలు.
                             
                           చిన్న తనం లో తనకు ఆశ్రయం ఇచ్చి ఆదుకొన్న కొల్కొత్తా మాఫియా లీడర్  భగవాన్ కు నీడలా  ఉంటూ... ప్రత్యర్ధి కులకర్ణి గ్యాంగ్ నుండి  కాపాడు తుంటాడు జై .
జీవితంలో  తాను కోల్పోయిన ప్రేమను సంధ్య లో చూసుకుంటాడు. భగవాన్ కొడుకు మున్నా రావడం తో పరిస్థితులు మారుతాయి. అతని శాడిస్ట్ చేష్టలు అందరిని బాధిస్తాయి. జై సన్నిహితురాలు , క్లబ్ డాన్సర్  జాన్వి మున్నా దృష్టిలో పడుతుంది. అతన్ని ఇష్టపడని జాన్విని మున్నా అతి క్రూరం గా కొట్టి చంపుతాడు. ఆ సందర్భం లో జై తో జరిగిన సంఘర్షణ లో మున్నా చనిపోతాడు. దాన్ని అవకాశం గా తీసుకుని గురవయ్య అనే ముటా  సభ్యుడు భగవాన్ -జై ల మధ్య చిచ్చు పెడతాడు. తనని చంపడానికి చూస్తున్న భగవాన్ ని ఎదుర్కోవడం ఇష్టం లేని జై అక్కడికి దూరం గా వెళ్ళి పోవాలను కుంటాడు. అక్కడి నుండి సంధ్య వాళ్ళ వూరికి వెళ్ళిన జై అక్కడ కొన్ని సమస్యలను పరిష్కరిస్తాడు. పగతో రగిలిపోతున్న భగవాన్ జై మిత్రుడు చోటూ ను పట్టుకుని  సంధ్య వివరాలు సేకరిస్తారు. సంధ్యను ఎత్తుకు తీసుకొస్తారు. ఆమెను కాపాడేందుకు జై తిరిగి కోల్కతా వస్తాడు. ఆ తర్వాత జరిగింది తెర ఫై చూడాలి ....
                                                      ' పులి', 'తీన్ మార్' ల పరాజయం తర్వాత వచ్చినప్పటికీ ...   డిఫరెంట్   గెట్అప్ తో పవన్ కళ్యాణ్  కనిపించిన  ఈ చిత్రం పట్ల ప్రేక్షకులు, అభిమానులు విపరీతమైన ఆసక్తి కనపర్చారు. పవన్ మాఫియా  గ్యాంగ్ స్టర్ గా  చాలా స్టైలిష్ నటన కనపరిచాడు  .  డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ లో కొత్త దనాన్ని చూపిస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో అతను చాలా  బాగా చేసాడు.  అయితే, సినిమా అంతా  కేవలం యాక్షన్ కే పరిమితం కావడం వల్ల,  పవన్ నుండి  ఆశించే  అంశాలు కొరవడటం వల్ల  ఈ చిత్రం  అసంతృప్తిని మిగిల్చింది.  ఈ చిత్ర కధాంశం గతం లో వచ్చిన పవన్ కళ్యాణ్     ' బాలు' , నాగార్జున 'అంతం'  చిత్రాలను గుర్తుకు తెస్తుంది. వినోదం పాలు బాగా తక్కువగా ఉన్న ఈ చిత్రం లో ...దర్శకుడి చిత్రీకరణ స్థాయి  సామాన్య ప్రేక్షకుడిని మించిపోయింది. అలీ ,బ్రహ్మానందం ఉన్నప్పటికీ వారి కామెడీ అంతంత మాత్రమే. పోలీసు పాపారాయుడుగా  బ్రహ్మానందం తో చేసిన సన్నివేశాల్లో పవన్ పాత్ర ని మరీ సిల్లీ గా చూపించారు. హీరో లో ప్రేమ పుట్టడం ...పెరగడం ...మరింత బాగా చూపితే సినిమా కి జీవం వచ్చేది. హీరో లో ఉండే కటినత్వాన్ని చూపినంత బలం గా అతనిలోని సున్నితత్వాని   చూప లేదు. సినిమా మొదటి భాగం చూసిన ప్రేక్షకులు హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి పొందితే ...రెండవ భాగం లో ఆ గ్రాఫ్  దారుణం గా పడి పోయింది. ప్రేక్షకులు ఆసక్తి చూపిన 'పంజా' టైటిల్ సాంగ్ సినిమా ఐపోయాక ,చివర్లో  పెట్టడం కూడా మైనెస్  అయ్యింది.
                                                    భగవాన్ గా  జాకీ ష్రాఫ్ ,అతని ప్రత్యర్ధి గా అతుల్ కులకర్ణి  పరిమితమైన పాత్రలే ఐనప్పటికీ బాగా చేసారు. గురవయ్య గా తనికెళ్ళ భరణి, మున్నాగా  అడివి శేషు రాణించారు. హీరోయిన్ సంధ్య గా  సారా జెనె డయాజ్ ఎంపిక సరిపోలేదు. జాన్వి గా అంజలీ లావణ్య  పాత్రకి తగ్గట్టే సెక్సీ గా ఉంది. ఇతర పాత్రల్లో పరుచూరి వేంకటేశ్వర్ రావు ,సుబ్బరాజు , ఝాన్సీ నటించారు.
వినోద్ ఫోటో గ్రఫీ ఈ చిత్రం లో ప్రత్యేకత. యువన్ శంకర్ రాజా సంగీతం లో ' ఎలా ఎలా ' వంటి ఒకటి,  రెండు మినహా చెప్పుకోదగ్గ పాటలు లేనప్పటికీ ,రీ రికార్డింగ్ సినిమా మూడ్ కి చాలా సహకరించింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శ్యాం కౌషెర్ యాక్షన్ సన్నివేశాలు ,విజువల్  అఫెక్ట్స్ బాగున్నాయి.                                                                                                                                                                                                                                                                                                                                                        - రాజేష్

0 comments:

Post a Comment