RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, May 31, 2013

'ఇద్దరమ్మాయిలతో' చిత్ర సమీక్ష 2.5/5



పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్  పతాకం ఫై  పూరి జగన్నాధ్ దర్శకత్వం లో బండ్ల గణేష్  ఈ చిత్రాన్ని నిర్మించారు . 

              సైకాలజీ లో పీజీ చెయ్యడానికి కేంద్ర మంత్రి కూతురు ఆకాంక్ష  స్పెయిన్ వెళ్తుంది . అక్కడ ఆమె వుండే ఇంట్లో- గతం లో అక్కడ వున్న కోమలి డైరీ దొరుకుతుంది .దాని ప్రకారం ....  సంగీతం నేర్చుకోవడానికి అక్కడికి వచ్చిన కోమలి గిటారిస్ట్ సంజూ రెడ్డి తో ప్రేమలో పడుతుంది . వారి ప్రేమకు రెండు కుటుంబాల వారూ అంగీకరిస్తారు . ... ఆ తర్వాత జరిగింది డైరీ లో వుండదు . అయితే , సంజూ ఆకాంక్ష కు తారస పడతాడు .ఒక మాఫియ గ్యాంగ్ చేతుల్లో కోమలి చనిపోయిందని చెబుతాడు . క్రమంగా ఆకాంక్ష సంజు కి దగ్గరై అతనితో ప్రేమలో పడుతుంది . తన ప్రేమను సంజూ తో సహా , తల్లి దండ్రులకు కూడా చెప్పేస్తుంది .ఆ తర్వాత కధ  అనుకోని మలుపులు తిరుగు తుంది .... 

                 'దేశముదురు' కాంబినేషన్ పూరి-అల్లు అర్జున్ లతో వచ్చిన ఈ చిత్రం ఫై మంచి అంచనాలున్నాయి .
దీన్ని  భారీ బడ్జెట్ తో,చక్కటి సాంకేతిక విలువలతో , ఎక్కువ భాగం విదేశాల్లోనే చేసారు . అయితే బలహీన మైన కధ,కధనం వల్ల సినిమా అంచనాలను చేరుకోలేకపోయింది .తెలుగు సినిమా స్థాయి పెంచుకోవడం అంటే - కొత్తదనంతో సినిమాని చూపగలగడం లోనే తప్ప, అడ్డమైన కధలకీ విదేశాలకి వెళ్లి నిర్మాత డబ్బుని విచ్చలవిడిగా తగలెయ్యడం కాదని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది .   అందరూ చూసే చోట విలన్లు ఓ  హత్య చేసి,దాన్ని వీడియో తీసిందని చెప్పి, కోమలిని ... వారి కుటుంబాలను చంపాలనుకోవడం చాలా  హాస్యాస్పదంగా వుంది .మొదటి భాగం పర్లేదనిపించినా రెండవభాగం సహనానికి పరీక్ష పెడుతుంది . చివరిలో వచ్చే ట్విస్ట్-ఫ్లాష్ బ్యాక్ కొంతవరకూ బాగుంది . సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రదాన ఆకర్షణ . ఇందులోని పాటలన్నీ బాగున్నాయి . పాటల చిత్రీకరణ కూడా బాగుంది . మరీ ప్రత్యేకంగా అర్జున్ బృందం ఫై చేసిన మొదటి పాట చిత్రీకరణ కు అభినందించాలి . చివర్లో వచ్చే 'టాప్ లేచిపోద్ది' మాస్ పాట  కూడా మంచి ఊపుతో ఉంది  . రీ రికార్డింగ్ లో కూడా దేవి ప్రత్యేక శ్రద్ధ కనిపించింది .సినిమా అంతా  అందం గా చూపించిన  అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో మరో ప్రత్యేకత . విదేశీ డాన్సర్స్ తో పాటు,  లొకేషన్స్ కూడా బాగున్నాయి . భారీ ఖర్చుతో విదేశీ  ఫైట్ మాస్టర్ కెచ్చా చిత్రీకరించిన  ఫైట్స్ బాగున్నాయి . ప్రత్యేకంగా ఇంటర్వెల్ ముందు  చాకు ఫైట్  కొత్తగా వుంది . అయితే , సినిమాలో ఫైట్స్ మోతాదుకు మించాయి . అందులోనూ  హింస ఇంకా ఎక్కువయ్యింది . సెన్సార్ వారి సౌజన్యంతో వీటిని విజయవంతంగా ప్రేక్షకులకు అందించారు . 
               
                   సంజు గా అల్లు అర్జున్ స్టైలిష్ గా నటించి పాత్రకు న్యాయం చేసాడు . పాత్ర కు అనుగుణంగానే  అయినప్పటికీ -అవసరాన్ని మించి నిర్మాత డబ్బు ఖర్చు చేయించి, నటుడిగా తన కోరికల్ని తీర్చుకున్నాడు .సంప్రదాయిక అమ్మాయి కోమలిగా అమలా పాల్ బాగా చేసింది . ఆకాంక్ష గా కేధరిన్ అందం గానే వున్నా,నటన కొంచం అతిగానే అనిపించింది .కేధరిన్ తొడలు చూపించడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు . బర్రె లాంటి మాఫియాడాన్ తో ఆమె పెళ్లి కెలా  వప్పుకుందో అర్ధం కాదు . ఫిడేల్ బ్రహ్మిగా ఒక్క పాటలో తప్ప బ్రహ్మానందం ఆకట్టుకోలేకపోయాడు . ఇక మెంటల్ అలీ తో బ్రహ్మానందం కామెడీ చిర్రెత్తించింది . ఇతర పాత్రలు  షవర్ అలీ , రావు రమేష్ , సుబ్బరాజు , భరణి , తులసి , ప్రగతి , నాజర్ , ప్రియ , ఖయ్యుం , శ్రీనివాస రెడ్డి పోషించారు.  -రాజేష్ 

0 comments:

Post a Comment