RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, December 6, 2012

వేదాంతం సత్యనారాయణ శర్మ సంస్మరణ

'అపర సత్యభామ'గా విశ్వవిఖ్యాతి గాంచి, కుగ్రామంలోని కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన, లాస్య, సాత్వికాభినయ నాట్యాచార్యుడు డా.వేదాంతం సత్యనారాయణ శర్మ అని వక్తలు కొనియాడారు. 'యువకళావాహిని' ఆధ్వర్యంల
ో డిసెంబర్ 6న త్యాగరాయగాన సభలో ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ సంస్మరణ సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన డా.కె.వి.కృష్ణకుమారి మాట్లాడుతూ- వేదాంతం కూచిపూడి ప్రాశస్త్యానికి కృషి చేసిన మహోన్నతుడని పేర్కొన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు డా.శోభానాయుడు మాట్లాడుతూ- భామాకలాపంలో సత్యభామగా, విప్రనారాయణలో దేవదేవిగా, ఉషగా స్త్రీ పాత్రలో వయ్యారాలు ఒలకబోస్తూ తన అభినయంతో అందర్నీ మైమరపించే వారన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణ మాట్లాడుతూ- భామాకలాపం ఆయన కోసమే రాసినట్లుగా ఉందన్నారు. రంగ స్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ- వేదాంతం కూచిపూడి నాట్యానికి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారన్నారు. శర్మ పాత్రధారణ అవయవ సౌష్టవంతో, అభినయంతో స్త్రీ లోకాన్నే మరిపించేదని అన్నారు. నాట్యాచారిణి మద్దాళి ఉషాగాయత్రి, గజల్ శ్రీనివాస్, డా"వి.ప్రకాశరావు, వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

0 comments:

Post a Comment