'తుఫాన్' చిత్ర సమీక్ష 2/5
అపూర్వలాఖియా అనగానే బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలు గుర్తుకువస్తాయి. 'జంజీర్'కు రీమేక్ అనగానే ఏదో కొత్తదనం ఉంటుందని వెళ్ళంకానీ.. రామ్‌చరణ్ ఎలా చేశాడనే ఆసక్తి సహజం . 78లో అప్పటి ట్రెండ్‌కు తగినట్లు వున్న ఈ చిత్రాన్ని చూసి, ఇప్పటి రామ్‌చరణ్‌ను అమితాబ్ తో పోల్చలేరు. నేటి జనరేషన్‌కోసమే ఈ చిత్రాన్నిచాలా మార్పులతో దర్శకుడు రీమేక్ చేసినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. కథలో నవ్యత కోసం ఆయిల్ మాఫియాను తీసుకున్నాడు.
సీరియస్‌గా సాగే ఈ చిత్రంలో తెలుగువారికి కావాల్సిన హాస్యం లేకపోవడం ప్రధాన లోపం. పంచ్ డైలాగ్‌ల పేరుతో కేవలం సన్నివేశపరంగా రాసినవే. "భయంతో బతకవచ్చుకానీ, తప్పుచేశామని బతకడం కష్టం. అత్యాశలేనిదో ఎదిగే హక్కులేదు.. తుఫాన్ వస్తే తట్టుకోలేం.." వంటి డైలాగ్‌లు ప్రాసకోసం రాసినట్లు అనిపిస్తాయి. 'పోలీస్' అంటూ రామ్‌చరణ్ ఓ సన్నివేశంలో పలకడం... పేలవంగా అనిపించింది. వెంటనే 'పోకిరి'లో మహేష్‌బాబుఅన్న డైలాగ్‌ను థియేటర్లలో జనాలు గుర్తుచేసుకోవడం విశేషం. మరో సన్నివేశంలో .... ప్రియాంకచోప్రా రూమ్‌లోకి తన పోలీసుతో వచ్చిన రామ్‌చరణ్‌ను చూసి..."హోటల్ మేనేజర్‌వి.. పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా?" అని పలికిన డైలాగ్...కరెక్ట్‌గా సరిపోయిందనే కామెంట్లు విన్పించాయి. చంద్రబోస్ రాసిన రెండు పాటలు సోసో సంగీతంతో అంతగా ఆకట్టుకోలేదు. గురు రాజ్ ఫోటోగ్రఫీ పర్వాలేదు . -రవళి
నిర్మాణసంస్థ: రిలయన్స్, లాఖియా సంస్థ... దర్శకత్వం: అపూర్వ లఖియా.
నటీనటులు: రామ్‌చరణ్, శ్రీహరి, ప్రియాంకచోప్రా, మహీగిల్, ప్రకాష్‌రాజ్,అతుల్ కులకర్ణి తదితరులు
విదేశాలనుంచి ఫేస్‌బుక్ ఫ్రెండ్ వివాహంకోసం ముంబై వస్తుంది మాల (ప్రియాంకచోప్రా). వేడుక రాత్రి తిరిగి వెళుతుంటే ఓ చోట హత్యను కళ్ళారా చూస్తుంది. ప్రత్యక్షసాక్షిగనుక కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌చేస్తుంది. చనిపోయింది డిప్యూటీకలెక్టర్ గనుక ఆ విషయాన్ని పోలీసు వ్యవస్థ సీరియస్‌గా తీసుకుంటుంది. అప్పటికే ఏదేళ్ళలో 22సార్లు ట్రాన్స్‌ఫర్లు కాబడ్డ విజయ్‌ఖన్నా (రామ్‌చరణ్) ముంబైకు ట్రాన్స్‌ఫర్ అవుతారు. తన పరిధిలో కాబట్టి అతనికి కమీషనర్ కేసు బాధ్యతలు అప్పగిస్తాడు. ప్రత్యక్షసాక్షి గనుక మాలను కోర్టుకు రమ్మని విజయ్‌ఖన్నా ఆహ్వానించడంతో , చనిపోయిన పిల్లల సెంటిమెంట్‌తో ఆమె సహకరించడానికి అక్కడే ఉంటుంది. కేసులో భాగంగా కార్లను మార్ట్‌గేజ్ చేసే షేర్‌ఖాన్ (శ్రీహరి)తో స్నేహం పెంచుకుంటాడు విజయ్‌ఖన్నా. అతని ద్వారా ఆయిల్ మాఫియా మూలవిరాట్ రుద్రప్రతాప్ తేజ (ప్రకాష్‌రాజ్)ను టార్గెట్ పెడతాడు ఎసీపీ. అయితే తేజ వేసిన ప్లాన్‌తో ఏసీపీ సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత పోలీసు దుస్తులులేకుండానే తేజను ఎలా మట్టుపెట్టాడు? అనేది కథ.
పోలీసు నేపథ్యంలో కథలు తెలుగు తెరకు కొత్త కాదు. ఇదివరకు చాలానే వచ్చాయి. సమసమాజమే లక్ష్యంగా పోలీసు విధినిర్వహణలో పోరాటం చేయాలని పోలీసు అధికారి వాదిస్తుంటాడు. సంఘవిద్రోహశక్తులపై పోలీసు తన తూటాను ఎక్కుపెడుతుంటాడు. వారి మధ్య పోరాటం, సంఘర్షణ వంటి అంశాలతోనే ఆ సినిమాలు తెరకెక్కుతాయి. మధ్యలో సెంటిమెంట్ కోసం కొన్ని సన్నివేశాలు, ప్రేమ కోసం కథానాయికను ఉపయోగించుకుంటారు. నమ్మకద్రోహంకోసం పోలీసుల్లోనే ఓ వ్యక్తి సంఘవిద్రోహులకు తోడ్పాడు ఇవ్వడం అన్నీ మామూలే. అయితే ఒకప్పుడు ఇటువంటి కథను హిందీలో అమితాబ్ చేసి 'జంజీర్'తో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే కథను రీమేక్‌గా తీయడం సాహసమే. అందులోనూ పోలీసు అంటే పవర్‌ఫుల్‌గానూ, చక్కని శరీరధారుఢ్యం, ఎమోషనల్‌గా చూసిన కొన్ని పాత్రలను రామ్‌చరణ్‌చేస్తే ఎలా ఉంటుంది? అనేదే ఇందులో కొత్తవిషయం.

రొటీన్ కధతో , వెరైటీ ట్విస్ట్‌లు లేకుండా... ఇప్పటి ట్రెండ్‌లో ప్రేక్షకులను మెప్పించడం కష్టమే . ఏ ప్రత్యేకతలు లేని ఈ చిత్రం ఎంతో అంచనాలను పెంచి... చివరికి ప్రేక్షకులకు హింస నే మిగిల్చింది . హిందీలో రామ్‌చరణ్ ప్రవేశ మంటూ .. ప్రచారాన్ని ఉపయోగించుకున్నా...పరాజయాన్నే పొందారు . రామ్‌చరణ్ ఏసీపీగా సరిపోయినా... కథానాయిక అతన్నిమించిన ఎత్తు ఉండడం ప్రధాన లోపంగా కన్పిస్తుంది. రామ్‌చరణ్ ఎమోషన్స్ అన్నీ పలికించినా ...ఎక్కడా ఫీల్ కలిగించలేదు . ఏదో డ్యూటీలో భాగంగా సీరియస్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడనే అనిపిస్తుంది. ప్రియాంక చోప్రా రొటీన్ అమ్మాయిలానే నటించింది. వాగుడుకాయలా ఆమె కొత్తగా అన్పిస్తుంది. ప్రకాష్‌రాజ్, శ్రీహరి పాత్రలు ఇందులో కీలకం. షేర్‌ఖాన్ చిత్రానికి హెల్ప్ అయ్యేపాత్ర. అప్పట్లోప్రాణ్ పోషించిన పాత్రను శ్రీహరి చేశాడు. హిందీలో సంజయ్‌దత్ చేశాడు. అయితే హిందీలో సంజయ్‌కు పాట ఉంది. ఇందులో లేదు. చక్కటి ట్విస్ట్ ఉన్న పాత్ర గనుక శ్రీహరికి మంచి మార్కులు పడ్డాయి. విలనిజంలో పలు షేడ్స్ చూపించే ప్రకాష్‌రాజ్ తన పాత్రని అలవోకగా పండించాడు. ఈ రెండు పాత్రలు మినహా చిత్రంలో చెప్పుకోవడానికి ఏమీలేదు.
సీరియస్‌గా సాగే ఈ చిత్రంలో తెలుగువారికి కావాల్సిన హాస్యం లేకపోవడం ప్రధాన లోపం. పంచ్ డైలాగ్‌ల పేరుతో కేవలం సన్నివేశపరంగా రాసినవే. "భయంతో బతకవచ్చుకానీ, తప్పుచేశామని బతకడం కష్టం. అత్యాశలేనిదో ఎదిగే హక్కులేదు.. తుఫాన్ వస్తే తట్టుకోలేం.." వంటి డైలాగ్‌లు ప్రాసకోసం రాసినట్లు అనిపిస్తాయి. 'పోలీస్' అంటూ రామ్‌చరణ్ ఓ సన్నివేశంలో పలకడం... పేలవంగా అనిపించింది. వెంటనే 'పోకిరి'లో మహేష్‌బాబుఅన్న డైలాగ్‌ను థియేటర్లలో జనాలు గుర్తుచేసుకోవడం విశేషం. మరో సన్నివేశంలో .... ప్రియాంకచోప్రా రూమ్‌లోకి తన పోలీసుతో వచ్చిన రామ్‌చరణ్‌ను చూసి..."హోటల్ మేనేజర్‌వి.. పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా?" అని పలికిన డైలాగ్...కరెక్ట్‌గా సరిపోయిందనే కామెంట్లు విన్పించాయి. చంద్రబోస్ రాసిన రెండు పాటలు సోసో సంగీతంతో అంతగా ఆకట్టుకోలేదు. గురు రాజ్ ఫోటోగ్రఫీ పర్వాలేదు . -రవళి
0 comments:
Post a Comment