RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, March 3, 2012

                    'మై హార్ట్ ఈస్ బీటింగ్' నిర్మాత కే.రాజశేఖర్,హీరో రేవంత్ లకు ఆత్మీయ అభినందన
                            పూర్తిగా అమెరికాలో,అక్కడున్న తెలుగువాళ్ళతో నిర్మించిన 'మై హార్ట్ ఈస్ బీటింగ్' ఇటీవల విడుదల అయ్యి అభినందనలు అందుకుంటోంది. ఈ సందర్భంగా 'మై హార్ట్ ఈస్ బీటింగ్' నిర్మాత కే.రాజశేఖర్,హీరో రేవంత్ లకు రవీంద్రభారతిలో 'యువకళావాహిని' మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా ఆత్మీయ సత్కారంచేసింది. విదేశాల్లో వున్నా మన యువత దైనందిన జీవితాన్ని ఇందులో హృదయం గా చిత్రీకరించారని- 'యువకళావాహిని'వై.కే.నాగేశ్వరరావు అన్నారు.

ఈ చిత్రం ద్వారా నిర్మాత రాజశేఖర్ కొత్తవారికి వేదిక కల్పించి,వారికి ఆశాజ్యోతిగా నిలిచారని -డి.యస్.దీక్షిత్ అన్నారు.యువతకు ఈ చిత్రం లో పెద్ద పీటవేసారని-చాట్ల శ్రీరాములు అన్నారు. రాజశేఖర్ అబిరుచిగల నిర్మాత-అని పాలకుర్తి మదుసూదనరావు అన్నారు.నిర్మాతగా డబ్బు మూటలతో కాకుండా,కొత్త ఆలోచనలతో రాజశేఖర్ చిత్రరంగానికి వచ్చారని-రచయిత సి.యస్.రావు అన్నారు.

 బ్రహ్మజిత్, శ్రీధర్ దీక్షిత్ వంటి సినిమా విద్యార్ధులు కూడా తమ అభిప్రాయాలను చెప్పిన ఈ సభలోసంగీత దర్శకుడు మైఖేల్ మక్కల్ మాట్లాడుతూ-ఒక మంచి చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయినందుకు ఆనందం గా వుంది-అన్నారు.హీరో రేవంత్ మాట్లాడుతూ-అభిరుచి గల నిర్మాతలు చిత్ర రంగంలో వున్నారనడానికి రాజశేఖర్ గారే మంచి ఉదాహరణ,.వారి చిత్రంలో అవకాశం రావడం నా అదృష్టం -అన్నారు. నిర్మాత కే.రాజశేఖర్ మాట్లాడుతూ-నా మొదటి చిత్రం 'గౌతం బుద్ధ' కు నంది అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి ఆర్ధికంగా తక్కువ...అభినందన పూర్వకంగా ఎక్కువ వచ్చింది. ఇంతమంది ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందం గా వుంది. ఇకపైన కూడా మంచిచిత్రాల నిర్మాణానికే కట్టుబడి వున్నాను. త్వరలో ఓ కామెడి థ్రిల్లర్ నిర్మించబోతున్నాను-అన్నారు.. సారిపల్లి కొండలరావు, జే .బాపు రెడ్డి, డి.మోహనరావు , జి.వి. నారాయణ రావు, జీ . హనుమంత రావు, పీ.జయప్రకాష్ రెడ్డి , సంజయ్ కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






0 comments:

Post a Comment