RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, October 6, 2011

ఊసర వెల్లి' చిత్ర సమీక్ష

                                     ఊసర వెల్లి'  చిత్ర సమీక్ష         2/5                      

                            శ్రీ వెంకటేశ్వర  సిని చిత్ర పతాకం ఫై  సురేంద్ర రెడ్డి  దర్శకత్వం లో  భోగవల్లి ప్రసాద్  ఈ చిత్రాన్ని నిర్మించారు.
            టోనీ డబ్బు కోసం ఏ పని కైనా సిద్ధ పడే చిల్లర దొంగ . ఓసారి  కాశ్మీర్ లో తీవ్రవాదుల చేతిలో బందీ అయిన టోనీ కి నీహారిక అనే అమ్మాయి పరిచయమై ఆ తర్వాత కనబడకుండా వెళ్లి పోతుంది.  ఆతర్వాత నీహారిక మరో చోట తారస పడటంతో ... ప్రేమ పేరుతో , స్నేహం పేరుతో టోనీ  వెంటపడుతుంటాడు. ఆక్రమంలో అజ్జూ భాయి అనే మాఫియా డాన్ మనుషులని చంపుతుంటాడు. అయితే , వారిని టోనీ  చంపుతూ పోవడానికి  ఒక బలమైన కారణం ఉందని ...ఒకరికి ఇచ్చిన మాటకోసం అలాచేస్తున్నాడని ఆ తర్వాత తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బాక్ లో నీహారికకు  కూడా ప్రధాన పాత్ర ఉంటుంది . అది ఏమిటి? బలమైన మాఫియా డాన్ అజ్జూ భాయి తో తల పడ్డ టోనీ ఎలా నెగ్గుకు రాగలిగాదనేది ఈ చిత్రం లో చూడాలి.
                          గతంలో ఎలాంటి సినిమాలు చేసినా ' కిక్' తో మంచి కమర్షియల్ దర్శకుడిగా  మారాడనిపించుకున్న సురేంద్ర రెడ్డి ఈ చిత్రం తో ఒకే సారి నాలుగు మెట్లు దిగజారాడు.   ఏ చిత్రాని కైనా  మంచి కధ , కొత్తదనం...వినోదం ఉన్నకధనం అవసరం.  అర్ధం లేని వక్కంతం వంశీ  కధతో,  గందరగోళం  స్క్రీన్ ప్లే  తో, ఏ ప్రత్యేకతలు లేకుండా  ఈ చిత్రం నిర్మించారు.   ట్విస్టులు, ఫైట్లు  ఎక్కువై పోయి ప్రేక్షకుడిని  చిర్రెత్తించాయి.   మాఫియా  సన్నివేశాలు  పరమ  రొటీన్ గా ఉన్నాయి.  హీరో  ఫై నే పూర్తిగా ఆధార పడ్డారు.  అయితే, హీరో పాత్రీకరణ' కిక్' లో రవితేజ లానే ఉండటం ...  ఆ స్త్తాయిలోపండక పోవడం మైనెస్ అయ్యింది.  ఉన్నంతలో యన్. టి. ఆర్ బాగానే చేసాడు. పాటల్లో, ఫైట్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం లో కొంతవరకూ  సఫలం అయ్యాడు. అయితే 'యమ దొంగ' కు ముందు అతని శరీరం లో  ఉన్న భారీ తనం మళ్ళీ కనిపించి అతని గ్లామర్ ని దెబ్బ తీసింది.  ఇంటర్ వెల్  ముందు ఇర్ఫాన్ ని చంపడం  , క్లైమాక్స్ సన్నివేశాలు మరీ కృతకం గా ఉన్నాయి.    సినిమా ప్రారంభం లో కాసేపు బాగానే ఉందనిపించినా ....     ఆ తర్వాత సినిమాలో వినోదం శూన్యం .  దాని కోసం పెట్టిన  జయప్రకాష్ రెడ్డి - రఘు బాబు బృంద కామెడీ మరీ చప్పగా ఉంది. మంచి కామెడీ లేకపోవడం కూడా ఈ చిత్రం లో మరో పెద్ద లోపం.   తమన్నా నీహారిక గా కీలకమైన పాత్రని బాగా చేసింది.  అయితే ఆమె పాత్రలో ఉన్న మెలికలు, ప్రేక్షకుడి ని కూడా తికమక పెడతాయి. ఫ్లాష్ బాక్ లో  ఆమె హీరో నుండి 'వాగ్దానం'  తీసుకునే అత్యంత ప్రధానమైన సన్నివేశం కూడా పేలవం గా ఉంది.   అజ్జూ భాయి  గా ప్రకాష్ రాజ్ పాత పాత్రనే చేసాడు. శ్యాం ఓ చిన్న పాత్రలో కనిపించాడు. తమన్నా స్నేహితురాలిగా పాయల్ ఘోష్ ,ఇతర పాత్రల్లో రెహమాన్ , భరణి, సయ్యాజి షిండే ,మురళి శర్మ         
         కొరటాల శివ సంభాషణల్లో పస లేదు. ' కరెంట్ స్థంభం కూడా సన్నగానే ఉంటుంది' వంటి డైలాగులు  నవ్వు తెప్పించాయి.ఇటీవల  తెలుగు లో దేవిశ్రీ ప్రసాద్ బలహీనమైన సంగీతం అందించిన చిత్రం ఇదే.  పాటలు ఆకట్టుకోలేక పోయాయి. రీ రికార్డింగ్ పరిస్థితి కూడా అదే. పాటల చిత్రీకరణ కూడా అంతంత మాత్రమే. రసూల్ చాయాగ్రహణం పర్వాలేదు. రాం లక్ష్మణ్ త్రిల్ల్స్ చెత్తగా ఉన్నాయి.                      

0 comments:

Post a Comment