RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, September 28, 2012

'రెబల్' చిత్ర సమీక్ష


'రెబల్' చిత్ర సమీక్ష     2.5

బాలాజీ సిని మీడియా పతాకం ఫై లారెన్స్ దర్శకత్వం లో భగవాన్,పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

రిషి అనే యువకుడు  వైజాగ్  నుండి హైదరాబాద్ వచ్చిఎవరికీ కనపడని  మాఫియా లీడర్లు    స్టీఫెన్-రాబర్ట్ ల కోసం మిత్రుడు నస రాజు తో కలిసి  అన్వేషిస్తుంటాడు.   స్టీఫెన్-రాబర్ట్ ల ప్రధాన అనుచరుడు నాను కూతురు, బ్యాంకాక్ లో డాన్స్ మాస్టర్ గా చేస్తున్న నందినిని ప్రేమలోకి దించి, తద్వారా   స్టీఫెన్-రాబర్ట్ ల ఆచూకీ తెలుసుకోవచ్చనుకుంటాడు.ఆ ప్రయత్నం లో సఫలమవుతాడు.ఆ సందర్భం గానే అతని గతం నందినికి చెప్పాల్సి వస్తుంది.   వైజాగ్ లో మంచికోసం నిలిచే భూపతి కొడుకు రుషి.తమ అక్రమాలకు అడ్డుగా నిలుస్తున్న భూపతి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న సింహాద్రి భూపతి తమ్ముడిని ఆశపెట్టి తన వైపుకి తిప్పుకుని భూపతి దంపతులను చంపిస్తాడు.ఆసందర్భం లో రుషి ప్రియురాలు దీపాలి కూడా వారి చేతుల్లో హతమవుతుంది.ఈ హత్యా కాండలో భూపతికి తోడ్పడిన స్టీఫెన్-రాబర్ట్ లను అంతం చెయ్యడమే ధ్యేయం గా పెట్టుకున్న రుషి ఎలా  విజయవంతం అయ్యాడనేది  సినిమాలో చూడాలి...

మంచి కమర్షియల్ చిత్రాలకుదర్శకుడిగా  పేరు పొందిన  లారెన్స్ ప్రభాస్ తో చేసిన చిత్రం ఇది.ఈ చిత్రం కోసం  సుధీర్గ కాలంపాటు , ఒకటికి రెండు సార్లు కధను మార్చి భారీ గా బడ్జెట్ పెంచి లారెన్స్ నిర్మాతను ఇబ్బంది పెట్టారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఒక్క ప్రభాస్ నటన తప్ప ఈ చిత్రం లో చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు ఏమీ లేవు. రొటీన్ కధతో,పట్టు లేని కధనం ,కొత్తదనం లేని సన్నివేశాలతో చేసిన రెబల్ ప్రేక్షకులను నిరాశ పరిచింది.సినిమాలో మితి మించిన యాక్షన్..వయొలెన్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి.  డాన్స్ మాస్టర్ గా చేస్తున్న నందినిని ప్రేమలోకి దించే  సన్నివేశాలు- తమన్నా చేసిన రామ్ చరణ్ 'రచ్చ' ను గుర్తు చేస్తే,సినిమా క్లైమాక్స్ మొత్తం ఇదే లారెన్స్ చేసిన నాగార్జున  ' డాన్'  క్లైమాక్స్ మరోసారి చూసినట్లుంటుంది.సినిమా ప్రారంభ సన్నివేశాలు,బ్రహ్మానందం తో కొన్ని సన్నివేశాలు,దీపాలి ఆశ్రమం సన్నివేశాలు,రుషి జాతకాన్ని పండితులు చూసే సన్నివేశం,డాన్స్ మాస్టర్ అలీ తో గాయకుడు ప్రభాస్ పోటీ ...వంటి సన్నివేశాలతో పాటు కొన్ని పోరాట సన్నివేశాలు బాగున్నాయి.దర్శకుడు అవసరం  లేకపోయినా విపరీతంగా ఖర్చు పెట్టించినట్లు మనకి స్పష్టంగా అర్ధమవుతుంది.గతంలో సంగీత దర్సకుడుగా ఒకటి,రెండు మంచి పాటలు ఇచ్చిన లారెన్స్ ఇందులో పూర్తిగా విఫలమయ్యాడు.పైగా పాటల్లో అరవవాసన ఎక్కువయ్యింది.చిన్నా నేపధ్య సంగీతం ఈ చిత్రం లోచెప్పుకోదగ్గ  ప్రధాన అంశం. రాం ప్రసాద్ ఫోటో గ్రఫి ,రామ్-లక్ష్మణ్ ఫైట్స్,మార్తాండ్ ఎడిటింగ్  కూడా బాగున్నాయి.

ప్రభాస్ నటనలో చాలా పరిణితి కనిపించింది.చాలా బాగా తన పాత్రను పోషించాడు.నందినిగా తమన్నా బొడ్డు సౌందర్యాన్ని చూపిస్తూనే పాత్రను కూడా బాగా చేసింది.చిన్న పాత్ర అయినా దీక్షా సెథ్ ఓకే,కృష్ణం రాజు చేసిన ప్రత్యేక పాత్ర అంతగా ఆకట్టుకోలేదు.అతని పోలీస్ స్టేషన్ పరిచయ సన్నివేశం మరీ అతిగా వుంది.బ్రహ్మానందం -కోవయ్ సరళ కామెడీ చిరాకు పుట్టించింది.సుప్రీత్ హీరో నమ్మిన బంటుగా ఓ వెరైటీ పాత్ర పోషించాడు.ఇతర పాత్రలు మోహన్ రుషి,ప్రభ తదితరులు పోషించారు.                                              -రాజేష్ 

0 comments:

Post a Comment