'రొటీన్ లవ్ స్టోరీ' చిత్ర సమీక్ష 3/5
ఇంజనీరింగ్ విద్యార్ధి సంజు తన్వి ప్రేమలో పడతాడు .తన ప్రేమను చెప్పిన సంజు ని కనీసం 6 నెలలపాటు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం కోరుతుంది తన్వి .ఆ తర్వాత ఒక విహార యాత్రలో జరిగిన సంఘటనలతో ఆమె సంజు పట్ల సుముఖంగా మారుతుంది.అయితే సంజు తొందర పాటుని వ్యతిరేకిస్తుంది.సంజు కూడా ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా పెళ్లి చేసుకోవడం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో గుర్తి స్తాడు.తన తొందర పాటుకు తన్విని క్షమాపణ కోరతాడు.క్రమంగా తన్వి సంజు తో ప్రేమలో పడుతుంది.అయితే,తన్వితో దగ్గరగా ఉంటూ' ఒకరిని ఒకరు సరిగా అర్ధం చేసుకోవడం' తప్పనిసరిగా భావిస్తాడు సంజు .అతని మిత్రులు- దానికి అనుగుణంగా తన్వి ఇంట్లోవారిని బయటికి వెళ్ళేలా చేసి, సంజు-తన్వి కొన్నాళ్ళు కలిసి ఉండేలా ఏర్పాటు చేస్తారు.అయితే,అక్కడ కూడా వారి మధ్య గొడవలు తలెత్తుతాయి.ఈ కలహాల జంట ఆతర్వాతనైనా కలిసారా?అన్ నది సినిమాలో చూడాలి...
'యల్.బి.డబ్ల్యు' తో దర్శకుడిగా మంచి పేరు సంపాయించిన ప్రవీణ్ సత్తారు చేసిన రెండవ చిత్రం కనుక, సహజం గానే ఈ చిత్రం ఫై మంచి అభిప్రాయం తోనే ప్రేక్షకులు వున్నారు.అందుకనే, ఓ పెద్ద సినిమా తో పోటీ పడి మరీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించ గలిగారు .అందుకు వీరు చేసిన ప్రచారం కూడా తోడయ్యింది.చిన్న చిత్రాల్లో ఈ స్థాయి పబ్లిసిటీ చేసిన చిత్రం ఈ మధ్య కాలం లో మరొకటి లేదు.'బూతు' యూత్ చిత్రాలు దండయాత్ర చేస్తూ, ప్రేక్షకుల అభిరుచి స్థాయిని దిగ జారుస్తూ,డబ్బు చేసుకుంటున్నఈ రోజుల్లో- అడ్డదారి ఆర్భాటాల జోలికి పోకుండా,కుటుంబంతో హాయిగా చూడదగ్గ చిత్రాన్ని అందించిన ప్రవీణ్ సత్తారు ధైర్యాన్ని మెచ్చుకోవాలి...అభినందించాలి. దర్శకుడు ఎక్కువ హడావుడి లేకుండా కేవలం ఒక యువ జంట ప్రధానం గా ....వారి మధ్య కీచులాటలు, అలకలు, అల్లర్లు, ఆవేశాలు, ముద్దులు, ముచ్చట్లు .... నేటి యువతరం మనోభావాలకు అద్దంలా ... 'రొటీన్ లవ్ స్టొరీ'నే భిన్నంగా చూపించడానికి ప్రయత్నించాడు ...చక్కగా మలిచాడు.'ఒకరిని నొకరు అర్ధం చేసుకోవడం కోసం' పాశ్చాత్య దేశాల్లో అనుసరించే 'డేటింగ్' విధానం లోనూ ఉపయోగాలున్నాయంటూ తెలివిగా ఇందులో చూపించాడు.కాశ్మీర్లో చిత్రీకరించిన సన్నివేశాలు కన్నుల పండువగా వున్నాయి.ఆడవాళ్ళ మనస్తత్వాన్ని గురించి సంజయ్ రెడ్డి చేసే గీతోపదేశం సన్నివేశం కూడా చాలా బాగుంది. అయితే, ఫార్ములా తో పనిలేకుండా సినిమా తీస్తున్నా...ఆసక్తికరం గా రూపొందించడం మాత్రం అవసరం అని దర్శకుడు గుర్తించాలి.సన్నివేశ రూపకల్పన లో దర్శకుడు ఇంకా పరిణితి సాధించాలి.సహజత్వం అనుకుంటూ కొన్ని చోట్ల సినిమా మరీ స్లో గా సాగింది...సంభాషణల్లో స్పష్టత కూడా కొరవడింది.అలాగే మాటల్లో తెలుగు శాతం బాగా తగ్గి పోయి ఇంగ్లీష్ ఎక్కువగా వినిపించింది.ఎమ్మెస్,హేమ, రాళ్ళపల్లి ఫై చేసిన కామెడీ 'జంగల్ మే మంగల్' సినిమాకి అతకలేదు.అలాగే తన్వి ప్రేమించేస్తోందని భ్రమించే తాగు బోతు రమేష్ పాత్ర కూడా అంతంత మాత్రం గానే వుంది.తన్విప్రేమ ను ఆశించే స్టూడెంట్ గ్యాంగ్ కామెడి కొంతవరకూ పర్వాలేదు.చివరికి హీరోగా మారిన నిర్మాతగా వెన్నెల కిషోర్ పాత్ర బాగుంది.
సంజు గా స్టూడెంట్ పాత్రలో సందీప్ ఆకార పరంగా అంత సరిపోకపోయినా,నటన లో మంచి మార్కులు సంపాయించాడు.అక్కడక్కడా పెద్ద హీరోలను అనుకరిస్తూ చెప్పినా... మొత్తం మీద 'డైలాగ్ మాడ్యు లేషన్' సందీప్ కి పెద్ద ఎసెట్. తన్వి గా అందం,అభినయం కలిసిన నటి రెజీనా చాలా బాగా చేసింది. స్నిగ్ద మిత్ర బృందం కూడా బాగా చేసారు. చంద్రమోహన్, కవిత ,ఝాన్సీ ఇతర పాత్రలు పోషించారు.దర్శకుడు రాసిన సంభాషణలు బాగున్నాయి.
మిక్కీ .జే .మేయర్ పాటల్లో- 'నా మనసు ఫై', ' నిన్నే చూస్తున్నా' అలరిస్తాయి. భార్గవ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది,ధర్మేంద్ర ఎడిటింగ్ బాగుంది. -రాజేష్
0 comments:
Post a Comment