RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, November 14, 2013

'మసాలా' చిత్ర సమీక్ష

                             'మసాలా' చిత్ర సమీక్ష            2.5/5


'సురేష్ ప్రొడక్షన్', 'స్రవంతి బ్యానర్ ' సంయుక్తంగా కె . విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాయి   


భీమరాజపురం అనే ఊళ్ళో బలరాం(వెంకటేష్) అనే జమీందారుంటాడు. అతనికి బ్రిటిష్ వాళ్ళని మించిపోయే ఇంగ్లీషు మాట్లాడాలని కోరిక .. అబద్ధమంటే కోపం. బలరాం చెల్లెలు(షాజన్ పదమ్సీ ). బలరాం విరోధి  బామ్మర్ది   (పోసాని).  మేనేజర్ నారాయణ(ఎమ్మెఎస్ నారాయణ) . ఇతని స్నేహితుడి కొడుకు రెహమాన్(రామ్).అతనికో అక్క(అంజలి).   ఇబ్బందుల్లో వున్నరెహమాన్ ను నారాయణ జమీందార్ వద్ద పని ఇప్పిస్తానని  భీమరాజపురానికి తీసుకొస్తాడు  . అక్కడ రామ్ గా తన పేరు అబద్దం చెప్పి రెహమాన్ బలరాం దగ్గర  కోటలో ఉద్యోగం సంపాయిస్తాడు . రెహమాన్ తన పేరులో ఆడిన ఆబద్ధం కోసం మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది .ఒకసారి నమాజ్ చేస్తుండగా దొరికిపోయిన రామ్- 'తనకు రెహమాన్ అనే తమ్ముడున్నాడని, అతను నమాజ్ చేస్తుండగానే మీరు  చూసారంటూ' మాయ చేస్తాడు . ఇక ఓ రోజు హైదరాబాద్ లో చదువుకుంటున్న బలరాం చెల్లెలు  ఇంటికి వస్తుంది. ఆమెతో రామ్ లవ్ లో పడతాడు. ఆ విషయం  బలరాంకు తెలుస్తుంది. ఆతర్వాత రామ్ చెప్పిన అబద్ధాలుకూడా  బలరాంకు తెలుస్తాయి .ఆ తర్వాత ఏం జరిగిందనేది తెర ఫై చూడాలి .... 
    
ఈ మధ్య మల్టీ స్టారర్ చిత్రాలకు మొగ్గు చూపిన వెంకటేష్ , యువ హీరో రామ్ లు కలిసి స్వంత సంస్థల ఫై రూపొందించిన  ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే వున్నాయి . ఇది హిందీ హిట్ 'బోల్ బచ్చన్' కి రీమేక్ .  ఆ చిత్రానికి కాపీ ఫేస్ట్ గానే ఈ చిత్రం  కనిపిస్తుంది.  ఏదైనా.. సినిమాను రీమేక్ చేసే  ముందు  మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటారు .  కానీ అవేమీ లేకుండా మక్కికి మక్కి దించేశాడు దర్శకుడు విజయ్ భాస్కర్. ఈ 'మసాలా' చిత్రంలో ప్రధానంగా అదే లోపంగా కనిపిస్తుంది. కథకు, పాత్రలకు, మాట్లాడే బాషకు సంబంధం ఉండదు. ఒక అబద్ధం అనేక అబద్ధాలు ....వాటికోసం  అనేక పాత్రలు ....ఇలాంటి కామెడీ తెలుగు ప్రేక్షకులు రోటీన్ గా చూస్తున్నదే. లాజిక్ మచ్చుకైనా లేని ఈ చిత్రం లో కనీసం ప్రేక్షకులను అక్కట్టుకునే మ్యాజిక్ అయినా లేదు .   దర్శకుడు అన్నివిధాలా విఫలమయ్యాడు. పాత్రల, సన్నివేశాల లక్ష్యం ఏమిటో  క్లారిటీ లేదు. -వెంకటేష్ - షాజన్ మధ్య అన్నచెల్లెలి అనుబంధాలు ఎక్కడా కనిపించవు.అలాగే అంజలి తో అతని ప్రేమ కూడా ఆర్టిఫిషియల్ గా వుంది . జమీందార్  'మసాలా డ్రామా కంపెనీ' చుట్టూ తిరగడం ఆయన పాత్ర హుందాతనానికి తగినట్లు  లేదు. కామెడీ విలన్ (పోసాని)వల్ల   సినిమా లో గ్రిప్ పోయింది.కేవలం- 'జమీందార్ కు  అబద్ధమంటే పడదు...హీరో అతనికి అబద్ధం చెప్పాడు' అనే అంశం  ఫైనే సినిమా నడుస్తుంది . క్లైమాక్స్ లో 'ఎంత మోసం' అంటూ పెట్టిన డ్రామా   బలహీనంగా  చిత్రీకరించడం తో సిన్మాకు మైనస్ అయ్యింది . 
 
జమీందార్ బలరాం గా వెంకటేష్  మొదటి సారి  డిఫరెంట్ పాత్ర లో  నటించాడు.  
 'క్యాట్ అండర్ ది హ్యాండ్ సెర్చింగ్ మదర్ ల్యాండ్'. 'ఐ టాక్ ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్'. 'నా లాంగ్వేజ్ ఇంగ్లీష్, నా మథర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, నా టోటల్ బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్'. అంటూ వెంకటేష్ చేసిన బట్లర్ ఇంగ్లీష్ కామెడీ ప్రేక్షకులను నవ్వించింది .అయితే ఈ బట్లర్ ఇంగ్లీష్ ప్రయోగం ప్రేక్షకుల్లో ఎంతమందికి అర్ధమవుతుందో ఏమో ?  'రామ్', 'రెహమాన్' పాత్రల్లో రామ్ బాగా నటించాడు. రెహమాన్ గా కష్ట పడ్డాడు . రెండు పాటల్లో బాగా డాన్స్ చేసాడు . షాజన్  అందంలో గానీ..నటనలోగానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఆమెది రాంగ్ సెలక్షన్ -అనే చెప్పాలి .  రామ్ కి అక్కగా, వెంకటేష్ కి ప్రియురాలిగా చేసిన అంజలి, అక్కగానే బాగుందనిపించింది. ఇక వయసు మీరిన  కొవై సరళ  చేసిన  డ్యాన్స్ లు  కొద్దిగా  నవ్వించినా.. ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది .ఎద్దు గా  జయప్రకాష్ రెడ్డి , అలీ, ఎమ్మెస్ నారాయణ బాగానే చేసారు .  తమన్ పాటల్లో 'నిను చూడని' ,'దుమ్ములే' ,'మీనాక్షి'...ఓకే .  మంచి లోకేషన్స్ లో బాగా చిత్రీకరించారు . అండ్రూ  ఫోటోగ్రఫీ ,వర్మ ఎడిటింగ్ బాగుంది. అనిల్ రావిపూడి సంభాషణలు బాగా రాసాడు               -రాజేష్  

0 comments:

Post a Comment