RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, December 21, 2012

''సారొచ్చారు'' చిత్ర సమీక్ష


''సారొచ్చారు'' చిత్ర సమీక్ష    2/5

త్రీ ఏంజల్స్  స్టూడియో పతాకం ఫై పరశురాం  దర్శకత్వంలో ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటలీ లో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ ను, తాను చాలా అందగత్తెననుకునే సంధ్య ఇష్టపడుతుంది .అతన్ని ప్రేమలోకి దించాలని చాలా ప్రయత్నిస్తుంది.అందుకు ఇష్టపడని కార్తీక్  ఇండియా కు తిరిగి వస్తున్న సమయం లో సంధ్యతో   - తనకు  ఇంతకుముందే  పెళ్లయ్యిందని చెబుతాడు.ఊటీలో ఫుట్ బాల్  కోచ్ గా వున్నపుడు వసు అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ....పెళ్ళికి ముందు బాగానే వున్న వసు, పెళ్లి తర్వాత వేధించడం మొదలుపెట్టిందని...ఆ కారణంగా ఆమెతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతాడు.అతనికి పెళ్ళయిపోయిందని తెలిసి సంధ్య బాధపడుతుంది.అయితే వసు తో వచ్చిన విభేదాల్లో, కార్తీక్ పరిస్థితిని అర్ధం చేసుకుని సానుభూతి చూపుతుంది.వారు ఇండియా కు తిరిగి  వచ్చిన తర్వాత సంధ్యకు,  కార్తీక్ పెళ్లి గురించి అసలు విషయం తెలుస్తుంది.ఆతర్వాత ఏం జరిగిందీ సినిమాలో చూడండి...

'సోలో' తో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పరశురాం ఇందులోనూ తనదైన శైలి చూపడానికి ప్రయత్నించాడు.పెళ్ళికి ముందు ప్రేమ  కాదు ,పెళ్లి తరువాత ప్రేమ ప్రధానం అనే  విషయాన్ని బలంగా చెప్పడానికి కష్టపడ్డాడు .  అందుకు ,కొన్ని చక్కటి సన్నివేశాలనూ సృష్టించాడు.సందర్భానుసారంగా  మంచి సంభాషణలు కూడా సమకూర్చాడు. అయితే మాస్ మహారాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ను క్లాస్ పాత్ర లో చూపాలనే సాహసం చేసి ఇబ్బందుల పాలయ్యాడు.రవితేజ తో ఈ కధను చెయ్యడమే సినిమాకు  పెద్ద మైనస్.రవితేజ నుంచి మంచి మసాలా సన్నివేశాలు,పంచ్ డైలాగ్స్ ఆశించే ప్రేక్షకులు నిరాస పడ్డారు. హీరోకు ముందే పెళ్ళయ్యిందంటూ- ప్రభాస్ 'డార్లింగ్' తరహాలో చూపిన ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు నిజంగా కధలో వుంటే బాగుండునని అనిపిస్తాయి. ఇటలీ లో ఐ.టి జాబ్ చేసే రవితేజను ఊటీ  ఫ్లాష్ బ్యాక్ లో ఫుట్ బాల్  కోచ్ గాచూపిస్తారు. సరే,అది ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాకే  కదా అనుకుంటే...క్లైమాక్స్ లో  మళ్ళీ  ఫుట్ బాల్  కోచ్ గా చూపిస్తారు.నారా రోహిత్ తో క్లైమాక్స్ సన్నివేశాలు బాగానే వున్నా, అటువంటి ముగింపులు గతంలో చాలా సినిమాల్లో చూసినవే కావడంతో ఆకట్టుకోలేదు.కారు ప్రయాణంలో హీరో హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పేవిధానం బాగుంది.  ఈ చిత్రం కధకూ, 'సారొచ్చారు' అనే పేరుకూ ఏ మాత్రం సంబంధం లేదు.


ఈ మధ్య చిత్రాల్లో  రెచ్చిపోయి చేసిన కామెడీకి భిన్నంగా రవితేజ కార్తిక్ గా  జంటిల్మన్ పాత్ర  ఇందులో  చేసాడు.అతను ఎంత సెటిల్డ్ గా,బాగా చేసినప్పటికీ-అతని ఇమేజ్  కి విరుద్ధంగా వున్నపాత్రలో  ప్రేక్షకులు అంగీకరించలేదు. సంధ్యగా కాజల్ ఎంతో చురుకైన పాత్రని చాలా చలాకీ గా పోషించి మంచి మార్కులు కొట్టేసింది .ఉత్తుత్తి ఫ్లాష్ బ్యాక్ లో వసుగా రిచా బాగా నటించింది.కాజల్ బావగా ప్రత్యేక పాత్ర చేసిన నారా రోహిత్ క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా చేసాడు.ఈ కాలంలోనూ కాజల్ ని ప్రేమిస్తున్నానంటూ- నారా రోహిత్ 'సత్తెకాలపు' ప్రేమలేఖలు రాయడం బాగులేదు. కాసేఫైనా ప్లాటినం ప్రణీత్ గా  యం.యస్.నారాయణ నవ్వించాడు. ఇతర పాత్రల్లో జయసుధ,చంద్రమోహన్,శ్రీనివాస్ రెడ్డి,రవి ప్రకాష్ ,చిత్రం శ్రీను,మాస్టర్ భరత్  నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మొహమాటానికి ఈ సినిమా చేసినట్లు అర్ధమవుతుంది. పాటలు అతని మార్క్ తో లేవు."గుస గుసలాడుతోంది","కాటుక కళ్ళు" పాటలు గుడ్డిలో మెల్ల. రీరికార్డింగ్ బాగుంది. విజయ్ .కే.చక్రవర్తి ఫోటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ చిరాకు పుట్టించాయి-రాజేష్ 

0 comments:

Post a Comment