RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, October 11, 2013

'రామయ్యా వస్తావయ్యా' చిత్ర సమీక్ష

'రామయ్యా వస్తావయ్యా'   చిత్ర సమీక్ష      2. 5 / 5


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై హరీష్‌శంకర్‌ దర్శకత్వం లో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు


 ఎప్పుడూ నలుగురు అల్లరిచిల్లరి కుర్రాళ్ళను వెంటేసుకుని కాలేజీ పేరుతో అమ్మాయికి సైట్‌కొట్టేవాడు నందు (ఎన్‌టిఆర్‌ ). వేరే కాలేజీలో చదివే ఆకర్ష (సమంత) ఆకర్షణ కు  లోనై ఆమెను లైన్లే పెట్టడానికి రకరకాలుగా టీజ్‌ చేస్తుంటాడు. ఓసారి ఆ అమ్మాయిని కాపాడతాడు. దానితో తన అక్క పెళ్లికి నందును తన ఊరు తీసుకెళుతుంది ఆకర్ష. చట్టవ్యతిరేక వ్యాపారాలుచేసే ముఖేష్‌రుషికి.. శత్రువులునుంచి ప్రమాదం ఉండడంతో కూతురు పెళ్లికి కూడా..కార్డుఉంటేనే రానిస్తాడు. ఆకర్షతోపాటు వచ్చిన నందు... చిన్న ట్విస్ట్‌ఇచ్చి.... ఆమె తండ్రిని చుట్టుపక్కల అనుచరుల్ని చంపేస్తాడు. ఈ కేసును పోలీసుఆఫీసర్‌ రావురమేష్‌ డీల్‌ చేస్తూ... నందునే మీ నాన్నను చంపాడని  ఆకర్షకు చెప్పేస్తాడు.  మీ నాన్న నువ్వు అనుకున్నంత మంచివాడుకాదని- ఫ్లాష్‌బ్యాక్‌లో కథ చెబుతాడు హీరో . అదే సినిమా...

'గబ్బర్‌సింగ్‌' తర్వాత హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహించిన సినిమా, మాస్‌ హీరో ఎన్‌టిఆర్‌ కాంబినేషన్‌లో రావడంతో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంపై ఓ క్రేజ్‌ ఏర్పడింది. తెలుగు సినిమాలకు ఒకటే ఫార్మెట్‌ ఉందని దర్శకులు నిర్మాతలు నమ్మి సినిమాలు  తీస్తున్నారు.  నవరసారలపేరుతో అన్నింటిని కలిపి ఇదే చక్కటి భోజనం అంటూ.. వారే చెప్పేస్తున్నారు.  కొత్త పోకడలతో హీరోలను చూపించే ఒరవడిలో కథను రాసుకుంటున్నారు. కొన్ని సినిమాలకు కథలంటూ ప్రత్యేకంగా ఉండవు. సీన్‌నుబట్టి.. డైలాగ్‌లు,... దాన్నిబట్టి.. నడిపిస్తూ  పోతుంటారు. హరీష్‌శంకర్‌ ఈ చిత్రం కథ గురించి అడిగితే.. అదే చెప్పాడు .'కథంటూ పెద్దగా చెప్పడానికి ఏమీలేదు. చూడాల్సిందే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమానే తీశాను. ఏదో ఉద్దరిద్దామని కాదంటూ'  వల్లించాడు.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే.... హీరోయిన్‌ను టీజింగ్‌ చేయడం, బామ్మలచేత నాట్యం చేయించడం...కత్తులు కటారులతో కాళ్లు చేతులు నరకడమే?- అనే  కొత్త అర్థం వచ్చేలా ఈ చిత్రం లో చూపాడు . 

 పాత్రకు అనుగుణం గా  ఎన్‌టిఆర్‌ ...  ఎక్కడ ఏ ఎమోషన్స్‌ పలికించాలో... ఎక్కడ ఎలా డాన్స్‌ చేయాలో... ఎక్కడ డైలాగ్స్‌ ఎత్తుపల్లాలు పలకాలో అన్నీ బాగా చేశాడు. సమంత కూడా తన టాలెంట్‌ను పాత్ర లో  చూపించేసింది. ఫ్యాష్‌బ్యాక్‌లో వచ్చే శ్రుతిహాసన్‌ పాత్ర కొత్తదనంలేకపోయినా, రొటీన్‌ పార్మెట్‌లో చేసేసింది. తనికెళ్ళభరణి టీచర్‌గా , ముఖేష్‌రుషి కరడుగట్టిన వ్యాపారవేత్తగా నటించాడు. చిత్రంలో హైలైట్‌గా- మళ్ళీ అరుంధతి తరహాలోనే 'నచ్చింది కనపడితే చెంతచేరాలనే' పాత్రను మళ్ళీ రవిశంకర్‌ బాగా  పోషించాడు. అతని తండ్రిగా కోటశ్రీనివాసరావు పాత్ర చిన్నదే. పోలీసు అదికారిగా రావురమేష్‌ సరిపోయాడు. తనికెళ్ళ భరణి ,  రోహిణీ హట్టంగడి, అజయ్ కూడా ఇందులో వున్నారు.

చోటా  కె నాయుడు ఫోటోగ్రఫీ ఈ చిత్రానికే  ప్రత్యేక ఆకర్షణ .   థమన్‌ సంగీతం లో పాటలు గొప్పగా కాకున్నా కొన్ని  బాగున్నాయి .   బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో  కొంత గందరగోళం  చేశాడు.   'జాబిల్లి నువ్వే చెప్పమా...' అనే పాటను ఎంతో అందంగా తీస్తే బాగుండేది... జాబిల్లి సాంగ్‌లో వీధిలైట్లను పెట్టి తీయడం అతకలేదు.  ఎడిటింగ్‌ విషయంలో ఇకాస్త జాగ్రత్తపడాల్సింది. రొటీన్  కత్తిఫైట్లు... నరుక్కోవడాలు ఇంకా ఎడిట్‌ చేయాల్సింది. డైలాగ్స్‌ విషయంలో కొత్తదనం ఏమీలేకపోగా....' బుడ్డోడు' అనే మాటను ఎన్‌టిఆర్‌ చేత అనిపించి... ఫైట్స్‌ చేయించడం... ఒక్కటే కొత్తగాఅనిపిస్తుంది.

  పెద్ద హీరోలతో సినిమా చేయడం అంటే... ఏదో రకంగా తీసేస్తే... చాలు జనాలు చూసేస్తారనుకోవడం చాలా పొరపాటు.  ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా అంటే -  దర్శక నిర్మాతలకు, హీరోకు నచ్చింది చేయడమే అనుకుంటే ... అంతకంటే పొరపాటు..' నాకు నచ్చింది..  నాకు వచ్చింది..  చేయడం నా పాలసీ' అన్న హరీష్‌శంకర్‌ ప్రేక్షకుల్నీ దృష్టిలోపెట్టుకోవాలి. సమాజాన్ని బాగుచేయకపోయినా పర్వాలేదు. చెడగొట్టకూడదు అనే పాలసీని నమ్మి సినిమాలు తీయాలి.  గబ్బర్‌సింగ్‌ సినిమా తీసింది ఈయనేనా అనిపిస్తుంది.  కానీ ఇందులో కేవలం వ్యక్తిగత పగ, ప్రతీకారం నేపథ్యంలోసాగుతుంది.ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో రోహిణిహట్టంగల్‌తో ఎన్‌టిఆర్‌ను లవ్‌చేయడం, డాన్స్‌ చేయడం, తర్వాత మనవడు అంటూ సెంటిమెంట్‌ పలకడంవంటివి పెద్దగా వర్కవుట్‌ కాలేదు.  కధ లో విషయం తక్కువ ... హీరో బిల్డప్పులో మాత్రం చాలా ఎక్కువ .  సంభాషణల్లో పంచ్‌లకోసం ప్రాకులాడేకన్నా...కథ, కథనంలో కొత్తదనాన్ని చూపడం  చాలా అవసరం.  మొదటిభాగం ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాగానే వుందనిపిస్తాడు దర్శకుడు .సెకండాఫ్‌లో కథ ప్రారంభమవుతుంది. ఇందులోఎక్కువ ఎమోషన్స్‌  ఉన్నాయి. కానీ అయినా దేనికీ  ప్రేక్షకుడు కనెక్ట్‌కాలేడు. 'నరసింహుడు', 'దమ్ము' చిత్రాలు గుర్తుకువస్తాయి. భారీగా తీస్తే సరిపోదు.. ఇందులో చాలావిషయాలు  లాజిక్కులకు అందవు. ఏ లాజిక్కులు లేకుండా చట్టం అంటే ఎలా ఉండాలి.అంటూ స్పీచ్‌లు చెప్పేస్తే సరిపోదు. బొమ్మరిల్లు, బృందావనం వంటి చిత్రాల్లో కుటుంబ సంబంధాలు ,  మానవీయతను టచ్‌చేసి కాస్త హాస్యపు గుళికలతో ఆకట్టుకున్న  నిర్మాత దిల్ రాజు  ఎన్‌.టిఆర్‌తో - పగ, ప్రతీకారం...చంపడం, నరకడం వంటి అంశాలు పెట్టి  ఆకట్టుకోవాలనుకోవడం  తప్పే   
                                                                                                  -రవళి 

0 comments:

Post a Comment