RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, July 4, 2013

'గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ' ఆవిష్కరణ

తెలుగు సాంస్కృతిక రంగ వికాసానికి సాంస్కృతిక సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని 'అధికార భాషా సంఘం' అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని జాతీయ స్థాయిలో చాటేలా అందరూ ముందుకు రావాలన్నారు. 'యువకళావాహిని'- 'గురుప్రసాద్ కల్చరల్ ఫౌం డేషన్'ల ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 'గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ'ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ పూర్వ కార్యదర్శి కె.పద్మనాభయ్య మాట్లాడుతూ-ఆర్థిక, మిలిటరీ వ్యవస్థ కంటే సాంస్కృతిక వ్యవస్థ గొప్పదన్నారు. ప్రతి దేశం పొరుగు దేశాలతో సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక రంగ ప్రముఖులకు 'గురుప్రసాద్ ఎక్సలెన్సీ అవార్డు'లను ప్రదానం చేశారు. ఎం. కె.రాము, వంశీ రామరాజు, కిన్నెర రఘురామ్, కె.కె.రాజా, అభినందన భవాని, శంకర్రావు, పొత్తూరి .రంగారావు, ఎన్.వి.ఎల్.నాగరాజు, సంజయ్ కిషోర్ ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. సారిపల్లి కొండలరావుఅధ్యక్షత వహించిన ఈ సభలో సినీనటి శ్రావ్యారెడ్డి, కె.వి.కృష్ణకుమారి, శ్రీలత , సి.హెచ్‌. త్రినాధరావు,నూతల పాటి సాంబయ్య, వై.కె.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పద్మశ్రీ , శ్రీదేవి,చింతలపాటి సురేష్, పవన్,వి.కె. దుర్గ , మురళీధర్, వి.వి.రామారావుల ' సినీగీత లహరి' అలరించింది. సుదామయి వ్యాఖ్యాతగా వ్యవహరించింది .

0 comments:

Post a Comment