' పోటుగాడు' చిత్ర సమీక్ష 2. 75 / 5
నటీనటులు: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రాన్‌కౌర్‌ముండి, రేచల్ వెయిన్, అనుప్రియ గొయాంక, పోసాని కృష్ణమురళి, అలీ, షిండే, సత్యంరాజేష్, గీతాసింగ్
నటీనటులు: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రాన్‌కౌర్‌ముండి, రేచల్ వెయిన్, అనుప్రియ గొయాంక, పోసాని కృష్ణమురళి, అలీ, షిండే, సత్యంరాజేష్, గీతాసింగ్
నిర్మాతలు: లగడపాటి శిరీష, శ్రీధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ వడయార్.
అల్లరి కుర్రాడు గోవిందం (మంచుమనోజ్). ప్రేమించడం అతని అలవాటు. అలా అని అందరినీ పెళ్లి చేసుకోడు. ఇప్పటి యూత్‌కు తగినట్లు యూజ్‌అండ్ త్రో అన్నమాట. అలా ఆయన జీవితంలో వచ్చిన వైదేహి, ముంతాజ్, ప్రియ, రేవల్ అనే నలుగురు అమ్మాయిల్ని ప్రేమించేస్తాడు. అయితే ఎవ్వరినీ సరిగ్గా ప్రేమించడు. ఈ విషయం తెలిసి అందరూ అసహ్యించుకుంటారు. దాంతో ఆత్మహత్య చేసుకోవడానికి కెండెక్కుతాడు. సరిగ్గాఅక్కడే జీవితంలో రాకరాక వచ్చిన ఓ ప్రేమికురాలి చేతిలో మోసపోయిన వెంకట్ (పోసాని కృష్ణమురళి) కూడా వచ్చి ఆత్మహత్యచేసుకోవాలనుకుంటాడు. ఒకరినొకరు తామెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో చెప్పుకుంటారు. ఆ కథలు వెండితెరఫై చూడాల్సిందే.

సినిమాను తీయాలంటే యూత్‌ను ఎట్రాక్ట్ చేయడమే లాజిక్కు. ఫ్యామిలీ చిత్రాలు తీసి పాసైనా కలెక్షన్లురాక ఇబ్బంది పడ్డానన్న లగడపాటి శ్రీధర్ ఇప్పుడు యూత్‌ను దృష్టిలో పెట్టుకుని 'పోటుగాడు' తీశాడు. మాతృక కన్నడ 'గోవిందాయ నమ:' చిత్రాన్ని చూసి అందులో 'ప్యార్‌మే పడిపోయా..' పాట నచ్చి చిత్రాన్ని తీయడానికి ముందుకు వచ్చాడంటే- అందులో ఏదో ఆకర్షణ ఉందనేగా. కెరీర్ ప్రారంభం నుండీ చాలా ప్రయోగాలు చేసినా మంచు మనోజ్‌కు సరైన సక్సెస్‌లేదు. అయితే 'పోటుగాడు' మాత్రం ఒక ఫార్ములా ప్రకారం మాస్ ప్రేక్షకుల కోసమే చేసారు కనుక, మంచి వసూళ్ళే సాధించ వచ్చు . సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. ఎంటర్‌టైన్ మెంట్‌పేరుతో పాత్రకు తగ్గట్టు ఎనర్జిటిక్‌గా మనోజ్ నటించాడు. మిగిలిన పాత్రల నిడివి పెద్దగా లేకపోవడంతో సినిమా అంతా మనోజే కన్పిస్తాడు. దానితో ఒక్కోసారి విసుగు పుడుతుంది కూడా. అల్లరిగా తిరిగే వ్యక్తి- జీవితంలో ఎదురైన అనుభవంతో మళ్ళీ మంచివాడుగా మారడం అన్న పాయింట్ పాతదే అయినా... ప్రజెంట్ చేసే విషయంలో దర్శకుడు పవన్ కొత్తగా చేశాడు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా స్క్రీన్‌ప్లే మలిచాడు.
ఇది మనోజ్ ఒన్‌మేన్ షో. సినిమా మొత్తం మనోజ్ లేని సీన్ అంటూ ఉండదు. తన అతి నటనతో డాన్స్, ఫైట్స్ ఇరగదీశాడు.ఇందులో మనోజ్, పోసాని పాత్రలే కీలకం. ఇద్దరూ చిత్రాన్నితమ భుజాలపై మోసేశారు. హీరోయిన్లుగా చేసిన నలుగురు అమ్మాయిలు కొత్తవారే. వారిలో ఉన్నంతలో ముంతాజ్‌గా నటించిన సాక్షి చౌదరి బాగుంది. మిగిలిన పాత్రల్లో షిండే, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి పాత్రలు మోస్తరుగానే ఉన్నాయి. రాజేష్, గీతాసింగ్ పాత్రలు ఉన్న కొన్నిసెకన్లయినా కొద్దిగా నవ్వించే ప్రయత్నం చేశారు.అయితే , హీరో -హీరోయిన్ల మధ్య ప్రేమ ఏర్పడే సన్నివేశాలు రొటీన్ గా వున్నాయి . హీరోయిన్లతో హీరో ప్రేమ ను ఎందుకు వాదులు కోవాల్సి వచ్చిందీ? చూపే కారణాలు కన్విన్సింగ్ గా లేవు . అనుభవం గల డైలాగ్ రైటర్ శ్రీధర్ సిపాన బాగానే రాశాడు. అక్కడక్కడా కొన్నిడబుల్ మీనింగ్ మాస్ మసాలాలు వాడుకున్నాడు . దాంతో వాటిలో కొన్నింటికి బీప్ సౌండ్‌లు వచ్చేశాయి. సంగీతపరంగా అచ్చు ఓల్డ్‌ఈజ్ గోల్డ్ తరహాలో పాత మెలోడీని రుచిచూపించాడు. 'ప్యార్‌లో పడిపోయానే..' అనే పాట వినడానికి చాలా బాగుంది.శ్రీకాంత్ ఫొటోగ్రఫీ బాగుంది. రోప్‌షాట్స్, రిస్కీషాట్స్‌లో మనోజ్ పనితనం బాగుంది . -రవళి
0 comments:
Post a Comment