RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, April 5, 2013

'బాద్ షా' చిత్ర సమీక్ష

'బాద్ షా' చిత్ర సమీక్ష   2.5 / 5


 పరమేశ్వర పతాకం ఫై శ్రీను వైట్ల దర్శ కత్వం లో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు .                                                                                                                


                          శ్రీను వైట్ల సమర్ధుడైన దర్శకుడు . సినిమా విజయానికి హీరో ని నమ్ముకోవడం కన్నా కామెడీని నమ్ముకోవడం ఉత్తమం అనే సూత్రాన్ని ఇటీవల తన భారీ చిత్రాల్లో  ప్రయోగించి, మంచి విజయాలు  సాధించారు . శ్రీను ఆ మధ్య పూరీ 'పోకిరి' ని అనుసరిస్తూ 'దూకుడు' చేసాడు . ఇప్పుడు దాదాపుగా అదే చిత్రాన్ని తిరిగి యన్టీ ఆర్ తో 'బాద్ షా' గా చేసాడు . అందుచేత ఈ చిత్రం కధ గురించి ప్రత్యేకం గా చెప్పడానికి ఏమీ లేదు . ఈ చిత్రంలో భారీ నిర్మాణ విలువలున్నాయి .కోన వెంకట్ సంభాషణలు , గుహన్ ఫోటోగ్రఫీ,వర్మ ఎడిటింగ్ ,విజయ్ యాక్షన్ ,ప్రకాష్ ఆర్ట్ ,తమన్ సంగీతం బాగున్నాయి . అయితే సినిమాలొ కొత్తదనం  మాత్రం కొరవడింది .మాఫియా ను మట్టు పెట్టడానికి మారు వేషం లో పోలీసులు ప్రయత్నించే ఈ కధ  లో,కధనం లో  స్పష్టత లేదు . చాలా చోట్ల గందర గోళానికి  గురవుతాము  . సినిమా ప్రారంభం నుండి  హీరోయిన్ కాజల్  మాటల రొద.. .ఇంటర్వెల్ దగ్గరకొచ్చే కొద్దీ ఎడతెగని 
యాక్షన్ హంగామా . రెండవ భాగం నుండీ తెలంగాణా యాస తో ఈవెంట్ మేనేజర్ గా  బాద్ షా మరో రూపం లో హంగామా . నిజానికి ఇటువంటి సన్నివేశాల్లోనే దర్శకుడు శ్రీ ను  వైట్ల-  కధ లో విషయం లేకపోయినా,మంచి హాస్యాన్ని రాబట్టి... ప్రేక్షకులను మాయ చేస్తుంటాడు . అయితే ఇందులో అతను చేసిన ప్రయత్నం విఫలమయ్యింది . అక్కడక్కడ తప్ప కామిడీ రొటీన్ గా సాగింది .  కలల్లో విహరిస్తాడంటూ బ్రహ్మానందంఫై భారీ ఆశలతో దర్శకుడు పెట్టిన కామెడి ట్రాక్ తుస్స్ మంది . మహేష్ బాబు కామెంటరీ ,అతిధి  పాత్రలో సిద్ధార్ధ ,విలన్ పొలీస్ గా నవదీప్ ... ఇలా ఎన్ని అదనపు ఆకర్షణ లున్నా ఉపయోగ పడలేదు .దర్శకుడిగా శ్రీను వైట్ల సమర్ధత ఫైనే సందేహాన్ని కలిగించే చిత్రం ఇది . 

               కాజల్ , వెన్నెల కిషోర్ లతో హీరో చేసిన కొన్ని సీన్స్...మందు కొట్టిన ఆడాళ్ళతో  యన్టీ ఆర్ పాటల సన్నివేశం ... ఇటలీ అందాలు బాగున్నాయి .బాద్షా గా యన్టీ ఆర్ బాగా నటించాడు  . డాన్సులు ఫైట్లు బాగా చేసాడు . సీనియర్ యన్టీ ఆర్ ను కొన్ని చోట్ల బాగా అనుకరించాడు . రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాలకోసం సీనియర్ యన్టీ ఆర్ వారసత్వాన్ని జూనియర్ వాడుకునే ప్రయత్నం చేసాడు .   అయితే అతని గెటప్ కారణం గా గ్లామర్ గా కన్నా, ఇబ్బంది కరంగానే చాలా చోట్ల  కనిపించాడు . జానకి గా కాజల్ అందం గా , బాగా చేసింది .  రివెంజ్  నాగేశ్వర్ రావు పేరుతో రామ్ గోపాల్ వర్మ ను తలపించేలా ఎమ్మెస్ నారాయణ ఫై చేసిన కామెడి బాగుంది .పిల్లి పద్మనాభ సిన్హా గా బ్రహ్మానందం కామెడి అర్ధం పర్ధం లేకుండా  చిరాకెత్తించింది . క్రమ శిక్షణకు మారు పేరైన పిల్లి వంశ పోలీస్ అధికారిగా నాజర్ నటన మరీ అతిగా వుంది  .   ఇతర పాత్రల్లో  ప్రదీప్ రావత్ ,ఆశిష్ విద్యార్ధి ,  సయ్యాజీ షిండే ,  తని కెళ్ల  భరణి , షఫీ , సుహాసిని , మోహన్ రుషి , సుప్రీత్ , సత్యం రాజేష్ ,నాగబాబు , చంద్ర మోహన్ , సుధా , ప్రగతి , సురేఖా వాణి, జయప్రకాశ్ రెడ్డి , అజయ్ , తగు బోతూ రమేష్, రవిప్రకాష్ , బ్రహ్మాజీ , గిరిధర్ , రజిత  , భరత్ , రాజీవ్ కనకాల నటించారు . తమన్ పాటలు...  చిత్రీకరణ బాగున్నాయి . 'కొట్టినా తిట్టినా' పాట 'బిజినెస్ మాన్ ' లోని 'సారొస్తారు' పాట అనుకరణ లా  వుంది .రీ  రికార్డింగ్ బాగుంది .   ఇందులో నికోల్ ఫై  ఐటెం సాంగ్ మరో బోనస్  
                            -రాజేష్ 

0 comments:

Post a Comment