RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, July 19, 2013

'ఓం' చిత్ర సమీక్ష

                                                'ఓం'  చిత్ర సమీక్ష      2 / 5     

   ఎన్టీఆర్ఆర్ట్స్ పతాకం ఫై సునీల్ రెడ్డి దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు . 
   

            హరిశ్చంద్ర ప్రసాద్  కుమారుడు అర్జున్ కు  తండ్రి అంటే  చాలా ప్రేమ . విరోధి   బైరెడ్డి నుండి  తండ్రిని  పలుమార్లు రక్షిస్తాడు .   హరిశ్చంద్ర ప్రసాద్  ను చంపడానికి గతం లో హరిశ్చంద్ర ప్రసాద్ తో విభేదాలున్న భవానీ శంకర్ ను పిలిపిస్తాడు . అనుకోకుండా కలిసిన అంజలి ప్రేమలో పడతాడు అర్జున్ . అదే సమయం లో   హరిశ్చంద్ర ప్రసాద్ మిత్రుడి కూతురు  రియా  విదేశాలనుండి వస్తుంది . అర్జున్ ప్రేమించిన  అంజలి ' బైరెడ్డి -భవాని శంకర్ ల మనిషి' అనే విషయం తెలియడం తో ... తండ్రి చనిపోయిన  రియా ను పెళ్ళిచేసుకొమ్మని  హరిశ్చంద్ర ప్రసాద్  అర్జున్ ని అడుగుతాడు . తప్పని పరిస్థితుల కారణం గానే    బైరెడ్డి -భవాని శంకర్ ల మనిషి గా పనిచెయ్యాల్సి వచ్చిందని అర్జున్ తో  అంజలి చెబుతుంది . ఆ తర్వాత అంజలి దారుణం గా హత్య చెయ్యబడుతుంది . అది  భవాని శంకర్ చేసాడని- అతన్ని చంపడానికి వెళ్ళిన అర్జున్ కి తన జీవితంలో జరిగిన కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏమిటి ? తరువాత ఎం జరిగింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి ... 

              రెండేళ్ళ పాటు కష్టపడి 3డి విధానాన్ని అధ్యయనం చేసి,  అధిక బడ్జెట్ తో కళ్యాణ్ రామ్  ఈ చిత్రాన్ని నిర్మించారు . నిజానికి, మంచి కధతో తీసే చిత్రానికి 3డి ఎఫెక్ట్స్ మరింత ఆకర్షణవుతాయి . అయితే మన వాళ్ళు 3డి ఫై  సరదాతో బోలెడు డబ్బులు పోసి  అర్ధం లేని సినిమాలు తీస్తున్నారు . ఈ మధ్య వచ్చిన కామెడీ 3డి 'యాక్షన్' అటువంటిదే . ఈ కళ్యాణ్ రామ్ యాక్షన్ 'ఓం' కూడా  అదే కోవకి  చేరింది  . పరమ రొటీన్ కధ... ఏమాత్రం ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లే... పట్టులేని టేకింగ్ తో - ఈ  చిత్రం, ఎంతో ఆశించి వచ్చిన ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది .  3డి తప్పితే  ఈ చిత్రం లో చూసేందుకు కొత్తగా  ఏమీ  లేదు . 'అవతార్' ఇన్స్పిరేషన్ అన్నారు కదా... మరి ఈ  3డి ఎఫెక్ట్స్ అయినా గొప్పగా ఉన్నాయా ?అంటే -కేవలం  కొన్ని సందర్భాల్లోనే  మనకు ఆ  అనుభూతి కలుగుతుంది. అంతకు మించి ఈ కధకు  3డి అవసరం కూడా లేదు . కధలో ట్విస్ట్ లు కూడా ఎక్కువే అయ్యాయి . ఆ ట్విస్ట్ లు బాగున్నప్పటికీ, వాటిని ప్రేక్షకుడికి కన్విన్సింగ్ గా చెప్పగలిగితేనే సినిమాకి ఉపయోగపడతాయి . లేకపోతే చిరాకు పుట్టిస్తాయి . ఈ కధలో ప్రధాన బలమైన  ట్విస్ట్ లు -బలహీనమైన దర్శకుడి కారణం గా సినిమాకి మైనస్ అయ్యాయి . అలాగే ఈ సీరియస్ సినిమాలో రిలీఫ్ కోసం మంచి  కామెడీగానీ ,  హీరో-హీరోయిన్ ల మధ్య చక్కటి ప్రేమ సన్నివేశాలు గానీ పెట్టకపోవడం మరో మైనస్ . 

             అర్జున్ గా కళ్యాణ్ రామ్ బాగా చేసాడు . అయితే అతని గెటప్ లో ఇబ్బంది వల్ల గ్లామర్ గా కనబడలేదు. అంజలి గా కృతి కర్బందా , రియా గా నికిషా పటేల్  అందం గా చేసారు . బైరెడ్డి గా  రావు రమేష్  ఉత్తరాంధ్ర యాస తో రక్తికట్టించాడు . హరిశ్చంద్ర ప్రసాద్ గా కార్తీక్ తనదైన స్టైల్ లో చేసాడు . భవానీ శంకర్ గా మలయాళీ నటుడు  సంపత్ రాజ్ ,మరో ప్రధాన పాత్ర లో సురేష్,  ఇతర పాత్రల్లో సూర్య,విజయ సాయి, ఆహుతి ప్రసాద్, సితార, చిన్నా, నాగినీడు, రఘు నటించారు . అచ్చు -సాయి కార్తీక్ ల సంగీతం లో పాటలు చెప్పుకోదగ్గవి లేవు. రీ రికార్డింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగుంది .  కళ్యాణ్-కృతి ల పాట చిత్రీకరణ కొత్తదనంతో   బాగుంది . హోలీ పాట, క్లబ్ లో కళ్యాణ్- నికిషాల డాన్స్ కలర్ ఫుల్ గా చేసారు .అజయన్ విన్సెంట్ ఫోటోగ్రఫీ బాగుంది. విజయ్-రవి వర్మల యాక్షన్ సీన్స్ రిచ్ గా వున్నాయి   -రాజేష్

0 comments:

Post a Comment