Thursday, February 28, 2013
సామాజిక రియాలిటీ షో చేయాలని...జీవిత రాజశేఖర్
Tuesday, February 26, 2013
పూజాకుమార్ హీరోయిన్లకు స్ఫూర్తి
Saturday, February 23, 2013
అదితిరావు కథానాయిక అవ్వాలి!
గరిటె వదిలేసి కెమెరా ముందుకు సంజీవ్ కపూర్
Friday, February 22, 2013
'జబర్దస్త్' చిత్ర సమీక్ష
'జబర్దస్త్' చిత్ర సమీక్ష 2.5/5
ఎవరూ లేని బైర్రాజు దొరికిన దగ్గరల్లా అప్పులు చేస్తూ అవారాగా బతికేస్తుంటాడు. బీహార్ లో ఒక అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి వప్పుకుని,పెళ్ళికి ముందే పరారై హైదరాబాద్ చేరుకుంటాడు . అక్కడ శ్రేయ అనే అమ్మాయి తో కలిసి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో చేరుతాడు . అక్కడ వచ్చిన ఓ వివాదం వల్ల , ఆ మిత్ర బృందం అంతా బయటికి వచ్చి వేరే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ పెడతారు . అది విజయవంతంగా నడుస్తున్న సమయంలో శ్రేయతో వచ్చిన స్పర్ధల కారణంగా బైర్రాజు ఆ సంస్థనుండి విడిపోయి వేరే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ పెడతాడు . సరస్వతి అనే అమ్మాయి అతనికి పరిచయమై ఆ సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంది . అయితే,ఒకరోజు ఆమె డబ్బుతో మాయమవుతుంది. అప్పుడు తెలుస్తుంది బైర్రాజుకి- ఆమె 420 అని. బైర్రాజు లేకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నడుపుతున్న శ్రేయ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటుంది . అదే సమయంలో బైర్రాజు,శ్రేయ బృందానికి మలేషియా నుండి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది . అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు?చివరికి ఎలా ఒక్కటవుతారనేది సినిమాలో చూడాలి ...
'అలా మొదలైంది' తో విజయవంతంగా కెరీర్ ప్రారంభించిన మహిళా దర్శకురాలు నందిని రెడ్డి చేసిన ఈ రెండవ చిత్రం ఆమె పేరు నిలపలేకపోయింది. 'అలా మొదలైంది' ఫ్రెష్ నెస్ తో మంచి వినోదాన్ని ఇస్తే ... పెద్ద ఆర్టిస్ట్ లతో రెగ్యులర్ సినిమా ధోరణిలో చేసిన ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయింది . హిందీ చిత్రం 'బ్యాండ్ బాజా బారాత్'ను లేపేసి ఈవెంట్ మేనేజ్మెంట్ నేపధ్యంలో చేసిన ఈ చిత్రంలో దర్శకురాలు కామెడీ కాస్త ఎక్కువగానే ఇవ్వాలని ప్రయత్నించి చతికిల పడింది .హీరో ,హీరోయిన్ లు సిద్ధార్ధ,సమంతా లతో పాటు ,తెలంగాణా శకుంతల,ధర్మవరపు, సయ్యాజి షిండే,శ్రీహరి ... ఇలా అన్ని పాత్రలకూ సమర్ధులైన ఆర్టిస్టులే వున్నా-బలహీన మైన స్క్రీన్ ప్లే, టేకింగ్ వల్ల... అక్కడక్కడా కొన్ని నవ్వులు తప్ప, చాలా సన్నివేశాలు పండలేదు .' ఫీల్ లేని గోల'గా మారింది . సినిమా ప్రారంభమే- హీరో బీహార్ లో ఓ అమ్మాయి తో పెళ్లి తప్పించుకుని రావడం ...పెళ్లి కూతురు అన్న సయ్యాజి షిండే తన గుంపు తో హైదరాబాద్ వచ్చి, నెలల తరబడి హీరోను వెతకడం వంటి అసంబద్ధమైన సన్నివేశాలతో ఈ చిత్రం మొదలవుతుంది . మలేషియా ముస్లిం డాన్ హైదరాబాద్ నుండి ఈవెంట్ మేనేజర్ లుగా హీరో,హీరోయిన్ లను రప్పించడం ... శ్రీహరిని ధర్మవరపు తెలుగులో 'తుంటా' అని తిడితే, 'చిన్నప్పుడు మా అమ్మ ఇలానే తిట్టే 'దంటూ శ్రీహరి అతన్ని ముద్దు పెట్టుకోవడం... అవారా బైర్రాజు ను పోలీసుల నుండి విడిపించడానికి శ్రేయ తండ్రి కాశీ 5 లక్షలు అప్పుచెయ్యడం వంటివి తమాషా గా వున్నాయి . హీరో,హీరోయిన్ ల మధ్య ప్రేమ పరిణామ క్రమం కూడా సరిగా చూపలేక పోయారు . సినిమా క్లైమాక్స్ కి వచ్చే కొద్దీ రొటీన్ గా మారిపోయి, తేలిపోయింది . ఇందులో ప్రత్యేకతగా చెప్పుకోవాల్సింది ఏమన్నా వుంటే -అది నిత్య మీనన్ పాత్ర .420 సరస్వతి గా ఆమె చేసింది చిన్న పాత్రే అయినా ప్రేక్షకులను అలరించించింది . కధానాయిక గా మంచి కెరీర్ వున్న నిత్య ఇలా నెగెటివ్ పాత్ర చెయ్యడం సాహసమే . అలాగే , ఈ చిత్రంలో తమన్ పాటలు రెండు బాగున్నప్పటికీ ... అన్ని పాటలూ ఖర్చుకు వెనుకాడకుండా రిచ్ గా చిత్రీకరించడం మరో విశేషం . డాన్ శ్రీహరి ఇంట్లో దురదృష్ట కళాకారుడు గాజు పెట్టెలో డ్రమ్స్ వాయించుకోవడం బాగుంది .
వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడే అవారా బైర్రాజుగా సిద్ధార్ద్ బాగా చేసాడు . శ్రేయ గా సమంతా కూడా పాత్రకు న్యాయం చేసింది . అయితే, సమంత పాత్రను మొదట ఓవరాక్టివ్ గా చూపించి, ఆతర్వాత నార్మల్ చేసేశారు .బీహారీ గా సయ్యాజి షిండే , తెలంగాణ శకుంతల పాత్రలు రొటీన్ . డాన్ జావేద్ భాయ్ గా శ్రీహరి పాత్ర కూడా అంతంత మాత్రమే. డాన్స్ మాస్టర్ గా ధర్మవరపు కాస్త నయం. ఇతర పాత్రలు కాశీ విశ్వ నాద్, ఉత్తేజ్, ప్రగతి, తాగు బోతు రమేష్,సురేష్, ధన రాజ్, అర్జున్,వెన్నెల కిషోర్, దువ్వాసి, ప్రిన్స్,వేణు పోషించారు . ఫోటోగ్రఫీ బాగుంది . వెలిగొండ శ్రీనివాస్ మాటలు, రీ రికార్డింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు . సినిమా ప్రారంభం లో హీరోఫై సునీల్ పరిచయ వ్యాఖ్యానం ఇందులో ఇంకో విశేషం -రాజేష్
Tuesday, February 19, 2013
రెడ్ లైట్ ఏరియాలో షెర్లిన్ బర్త్‌డే
బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా తన పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకుంది. ఫిబ్రవరి 11తో 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న షెర్లిన్ చోప్రా......ముంబైలోని రెడ్ లైట్ ఏరియా కామతిపురా వెళ్లి అక్కడి సెక్స్ వర్కర్లతో కలిసి కేక్ కట్ చేసి తన పుట్టిన రోజును జరుపుకుంది. గతంలో ఓ సారి డబ్బు కోసం సెక్స్‌లో పాల్గొన్నానని ప్రకటించిన షెర్లిన్ చోప్రా....ఇప్పుడు సెక్స్ వర్కర్లతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. క్రిస్టియన్ ఫాదర్, ముస్లిం మదర్‌కు జన్మించిన షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా. స్వస్థలం హైదరాబాద్. కాలేజీ రోజుల్లో మిస్ ఆంధ్రా ప్రెజెంట్ అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం షెర్లిన్ చోప్రా ‘కామసూత్ర 3డి’ అనే శృంగార చిత్రంలో నటిస్తోంది. వాత్సాయన కామసూత్ర ఆధారంగా దర్శకుడు రూపేష్ పాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Saturday, February 16, 2013
షబానా మేనకోడలు సయామీ ఖేర్
‘దేవదాసు’తో రామ్, ఇలియానాను పరిచయం చేసిన వైవీయస్ చౌదరి ‘రేయ్’తో సాయిధరమ్‌తేజ్, సయామీ ఖేర్‌ను పరిచయం చేస్తున్నారు. సాయిధరమ్‌తేజ్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కాగా, సయామీ ఖేర్ ప్రముఖ నటి షబానా ఆజ్మీ మేనకోడలు కావడం విశేషం. ఇందులో శ్రద్ధాదాస్ మరో నాయికగా చేస్తున్నారు. యలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లు వారి పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘ఇలియానా తరహాలోనే సయామీ ఖేర్ కూడా స్టార్ హీరోయిన్ అవుతారు. తను గ్లామర్, పెర్ఫార్మెన్స్ల కలబోత. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే కెమిస్ట్రీకి కొత్త అర్థం చెప్పేలా సయామి కేరెక్టర్ సాగుతుంది. లవ్ అంటే ఆబ్సెన్స్లో కూడా ప్రెజెన్స్‌ను చూడగలగాలని నమ్మే పాత్ర తనది. కచ్చితంగా ఈ సినిమా తర్వాత తెలుగు తెరకు ఓ సూపర్ హీరోయిన్ దొరికిందనడం ఖాయం’’ అని చెప్పారు
త్రిషలో కొత్తగా పోరాట కళ
Saturday, February 9, 2013
మోహిత్ రైనాతో ప్రియాంక పెళ్లి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి బాలీవుడ్ మూవీ ‘జంజీర్’లో నటిస్తున్న ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లికి రెడీ అవుతోంది. బాలీవుడ్ నుంచి అందుతున్న వివరాల ప్రకారం ఆమె హిందీ టెలివిజన్ నటుడు మోహిత్ రైనాను పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ టీవీ సీరియల్ ‘మహదేవ్’లో శివుని పాత్ర చేసిన మోహిత్ రైనా బాగా పాపులర్ అయ్యా డు. మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని మీడియా ప్రియాంక చోప్రాను ప్రశ్నించిన ప్రతిసారీ -'నేను సింగిల్‌గానే ఉన్నాను, నాకు తగిన జోడీ కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ సమాధానం ఇస్తూ వస్తోంది. ''తోడు కోసం ఎదురు చూస్తున్నాను'- అంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రియాంక కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. హిందీ ఛానల్ 'జూమ్' కథనం ప్రకారం ఆమె కుటుంబ సభ్యులు టీవీ నటుడు మోహిత్ రైనాతో ఆమెకు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది
హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటా! -లక్ష్మీరాయ్
'మిర్చి' చిత్ర సమీక్ష 3/5
యు.వి.క్రియేషన్స్ పతాకం ఫై కొరటాల శివ దర్శకత్వం లో వంశీ కృష్ణ రెడ్డి,ఉప్పలపాటి ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రభాస్, అనుష్క, రిచా వంటి తారాగణం తో రచయితగా సుపరిచితుడైన కొరటాల శివ దర్శకుడిగా మారి చేసిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో ఉత్సుకత వుంది . కథ కొత్తదేమీకాదు.. ట్రీట్మెంట్ వెరైటీ అనిచెబుతున్న ఈ దర్శకునికి శ్రీశ్రీ కవితలంటే ఎనలేని అభిమానం. 'పోరాడితే పోయేదేముంది.. బానిన సంకెళ్ళు తప్ప...' అనే అంశాన్ని స్పూర్తిగా తీసుకుని.... 'వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది. మళ్ళీ వాళ్లే ప్రేమిస్తారని.. 'రాసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
జై (ప్రభాస్) ఇటలీలో ఆర్కెటెక్చర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న అతడు ఎం.ఎస్. చదివే మానస (రిచా) ప్రేమలో పడతాడు. ఆ టైమ్‌లో తన ఫ్యాక్షన్ కుటుంబం గురించి తెలియజేస్తుంది. తరువాత సీన్లో జై ఇండియాలో ఓ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ స్టూడెండ్‌గా ఉండే రౌడీ పూర్ణ (సుబ్బరాజు)తో స్నేహాన్ని పెంచుకొని అతనికి దగ్గరవుతాడు. జై వేసిన ప్లాన్‌తో పూర్ణ మంచివాడిగా మారిపోతాడు. ఆ తర్వాత సెలవులకు తన ఊరికి తీసుకెళ్ళి తన ఇంటివారినందరినీ జైని పరిచయం చేస్తాడు పూర్ణ. అతని నాన్న నాగినీడు, బాబారు ఉమ (సుప్రీత్‌రాజ్) పక్కనే ఉన్న రెంటచింతల గ్రామంలోని ఊరిపెద్ద తమ ప్రత్యర్థి అయిన దేవ (సత్యరాజ్)పై ఇంకా పగతో రగిలిపోతుంటారు. మీకు ఇప్పటికే అర్థమై వుంటుంది కదా... జై.. పూర్ణను మార్చినట్లే... అందరినీ మార్చి ప్రేమతో తనవైపుకు ఎలా తిప్పుకున్నాడు. తన తండ్రి అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేసి చూపాడు? అన్నది పాయింట్. ఇందులో అనుష్క ఫ్లాప్‌బ్యాక్‌లో తన మామ కూతురుగా కన్పిస్తుంది. చివరికి ఎవర్ని పెళ్ళి చేసుకున్నాడనేది సినిమాలో చూడాలి...
పాత్రపరంగా జై పాత్రలో ప్రభాస్ ఇమిడిపోయాడు. ఎన్నో మాస్ చిత్రాలు చేసిన ప్రభాస్ ఈ చిత్రంలో నిగ్రహంగా చేయాల్సివచ్చింది. రెండు కోణాలున్న ఈ పాత్రలో అవసరమైనచోట రుద్రుడులానూ, శాంతమూర్తిలానూ నటించాడు. బాంక్‌మేనేజర్ బ్రహ్మానందంతోపాటు మానస కుటుంబంతో చేసిన కామెడీ సన్నివేశాలు, రొమాన్స్, యాక్షన్ సరదా సరదాగా అనిపిస్తాయి.
ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే అనుష్క పాత్ర గ్రామీణ యువతి. ఆమెపై చిత్రించిన 'ఇదేదో బాగుందే.. డార్లింగ్' పక్కామాస్ సాంగ్స్ పర్వాలేదు. దేవీశ్రీప్రసాద్ బాణీల్లో బాగున్నవవే. ఇక కథంతా రిచాగంగోపాథ్య ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. రచయితగా 'భద్ర', 'బృందావనం' వంటి కథలు రాసిన కొరటాల శివ అదే తరహాలో రాసుకున్నకథే. స్క్రీన్‌ప్లేలో కొత్తదనాన్ని చూపి.. మాస్ ఎలిమెంట్లతో కథను నడిపించేశాడు. ద్వితీయార్థంలో తల్లి, తండ్రి, కొడుకుమధ్య వచ్చే సన్నివేశాలకు గమనంలో స్పీడ్‌వల్ల రొటీన్ అనేది పెద్దగా అనిపించదు. సత్యరాజ్ పాత్ర నీట్‌గా, అందరూ బాగుండాలని కోరుకునే హుందాయైన పాత్ర. నదియా ఆయన భార్యగా నటించింది. సంపత్‌రాజ్, ఆదిత్యమీనన్, నాగినీడు, బెనర్జీ, సప్రీత్, హేమ, రఘుబాబు...పాత్రలు కథప్రకారమే ఉన్నాయి. బ్రహ్మానందం బ్యాంక్ మేనేజర్‌గా, వీరప్రతాప్‌గా నటించి హాస్యం కోసం ట్రై చేశాడు.
కథ ఎలా ఉంది అనేదికాకుండా కథనాన్ని నడపడంలో పాత చిత్రాల్ని మరిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లాజిక్కులకు అందని యాక్షన్ సన్నివేశాలు, హఠాత్తుగా హీరో ప్రత్యక్షం కావడం, కరడుగట్టిన ప్రతీకారంతో రగిలిపోయిన వారిని ఒక్కసారిగా మార్చడమనే సన్నివేశాలు సినిమాటిక్‌గా ఉన్నాయి. 'శంఖం', 'దమ్ము', 'బిందాస్', 'బృందావనం' వంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. 'బృందావనం'లో రెండు కుటుంబాల్లో అన్నదమ్ముల గొడవ గ్రామాల గొడవైతే... 'మిర్చి'లో రెండు గ్రామాల్లోని రెండు కుటుంబాల గొడవ. మొత్తంమీద మాస్ చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సగం వరకు సక్సెస్ అయ్యారు. -రవళి
Monday, February 4, 2013
వెండితెరపై మగువలు తాగి తందనాలు
కేబుల్ టీవీ ప్రసారాల డిజిటైజేషన్
Friday, February 1, 2013
'ఒంగోలు గిత్త' చిత్ర సమీక్ష
'ఒంగోలు గిత్త' చిత్ర సమీక్ష 2/5
చిన్నప్పుడే ఒంగోలు మిర్చి యార్డ్ లోకి వచ్చిన అనాధ, క్రమంగా వైట్ పేరుతో మిర్చి వర్తకుడిగా ...అందరికీ తలలో నాలుకలా మారుతాడు. మిర్చి యార్డ్ చైర్మన్ ఆదికేశవులు దృష్టిలో సమర్ధుడనిపించుకుంటాడు. ఒక సందర్భంలో -ఆదికేశవులు కూతుర్ని తనకిచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పించి, నిశ్చితార్ధం కూడా కానిస్తాడు. బయటికి ఎంతో గొప్పవాడిగా కనిపించే ఆదికేశవులు అసలు రూపం మరొకటి వుంటుంది. మిర్చి యార్డ్ ను మరో చోటికి తరలించాలని , ఎమ్మెల్యే తో కలిసి అతడు చేసే కుట్రను వైట్ అడ్డుకుంటాడు.ఆదికేశవులు అసలు రూపాన్ని బైటికి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు.ఇంతకీ ఈ వైట్ ఎవరు? మిర్చి యార్డ్ లో అతను ఏ ప్రయోజనం ఆశిస్తున్నాడు?చివరికి ఆదికేశవులు గోముఖాన్ని ఎలా తొలిగించాడనేది సినిమాలో చూడాలి ...
'బొమ్మరిల్లు' తో గొప్పపేరు,'పరుగు'తో మంచిపేరు తెచ్చుకున్న భాస్కర్,ఆ తర్వాత 'ఆరెంజ్' పేరుతో పూర్తిగా విదేశాల్లో అర్ధంలేని ఓ 'ఆధునిక' చిత్రాన్ని విపరీత ఖర్చుతో తీసి, నిర్మాత నాగబాబు కొంప ముంచాడు. ఇప్పుడు, తన ధోరణికి పూర్తి భిన్నంగా, పక్కా కమర్షియల్ పంధాలో ఈ చిత్రాన్ని చేసాడు. అయితే ,అసలు అతనికి 'పక్కా కమర్షియల్ పంధా' అంటే ఏంటో తెలియక పోవడం వల్ల ...తనకు తోచిందేదో చేసేసి మరో పెద్ద పరాజయాన్ని ఇచ్చాడు . పరమ రొటీన్ కధతో, అర్ధం లేని స్క్రీన్ ప్లేతో చేసిన ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు నాసిరకం టేకింగ్ వల్ల పండలేదు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఎన్నో సార్లు తీవ్ర అసహనానికి గురవు తాడు. దీనికి తోడు- భాస్కర్ మాస్ మసాలా అంతా అరవ వాసన తో వెగటు పుట్టించింది. సినిమాలో పాటలు మరో పెద్ద మైనస్. అసందర్భం అయినా,జానపద గాయకులతో పాట పెట్టడం అభినందనీయం. కొత్తగా మిర్చి యార్డ్ (గుంటూరు) నేపధ్యంలో చెయ్యడం కూడా బాగుంది. ఈ చిత్రం లో ఒకే ఒక ప్లస్...ప్రకాష్ రాజ్ పాత్ర, అతని నటన. ఈ మధ్య రొటీన్ పాత్రలే చేస్తున్న ప్రకాష్ రాజ్ ఆదికేశవులు గా అధ్బుతంగా చేసాడు.అయితే ,అతని పాత్రను నగ్నంగా చూపాల్సిన అవసరం ఎంత మాత్రం కనిపించలేదు. మంచితనం ముసుగేసుకునే ఆదికేశవులు కేరెక్టర్ రూపకల్పనలోనూ... ఆదికేశవులు ఆఫీసులో "ప్రేమే దైవం...సేవే మార్గం" వంటి స్లోగన్స్ తో బోర్డులు పెట్టడంతోనూ దర్శకుడు ఎవరినో ఉద్దేశించాడనే సందేహం కలుగుతుంది.
'పిట్ట కొంచం,కూత ఘనం' అనిపించుకునే రామ్, ఇందులోనూ వైట్ గా ఉత్సాహంతో, బాగా చేసాడు. సంధ్య గా కృతి కర్బంద అందంగా నటించింది. పావురం గా కిషోర్ దాస్ ఈ చిత్రం లో పెద్ద పాత్రను బాగా చేసాడు. అలీ కామెడీ ఇబ్బంది పెట్టింది. తిక్కవరం వాత్సవ్యుడుగా రఘుబాబు తిక్క పాత్ర పర్వాలేదు.రామ్ తండ్రిగా ప్రభు పాత్రోచితంగా నటించాడు. ఇతర పాత్రల్లో రమాప్రభ, ఆహుతి ప్రసాద్, అభిమన్యు సింగ్, అజయ్, జయలక్ష్మి, రాజేంద్ర, జయప్రకాశ్ రెడ్డి చేసారు. మణిశర్మ రీ రికార్డింగ్ ,వెంకటేష్ ఫోటోగ్రఫీ బాగుంది. సురేంద్ర క్రిష్ణ సంభాషణలు అంతంత మాత్రంగానే వున్నాయి. -రాజేష్