Friday, December 28, 2012
ప్రేమ వ్యవహారంతో సంధ్య విరక్తి
Wednesday, December 26, 2012
'ఖిలాడీ 786'తో బాలీవుడ్ కి క్లాడియా సీస్లా
ప్రపంచ సుందరి ఒలీవియా కల్పోని
Saturday, December 22, 2012
తెర ఫైకి అర్జున్ కూతురు ఐశ్వర్య
Friday, December 21, 2012
''సారొచ్చారు'' చిత్ర సమీక్ష
''సారొచ్చారు'' చిత్ర సమీక్ష 2/5
త్రీ ఏంజల్స్ స్టూడియో పతాకం ఫై పరశురాం దర్శకత్వంలో ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇటలీ లో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ ను, తాను చాలా అందగత్తెననుకునే సంధ్య ఇష్టపడుతుంది .అతన్ని ప్రేమలోకి దించాలని చాలా ప్రయత్నిస్తుంది.అందుకు ఇష్టపడని కార్తీక్ ఇండియా కు తిరిగి వస్తున్న సమయం లో సంధ్యతో - తనకు ఇంతకుముందే పెళ్లయ్యిందని చెబుతాడు.ఊటీలో ఫుట్ బాల్ కోచ్ గా వున్నపుడు వసు అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ....పెళ్ళికి ముందు బాగానే వున్న వసు, పెళ్లి తర్వాత వేధించడం మొదలుపెట్టిందని...ఆ కారణంగా ఆమెతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతాడు.అతనికి పెళ్ళయిపోయిందని తెలిసి సంధ్య బాధపడుతుంది.అయితే వసు తో వచ్చిన విభేదాల్లో, కార్తీక్ పరిస్థితిని అర్ధం చేసుకుని సానుభూతి చూపుతుంది.వారు ఇండియా కు తిరిగి వచ్చిన తర్వాత సంధ్యకు, కార్తీక్ పెళ్లి గురించి అసలు విషయం తెలుస్తుంది.ఆతర్వాత ఏం జరిగిందీ సినిమాలో చూడండి...
'సోలో' తో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పరశురాం ఇందులోనూ తనదైన శైలి చూపడానికి ప్రయత్నించాడు.పెళ్ళికి ముందు ప్రేమ కాదు ,పెళ్లి తరువాత ప్రేమ ప్రధానం అనే విషయాన్ని బలంగా చెప్పడానికి కష్టపడ్డాడు . అందుకు ,కొన్ని చక్కటి సన్నివేశాలనూ సృష్టించాడు.సందర్భానుసారంగా మంచి సంభాషణలు కూడా సమకూర్చాడు. అయితే మాస్ మహారాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ను క్లాస్ పాత్ర లో చూపాలనే సాహసం చేసి ఇబ్బందుల పాలయ్యాడు. రవితేజ తో ఈ కధను చెయ్యడమే సినిమాకు పెద్ద మైనస్.రవితేజ నుంచి మంచి మసాలా సన్నివేశాలు,పంచ్ డైలాగ్స్ ఆశించే ప్రేక్షకులు నిరాస పడ్డారు. హీరోకు ముందే పెళ్ళయ్యిందంటూ- ప్రభాస్ 'డార్లింగ్' తరహాలో చూపిన ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు నిజంగా కధలో వుంటే బాగుండునని అనిపిస్తాయి. ఇటలీ లో ఐ.టి జాబ్ చేసే రవితేజను ఊటీ ఫ్లాష్ బ్యాక్ లో ఫుట్ బాల్ కోచ్ గాచూపిస్తారు. సరే,అది ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాకే కదా అనుకుంటే...క్లైమాక్స్ లో మళ్ళీ ఫుట్ బాల్ కోచ్ గా చూపిస్తారు.నారా రోహిత్ తో క్లైమాక్స్ సన్నివేశాలు బాగానే వున్నా, అటువంటి ముగింపులు గతంలో చాలా సినిమాల్లో చూసినవే కావడంతో ఆకట్టుకోలేదు.కారు ప్రయాణంలో హీరో హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పేవిధానం బాగుంది. ఈ చిత్రం కధకూ, 'సారొచ్చారు' అనే పేరుకూ ఏ మాత్రం సంబంధం లేదు.
ఈ మధ్య చిత్రాల్లో రెచ్చిపోయి చేసిన కామెడీకి భిన్నంగా రవితేజ కార్తిక్ గా జంటిల్మన్ పాత్ర ఇందులో చేసాడు.అతను ఎంత సెటిల్డ్ గా,బాగా చేసినప్పటికీ-అతని ఇమేజ్ కి విరుద్ధంగా వున్నపాత్రలో ప్రేక్షకులు అంగీకరించలేదు. సంధ్యగా కాజల్ ఎంతో చురుకైన పాత్రని చాలా చలాకీ గా పోషించి మంచి మార్కులు కొట్టేసింది .ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాక్ లో వసుగా రిచా బాగా నటించింది.కాజల్ బావగా ప్రత్యేక పాత్ర చేసిన నారా రోహిత్ క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా చేసాడు.ఈ కాలంలోనూ కాజల్ ని ప్రేమిస్తున్నానంటూ- నారా రోహిత్ 'సత్తెకాలపు' ప్రేమలేఖలు రాయడం బాగులేదు. కాసేఫైనా ప్లాటినం ప్రణీత్ గా యం.యస్.నారాయణ నవ్వించాడు. ఇతర పాత్రల్లో జయసుధ,చంద్రమోహన్,శ్రీనివాస్ రెడ్డి,రవి ప్రకాష్ ,చిత్రం శ్రీను,మాస్టర్ భరత్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మొహమాటానికి ఈ సినిమా చేసినట్లు అర్ధమవుతుంది. పాటలు అతని మార్క్ తో లేవు."గుస గుసలాడుతోంది","కాటుక కళ్ళు" పాటలు గుడ్డిలో మెల్ల. రీరికార్డింగ్ బాగుంది. విజయ్ .కే.చక్రవర్తి ఫోటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ చిరాకు పుట్టించాయి-రాజేష్
Monday, December 17, 2012
నిజాయతీగా శ్రమిస్తే నిలదోక్కుకోవచ్చు:జాక్వెలిన్
Friday, December 14, 2012
'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్ర సమీక్ష
'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్ర సమీక్ష 3/5
వరుణ్-నిత్య చిన్ననాటి స్నేహితులు.వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఎన్నో సందర్భాల్లో వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తు తుంటాయి.కొన్నాళ్ళ పాటు దూరంగా వున్నా , వారు మళ్ళీదగ్గరవుతుంటారు.వరుణ్ తన కుటుంబం కోసం తన కెరీర్ ని మలుచుకునే సందర్భంలో వరుణ్-నిత్య ల మధ్య వచ్చిన విభేదాలు తారా స్థాయికి చేరుకుంటాయి.చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాయించుకున్న వరుణ్ నిత్య ని కలవాలని ...తిరిగి ఆమె ప్రేమను పొందాలని ప్రయత్నిస్తాడు.అప్పటికే సోషల్ వర్కర్ గా మారిన నిత్య అతన్ని తిరస్కరిస్తుంది.దాంతో వేరే అమ్మాయి తో వరుణ్ పెళ్ళికి అంగీకరిస్తాడు.అది తెలిసిన నిత్యకు తను చేసిన తప్పు ఏమిటో అర్ధమవుతుంది.ఒకరినొకరు వదులుకోలేక వరుణ్-నిత్య లు పడ్డ మానసిక సంఘర్షణ కు ముగింపు ఏమిటనేది సినిమాలో చూడాలి....
మణిరత్నం వంటి దర్శకుల తర్వాత వచ్చిన దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకత ను సంతరించుకున్న దర్శకుల్లో గౌతం మీనన్ ఒకరు. అతని చిత్రాలు రొటీన్ కధనం తో కాకుండా...పాత్రల ఆత్మ కధలా ప్రేక్షకుల మనసులకు దగ్గరవుతుంటాయి.సున్నితంగా ..సునిశితంగా చెప్పడం అతనిలో విశేషం. .ఇందులో వరుణ్-నిత్య అనే రెండు పాత్రల ప్రేమ పరిణామ క్రమం ఎంతో హృద్యం గా చూపించారు. అసహమైన నాటకీయతకు తావు లేకుండా వారి స్నేహం...ప్రేమ...కలహాలు...ఎడబాటు...కల యికలను విపులంగా, సహజంగా చూపుతూ కధను నడిపించారు.అయితే ఈ క్రమంలో సినిమాలో చాలా చోట్ల నడక నెమ్మదించి...సాగదీసిన ఫీలింగ్ తో ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సన్నివేశంలో పది నిముషాల పాటు లాంగ్ షాట్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు.క్లైమాక్స్ కూడా సుదీర్గంగా వుంది...అయినా బలమైన సన్నివేశం కావడంతో దాన్ని సహించారు. సినిమా ప్రారంభంలో ఒకేసారి వరసగా కృష్ణుడు,నానిలఫై రెండుపాటలు పెట్టడం ఎందుకో అర్ధం కాదు. 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' తరహా లోనే ఇందులో, హీరో హీరోయిన్లను చిన్న వయసునుండి చూపడంలో విజయవంతం అయ్యారు. రవిప్రకాష్ పెళ్లి సంబంధం కేన్సిల్ తర్వాత, వారి ఇంట్లో సన్నివేశం మనసుని తాకుతుంది. ప్రేమ విఫలమైన నిత్య సోషల్ వర్కర్ గా మారడం బాగుంది. ప్రేమికులు ఇష్టపడే సన్నివేశాలు ఇందులో బాగానే వున్నాయి. కాస్త క్లాస్ టచ్ వున్న చిత్రాలు చూడగలిగే యువతకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.
వరుణ్ గా నాని అ పాత్రని చాలా బాగా చేసాడు.ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎంతగానో ఆకట్టుకున్నాడు.నిత్య గా సమంత అన్నివిధాలా రాణించింది. వివిధ వయసులను ప్రతిబింబిస్తూ, తనలోని ప్రతిభావంతురాలైన నటిని ప్రేక్షకుల ముందుంచింది. నాని ఫ్రెండ్ గా కృష్ణుడు పాత్ర కొంత రిలీఫ్ నిచ్చింది. రవిప్రకాష్, రవి రాఘవేంద్ర,వివేక్ పాథక్ ,అనుపమా కుమార్ ఇతర పాత్రలు పోషించారు.హీరో జీవా ఒకసారి తళుక్కున కనిపించడం ప్రేక్షకులకు బోనస్ . చాలా కాలం తర్వాత ఈ ప్రేమ కదా చిత్రంలో ఇళయ రాజా సంగీతం ప్రత్యేకతను సంతరించుకుంది.'ఏది ఏది కుదురేది', 'లాయి లాయి హాయి','ఇంతకాలం కోరుకున్న' వంటి చాలా బాగున్న పాటలు ఇందులో వున్నాయి .దర్శకుడి అభిరుచి మేరకు సందర్భానుసారం అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది. గేయరచయితగా అనంత శ్రీరామ్ మరోసారి ఈ చిత్రాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.మసాలా రచయితగా పేరున్న కోనవెంకట్ కు ఈ చిత్రం నిజంగా కత్తిమీద సామే...ఐనా అతను న్యాయం చెయ్యగలిగాడు. -రాజేష్
Thursday, December 13, 2012
ప్రపంచ శృంగార నాయిక ప్రియాంక చోప్రా
Tuesday, December 11, 2012
విశ్వరూపుడు కమల్ తో గోచీ కట్టించానా!
Thursday, December 6, 2012
'ది టేస్ట్ ఆఫ్ మనీ' పుస్తకావిష్కరణ
అంతర్జాతీయ సినిమాకు కొన్ని ప్రమాణాలుంటాయనీ, మనకి పాటలు, డాన్సులు, ఫైట్లు, మెలోడ్రామాలు కావాలనీ, అలాంటప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మన సినిమాలకి ఎలా పేరొస్తుందని సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ ఎడిషన్ ఎడిటర్ జగన్.. కాన్స్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించిన 15 సినిమాల కథలతో రాసిన 'ది టేస్ట్ ఆఫ్ మనీ' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు అందజేశారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ఈ కార్యక్రమం జరిగింది. కాన్స్ సినిమా మీద రాసినట్లే భారతీయ సినిమా గురించి కూడా జగన్ పుస్తకం రాయాలని కె.శ్రీనివాస్ ఆకాంక్షించారు. కొన్ని ప్రమాణాలు పాటిస్తే, సరిగ్గా చెప్పగలిగితే చిన్న కథతోటే మన సినిమాని కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చనే సంగతిని ఈ పుస్తకంలో తెలియజేశానని రచయిత జగన్ చెప్పారు. ఈ పుస్తకాన్ని తన మాతృమూర్తికి అంకితమిచ్చారు. ఆమెను అక్కినేని చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్ గ్రూప్స్ అధినేత ఎ.రమేశ్ ప్రసాద్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, నటుడు, రచయిత తనికెళ్ల భరణి, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
వేదాంతం సత్యనారాయణ శర్మ సంస్మరణ
ో డిసెంబర్ 6న త్యాగరాయగాన సభలో ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ సంస్మరణ సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన డా.కె.వి.కృష్ణకుమారి మాట్లాడుతూ- వేదాంతం కూచిపూడి ప్రాశస్త్యానికి కృషి చేసిన మహోన్నతుడని పేర్కొన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు డా.శోభానాయుడు మాట్లాడుతూ- భామాకలాపంలో సత్యభామగా, విప్రనారాయణలో దేవదేవిగా, ఉషగా స్త్రీ పాత్రలో వయ్యారాలు ఒలకబోస్తూ తన అభినయంతో అందర్నీ మైమరపించే వారన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణ మాట్లాడుతూ- భామాకలాపం ఆయన కోసమే రాసినట్లుగా ఉందన్నారు. రంగ స్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ- వేదాంతం కూచిపూడి నాట్యానికి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారన్నారు. శర్మ పాత్రధారణ అవయవ సౌష్టవంతో, అభినయంతో స్త్రీ లోకాన్నే మరిపించేదని అన్నారు. నాట్యాచారిణి మద్దాళి ఉషాగాయత్రి, గజల్ శ్రీనివాస్, డా"వి.ప్రకాశరావు, వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Wednesday, December 5, 2012
నేను బాగుండడం ఇష్టం లేదా?:లక్ష్మీరాయ్
Saturday, December 1, 2012
'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్ర సమీక్ష
'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్ర సమీక్ష 3.5/5
బి.టెక్ చేసిన సురభి నాటక సంస్థ కళాకారుడు బాబు ఈ రంగం లో ఏ ఉపయోగం ఉండదని ,ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటాడు.తాత సురభి సుబ్రహ్మణ్యం చెప్పినా వినడు.ఆ బాధతో అతను చని పోతాడు.తాత కోరిక ప్రకారం అస్థికలు అతని స్వగ్రామం బళ్ళారి చెరువులో నిమజ్జనం చేసి,అతను రాసిన 'కృష్ణం వందే జగద్గురుమ్' నాటకాన్ని అక్కడ ప్రదర్శించి, అమెరికా వెళ్లి పోవాలని బాబు తన నాటక బృందం తో వెళ్తాడు.అక్కడ అక్రమ ల్యాండ్ మైనింగ్ చేస్తూ స్వంత సామ్రాజ్యాన్ని నడుపుతున్న రెడ్డప్ప మనుషుల దౌర్జన్యానికి గురవుతారు.వారిని ప్రతిఘటిస్తున్న బాబు కు -రెడ్డప్ప అక్రమాలను బయటపెట్టేందుకు ఆధారాలు సేకరిస్తున్న మీడియా ప్రతినిధి దేవిక కలుస్తుంది.అనాధ అయిన బాబుకు, అనుకోని విధంగా తన కుటుంబ విషయాలు తెలుస్తాయి.తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం లో బాబు ఎంతవరకు సఫమయ్యాడనేది సినిమాలో చూడాలి...
చిత్త శుద్ధి ...డొక్క శుద్ధి వున్న దర్శకులు మన తెలుగు సినిమా రంగంలో అతి తక్కువగా వుండటం వల్లనే మన చిత్రాల స్థాయి దయనీయంగా ఉంటుందనేది విచారించదగ్గ వాత్సవం. ఇటీవల వికసిస్తున్న కొత్తతరం మంచి దర్శకుల్లో రాధా కృష్ణ ఒకరు.సమాజం గురించీ ...మనిషి గురించీ అధ్యయనం చేసి, తాత్వికత మేళవించి సినిమాలు చేసి -ప్రేక్షకులను మెప్పించడం తేలికైన విషయం కాదు.'గమ్యం','వేదం' అందించి అభినందనలు అందుకున్న రాధాకృష్ణ ,మన కోసం మనం కాదు ...మంది కోసం బతకడం లోనే జీవిత సాఫల్యం వుందని చెబుతూ-ప్రేక్షకులను స్పందింప జేస్తూ 'కృష్ణం వందే జగద్గురుమ్'ను మంచి అనుభూతి మిగిల్చే సినిమాగా మలిచారు.రెగ్యులర్ సినిమాలో వుండే ఐటమ్ సాంగ్స్,ఫైట్స్ ,ట్విస్ట్ లు ఉన్నప్పటికీ 'ఆత్మ'ని కోల్పోకుండా సినిమాని నడిపించడమే ఈ దర్శకుడిలో గొప్పదనం.సురభి నాటక సమాజాన్ని సినిమాలో ప్రముఖంగా చూపడం అభినందనీయం. సినిమా మొదటి భాగం చూసి ...అద్భుతమైన తెలుగు సినిమా చూసిన ఆనందాన్ని పొందే ప్రేక్షకుడు- రెండవ భాగం లో హీరో ఫ్లాష్ బ్యాక్ ద్వారా మేనమామ ఫై పగ సాధిస్తానంటూ తిరగడం ఇబ్బందినే కలిగిస్తుంది.అలాగే ఆంధ్ర-కర్నాటక సరిహద్దు బళ్లారి లో కధ జరగడం తో- సహజత్వం కోసం పెట్టిన కన్నడ సంభాషణలు సగటు ప్రేక్షకుడుకి కొరుకుడు పడవు.అయితే, ఒక మంచి సినిమాలో ఇటువంటివి ప్రేక్షకుడు పట్టించుకోడు.దర్శకుడి పనితనంతో పాటు ఈ చిత్రంలో సిరివెన్నెల సాహిత్యం, సాయి మాధవ్ సంభాషణలు,జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ,మణి శర్మ సంగీతం హైలైట్స్ .సినిమాలోప్రధానంగా తీసుకున్న అక్రమ మైనింగ్ అంశం ... సిరివెన్నెల' పాట 'జరుగుతున్నది జగన్నాటకం' ప్రస్తుత అరాచకీయాన్ని కళ్ళకు కడతాయి.దర్శకుడి మార్గ దర్సకత్వంలో సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు చిత్రంలో ఎన్నోసందర్భాల్లో 'ఓహో' అనిపిస్తాయి...జీవిత సారాన్ని కురిపిస్తాయి.ఈ మధ్య రొటీన్ ట్యూన్స్ తో తెర మరుగై పోతున్న మణి శర్మ మరో సారి ఈ చిత్రం లో తన విశ్వరూపాన్ని చూపించాడు.సందర్భోచితంగా పాటలూ, సినిమాకు ప్రాణం పోసిన అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించాడు. కధకు తగ్గ దృశ్య వైభవాన్ని జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీతో అందించాడు.
హీరో గా చాలా చిత్రాలు చేసినా, తన బాడీ లాంగ్వేజ్ కి పక్కాగా సూట్ అయ్యే బి.టెక్ బాబు పాత్రలో రాణించాడు దగ్గుబాటి రానా. ఎక్స్ ప్రెషన్స్ లోనూ అభివృద్ధి సాధించాడు. అందంతో పాటు అభినయం లోనూ దేవికగా నయన తార రాణించింది.ఆమె తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సురభి సుబ్రహ్మణ్యం గా కోట,రెడ్డప్ప మనుషులు నాలుక తెగ్గోసే వీర్రాజుగా రఘుబాబు, రంగస్థల పండిట్ (రంపం)గా బ్రహ్మానందం, రత్నప్రభ గా హేమ, మట్టిరాజుగా ఎల్బీ శ్రీరామ్, రెడ్డప్పగా మిలింద్ గునాజి, చక్రవర్తిగా మురళీ శర్మ,టాక్సీ డ్రైవర్ టిప్పు గా పోసాని ,సత్యం రాజేష్,రవి ప్రకాష్,రూపా దేవి, మరి కొందరు సురభి కళాకారులు ఈ చిత్రం లోని పాత్రలను పండించారు.'బళ్ళారి బావ'పాటలో సమీరా రెడ్డి సరసన , వెంకటేష్ కాసేపు కనిపించి ఆనందింప జేశాడు.ఇందులో ఓ ఇంగ్లీష్ తరహా డాన్స్ కూడా బోనస్. -రాజేష్
Thursday, November 29, 2012
శ్వేతామీనన్ మాతృత్వ వ్యాపారం
‘చేపలమ్మా.. చేపలు’ పాట నెట్లో హల్చల్
గంగ్నమ్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు ‘చేపలమ్మా.. చేపలు’ పాట నెట్లో హల్చల్ చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన పాకిస్థానీ మహమూద్ షాహిద్ నజీర్(31) పాడిన ఈ పాటను యూట్యూబ్‌లో ఇప్పటికే 36 లక్షల మంది వీక్షించారు. లండన్‌లోని అప్టన్ పార్క్ క్వీన్స్ మార్కెట్లో చేపలు అమ్మే నజీర్ వినియోగదారులను అకర్షించడానికి.. ‘కమాన్ లేడీస్.. కమాన్ లేడీస్.. హావ్ ఎ లుక్.. వన్ పౌండ్ ఫిష్.. వెరీవెరీ గుడ్.. వెరీవెరీ చీప్’ అంటూ పాడిన ఈ పాట అందరినీ ఎంతో ఆకర్షిస్తోందని, ఈ క్రిస్మస్కు నంబర్ వన్ పాటగా నిలుస్తుందని ‘సన్’ పత్రిక తెలిపింది. యూట్యూబ్‌లో నజీర్ ఉంచిన ఈ పాట ఇప్పుడు అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా వార్నర్ మ్యూజిక్ సంస్థ దృష్టి అతడిపై పడేలా చేసింది. ఈ పాట కూడా దక్షిణ కొరియా పాప్ గాయకుడు సై పాడిన గంగ్నమ్ తరహాలో పెద్ద హిట్ అవడం ఖాయమని వార్నర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు అలేషా డిక్సన్, యూఎస్ బాయ్స్ బ్యాండ్ మైండ్‌లెస్ బిహేవియర్, రియో ఫెర్నినాండ్ వంటివారు ఈ పాటకు ఫిదా అయిపోయారు. క్వీన్స్ మార్కెట్లో నజీర్ ఈ పాట పాడటం మొదలుపెడితే చాలు.. జనం గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చేస్తారట. కొందరైతే.. తన పాట కోసమే.. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఐరోపా నుంచి వస్తున్నారని నజీర్ చెప్పాడు. సంపాదన కోసం పాకిస్థాన్‌కు చెందిన నజీర్ ఏడాది క్రితం లండన్‌కు వచ్చాడు. ఆయన భార్య, నలుగురు పిల్లలూ పాకిస్థాన్‌లోనే ఉంటారు. ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే.. నజీర్ యజమాని వినియోగదారులను ఆకర్షించడానికి బిగ్గరగా అరవమని చెప్పాడు. అయితే, అలా అరవడం ఇష్టం లేని నజీర్.. ఈ పాటను పాడటం మొదలెట్టారు. వినియోగదారులకు ఈ పాట నచ్చడంతో.. నువ్వు పాప్ స్టార్ అవ్వాలి. నువ్వు ఎక్స్‌ఫ్యాక్టర్ షోలో పాల్గొనాలి అని వారు చెప్పారు. అయితే, ఎక్స్‌ఫ్యాక్టర్ షోలో ఇతడి పాటను తిరస్కరించారు. అయితేనేం.. ఇప్పుడు అంతకు మించి పెద్ద పాప్ స్టార్‌గా నజీర్ మారిపోయాడు. ఇప్పుడు అతడితో ఒప్పందం కుదుర్చుకున్న వార్నర్ మ్యూజిక్.. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన గీతం కోసం ఎక్స్‌ఫ్యాక్టర్ విజేత పాటకు పోటీగా నజీర్ ‘వన్ పౌండ్ ఫిష్’ పాటను దించనుంది.
Sunday, November 25, 2012
'రొటీన్ లవ్ స్టోరీ' చిత్ర సమీక్ష 3/5
ఇంజనీరింగ్ విద్యార్ధి సంజు తన్వి ప్రేమలో పడతాడు .తన ప్రేమను చెప్పిన సంజు ని కనీసం 6 నెలలపాటు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం కోరుతుంది తన్వి .ఆ తర్వాత ఒక విహార యాత్రలో జరిగిన సంఘటనలతో ఆమె సంజు పట్ల సుముఖంగా మారుతుంది.అయితే సంజు తొందర పాటుని వ్యతిరేకిస్తుంది.సంజు కూడా ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా పెళ్లి చేసుకోవడం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో గుర్తి స్తాడు.తన తొందర పాటుకు తన్విని క్షమాపణ కోరతాడు.క్రమంగా తన్వి సంజు తో ప్రేమలో పడుతుంది.అయితే,తన్వితో దగ్గరగా ఉంటూ' ఒకరిని ఒకరు సరిగా అర్ధం చేసుకోవడం' తప్పనిసరిగా భావిస్తాడు సంజు .అతని మిత్రులు- దానికి అనుగుణంగా తన్వి ఇంట్లోవారిని బయటికి వెళ్ళేలా చేసి, సంజు-తన్వి కొన్నాళ్ళు కలిసి ఉండేలా ఏర్పాటు చేస్తారు.అయితే,అక్కడ కూడా వారి మధ్య గొడవలు తలెత్తుతాయి.ఈ కలహాల జంట ఆతర్వాతనైనా కలిసారా?అన్నది సినిమాలో చూడాలి...
'యల్.బి.డబ్ల్యు' తో దర్శకుడిగా మంచి పేరు సంపాయించిన ప్రవీణ్ సత్తారు చేసిన రెండవ చిత్రం కనుక, సహజం గానే ఈ చిత్రం ఫై మంచి అభిప్రాయం తోనే ప్రేక్షకులు వున్నారు.అందుకనే, ఓ పెద్ద సినిమా తో పోటీ పడి మరీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించ గలిగారు .అందుకు వీరు చేసిన ప్రచారం కూడా తోడయ్యింది.చిన్న చిత్రాల్లో ఈ స్థాయి పబ్లిసిటీ చేసిన చిత్రం ఈ మధ్య కాలం లో మరొకటి లేదు.'బూతు' యూత్ చిత్రాలు దండయాత్ర చేస్తూ, ప్రేక్షకుల అభిరుచి స్థాయిని దిగ జారుస్తూ,డబ్బు చేసుకుంటున్నఈ రోజుల్లో- అడ్డదారి ఆర్భాటాల జోలికి పోకుండా,కుటుంబంతో హాయిగా చూడదగ్గ చిత్రాన్ని అందించిన ప్రవీణ్ సత్తారు ధైర్యాన్ని మెచ్చుకోవాలి...అభినందించాలి. దర్శకుడు ఎక్కువ హడావుడి లేకుండా కేవలం ఒక యువ జంట ప్రధానం గా ....వారి మధ్య కీచులాటలు, అలకలు, అల్లర్లు, ఆవేశాలు, ముద్దులు, ముచ్చట్లు .... నేటి యువతరం మనోభావాలకు అద్దంలా ... 'రొటీన్ లవ్ స్టొరీ'నే భిన్నంగా చూపించడానికి ప్రయత్నించాడు ...చక్కగా మలిచాడు.'ఒకరిని నొకరు అర్ధం చేసుకోవడం కోసం' పాశ్చాత్య దేశాల్లో అనుసరించే 'డేటింగ్' విధానం లోనూ ఉపయోగాలున్నాయంటూ తెలివిగా ఇందులో చూపించాడు.కాశ్మీర్లో చిత్రీకరించిన సన్నివేశాలు కన్నుల పండువగా వున్నాయి.ఆడవాళ్ళ మనస్తత్వాన్ని గురించి సంజయ్ రెడ్డి చేసే గీతోపదేశం సన్నివేశం కూడా చాలా బాగుంది. అయితే, ఫార్ములా తో పనిలేకుండా సినిమా తీస్తున్నా...ఆసక్తికరంగా రూపొందించడం మాత్రం అవసరం అని దర్శకుడు గుర్తించాలి.సన్నివేశ రూపకల్పన లో దర్శకుడు ఇంకా పరిణితి సాధించాలి.సహజత్వం అనుకుంటూ కొన్ని చోట్ల సినిమా మరీ స్లో గా సాగింది...సంభాషణల్లో స్పష్టత కూడా కొరవడింది.అలాగే మాటల్లో తెలుగు శాతం బాగా తగ్గి పోయి ఇంగ్లీష్ ఎక్కువగా వినిపించింది.ఎమ్మెస్,హేమ, రాళ్ళపల్లి ఫై చేసిన కామెడీ 'జంగల్ మే మంగల్' సినిమాకి అతకలేదు.అలాగే తన్వి ప్రేమించేస్తోందని భ్రమించే తాగు బోతు రమేష్ పాత్ర కూడా అంతంత మాత్రం గానే వుంది.తన్విప్రేమ ను ఆశించే స్టూడెంట్ గ్యాంగ్ కామెడి కొంతవరకూ పర్వాలేదు.చివరికి హీరోగా మారిన నిర్మాతగా వెన్నెల కిషోర్ పాత్ర బాగుంది.
సంజు గా స్టూడెంట్ పాత్రలో సందీప్ ఆకార పరంగా అంత సరిపోకపోయినా,నటన లో మంచి మార్కులు సంపాయించాడు.అక్కడక్కడా పెద్ద హీరోలను అనుకరిస్తూ చెప్పినా... మొత్తం మీద 'డైలాగ్ మాడ్యు లేషన్' సందీప్ కి పెద్ద ఎసెట్. తన్వి గా అందం,అభినయం కలిసిన నటి రెజీనా చాలా బాగా చేసింది. స్నిగ్ద మిత్ర బృందం కూడా బాగా చేసారు. చంద్రమోహన్, కవిత ,ఝాన్సీ ఇతర పాత్రలు పోషించారు.దర్శకుడు రాసిన సంభాషణలు బాగున్నాయి.
మిక్కీ .జే .మేయర్ పాటల్లో- 'నా మనసు ఫై', ' నిన్నే చూస్తున్నా' అలరిస్తాయి. భార్గవ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది,ధర్మేంద్ర ఎడిటింగ్ బాగుంది. -రాజేష్
Friday, November 23, 2012
'డమరుకం' చిత్ర సమీక్ష
'డమరుకం' చిత్ర సమీక్ష 2.5/5
దేవతలు,రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం లో అందరూ మరణించినా అంధకాసురుడు అనే రాక్షసుడు మాత్రం ప్రాణాలతో మిగిలి ఉంటాడు . పంచగ్రహ కూటమి రోజున పుట్టిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని, వధిస్తే లోకాన్ని శాసించే శక్తి మంతుడవుతానని తెలిసి ...మహేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.అందుకు అడ్డు పడనని శివుడి నుండి మాట తీసుకుంటాడు.అయితే ,శివ భక్తుడిగా ఉంటూ,తన వారినందరినీ పోగొట్టుకుని శివ ద్వేషి గా మారిన మల్లికార్జున్ ని మహేశ్వరి ప్రేమిస్తుంది.మహేశ్వరి మనసు దోచుకోవడానికి అంధకాసురుడు మహేశ్వరి బావ రూపం లో వచ్చి, మల్లికార్జున్ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు.పరమేశ్వరుడు వీరిలో ఎవరికి సహకరిస్తాడు?చివరికి ఎవరు గెలుస్తారు?అనేది సినిమాలో చూడాలి...
సోషియో ఫాంటసీ కధాంశం తో, గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చిన చిత్రాల కోవలో వచ్చిన మరో చిత్రం ఈ 'డమరుకం' . ఈ మధ్యనే వచ్చిన' శక్తి', 'భద్రీనాద్' పెద్ద ఫ్లాప్ అయ్యాయి.వాటంత హింసించక పోయినా- 'డమరుకం' కూడా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన చిత్రమే. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచిపేరు సంపాయించిన శ్రీనివాస్ రెడ్డి తన స్టైల్ కి పూర్తి భిన్నమైన కధతో, భారీ బడ్జెట్ తో చేసిన చిత్రం ఇది.వచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను శ్రీనివాస్ రెడ్డి సద్వినియోగ పర్చుకోలేకపోయాడనే చెప్పాలి. ఇటీవల భారీ చిత్రాలు చేసిన మన దర్శకులు చాలా మంది... నిర్మాతలను,హీరోలను మేనేజ్ చేసినంత బాగా, సబ్జెక్ట్ ని చెయ్యలేక పోతున్నారు.అందుకే పరిశ్రమ భారీ పరాజయాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.దేవుళ్ళతో కూడిన సోషియో ఫాంటసీ అనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో అటువంటిది ఏదీ కనబడదు. కనీసపు రీజనింగ్ లేకుండా,పరమ రొటీన్ గా , కేవలం గ్రాఫిక్స్ మాయాజాలం ఫై ఆధార పడి ఈ చిత్రం చేసారు.నిజానికి, ఇందులో చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి .అయితే, బలమైన స్క్రీన్ ప్లే ఉన్నప్పుడే గ్రాఫిక్స్ సినిమాకి మరింత బలాన్నిస్తాయనే విషయం వీరు పట్టించుకోలేదు.అందుకే శివుడు సాంబ య్యగా భూలోకంలో తిరిగేస్తూ...బ్రహ్మానందం వంటి చిన్న పాత్రకు కూడా ప్రత్యక్షమైపోయి అన్నివిషయాలూ చెప్పేస్తుంటాడు.మల్లికార్జున్, మహేశ్వరి లకూ దైవానుగ్రహం వుందని చెప్తారు తప్ప ,అవి వారికి ఉపయోగ పడటం కనిపించదు.అంధకాసురుడు నిజంగా బలవంతుడా...కాదా అన్నంత అనుమానాస్పదం గా ప్రవర్తిస్తుంటాడు.క్లైమాక్స్ లో విలన్ దెబ్బకి హీరో ఆకాశం లోకి వెళ్లి అక్కడ శివ సాక్షాత్కారం పొంది కిందికి రావడం వంటివి తమాషాగా వున్నాయి.విలన్ శివభక్తుడు...హీరో శివ ద్వేషి కావడం ప్రత్యేకతను సంతరించుకున్నప్పటికీ, కధా క్రమంలో దాన్ని నిలుపుకోలేకపోయారు. నంది,బ్రహ్మ రాక్షసుడు వంటి గ్రాఫిక్స్ పేలవంగా వుంటే..అతి ముఖ్యమైన క్లైమాక్స్ లో డి .టి .యస్ సౌండ్ మిస్ కావడం పెద్ద మైనస్ .కామెడి లో సిద్ధహస్తుడైన శ్రీనివాస్ రెడ్డి ఇందులో కామెడి సన్నివేశాలను కొత్తగా చూపించలేక పోయాడు.
కధా నాయకుడిగా నాగార్జున నటన,దేవిశ్రీ ప్రసాద్ సంగీతం,చోటా ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో హైలై ట్స్ .సినిమా అంతా భారీ నిర్మాణ విలువలు కనిపిస్తాయి.నాగార్జున సిక్స్ పాక్ బాడీ తో చాలా హుషారుగా తన పాత్రను పోషించారు.కొత్తదనం లేని ప్రధాన పాత్రను అనూష్క అందం గా పోషించింది.'బొమ్మాళీ ' అంటూతన గొంతుతో 'అరుందతి' లోఅలజడి సృష్టించిన రవిశంకర్ ఇందులో అంధకాసురుడుగా తననటనతో,గొంతుతో పాత్రకు జీవం పోసాడు. ప్రకాష్ రాజ్ ను శివుడుగా చూపడంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.అనుష్క బావగా గణేష్ వెంకట్రామన్ బాగాచేసాడు.ఇతర పాత్రల్లో జీవా,బ్రహ్మానందం,కృష్ణ భగవాన్,రఘుబాబు,ఎమ్మెస్ నారాయణ,దేవన్, ప్రగతి, అభినయ నటించారు.శ్రీనివాస్ రెడ్డి సంభాషణలు చాలా సన్నివేశాల్లో బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ప్రేక్షకులను అలరించాయి.నేపధ్య సంగీతం కూడా బాగుంది.'కన్యా కుమారీ' పాట హుషారుగా ...'ప్రాణమా' అందంగా లలితంగా...'శివ శివ శంకర' భక్తి రసాత్మకంగా భారీగా చిత్రీకరించారు.చార్మి ఫై చేసిన 'గరం గరం చాయ్' మంచి మసాలా పాట .మొత్తం సినిమాని చోటా .కే.నాయుడు కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. గౌతం రాజు ఎడిటింగ్ గొప్పతనం కూడా అంతటా కనిపిస్తుంది. -రాజేష్
Wednesday, November 21, 2012
గోవాలో సినిమా పండుగ ప్రారంభం
గోవా నగరం అందంగా ముస్తాబైంది. ఈ సందడంతా నేడు ప్రారంభం అవుతున్న 43వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల కోసమే. ఈ నెల 30వరకు జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు భారతీయ భాషలకు చెందిన 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఆస్కార్ అవార్డ్గ్రహీత ఆంగ్ లీ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘లైఫ్ ఆఫ్ పై’ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ అతిథిగా పాల్గొనబోతున్నారు. ముగింపు చిత్రంగా మీరానాయర్ రూపొందించిన ‘ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
కాగా, ఇండియన్ పనోరమా విభాగంలో ఒక్క తెలుగు చిత్రం కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. దాదాపు వంద, ఆపై చిలుకు సినిమాలు నిర్మితమవుతున్న టాలీవుడ్ నుంచి కేవలం తొమ్మిదే సినిమాలు కమిటీ ముందుకు వెళ్లాయి. వాటిలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, మా ఊరి జోగిని, మల్లెల తీరం, ఓంకారం, వీరంగం’ లాంటి చిత్రాలు ఉన్నాయి. అయితే ఒక్క చిత్రం కూడా ప్రదర్శనకు అర్హత పొందలేకపోయింది. గత ఏడాది తెలుగు పరిశ్రమ నుంచి ‘విరోధి’ చిత్రం ప్రదర్శితమైంది. ఈ ఏడాది కనీసం ఆ ఊరట కూడా లేదు. ఇక ఇతర భాషల్లో విషయానికి వస్తే... మలయాళ పరిశ్రమ నుంచి దాదాపు 30 సినిమాలు వెళ్లగా, వాటిలో అయిదు సినిమాలు ప్రదర్శనకు అర్హత పొందడం విశేషం. ఇంకా ఒక తమిళ చిత్రం, బెంగాలీవి మూడు చిత్రాలు, భోజ్‌పురి నుంచి ఒక చిత్రం, ఒక కొంకణి చిత్రం, ఓ అస్సామీ చిత్రం, బ్యారీ భాషకు చెందిన సినిమా... ఇలా పలు భాషలకు చెందిన చిత్రాలు ప్రదర్శితం కాబోతున్నాయి.
మన తెలుగు పరిశ్రమతో పోల్చితే ఈ భాషలన్నింటిలోనూ తక్కువ సంఖ్యలో సినిమాలు రూపొందుతాయి. అయినా చిత్రోత్సవాల్లో పోటీపడటం అభినందించదగ్గ విషయం. తెలుగు పరిశ్రమ నుంచి సినిమాలు ప్రదర్శనలకు ఎంపిక కాకపోవడం అనేది ఆలోచించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా ఓ అవార్డును ప్రవేశపెట్టారు. ప్రత్యేక జ్యూరీ ఎంపిక చేసే చిత్రానికి ‘సెంటినరీ ఫిల్మ్ అవార్డ్’ను అందజేస్తారు. ఈ అవార్డులో భాగంగా 10 లక్షల రూపాయలు నగదు బహుమతి అందజేయబోతున్నారు.
'ప్రయోగం' దర్శకుడు భానుప్రకాష్ కు సత్కారం
'ప్రయోగం' చిత్రానికి 'తొలి చిత్ర ఉత్తమ దర్శకుడు' నంది అవార్డు పొందిన భానుప్రకాష్ కు 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వర్ రావు ఆధ్వర్యం లో రవీంద్ర భారతి లో అభినందన సత్కారం జరిగింది.సారిపల్లి కొండల రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నటులు రంగనాద్ మాట్లాడుతూ - సినిమాని 4 ఫ్రేముల్లో చెప్పడం ద్వారా భానుప్రకాష్ 'దర్శకావధాని' అనిపించుకున్నారు.ఈ చిత్ర నిర్మాణం లో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, తొలి చిత్రానికే నంది అవార్డ్ స్వంతం చేసుకున్నారని-అన్నారు. సాయి చంద్ మాట్లాడుతూ-అనుభవగ్యులైన పాత దర్శకులే చెయ్యలేని పని , తొలి చిత్రంలోనే భాను ప్రకాష్ చేసి చూపించాడని అన్నారు. ఆర్ .పీ.పట్నాయక్ మాట్లాడుతూ-సినిమాని 4 ఫ్రేముల్లో చూపించిన భాను, మనిషిలోని 4 రకాల స్వభావాలను చూపే చిత్రాన్ని కూడా చెయ్యాలని అన్నారు.ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ-కష్ట సాధ్యమైన ఈ చిత్రాన్ని ఎంతో శ్రమించి, పక్కా ప్రణాళికతో భాను తెరకెక్కించారని అన్నారు. డా"కే.వి.కృష్ణ కుమారి మాట్లాడుతూ-పెద్ద చిత్రాలు ప్రేక్షకులను మత్తులో ముంచుతుంటే,యువత మత్తు లోంచి బయట పడాలని చెప్పే చిత్రాన్ని నిర్మించిన భాను ప్రకాష్ ఎంతైనా అభినందనీయుడని అన్నారు.
Friday, November 16, 2012
టీవీ నంది 2011 అవార్డుల ప్రకటన
2011 సంవత్సరానికి టీవీ నంది అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల విజేతల వివరాలను సమాచార శాఖ మంత్రి డీకే అరుణ సోమవారమిక్కడ సచివాలయంలో వెల్లడించారు. ఈ అవార్డుల ఎంపిక కోసం 12 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. వారు విజేతల వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
అవార్డులు పొందిన టీవీ సీరియళ్లు ఇవే..
ఉత్తమ టెలి చిత్రం: నాభూమి(దూరదర్శన్), ద్వితీయ ఉత్తమ టెలి చిత్రం: జోగిని(దూరదర్శన్); ఉత్తమ టీవీ ఫీచర్: అదుర్స్(ఈటీవీ), ద్వితీయ ఉత్తమ టెలి ఫీచర్: బ్రహ్మమొక్కటే(ఎస్వీబీసీ); ఉత్తమ మెగా సీరియల్: నయన(ఎస్వీబీసీ), ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్: పంచతంత్రం(ఈటీవీ); ఉత్తమ టీవీ డెయిలీ సీరియల్: పసుపు కుంకుమ(జీ టీవీ), ద్వితీయ ఉత్తమ డెయిలీ సీరియల్: మమతల కోవెల(జెమినీ టీవీ); ఉత్తమ దర్శకుడు: జి.అనిల్ కుమార్(మనసు మమత); ఉత్తమ నటుడు(అచ్యుత్ అవార్డు): శుభలేఖ సుధాకర్, ఉత్తమ నటి: ఆర్.పల్లవి(భార్యామణి); ఉత్తమ సహాయ నటుడు: కె.జయరాం(ఆడదే ఆధారం), ఉత్తమ సహాయ నటి: మధుమణి(జోగిని); ఉత్తమ హాస్య నటుడు: రామ్‌జగన్(చూడు చూడు తమాషా), ఉత్తమ హాస్యనటి: శ్రీలక్ష్మి(నేనే మీ అల్లుడు); ఉత్తమ విలన్: లావణ్య లహరి(అంతఃపురం); ఉత్తమ బాల నటుడు: మాస్టర్ నరేష్ చంద్ర(పసుపు కుంకుమ), ఉత్తమ బాల నటి: బేబీ అనూష, బేబీ దివిజ(అన్నా చెల్లెలు); ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: పి.భవాని ప్రసాద్(ధరణి), ఉత్తమ కథా రచయిత: దివంగత సీహెచ్ సుమన్. వీటితోపాటు ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంభాషణల రచయిత, ఉత్తమ సంగీత దర్శకుడు తదితర అవార్డులు ప్రకటించారు.
స్పెషల్ జ్యూరీ అవార్డులు
శ్రీ జమ, జయవాణి(జ్ఞాపకాలు), జి.ఉమా మహేశ్వరరావు(ఓం నమః), కె.వి.రెడ్డి(కుంకుమ రేఖ), జక్కల వెంకన్న(నాలో నేను), కర్రి బాలాజీ (బంద్). ఉత్తమ న్యూస్రీడర్లుగా కె.వినోద్ కుమార్(హెచ్ఎం టీవీ), ఎస్.లక్ష్మీ కళ్యాణి(టీవీ5)లకు జ్యూరీ అవార్డులు దక్కాయి. |
నచ్చిన సినిమా చేసేందుకే ఇక్కడికొచ్చాను! -ప్రవీణ్ సత్తారు
Tuesday, November 13, 2012
మేధస్సు ఉన్నప్రేక్షకుల కోసమే ‘విశ్వరూపం’
ఆటవిక యువతిగా అనూష్క ఛాలెంజ్
Saturday, November 10, 2012
ఒబామాను బలపరచిన హాలీవుడ్
Monday, November 5, 2012
సత్యవోలు సుందర సాయి 'ఇవి అబద్ధాలు కావు' పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత సత్యవోలు సుందర సాయి రచించిన 'ఇవి అబద్ధాలు కావు' పుస్తకాన్నిరవీంద్ర భారతి లో 'కిన్నెర ఆర్ట్ థియేటర్స్' ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా దారు కే.వి.రమణా చారి ఆవిష్కరించారు.అధికారి ప్రజల ఆశల రూపం గా వుండాలని , స్వార్ధం,అహంకారం,విభజన సూత్రం పాటించే వారైతే ప్రజలకు సేవ చెయ్యలేరని,అదే సుందర సాయి రచనల్లో కనిపిస్తుందని -రమణా చారి అన్నారు. డా "యన్.గోపి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో 'యస్.వి.బీ.సి' సి.ఈ.ఓ పాలకుర్తిమదుసూధన రావు, 'దూర దర్శన్ -సప్తగిరి' సంచాలకులు మల్లాది శైలజ సుమన్, రచయితలు జీడిగుంట రామచంద్ర మూర్తి ,ఓలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.
Thursday, November 1, 2012
'నాట్స్' సంబరాలకు సన్నాహాలు
శాస్త్రీయతను మించిన లాలిత్యం!
Friday, October 26, 2012
పరభాషా సీరియళ్లను నియంత్రించాలి
పరభాషా సీరియళ్లను నియంత్రించాలి
| |||
Friday, October 19, 2012
Thursday, October 18, 2012
' కెమెరా మేన్ గంగతో రాంబాబు' చిత్ర సమీక్ష
' కెమెరా మేన్ గంగతో రాంబాబు' చిత్ర సమీక్ష 2.5/5
యూనివర్సల్ మీడియా పతాకం ఫై పూరి జగన్నాద్ దర్శకత్వం లో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించే వెల్డర్ రాంబాబు లో ఆవేశాన్ని గమనించిన ఓ టి.వి ఛానెల్ కెమెరా ఉమన్ గంగ అతన్ని తమ ఛానెల్ లో రిపోర్టర్ గా చేర్పిస్తుంది. రాంబాబు తన దూకుడు తో అందరి దృష్టిని ఆకట్టు కుంటాడు.నిజాన్ని నిర్భయం గా చెప్పే జర్నలిస్ట్ దశరధ రామ్ ను హత్య చేసిన మాజీ ముఖ్య మంత్రి జవహర్ నాయుడును ఎదుర్కొని, అతని రాజకీయ వారసుడు రానా ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు. తెలివిగా ఆ కేసునుండి బయటకొచ్చిన రానా రాష్ట్ర ముఖ్య మంత్రి కావాలని ప్రయత్నిస్తుంటాడు.ఇక్కడ వ్యాపారాలు చేస్తూ దోచేస్తున్న పక్క రాష్ట్రాల వారిని తరిమేసి , రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ-ప్రజల్లో తన రాజకీయ ప్రాభవం పెంచుకోవడం కోసం భావోద్వేగాలను రెచ్చగొడతాడు.అయితే,అతన్నిమీడియా ముందు నిలదీసి - అతని వాదన లోని సంకుచితత్వాన్ని ప్రజల్లో ఎండగడతాడు రాంబాబు.ఎంతో కష్ట పడి ప్రజల్లో పెంచుకుంటున్న ఇమేజ్ ని దెబ్బ తీసిన రాంబాబు ని అడ్డు తొలగించు కోవాలని రానా ప్రయత్నిస్తుంటాడు. ప్రజల సానుభూతిని పొందడానికి మరో నీచమైన పధకాన్ని వేస్తాడు. రానా వంటి దుష్ట శక్తి ని రాష్ట్ర ముఖ్య మంత్రి కాకుండా అడ్డుకోవడానికి రాంబాబు ఏం చేసాడో సినిమాలో చూడాలి...
'పోకిరి' జంట పవన్-పూరిల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఫై సహజం గానే భారీ అంచనాలు వుంటాయి.అయితే ఇది పూరీ రెగ్యులర్ గా చేసే సరదా టైప్ సినిమా కాదు. పవన్ ఆలోచనా విధానానికి అనుగుణం గా, సామాజిక చైతన్యం పెంచేలా దీన్నిరూపొందించాల్సి వుంది. ఈ తరహా సబ్జెక్ట్ ఫై అవగాహన లేని పూరి దీని ఫై మరింత ఎక్కువ కష్టపడాల్సి వుంది. అయితే, ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాద్ ప్రారంభించిన మూడు నెలలకో సినిమా స్కీం వల్ల పూరి తన చిత్రాల ఫై ఏమాత్రం శ్రద్ధ చూపలేక పోతున్నాడు.దాంతో, ఇప్పుడు వస్తున్న అతని చిత్రాల క్వాలిటీ దారుణం గా పడిపోయింది.ఇటీవల వచ్చిన అతని 'దేవుడు చేసిన మనుషులు' ఇందుకు తాజా ఉదాహరణ .ఈ ' కెమెరా మేన్ గంగతో రాంబాబు' కూడా ఆ కోవలోనే పేలవంగా వచ్చింది.దాంతో ఈ చిత్ర నిర్మాణ సమయం లోనే' కొన్ని సన్నివేశాలను హీరో రీ షూట్ చెయ్య మన్నారని,అందుకు పూరీ అంగీకరించలేదంటూ'-వార్తలు వచ్చాయి.దానికి తగ్గట్టుగానే సినిమాలో పాత్రలు, పాత్ర దారులు,సన్నివేశాలు ...అన్నీ రొటీన్ గా, నిస్సత్తువుగా వున్నాయి. ఒక్క మీడియా నేపధ్యం మాత్రమే వున్నంతలో కొత్తది. మీడియాను చూపడం లోనూ దర్శకుడి అవగాహనా లేమి,గందర గోళం కనిపిస్తుంది. ప్రస్తుతం మీడియా రాజకీయ పార్టీలు,నాయకుల చేతుల్లో పడి వారి ప్రయోజనాలు కాపాడేందుకే పని చేస్తోంది.అందువల్ల, వారంతా కలిసి కట్టుగా రాంబాబు వంటి 'ప్రజల మనిషి'కి మద్దతు పలుకుతారనడం ఉత్త భ్రమ.అలాగే రాంబాబుకు ప్రజల్లో విశేష ప్రాచుర్యం రావడాన్ని బలంగా చూపలేక పోయారు.అతను పిలిస్తే అంతమంది జనం రావడం ...తక్కువ స్థాయి గ్రాఫిక్స్ తో క్లైమాక్స్ చెయ్యడం ... ఆర్టి ఫిషియల్ గా వుంది. .టి .వి చానెల్ లో అలీ 'మేలుకొలుపు' కార్యక్రమం, మరో చానెల్ లో బ్రహ్మానందం కోట ఫై చేసిన కార్యక్రమం..వార్తలను మార్చి చదివే సన్నివేశం మంచి వినోదాన్ని అందించాయి.పరాయి రాస్ట్రీయులను పార ద్రోలాలనే రానా ఉద్యమం మన తెలంగాణా ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. ఆ సందర్భంగా -జాతీయ సమైక్యత ను చెప్పే పవన్ ప్రసంగం ఈ చిత్రం లో హై లైట్ గా నిలుస్తుంది.అది ఇక్కడి తెలంగాణా వాదులకి కూడా వర్తిస్తుంది.
కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫైనే ఆధార పడి ఈ చిత్రం చేసారు. దానికి పవన్ పూర్తి న్యాయం చేసారు. డైలాగ్స్ పవర్ ఫుల్ గా చెప్పడమే కాకుండా,డాన్స్ కూడా మరింత ఈజ్ తో చేసాడు. అయితే స్క్రీన్ ప్లేలో విషయం లేకపోవడం వల్ల అతని శ్రమ వృధా అయ్యింది .తమన్నా అందం గానే వుంది, బాగా చేసింది ... కానీ 'ఎక్ష్త్రార్డినరీ' అమ్మాయి గా మాత్రం సరిపడ లేదు.ఆమె క్యారక్ట రైజేషన్లో ' అతి' వల్ల ప్రేక్షకులు బాధపడ్డారు.గబ్రియేల కూడా ఇబ్బంది పెట్టింది. విలన్లుగా కోట,ప్రకాష్ రాజ్ లు కొత్తగా చేసింది ఏమీ లేదు.మహిళా నేత గుండక్కగా శృతి,ముఖ్య మంత్రి గా నాజర్,ఇతర పాత్రల్లోసూర్య, ధర్మవరపు,యమ్మెస్,తనికెళ్ళ భరణి,ఉత్తేజ్,స్కార్లెట్ ఓ పాటలో నటించారు.మణిశర్మ సంగీతం లో పాటలు అంతంత మాత్రం గానే వున్నాయి.'ఎక్ష్త్రార్డినరీ', 'రెడీ 123' పాటల చిత్రీకరణ,నేపధ్య సంగీతం బాగుంది.ఈ చిత్రాన్ని 40 ఏళ్ళుగా ప్రజా సమస్యల ఫై చిత్రాలు నిర్మిస్తున్న ఆర్ .నారాయణ మూర్తి కి అంకితం ఇవ్వడం విశేషం. -రాజేష్
Friday, October 12, 2012
' బ్రదర్స్' చిత్ర సమీక్ష 3/5
జెనెటిక్ శాస్త్రవేత్త రామచంద్ర తన భార్య మీద చేసిన ప్రయోగం వికటించి ఆమెకు అవిభక్త కవల పిల్లలు విమల్ , అఖిల్ పుడతారు. వారిద్దరూ అవిభక్త కవలలుగా ఉండటం రామచంద్రకి ఇష్టం లేకపోయినా భార్య కోరిక మేరకు వారిని అలాగే పెంచుతారు. రామచంద్ర ఎనర్జియోన్ అనే మిల్క్ పౌడర్ కనిపెడతాడు. అతి తక్కువ సమయంలోనే ఈ ఎనర్జియోన్ ప్రభావవంతంగా పేరు సంపాయించి, అమ్మకాలు విపరీతంగా పెరగడంతో అందరి చూపు ఎనర్జియోన్ పై పడుతుంది. ఎనర్జియోన్ ఎలా తయారు చేస్తారు? అనేవిషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న రష్యన్ జర్నలిస్ట్ వోల్గా కి విమల్ , అఖిల్ మిత్రురాలు అంజలి కూడా సహాయం చేస్తుంటుంది.ఆ క్రమంలోరష్యన్ జర్నలిస్ట్ తో సహా ,విమల్ కూడా మరణిస్తాడు.అసలు ఈ ఎనర్జియోన్ మిల్క్ పౌడర్ ఫార్ములాలో ఏముందో తెలుసుకోవడానికి అఖిల్-అంజలి అందులో వాడుతున్న పదార్ధాల మూల కేంద్రం అయిన ఉక్రెయిన్ వెళ్తారు.ఆ తర్వాత ఏం జరిగిందీ సినిమాలో చూడాలి...
విభిన్నమైన పాత్రలకి పేరు పొందిన సూర్య హీరోగా ,'వీడొక్కడే' 'రంగం' వంటి విలక్షణమైన చిత్రాల దర్శకుడు ఆనంద్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ఇది. అవిభక్త కవలలుగా సూర్య రెండు పాత్రలు చెయ్యడం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.. స్వార్ధం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే సైంటిస్ట్ దుర్మార్గాన్ని అతని పిల్లలే బయట పెట్టడం ...అనే మంచి కధాంశంతో చేసిన ఈ చిత్రంలో అవిభక్త కవలలు గా సూర్య ఉన్నంత వరకూ... సినిమా మొదటి భాగం చాలా బాగుంది.విమల్ చనిపోయాక ఎనర్జియోన్ రహస్యాన్ని తెలుసుకోవడానికి అఖిల్ ఉక్రెయిన్ వెళ్లినప్పటినుండి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సస్పెన్స్ తెలిసిన తర్వాత దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా నడపలేకపోయాడు. మేధావి అయిన దర్శకులతో వచ్చే ఓ పెద్ద ఇబ్బంది ఏమిటంటే-వారు వారి స్థాయిలో ఆలోచిస్తూ సగటు ప్రేక్షకుడికి దూరంగా పోతుంటారు.అదే ఇందులోనూ జరిగింది.చిత్రంలో సైన్స్ విషయాలు ప్రధానం కావడం వల్ల, అవి ప్రేక్షకులకు అర్ధం కాలేదు.ఇక రెండవ భాగం మొత్తం ఉక్రెయిన్ లో జరగడం ...అదీ సుదీర్ఘంగా సాగడం...ఆ భాగంలో వినోదం ఏమాత్రం లేకపోవడం సినిమాని నిరాసక్తంగా మార్చాయి.ఆ సన్నివేశాల్లో హీరోతోపాటు హీరొయిన్ కూడా ఉన్నప్పటికీ, వారి మధ్య రొమాన్స్ ని వినోదాత్మకంగా వాడుకోలేకపోయారు. అవిభక్త కవలల చిత్రీకరణ గొప్పగా వుంది. విరామానికి ముందు జాయింట్ వీల్ ఫై ఫైట్ ,ఉక్రెయిన్ అడవిలో ఫైట్ పీటర్ హైన్స్ బాగా చేసాడు. విమల్ చనిపోయాక అతన్ని అఖిల్ తో విడదీసే సన్నివేశం మనసులను కదిలిస్తుంది. హీరో క్రూరుడైన తండ్రిని ఎలకలకు ఆహారంగా వదిలేసే క్లైమాక్స్ సన్నివేశం కూడా బాగుంది.
అవిభక్త కవలలుగా సూర్య అద్భుతం గా నటించాడు.రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపడానికి చాలా శ్రమించాడు.అంజలి గా కాజల్ కూడా బాగా చేసింది.సినిమా అంతా అందంగా కనిపించింది.అఖిల్ కి సూర్య తమ్ముడు కార్తి, అంజలికి చిన్మయి చెప్పిన డబ్బింగ్ బాగుంది.సూర్య తండ్రి సైంటిస్ట్ రామ చంద్రగా సచిన్ ఖేడేకర్ ,తల్లిగా తార చేసారు.చాలా కాలానికి రవిప్రకాష్ కి ఇందులో చెప్పుకోదగ్గ విలన్ పాత్ర లభించింది.హారిస్ జైరాజ్ హిట్ ట్యూన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే 'రాణి రాణి' వంటి పాటల చిత్రీకరణ కలర్ ఫుల్ గా వుంది. నేపధ్య సంగీతం ,విజువల్ ఎఫెక్ట్స్ , సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ, అంటోనీ ఎడిటింగ్ బాగున్నాయి. -రాజేష్