RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, February 17, 2012


                                                            ' నిప్పు' చిత్ర సమీక్ష         2.25/5     
                      బొమ్మరిల్లు పతాకం ఫై గుణశేఖర్ దర్సకత్వం లో వై .వి.యస్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సూర్య - శ్రీ  ప్రాణ మిత్రులు.   శ్రీ పుట్టిన రోజు  వేడుకల కోసం  సూర్య  మిత్ర బృందం  సౌదీ  అరేబియా వెళ్తుంది. అక్కడ  శ్రీ  ప్రేయసి  వైష్ణవి  ప్రమాదవశాత్తు చనిపోతుంది. అయితే ఆమెను  శ్రీ హత్యచేసినట్లు భావించి   అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. శ్రీ కి వురి శిక్ష విధిస్తారు. ఆ శిక్ష నుండి అతను  తప్పించుకోవాలంటే  చని పోయిన వైష్ణవి  తల్లి దండ్రులు శ్రీ ని  క్షమించినట్లు  రాసివ్వాల్సి వుంటుంది. గూండా సామ్రాజ్యానికి  నాయకుడైన  వైష్ణవి తండ్రి  రాజా గౌడ్ అరాచకాలను ఎదిరించి , అప్పటికే సూర్య అతనితో  శత్రుత్వం కొనితెచ్చుకుని ఉంటాడు. అయినప్పటికీ మిత్రుడు శ్రీ ప్రాణాలు కాపాడటం కోసం ...రాజా గౌడ్ నుండి క్షమాపణ సంతకం తీసుకోవడానికి సూర్య ప్రయత్నం ప్రారంభిస్తాడు. శ్రీ కుటుంబ సభ్యులకు విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ,తను ప్రేమించిన శ్రీ చెల్లెలు మేఘన కు మాత్రమే సూర్య  జరిగింది చెబుతాడు.  రాజా గౌడ్ ను ప్రసన్నం చేసుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా పట్టు వదలని సూర్య తను అనుకున్నది ఎలా సాధించాడనేదే ఈ చిత్ర కధాంశం .
          మాస్ చిత్రాల హీరో రవితేజ తో   ఫ్లాప్ చిత్రాల దర్శకులు నిర్మించిన ఈ చిత్రం పట్ల  మొదటి నుండీ అందరికి సందేహాలున్నాయి. చిత్రం చూసాక వారి సందేహాలే నిజమయ్యాయని అనిపిస్తుంది. రవి తేజ సినిమా అంటే పూర్తి వినోదాత్మకం గా వుండాలని  ప్రేక్షకులు ఆశిస్తారు. ఈ చిత్రం లో వారు ఆశించినంత వినోదం లేకపోవడం తో పాటు, కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులను నిరాశ పరిచింది.  రౌడీ గ్యాంగులు ...వాళ్ళతో హీరో ఫైట్లు మనం చాలా సినిమాల్లో చూసినవే .వాటితోపాటు ఇందులో హీరో కంటైనర్ ఫై బైక్ నడపడం...గేటు ఫై నుండి  బైక్ తో జంప్  చేయడం వంటి  కనల్ కన్నన్  స్పెషల్  విన్యాసాలు కూడా చేసి చిరాకు  కలిగించాడు.  శ్రీ  ప్రేయసి  వైష్ణవి   సౌదీ  అరేబియాలో అన్ని అంతస్తుల భవంతి ఎక్కి మరీ ...పరుగెడుతూ  పడి, ప్రాణాలు పోగొట్టుకోవడం నమ్మేవిధంగా లేదు.  శ్రీ ప్రాణాలు కాపాడటం కోసం ...రాజా గౌడ్ నుండి క్షమాపణ సంతకం తీసుకోవడానికి సూర్య చేసిన  ప్రయత్నాలు కూడా సహజత్వానికి దూరంగా వున్నాయి.  చాలా సినిమాలకి  ప్రధాన ఆకర్షణ అయిన  బ్రహ్మానందం  కామెడీ  ఈ చిత్రం లో మాత్రం పెద్ద ఇబ్బంది గా మారింది. ఒక్కో పాట ఒక్కొక్కరితో రాయించినా,  మంచి లోకేషన్స్ లో బాగా చిత్రీకరించినా... తమన్ సంగీతం లో పాటలు ఇంకాస్త బాగుంటే  సినిమాకి ఉపకరించేవి.  టి.వి 9 లో రాజా గౌడ్ ను పరిచయం చెయ్యడం, రెస్టారెంట్ లో ఫైట్ వంటివి బాగున్నాయి.
               ఈ చిత్రం లో రవి తేజ ఒక్కడే  ప్రధాన ఆకర్షణ . ఎప్పటిలానే  శక్తివంతం గా సూర్య  పాత్రకి  న్యాయం చెయ్యడానికి కృషి చేసాడు. ఇటీవల చిత్రాల కన్నా అందం గా కూడా కనిపించాడు. దీక్షా సేథ్ విగ్రహం బాగున్నా
విషయం లో ఇంకా వెనుకబడే వుంది.  శ్రీ పాత్రలో శ్రీరాం చిన్న పాత్ర బాగా చేసాడు.అతని ప్రేయసి వైష్ణవి  గా భావన , మరో సన్నివేశం లో దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారి కనిపించి వెళ్ళారు. శ్రీ తండ్రిగా  రాజేంద్ర ప్రసాద్ బాగానే చేసినా ,అతన్నీ...కృష్ణుడిని  బాగా వాడుకోలేదని అనిపిస్తుంది. లావు తగ్గిన భరత్ ని  చూడ లేకపోయాము. ప్రదీప్ రావత్, ముకుల్ దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్, ధర్మవరపు, సి.వి.యల్, ప్రగతి, సురేఖ వాణి,  వినయ్ వర్మ, గీతా సింగ్ , శకుంతలఈ చిత్రం లోని ఇతర పాత్రలు పోషించారు. శ్రీధర్ సీపాన సంభాషణలు, సర్వేష్ మురారి ఫోటో గ్రాఫి,
గౌతం రాజు ఎడిటింగ్  బాగున్నాయి                                                                                                                                -రాజేష్               


0 comments:

Post a Comment