RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, February 9, 2013


                                            'మిర్చి' చిత్ర సమీక్ష          3/5
యు.వి.క్రియేషన్స్ పతాకం ఫై కొరటాల శివ దర్శకత్వం లో వంశీ  కృష్ణ రెడ్డి,ఉప్పలపాటి ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రభాస్‌, అనుష్క, రిచా వంటి తారాగణం తో రచయితగా సుపరిచితుడైన కొరటాల శివ దర్శకుడిగా మారి చేసిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో  ఉత్సుకత వుంది . కథ కొత్తదేమీకాదు.. ట్రీట్‌మెంట్‌ వెరైటీ అనిచెబుతున్న ఈ దర్శకునికి శ్రీశ్రీ కవితలంటే ఎనలేని అభిమానం. 'పోరాడితే పోయేదేముంది.. బానిన సంకెళ్ళు తప్ప...' అనే అంశాన్ని స్పూర్తిగా తీసుకుని.... 'వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది. మళ్ళీ వాళ్లే ప్రేమిస్తారని.. 'రాసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 జై (ప్రభాస్‌) ఇటలీలో ఆర్కెటెక్చర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న అతడు ఎం.ఎస్‌. చదివే మానస (రిచా) ప్రేమలో పడతాడు. ఆ టైమ్‌లో తన ఫ్యాక్షన్‌ కుటుంబం గురించి తెలియజేస్తుంది. తరువాత సీన్‌లో జై ఇండియాలో ఓ కాలేజీలో జాయిన్‌ అవుతాడు. అక్కడ స్టూడెండ్‌గా ఉండే రౌడీ పూర్ణ (సుబ్బరాజు)తో స్నేహాన్ని పెంచుకొని అతనికి దగ్గరవుతాడు. జై వేసిన ప్లాన్‌తో పూర్ణ మంచివాడిగా మారిపోతాడు. ఆ తర్వాత సెలవులకు తన ఊరికి తీసుకెళ్ళి తన ఇంటివారినందరినీ జైని పరిచయం చేస్తాడు పూర్ణ. అతని నాన్న నాగినీడు, బాబారు ఉమ (సుప్రీత్‌రాజ్‌) పక్కనే ఉన్న రెంటచింతల గ్రామంలోని ఊరిపెద్ద తమ ప్రత్యర్థి అయిన దేవ (సత్యరాజ్‌)పై ఇంకా పగతో రగిలిపోతుంటారు. మీకు ఇప్పటికే అర్థమై వుంటుంది కదా... జై.. పూర్ణను మార్చినట్లే... అందరినీ మార్చి ప్రేమతో తనవైపుకు ఎలా తిప్పుకున్నాడు. తన తండ్రి అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేసి చూపాడు? అన్నది పాయింట్‌. ఇందులో అనుష్క ఫ్లాప్‌బ్యాక్‌లో తన మామ కూతురుగా కన్పిస్తుంది. చివరికి ఎవర్ని పెళ్ళి చేసుకున్నాడనేది సినిమాలో చూడాలి...
పాత్రపరంగా జై పాత్రలో ప్రభాస్‌ ఇమిడిపోయాడు. ఎన్నో మాస్‌ చిత్రాలు చేసిన ప్రభాస్‌ ఈ చిత్రంలో నిగ్రహంగా చేయాల్సివచ్చింది. రెండు కోణాలున్న ఈ పాత్రలో అవసరమైనచోట రుద్రుడులానూ, శాంతమూర్తిలానూ నటించాడు. బాంక్‌మేనేజర్‌ బ్రహ్మానందంతోపాటు మానస కుటుంబంతో చేసిన కామెడీ సన్నివేశాలు, రొమాన్స్‌, యాక్షన్‌ సరదా సరదాగా అనిపిస్తాయి.
ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే అనుష్క పాత్ర గ్రామీణ యువతి. ఆమెపై చిత్రించిన 'ఇదేదో బాగుందే.. డార్లింగ్‌' పక్కామాస్‌ సాంగ్స్‌ పర్వాలేదు. దేవీశ్రీప్రసాద్‌ బాణీల్లో బాగున్నవవే. ఇక కథంతా రిచాగంగోపాథ్య ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. రచయితగా 'భద్ర', 'బృందావనం' వంటి కథలు రాసిన కొరటాల శివ అదే తరహాలో రాసుకున్నకథే. స్క్రీన్‌ప్లేలో కొత్తదనాన్ని చూపి.. మాస్‌ ఎలిమెంట్లతో కథను నడిపించేశాడు. ద్వితీయార్థంలో తల్లి, తండ్రి, కొడుకుమధ్య వచ్చే సన్నివేశాలకు గమనంలో స్పీడ్‌వల్ల రొటీన్‌ అనేది పెద్దగా అనిపించదు. సత్యరాజ్‌ పాత్ర నీట్‌గా, అందరూ బాగుండాలని కోరుకునే హుందాయైన పాత్ర. నదియా ఆయన భార్యగా నటించింది. సంపత్‌రాజ్‌, ఆదిత్యమీనన్‌, నాగినీడు, బెనర్జీ, సప్రీత్‌, హేమ, రఘుబాబు...పాత్రలు కథప్రకారమే ఉన్నాయి. బ్రహ్మానందం బ్యాంక్‌ మేనేజర్‌గా, వీరప్రతాప్‌గా నటించి హాస్యం కోసం ట్రై చేశాడు.
కథ ఎలా ఉంది అనేదికాకుండా కథనాన్ని నడపడంలో పాత చిత్రాల్ని మరిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లాజిక్కులకు అందని యాక్షన్‌ సన్నివేశాలు, హఠాత్తుగా హీరో ప్రత్యక్షం కావడం, కరడుగట్టిన ప్రతీకారంతో రగిలిపోయిన వారిని ఒక్కసారిగా మార్చడమనే సన్నివేశాలు సినిమాటిక్‌గా ఉన్నాయి. 'శంఖం', 'దమ్ము', 'బిందాస్‌', 'బృందావనం' వంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. 'బృందావనం'లో రెండు కుటుంబాల్లో అన్నదమ్ముల గొడవ గ్రామాల గొడవైతే... 'మిర్చి'లో రెండు గ్రామాల్లోని రెండు కుటుంబాల గొడవ. మొత్తంమీద మాస్‌ చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సగం వరకు సక్సెస్‌ అయ్యారు.                                                    -రవళి                                                                                                                                                                 

0 comments:

Post a Comment