మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ
‘మల్లీశ్వరి’ తెలుగు చిత్ర సీమకు చుక్కానిలాంటిదని , ఎన్నటికి వన్నె తగ్గని అద్భుత కళాఖండమని ... జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.' యువ కళావాహిని' ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన ‘వాహిని వారి మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ’ సభకు సినారె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభ, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వర్‌రావు సంగీతం' మల్లీశ్వరి' ని చిరస్థాయిగా నిలబెట్టాయని సినారె పేర్కొన్నారు. ఎన్టీఆర్, భానుమతి పాత్ర లు, ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు’, ‘మనసున మల్లెల’ పాటలు నేటికీ మరుపురానివన్నారు. దేవులపల్లి సాహిత్య ప్రతిభకు మల్లీశ్వరి పాటలు తార్కాణమన్నారు.
సభలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ- 1951లో వచ్చిన' మల్లీశ్వరి' తెలుగు చలన చిత్ర పరిశ్రమకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభకు చిత్రంలోని సన్నివేశాలే నిదర్శనమన్నారు.బి .యన్ .రెడ్డి వంటి ఉన్నత స్థాయి దర్శకుల స్ఫూర్తి తోనే తను చిత్ర నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన సారిపల్లి కొండల రావు ప్రసంగిస్తూ- బీఎన్‌రెడ్డి లాంటి దర్శకులు అరుదుగా లభిస్తారన్నారు. ఫిల్మీడియా సౌజన్యం తో ఈ కార్యక్రమం జరిగింది.
సభలో ప్రముఖ రచయిత, నటులు రావి కొండల రావు, నిర్మాత, దర్శకులు అల్లాణి శ్రీధర్, ప్రముఖ రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, సాహితీ వేత్త ఓలేటి పార్వతీశం, లంకా లక్ష్మీనారాయణ, వై.కె. నాగేశ్వర్‌రావు, మళ్లీ ఖార్జునరావు, నరసింహారావు, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు . సినిమాలోని సన్ని వేశాలను, కథను, పాటలతో పాటు రసవత్తరం గా ఎస్.వి. రామారావువివరించారు . సభకు ముందు వీకే దుర్గ , శరత్ చంద్ర' మల్లీశ్వరి' చిత్రంలోని పాటలను మధురంగా ఆలపించారు.

3 comments:
మల్లీశ్వరి చిత్రం ఓ కళాఖండం,ఈ చిత్రం లోని పాటలు అజరామరం.
ఈ సందర్భంగా మల్లీశ్వరి సినిమా స్పెషల్ ఎడిషన్ డి వి డి ఎమన్నా విడుదలచేశారా ఊరికే ఓహో ఆహా అంటూ పొగిడేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారా. ఇవ్వాళ్టికి మల్లీశ్వరి సినిమా చక్కటి కాపీ అంటే కట్లు, మచ్చలు చుక్కలు లేకుండా అడియో క్లీన్‌గా ఉన్న సి డి కాని డి వి డి కాని దొరుకుతున్నదా!!?? ఈ సందర్భంగా అలనాటి విశేషాలతో, ఇంటర్వ్యూలతో ఒక చక్కటి డి వి డి విడుదల చేయగలిగితే ఈ నాటి తరానికి, అప్పటి వారు మళ్ళి చూసుకోవటానికి, మల్లీశ్వరి సినిమా గొప్పతనం ఏమిటి అని రాబొయ్యే తరాలకు తెలిసే అవకశం ఉన్నది. ఉత్తుత్తి మీటింగుల వల్ల ఫలితం ఏమిటి. శూన్యం.
ఈ మధ్యనే బెన్ హర్ సినిమాకు ఇలాగే ఆరు దశాబ్దాలు నిండిన సందర్భంగా వాళ్ళు మూడు డి వి డి లు ఉన్న స్పెషల్ డివిడి పాక్ విడుదల చేశారు. అద్భుతంగా ఉన్నది కాపీ, , మేకింగ్ ఆఫ్ బెన్ హర్ విశేషాలతొ. . పైగా మైన్ సినిమా చార్ల్టన్ హెస్టన్ ఆడియో కామెంటరీ కూడ ఉన్నది. అంటే సినిమా చూస్తూ సినిమా ఆడియో కాని, ఆడియో కామెంటరీ కాని మనం సెలక్ట్ చేసుకు చూడవచ్చు. ఆడియో కామెంటరీ సెలెక్ట్ చేసుకుంటే,ఆయా సీన్ల దగ్గర సినిమా తీస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు, అంత అద్భుతంగా ఎలా తియ్యగలిగారు వంటి విశేషాలు ఆ సినిమా హీరో గా వేసిన నటుడు చెబుతూ ఉంటే సినిమా చూడవచ్చు. తెలుగులో ఒక్కటంటే ఒక్కటి అటువంటి డి వి డి రాలేదు. మన నిర్మాతలకి నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప, నా సినిమాకి కలెక్షన్లు ఎక్కువ అంటే నా సినిమాకి కలెక్షన్లు ఎక్కువ అంటూ కొట్టుకోవటమే తెలుసు. మంచి పరిణితి కలిగిన వ్యాపారం చెయ్యటం రాదు, ప్రేక్షకులను అలరించటం అంతకన్నా తెలియదు.
శివరామప్రసాదు గారు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది.
Post a Comment