టెలివిజన్‌పై ఆధారపడి జీవించే నటీనటుటు, సాంకేతిక నిపుణులు పరభాషా సీరియళ్ల వల్ల ఉపాధిని కోల్పోతున్నారు. ఈ బెడద తొలగింపుకే కాదు.. టీవీ కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక సమాఖ్య ఏర్పాటు చేయాలి. అందుకోసం తెలుగు టీవీ నిర్మాతల సంఘం (టిటిపిసి) ప్రయత్ని స్తోంది’’ అన్నారు ఏపీ ఫిలింఛాంబర్ అధ్యక్షులు, టిటిపిసి గౌరవ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా యూనియన్లలో సభ్యత్వం ఖరీదైన వ్యవహారం. టీవీ కార్మికులకు అందుబాటులో ఉండదు కనుక..ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం అత్యావశ్యకం. అందుకోసం ప్రత్యేక నిబంధనలను తయారు చేసి ప్రభుత్వాన్ని సంప్రదించాలి..అనీ తమ్మారెడ్డి సూచించారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిపిసి కార్యవర్గ సభ్యులు (2012 సెప్టెంబర్ 29న ఎన్నికయ్యారు) పాల్గొన్నారు.
టిటిపిసి కార్యవర్గం 2012: అధ్యక్షులు: ఎ.ప్రసాద్‌రావు, ఉపాధ్యక్షులు: పి.ప్రభాకర్, వి.వి.రావు, ప్రధానకార్యదర్శి: ఎమ్.వినోద్‌బాల, సంయుక్త కార్యదర్శులు: కె.వి.కిరణ్‌కుమార్, డి.వెై.చౌదరి, ట్రెజరర్: కె.రమేష్‌బాబు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు: విజయ్‌యాదవ్, జి.తాండవకృష్ణ, కె.వెంకటేశ్వర ప్రసాద్, మహతి, యాట సత్యనారాయణ, వెై.రాజీవ్‌రెడ్డి, కో ఆప్టెడ్ సభ్యులు: కె.వి.శ్రీరామ్, కె.శ్రీనివాస్. గౌరవ ఛెైర్మన్‌గా డాదాసరి నారాయణరావు, గౌరవ అధ్యక్షులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సలహాదారుగా టి.సంజయ్ రెడ్డి..వ్యవహరిస్తారు. .
0 comments:
Post a Comment