RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Monday, December 19, 2011

రచయిత, నటుడు భూపాల్ రెడ్డి కి సన్మానం

                           రచయిత, నటుడు భూపాల్ రెడ్డి కి సన్మానం
  ప్రముఖ రచయిత్రి    వాసి రెడ్డి  సీతా దేవి  జయంతి  సందర్భం  గా -          ఇటీవల కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న రచయిత, నటుడు [కొమరం భీమ్] భూపాల్ రెడ్డి కి 'యువ కళా వాహిని' నేతృత్వం లో సన్మానం జరిగింది. డిశంబర్ 16  న 'తెలుగు  యూనివర్సిటీ' లో జరిగిన ఈ కార్య క్రమం లో -   డా:సి .నారాయణ రెడ్డి , దూర దర్శన్ పూర్వ సంచాలకులు పాలకుర్తి మధు సూదన రావు , రచయిత్రి  శ్రీ లత  , ఆవుల మంజులత, సుద్దాల అశోక్ తేజ,  యం .ఆర్.నాయక్, త్రిపురనేని సాయి చంద్ , అల్లాణి శ్రీధర్ ,  'యువకళా వాహిని'  వై.కే. నాగేశ్వర రావు, జి . మల్లికార్జునరావు   తది తరులు పాల్గొన్నారు. టి. నాగి రెడ్డి , వెంగ మాంబ  , గంగాధర్   బృందం  ప్రదర్శించిన   'సత్య  హరిశ్చంద్రీయం '   సభికులను  ఆకట్టుకుంది .

1 comments:

నీహారిక said...

Jyoti's status on Facebook ...
భగవంతుడా. ఏంటయ్యా ఈ ఏడాదిలో చాలామంది ప్రముఖులను నీ దగ్గరకు పిలుచుకున్నావు. వాళ్లంతా నీకు చాలా ప్రియమైనవాళ్లని మాకు తెలుసులే..మరో విషయం కూడా మాకు బాగా అర్ధమైంది ఏంటంటే నీకు సినిమాలంటే ఇష్టమని సుజాత, ముళ్లపూడి, నూతన్ ప్రసాద్, షమ్మికపూర్ లాంటివాళ్లను, సంగీతమంటే ఇష్టమని భూపేన్ హజారికా, జగ్ జిత్ సింగ్, భీమ్ సేన్ జోషి లాంటివాళ్లను, టెక్నికల్ అవసరాలకోసం స్టీవ్ జాబ్స్, డెనిస్ రిచీ లాంటివాళ్లను...మరెందరినో మాతో ఉంచకుండా నీ దగ్గరకు రప్పించుకున్నావు. పర్లేదు. కాని ....

అప్పుడప్పుడు మా నాయకులను కూడా ప్రేమించవయ్యా స్వామి.. ఇది కోట్లాది బాధిత ప్రజల మొర. తొందరగా ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకో తంఢ్రి.... మా కష్టాలు తీరతాయి..
________________
పైన వ్రాసిన కమెంట్ మీ స్నేహితురాలిది. తనకి ఓటు వేయడానికి తీరిక లేదు కానీ తనకిష్టం లేకపోతే ఎవరినైనా చనిపోవాలనుకుంటుంది. మిమ్మల్ని మీ బంధువులు అవమానించారన్నారు. అలా అవమానించబట్టే మీరు ఈ రోజున ఇలా ఉన్నారు. మీకు తప్పు ఒప్పు తెలిసి వచ్చాయి కాబట్టే మారారు. అలా ఆ రాజకీయ నాయకులు కూడా మారవచ్చు కదా !! అలా చనిపోవాలని కోరుకోవడం ఏమిటి ? మనకిష్టం లేని వ్యక్తులని చనిపోవాలని మనం కోరుకుంటుంటే ఈ ప్రపంచం లో ఎవరూ మిగలరు.

మీకు తెలిసిన టెక్నికల్ విషయాలను , వీడియో లను అందరితోనూ పంచుకుంటున్నారు, మీకు టీవీ వాళ్ళతో పరిచయాలున్నాయి మీరు నాకు సహాయం చేసారనుకోండి, నేను జీవితం లో కాస్త ముందుకి వెళ్ళగలుగుతాను. అపుడు మా ఆయనతో శ్రీధర్ చాలా గ్రేట్ అని అంటే మా ఆయనకు ఒళ్ళు మండదా ?? అపుడు మా ఆయన నన్ను కూడా చనిపోమని అంటే మీకు ఎలా ఉంటుంది ? నాకు కూడా అలాగే ఆ రాజకీయ నాయకులను చనిపోమని అంటే అలాగే ఉంది. ఏదయినా విషయాన్ని స్నేహితులైతే బాగా అర్ధం అయేటట్లు చెపుతారని మీకు చెపుతున్నాను. ఆవిడను నా విషయం లో కల్పించుకోవద్దని నా మాటగా చెప్పండి.

గీతాచార్య ఏ తప్పు చేసాడో లెనిన్ బాబు అదే తప్పు చేసాడు. ఒకరిని తిట్టడం ఒకరిమీద జాలి చూపించడం ఏమిటి? రాజీవ్ గాంధీ స్నేహితులని నమ్మి మోసపోయారు దానికి ఆయన భార్యని శిక్షించాలా ? అన్నదే నా ప్రశ్న !!

Post a Comment